Showing posts with label mani sharma. Show all posts
Showing posts with label mani sharma. Show all posts

Wednesday, June 10, 2026

Ekkada ekkada undo taaraka [ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక] - Murari

Title :Ekkada ekkada undo taaraka
Movie:Murari
Singers:S.P. Charan గారు, Harini గారు
Lyricist:Sirivennela sitarama sastry  గారు
Composer:Manisharma గారు
Director:Krishna Vamsi గారు

ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక, నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలురేపే గోపిక

తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక, ఓహో అల్లరి అల్లరి ఆశలు రేపకా

నాకోసమే తళుక్కన్నదో, నాపేరునే పిలుస్తున్నదో 

పూవానగా కురుస్తున్నది, నా చూపులో మెరుస్తున్నదీ

ఏ ఊరే అందమా, ఆచూకీ అందుమా

కవ్వించే చంద్రమా, దోబూచీ చాలమ్మా 

ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక

ఒహో అల్లరి అల్లరి ఆశలు రేపకా


కులుకులు ఆ మెలికెలు మెఘాలలో మెరుపులు, పలుకులు ఆ పెదవులు మన తెలుగు రాచిలకలు

పదునులో ఆ చూపులు చురుకైన చురకత్తులు, పరుగులో ఆ ఆడుగులు గోదారిలో వరదలు

నా గుండెలో అదో మాదిరి, నింపేయకే సుధామధురి

నా కళ్ళలో కలల పందిరి, అల్లేయకోయి మహా పోకిరి

మబ్బుల్లో దాగుంది తనవైపే లాగింది 

సిగ్గల్లే తాకింది బుగ్గల్లో పాకింది ..

....ఓహో తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక


ఎవ్వరూ నన్నడగరే అతగాడి రూపేంటని, అడిగితే చూపించనా నిలువెత్తు చిరునవ్వునీ 

మెరుపుని చిరునవ్వుని కలగలిపి చూడాలని, ఎవరికి అనిపించినా చూడొచ్చు నా చెలియని

ఎన్నాళ్ళిలా తనొస్తాడని చూడాలటా ప్రతీదారిని 

ఏ తోటలో తనుందోననీ ఎటూ పంపను నా మనసునీ 

ఏనాడూ ఇంతిదిగా, కంగారే ఎరుగనుగా  

ఔనన్నా కాదన్నా గుండెలకు కుదురుందా....

తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక, ఓహో అల్లరి అల్లరి ఆశలు రేపకా

ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక, నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలురేపే గోపిక

పూవానగా కురుస్తున్నది, నా చూపులో మెరుస్తున్నదీ

నాకోసమే తళుక్కన్నదో, నాపేరునే పిలుస్తున్నదో 

కవ్వించే చంద్రమా, దోబూచీ చాలమ్మా 

ఏ ఊరే అందమా, ఆచూకీ అందుమా

అక్కడ అక్కడ అక్కడ ఉందాతారక, అదిగో తెల్లని మబ్బుల మధ్యన దాగీ దాగకా ...

Monday, June 8, 2026

Sri anjaneyam slokam [శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం] - Sri Anjaneyam

Title :Sri anjaneyam slokam
Movie:Sri Anjaneyam
Singers:K.S. Chitra గారు, Kalpana గారు
Lyricist:Sirivennela sitarama sastry  గారు
Composer:Manisharma గారు
Director:Krishna Vamsi గారు

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం (2)

ప్రభాదివ్యఖాయం ప్రకీర్తిప్రదాయం (2) 

భజే వాయుపుత్రం భజే వాలగాత్రం (2)

భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం (2)

భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం (2)  

భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం 

భజే బ్రహ్మతేజం భజే బ్రహ్మతేజం 

భజేహం భజేహం భజేహం భజేహం 

భజేహం భజేహం భజేహం భజేహం 

భజేహం భజేహం భజేహం 

Sunday, April 5, 2026

Meghale taakindi [మేఘాలె తాకింది హై హైలెస్స] - Preminchukundam Raa

Title :Meghale taakindi
Movie:Preminchukundam raa
Singers:S.P. Balasubramanyam గారు, K.S. Chitra గారు
Lyricist:Sirivennela Sita rama sastry గారు
Composer:Mani Sharma గారు
Director:Jayant C Paranji గారు

మేఘాలె తాకింది హై హైలెస్స, నవరాగంలో నవ్వింది నా మోనాలిసా

ఈ గాలి రేపింది నాలో నిషా, చెలరేగాలి రమ్మంది 

హల్లో అంటూ వొళ్ళోవాలే అందాల అప్సరస 

మేఘాలె తాకింది హై హైలెస్స, నవరాగంలో నవ్వింది నీ మోనాలిసా

ఈ గాలి రేపింది నాలో నిషా, అది నా శ్వాస చేరి

హల్లో అంటూ అల్లేసింది నీ మీద నా ఆశ 


తొలిసారి నిను చూసి మనసాగక, పిలిచానే చిలకమ్మ మెలమెల్లగా

తెలుగంత తీయ్యంగా, నువ్ పలికావే స్నేహంగా

చెలిమన్న వలవేసి నను లాగగా, చేరాను నీ నీడ చలచల్లగా 

గిలిగింత కలిగేలా, తొలివలపంటే తెలిసేలా

కునుకన్న మాటే నను చేరక 

తిరిగాను తెలుసా ఏం తోచక 

మేఘాలె తాకింది హై హైలెస్స, నవరాగంలో నవ్వింది నీ మోనాలిసా


తొలిపొద్దు వెలుగంత చిరు వేడిగా, నిలువెల్ల పులకింత చిగురించగా 

దిగులేదో హాయేదో గుర్తుచెరిపింది ఈ వింత

ఒక మత్తు కలిగింది గమ్మత్తుగా నిజమేదో కలఏదో మరిపించగా 

పగలేదో రేయేదో రెండుకలిసాయి నీ చెంత 

ప్రేమంటే ఇంతే ఏమోమరి

దానంతు ఏదో చూస్తే సరి 

మేఘాలె తాకింది హై హైలెస్స, నవరాగంలో నవ్వింది నీ మోనాలిసా

ఈ గాలి రేపింది నాలో నిషా, అది నా శ్వాస చేరి

హల్లో అంటూ అల్లేసింది నీ మీద నా ఆశ 

మేఘాలె తాకింది హై హైలెస్స, నవరాగంలో నవ్వింది నీ మోనాలిసా 

Saturday, March 28, 2026

Chilakapaccha koka [చిలకపచ్చకోక పెట్టినాదికేక ] - Narasimha Nayudu/Naidu

Title :Chilakapaccha koka
Movie:Narasimha naidu
Singers:Nagur babu (Mano) గారు, Radhika గారు
Lyricist:Bhuvana chandra గారు
Composer:Mani sharma గారు
Director:B. Gopal గారు

చిలకపచ్చకోక పెట్టినాదికేక తోడులేక బాలకృష్ణుడా 

రెండుజళ్ళ కైక రెచ్చినాది కాక పంచుకోవె పాలమీగడ 

రారా ఉల్లాస వీరుడా నీ సోకుమాడ నీదే నా పట్టుపావడా 

వస్తే నా పూలజంగిడి నీ తస్సచక్క ఇస్తావా ముంతమావిడి 

చిలకపచ్చకోక హ పెట్టినాదికేక 


చంపకమాలా చంపకే బేలా చాటుముద్దుల్లోనే ఉంది ఘాటుమసాలా 

కొంటెగోపాలా ఆపరగోలా సరసానికి ఉందిరయ్యో వేళాపాళా 

వద్దకొచ్చేసి హద్దు ఉందంటే తిక్కరెచ్చిపోద ఒసే తూగుటుయ్యాలా 

వద్దు వద్దన్నా ముద్దుపెట్టేసే మగసిరినీకుందిగా మురళిలోలా 

పిల్లచూస్తె జామకాయలే దీంతస్సదియ్య కొరకబోతె మిరపకాయలే 

చెయ్యేస్తే పులకరింతలే ఈ పిల్లగాడు నందమూరి నాటుబాంబులే 

చిలకపచ్చకోక పెట్టినాదికేక తోడులేక బాలకృష్ణుడా 

రెండుజళ్ళ కైక రెచ్చినాది కాక పంచుకోవె పాలమీగడ 


నిన్నుచూసాకే వెన్నుమీటాకే ఆడతనంలోని సుఖం తెలిసిందయ్యో 

చెనుపట్టాకే చెంపగిల్లాకే మోజువేటలో మజా మరిగానమ్మో 

పాలుకావాలా పళ్ళుకావాలా పళ్ళుపాలతోటి పడుచుపిల్ల కావాలా 

చెంతచేరాలే చిందులెయ్యాలే దాచుకున్న అందాలు దోచిపెట్టాలే 

ఏడూళ్ళా అందగత్తిని నీసోకుమాడ పట్టుకుంటె అత్తిపత్తిని 

హా రావే నా సోంపాపిడి నువ్వొద్దన్నా చేసేస్తా వీరముట్టడి 


చిలకపచ్చకోక పెట్టినాదికేక తోడులేక బాలకృష్ణుడా 

రెండుజళ్ళ కైక రెచ్చినాది కాక పంచుకోవె పాలమీగడ 

రారా ఉల్లాస వీరుడా నీ సోకుమాడ నీదే నా పట్టుపావడా 

వస్తే నా పూలజంగిడి నీ తస్సచక్క ఇస్తావా ముంతమావిడి 

రారా ఉల్లాస వీరుడా నీ సోకుమాడ నీదే నా పట్టుపావడా హొయ్ 

Satamaanamannadi le chelime [హే శతమానమన్నదిలే చెలిమే ] - Mrugaraju

Title :He satamaanamannadi le
Movie:Mrugaraju
Singers:Hari haran గారు, Saadhana Sargam గారు
Lyricist:Veturi Sundara rama murthy గారు
Composer:Mani sharma గారు
Director:Guna sekhar గారు

హే శతమానమన్నదిలే చెలిమే 

చిన్ని చిన్నారి ఆశలు గిల్లే, వంక జాబిల్లి వలపులు జల్లే

కొత్త వయ్యారమొచ్చింది ఉయ్యాల వయసులలో హల

హే శతమానమన్నదిలే చెలిమే 

పువ్వు పాడేది పుప్పొడి జోల, తేటి కోరేది తేనెల లాలా 

నీలి మేఘాలలో తేలిపోవాలి తనువులిలా హల

హే శతమానమన్నదిలే చెలిమే చిన్ని చిన్నారి ఆశలు గిల్లే 

వంక జాబిల్లి వలపులు జల్లే


విన్నానులే నీ ఎదలోతుల్లో జలపాతాల సంగీతమే

కన్నానులే నీ కన్నుల్లోన కల్లలే కన్న సావాసమే 

కోకిలలా కిలకిలలే మన పూదోటలో 

తేనెలలా వెన్నెలలే వేసవిపూటలో 

ప్రాయమో గాయమో సుమశర స్వరజతిలోన 

హే శతమానమన్నదిలే చెలిమే 

పువ్వు పాడేది పుప్పొడి జోల, తేటి కోరేది తేనెల లాలా 


చూడాలని చలి కాటేపడని చోటే గిచ్చి చూడాలని 

చెప్పాలని నీ చూపేసోకని సోకే అప్పజెప్పాలని 

మరి పదవి విరి పొదకే చెలి మర్యాదగా

యెదకడిగే ఎదురడిగా సిరిదోచెయ్యగా  

వీణవో జాణవో రతి ముఖ సుఖ శృతిలోన

  

హే శతమానమన్నదిలే చెలిమే 

చిన్ని చిన్నారి ఆశలు గిల్లే, వంక జాబిల్లి వలపులు జల్లే

కొత్త వయ్యారమొచ్చింది ఉయ్యాల వయసులలో హల

హే శతమానమన్నదిలే చెలిమే 

పువ్వు పాడేది పుప్పొడి జోల, తేటి కోరేది తేనెల లాలా 

నీలి మేఘాలలో తేలిపోవాలి తనువులిలా హల 

Navami dasami [నవమి దశమి తగిన రోజులు ] - Bavagaru baagunnara

Title :Navami dasami
Movie:Bavagaru bagunnara
Singers:Hari haran గారు, Sujata గారు
Lyricist:Chandraboase గారు
Composer:Mani sharma గారు
Director:Jayanth C Paranji గారు

నవమి దశమి తగిన రోజులు యువతి యువకుల తమపనలకు

మకరం మిథునం వృషభ రాశులు అనుకూలించును రసికులకు

దొరికినది సమయం ఓ, విరహముతో సమరం

సాయం అందించు ఆలించు పాలించు

బిడియం చాలించు చుంబించు చిగురించు

నవమి దశమి తగిన రోజులు యువతి యువకుల తమపనలకు


ప్రాయం పెరటిలో లతలు అడిగే తొలకరి చినుకువు నువ్వే

సాయం సంధ్యలో స్వాగతించే పడమర ప్రమిధవు నువ్వే

చెంగావి రంగుల్లో చీరని, కంగారు రాగాలో తీయనీ

దీపం వెలిగించు ఒడిపంచు చలిదించు

తాపం వివరించు వినిపించు వికసించు

నవమి దశమి తగిన రోజులు యువతి యువకుల తమపనలకు


స్వర్గం దారిలో పరుగుతీసే పరువపు పరబరి** నీదే

సర్వం దోచంగా ఎదురుచూసే మదనుడి ఒరవడి నీదే

కావేరి పొంగుల్లో మునగనీ, కస్తూరి తిలకాలే కరగనీ

మైకం కలిగించు కవ్వించు కరుణించు 

మంత్రం పలికించు పులకించు పవళించు


నవమి దశమి తగిన రోజులు యువతి యువకుల తమపనలకు

మకరం మిథునం వృషభ రాశులు అనుకూలించును రసికులకు

దొరికినది సమయం ఓ, విరహముతో సమరం

సాయం అందించు ఆలించు పాలించు

బిడియం చాలించు చుంబించు చిగురించు 

Friday, September 5, 2025

Vaana vallappa vallappa [వాన వల్లప్ప వల్లప్ప వొళ్ళప్పగించేయ్ సామిరంగా] - Annayya

Title :Vaana vallappa vollappaginchey
Movie:Annayya
Singers:Hariharan గారు, Sujata గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Mani sharma గారు
Director:Mutyala Subbayya గారు


వాన వల్లప్ప వల్లప్ప వొళ్ళప్పగించేయ్ సామిరంగా

ఆపు నీగొప్పలే తప్ప నా తిప్పలెట్టా రంగ రంగా

ప్రేమరాగం తేమతాళం జంటకచ్చేరి చేస్తుంటే 

మంచయోగం మాయరోగం అంటకట్టేసి పోతుంటే 

వాన వల్లప్ప వల్లప్ప వొళ్ళప్పగించేయ్ సామిరంగా

ఆపు నీగొప్పలే తప్ప నా తిప్పలెట్టా రంగ రంగా

ప్రేమరాగం తేమతాళం జంటకచ్చేరి చేస్తుంటే 

మంచయోగం మాయరోగం అంటకట్టేసి పోతుంటే 


ఆషాఢమాసంలో నీటి అందాలముసురుల్లో

మేఘాలదేశంలో కొత్తబంధాల మెరుపుల్లో 

ఆడబిడ్డా వొంటినిట్టా ఈడుకుంపట్లుగా చేసే 

జారిపడ్డా జారిపడ్డ నీ కౌగిట్లో దాచేసేయ్

వాన వల్లప్ప వల్లప్ప వొళ్ళప్పగించేయ్ సామిరంగా

ఆపు నీగొప్పలే తప్ప నా తిప్పలెట్టా రంగ రంగా 


వేసంగివానల్లో నను వేధించు వయసుల్లో

పూలంగి గొడుగుల్లో నిను బంధించు ఒడుపుల్లో

అమ్మదొంగా సుబ్బరంగా  మొగ్గ అందించు మోహంగా 

అబ్బరంగా నిబ్బరంగా అగ్గిపుట్టింది వాటంగా 


వాన వల్లప్ప వల్లప్ప వొళ్ళప్పగించేయ్ సామిరంగా

ఆపు నీగొప్పలే తప్ప నా తిప్పలెట్టా రంగ రంగా

ప్రేమరాగం తేమతాళం జంటకచ్చేరి చేస్తుంటే 

మంచయోగం మాయరోగం అంటకట్టేసి పోతుంటే 

వాన వల్లప్ప వల్లప్ప వొళ్ళప్పగించేయ్ సామిరంగా

ఆపు నీగొప్పలే తప్ప నా తిప్పలెట్టా రంగ రంగా

Monday, December 8, 2014

Yamaha Nagari [యమహా నగరీ ] from Chudalani Undi

Song Name :Yamaha Nagari..
Movie:Chudalani Undi
Singers:Hariharan
Lyricist:Veturi Sundararama Murthy
Composer:Mani Sharma
Director:Gunasekhar




ఆలాపన:
స రి మా మ గా రీ స స సనిధప స..
స రి మా మ గా రీ స స సనిధప స..
రి మ ధా ని ధ ప సా సనిధప మగపమరీ..
యమహా నగరీ కలకత్తా పురీ..

పల్లవి:
యమహా నగరీ కలకత్తా పురి..
నమహో హుగిలి హౌరా వారధి
యమహా నగరీ కలకత్తా పురి 
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మరి
చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి
చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి
యమహా నగరీ కలకత్తా పురీ..
నమహో హుగిలీ హౌరా వారధీ

చరణం 1:
నేతాజీ పుట్టినచోట గీతాంజలి పూసినచోట
పాడనా..తెలుగులో..
ఆ హంస పాడిన పాటే ఆనందుడు చూపిన బాట
సాగనా...
పద గురూ పరుగు తీసింది పట్నం..
బ్రతుకుతో వేయి పందెం
కడకు చేరాలి గమ్యం కదిలిపోరా..

ఒకరితొ ఒకరికి 
ముఖపరిచయములు
దొరకని క్షణముల
బిజిబిజి బ్రతుకుల
గజిబిజి ఉరుకుల పరుగులలో.. 

యమహా నగరీ కలకత్తా పురీ..
నమహో హుగిలి హౌరా వారధి
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మరి
చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి
చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి
యమహా నగరీ కలకత్తా పురీ..


చరణం 2:
బెంగాలీ కోకిల బాల
తెలుగింటి కోడలు పిల్ల
మానినీ.. సరోజినీ...
రోజంతా సూర్యుని కింద
రాత్రంతా రజినిగంధా సాగనీ
పదుగురు ప్రేమలే లేని లోకం
దేవతా మార్కు మైకం
శరన్నవలాభిషేకం తెలుసుకోరా..

కలలకు నెలవట 
కళళకు కొలువట
తిథులకు శెలవట
అతిథుల గొడవట
కలకట నగరపు కిటకిటలో..

యమహా నగరీ కలకత్తా పురి..
నమహో హుగిలి హౌరా వారధి
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మరి
చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి
యమహా నగరీ కలకత్తా పురి.. 

చరణం 3:
వందేమాతరమే అన్న
వంగా భూతలమే మిన్న
జాతికే కీర్తిరా..
మాతంగి కాళీ నిలయ
చోరంగి రంగుల దునియా నీదిరా...
వినుగురూ.. సత్యజిత్ రే సితారా
ఎస్ డి బర్మన్ కిథారా
థెరిస్సా కే కుమారా..
కదిలి రారా..
జనగణమనముల 
స్వరపద వనముల
హృదయపు లయలను
శృతిపరచిన ప్రియ
శుకపికముఖసుఖ రవళులతో.. 

యమహా నగరీ కలకత్తా పురీ..
నమహో హుగిలి హౌరా వారధి
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మరి
చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి
చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి
యమహా నగరీ కలకత్తా పురీ..
నమహో హుగిలి హౌరా వారధీ...