| Title : | Meghale taakindi |
| Movie: | Preminchukundam raa |
| Singers: | S.P. Balasubramanyam గారు, K.S. Chitra గారు |
| Lyricist: | Sirivennela Sita rama sastry గారు |
| Composer: | Mani Sharma గారు |
| Director: | Jayant C Paranji గారు |
మేఘాలె తాకింది హై హైలెస్స, నవరాగంలో నవ్వింది నా మోనాలిసా
ఈ గాలి రేపింది నాలో నిషా, చెలరేగాలి రమ్మంది
హల్లో అంటూ వొళ్ళోవాలే అందాల అప్సరస
మేఘాలె తాకింది హై హైలెస్స, నవరాగంలో నవ్వింది నీ మోనాలిసా
ఈ గాలి రేపింది నాలో నిషా, అది నా శ్వాస చేరి
హల్లో అంటూ అల్లేసింది నీ మీద నా ఆశ
తొలిసారి నిను చూసి మనసాగక, పిలిచానే చిలకమ్మ మెలమెల్లగా
తెలుగంత తీయ్యంగా, నువ్ పలికావే స్నేహంగా
చెలిమన్న వలవేసి నను లాగగా, చేరాను నీ నీడ చలచల్లగా
గిలిగింత కలిగేలా, తొలివలపంటే తెలిసేలా
కునుకన్న మాటే నను చేరక
తిరిగాను తెలుసా ఏం తోచక
మేఘాలె తాకింది హై హైలెస్స, నవరాగంలో నవ్వింది నీ మోనాలిసా
తొలిపొద్దు వెలుగంత చిరు వేడిగా, నిలువెల్ల పులకింత చిగురించగా
దిగులేదో హాయేదో గుర్తుచెరిపింది ఈ వింత
ఒక మత్తు కలిగింది గమ్మత్తుగా నిజమేదో కలఏదో మరిపించగా
పగలేదో రేయేదో రెండుకలిసాయి నీ చెంత
ప్రేమంటే ఇంతే ఏమోమరి
దానంతు ఏదో చూస్తే సరి
మేఘాలె తాకింది హై హైలెస్స, నవరాగంలో నవ్వింది నీ మోనాలిసా
ఈ గాలి రేపింది నాలో నిషా, అది నా శ్వాస చేరి
హల్లో అంటూ అల్లేసింది నీ మీద నా ఆశ
మేఘాలె తాకింది హై హైలెస్స, నవరాగంలో నవ్వింది నీ మోనాలిసా

No comments:
Post a Comment