| Title : | Vira vikrama dheera diggaja |
| Movie: | Adavi Donga |
| Singers: | S.P. Balasubramanyam గారు, P.Suseela గారు |
| Lyricist: | Veturi Sundara Rama murthy గారు |
| Composer: | Chakravarthy గారు |
| Director: | K. Raghavendra Rao గారు |
వీర విక్రమ ధీర దిగ్గజ నీకే స్వాగతాలు
వీర విక్రమ ధీర దిగ్గజ నీకే స్వాగతాలు
వాలు చూపుల వన్నెలాడికి వయసే అంకితాలు
మహరాజులా మనసేలుకో, మహరాణిలా మనువాడుకో
వచ్చే వసంతకాలం విచ్చేసుమాల గంధం, నీకై తపించి నిన్నే జపించే అందం
కవ్వించు తేనె దీపం కౌగిళ్ళ ప్రేమ శిల్పం, నేనై చలించి నిన్నే వరించె బంధం
కొండరకి పండు ముద్దంటా, నా కొండమల్లి నువ్వంటా
రసాలా నవరసాల యమ మసాలా వేడిలో
లవ్‌బాయ్‌లా లాలించవా కౌబాయ్‌లా కవ్వించనా
వీర విక్రమ ధీర దిగ్గజ నీకే స్వాగతాలు
వాలు చూపుల వన్నెలాడికి వయసే అంకితాలు
వాటెయ్యకుంటే పాపం వయ్యారమెంత శాపం, పూచేటి సోకు దాచేసుకోకు నేరం
వలపన్నదెంత వేగం వలవేసిపట్టె మోహం, తీరేదికాదు నూరేళ్ళ దాహం
నీరూపు నాకు చుక్కంటా, నాలేత బుగ్గకిమ్మంటా
పెట్టించు లగ్గమెట్టించు ముద్దుపుట్టించే వేళలో
జాంపండులా దొరికావులే జేంస్‌బాండులా కలిసావులే
వీర విక్రమ ధీర దిగ్గజ నీకే స్వాగతాలు
వాలు చూపుల వన్నెలాడికి వయసే అంకితాలు
కౌగిళ్ళు నీకు పంచే కసిఈడు కాస్త పెంచే, కవ్వింతలోన ఉన్నంత దోచిపోరా
మల్లెల్లో ఇల్లు కట్టి మసకల్లో కన్నుకొట్టి, దీపాలవేళ తాపాలు తీర్చి పోవే
చిలకంటి దాన్ని నేనంటా, అలకల్లొ ఉంది సోకంతా
తందానా తన తందానా జంటతాళాలే సాగనీ
హీరోలకే హీరోవిరా హీమానులా ప్రేమించనా
వీర విక్రమ ధీర దిగ్గజ నీకే స్వాగతాలు
వాలు చూపుల వన్నెలాడికి వయసే అంకితాలు
మహరాజులా మనసేలుకో, మహరాణిలా మనువాడుకో

No comments:
Post a Comment