| Title : | Talachi talachi chuste |
| Movie: | 7G Brundavan colony |
| Singers: | Shreya Goshal గారు |
| Lyricist: | Siva Ganesh గారు |
| Composer: | Yuvan Shankar Raja గారు |
| Director: | Selva Raghavan గారు |
తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా..
నీకై నేను బ్రతికి ఉంటిని.. ఓ.. నీలో నన్ను చూసుకుంటిని
తెరచి చూసి చదువు వేళ, కాలిపోయే లేఖ రాసా
నీకై నేను బ్రతికి ఉంటిని.. ఓ.. నీలో నన్ను చూసుకుంటిని
కొలువుతీరు తరువుల నీడ, చెప్పుకొనును మన కథనిపుడు
రాలిపోయిన పూలగంధమా
రాక తెలుపు మువ్వల సడిని, తలచుకొనును దారులు ఎపుడు
పగిలిపోయిన గాజుల అందమా
అరచేత వేడిని రేపే, చెలియ చేయి నీ చేత
ఒడిలో వాలి కథలను చెప్ప రాసిపెట్టలేదు
తొలిస్వప్నం చాలులే ప్రియతమా.. కనులు తెరువుమా..
మధురమైన మాటలు ఎన్నో, కలసిపోవు నీ పలుకులలో
జగము కరుగు రూపే కరుగునా
చెరిగిపోని చూపులు అన్నీ, రేయిపగలు నిలుచును నీలో
నీదుచూపు నన్ను మరచునా
వెంటవచ్చు నీడ బింబం, వచ్చి వచ్చి పోవు
కళ్ళముందు సాక్ష్యాలున్నా తిరిగినేను వస్తా..
ఒకసారి కాదురా ప్రియతమా .. ఎపుడు పిలిచినా..
తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా..
నీకై నేను బ్రతికి ఉంటిని.. ఓ.. నీలో నన్ను చూసుకుంటిని

No comments:
Post a Comment