Showing posts with label Yuvanshankarraja. Show all posts
Showing posts with label Yuvanshankarraja. Show all posts

Friday, April 3, 2026

Talachi talachi chuste [తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా] - 7G Brundavan Colony

Title :Talachi talachi chuste
Movie:7G Brundavan colony
Singers:Shreya Goshal గారు
Lyricist:Siva Ganesh గారు
Composer:Yuvan Shankar Raja గారు
Director:Selva Raghavan గారు

తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా.. 

నీకై నేను బ్రతికి ఉంటిని.. ఓ.. నీలో నన్ను చూసుకుంటిని

తెరచి చూసి చదువు వేళ, కాలిపోయే లేఖ రాసా 

నీకై నేను బ్రతికి ఉంటిని.. ఓ.. నీలో నన్ను చూసుకుంటిని


కొలువుతీరు తరువుల నీడ, చెప్పుకొనును మన కథనిపుడు 

రాలిపోయిన పూలగంధమా 

రాక తెలుపు మువ్వల సడిని, తలచుకొనును దారులు ఎపుడు 

పగిలిపోయిన గాజుల అందమా 

అరచేత వేడిని రేపే, చెలియ చేయి నీ చేత 

ఒడిలో వాలి కథలను చెప్ప రాసిపెట్టలేదు 

తొలిస్వప్నం చాలులే ప్రియతమా.. కనులు తెరువుమా..


మధురమైన మాటలు ఎన్నో, కలసిపోవు నీ పలుకులలో

జగము కరుగు రూపే కరుగునా 

చెరిగిపోని చూపులు అన్నీ, రేయిపగలు నిలుచును నీలో 

నీదుచూపు నన్ను మరచునా 

వెంటవచ్చు నీడ బింబం, వచ్చి వచ్చి పోవు 

కళ్ళముందు సాక్ష్యాలున్నా తిరిగినేను వస్తా..

ఒకసారి కాదురా ప్రియతమా .. ఎపుడు పిలిచినా..


తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా.. 

నీకై నేను బ్రతికి ఉంటిని.. ఓ.. నీలో నన్ను చూసుకుంటిని 

Thursday, March 19, 2026

Akasam kindundi [ఆకాశం కిందుంది ఈ నేలేమో ఇక పైనుంది] - Seshu

Title :Akasam kindundi
Movie:Seshu
Singers:Tippu గారు
Lyricist:Chandrabose గారు
Composer:Yuvan Shankar Raja గారు
Director:Jeevitha Rajasekhar గారు

రేయ్ చియ్యాన్ ఇంకేం నీ లవ్ అప్లికేషన్లో ఆ అమ్మాయి సంతకం చేసిందిరోయ్ 

ఉమ్మ్. ఉహూ.. మామూలు ఇంకుతో కాదురా పిచ్చోడా గ్రీన్ఇంకుతో చేసింది 

అయితే బాడీ గాల్లోతేలిపోతున్నట్టు కళ్ళువాలిపోతునట్టు, వొళ్ళు చలిచలిగాఉన్నట్టు అనిపిస్తోందిరా 

ఛ ఛ అవన్నీ మలేరియా సింప్టంస్ రా.. ఇది లవ్వేరియా

దీని లక్షణాలు ఇదిగో ఇలా ఉల్టా పల్టాగా ఉంటాయి రండి 


ఆకాశం కిందుంది ఈ నేలేమో ఇక పైనుంది 

అమ్మాయే అవునంది నాకంతా తలకిందౌతుంది

హుషారుగా షికారుగా అటూ ఇటూ తిరిగే నాకు 

హఠాత్తుగా లవ్వేరియ ఫీవరే వచ్చింది

ఆకాశం కిందుంది ఈ నేలేమో ఇక పైనుంది 

అమ్మాయే అవునంది నాకంతా తలకిందౌతుంది


ఒరేయ్ చియ్యన్ మొత్తానికి నీకు ఆ అమ్మయి పడింది, నువ్వా అమ్మయికి పడ్డవ్.. ఇద్దరు కలిసి లవ్లో పడ్డారు .. జాగ్రత్తరోయ్ ఇంకా ఎక్కడెక్కడ పడతారో 

చూడరా నువ్వు ఏం చెప్పిన వినబడట్లేదు.. అస్సలు ఏమి కనబడట్లేదు రా ఆ అమ్మయి తప్ప


రోడ్డుపై నడిచెళుతుంటే పోస్టరై కనిపించింది

రూములో పడుకునిఉంటే ఫ్యానులా తిరుగుతు ఉంది 

ఎవరికో ఫోన్ చేస్తుంటే లినులో తానొచ్చింది 

చివరికి భోంచేస్తుంటే ముద్దలా మురిపించింది 

అమ్మడి రూపమే అంతటా వ్యాపించే 

ఆకాశం కిందుంది ఈ నేలేమో ఇక పైనుంది 

అమ్మాయే అవునంది నాకంతా తలకిందౌతుంది


రేయ్ వీడు చాల డీప్లోకి వెళ్ళిపోయాడురా.. ఇంకీడు పైకిరావడం కష్టం రా 

ఛ నువ్ నోర్ముయ్యిరా .. నువ్వు చెప్పరా చియ్యన్

మిల మిలా మిణుగురులొచ్చి మనసునే మురిపించాయి

కిల కిలా చిలకలు వచ్చి కితకితలు పెడుతున్నాయి 

పగటిలో చీకటివచ్చి కలలనే రప్పించింది 

కలలలో అమ్మాయొచ్చి కలకలం తెప్పించింది  

కొత్తగా వింతగా ఉన్నది ఈ ప్రేమే 

ఆకాశం కిందుంది ఈ నేలేమో ఇక పైనుంది 

అమ్మాయే అవునంది నాకంతా తలకిందౌతుంది

హుషారుగా షికారుగా అటూ ఇటూ తిరిగే నాకు 

హఠాత్తుగా లవ్వేరియ ఫీవరే వచ్చింది

ఆకాశం కిందుంది ఈ నేలేమో ఇక పైనుంది 

Wednesday, November 12, 2014

gulaabi kaLLu renDu Mullu...[గులాబి కళ్ళు రెండు ముళ్ళు]


Title :gulaabi kaLLu renDu...
Movie:Govindudu Andarivaadel
Singers:Javed Ali గారు
Lyricist: Sri Mani గారు 
Composer: Yuvan shankar raaja గారు
Director:Krishna Vamsi గారు





గులాబి కళ్ళు రెండు ముళ్ళు చేసి గుండెలొకి గుచ్హుతున్నావే ఒహో.
జిలేబి వొళ్ళు  చేసినట్టు నువ్వె ఆశపెట్టి చంపుతున్నావే..
రాకాసివె...నిలే పెదాలలొ పొగే చెసి ఊరించి ఉడికించి పొతావే రాక్షసి సరా సరి నీ నడుమూ మడతల్లొ నను మడతపెట్టావే..
ఊర్వశి నిలొ నిష నషాలనికంటె ఓ ఇంగ్లీషు ముద్దీయవే.. పిల్లా పిల్లా ఒహూఒ...
నాతోటి నీకింత తగువెందుకె నా ముద్దు నా కివ్వకా.
అసలింత నీకింత పొగరెందుకె పిసరంత ముద్దివ్వకా..
నాపైన కోపమే చల్లార్చుకొ ముద్దుల్తొ వేడిగా..
ఆపై ఉక్రొషమే తీర్చేసుకొ పెదాల్తొ తీయగ..
పిసినారి నారివె గొదావరి నా గుండెల్లొ ఉప్పొంగి ఉరికేంత ముద్దీయవే మరీ మనొహరి నీ ముక్కోపమందాల కసి తీరె ముద్దియవే...
ఏం మదువు దాగుందొ ఈమగువలొ చూస్థెనె కిక్కెక్కెలా..
ఆ షేక్స్పిరైనా నిను చూసెనొ.. ఓ దేవదాసవ్వడా...
నీ ఫ్రెంచ్  కిస్సునె అందిచవె? పరదేసి నేననా...
నీ పెంకి మూద్దునే భరించగా స్వదేసినవ్వనా...
ఓ ఆడ బాంబులా పిల్లా నువ్వె నీ అందాలు పేల్చెసి నా అంతు తెల్చేసి న్వూక్లియర్ రీయాక్టరై నా అణువణువు అనుబాంబు ముద్దుల్తొ ముంచెయ్యవే...
గులాబి కళ్ళు రెండు ముళ్ళు చేసి గుండెలొకి గుచ్హుతున్నావే ఒహూ.
జిలేబి వొళ్ళు  చేసినట్టు నువ్వె ఆశపెట్టి చంపుతున్నావే..
రాకాసివె...నిలే పెదాలలొ పొగే చెసి ఊరించి ఉడికించి పొతావే రాక్షసి సరా సరి నీ నడుమూ మడతల్లొ నను
మడతపెట్టవే..
ఊర్వసి నీలొ నిష నషాలనికంటె ఓ ఇంగ్లీషు ముద్దీయవే.. పిల్లా పిల్లా ఒహో...

English

gulaabi kaLLu renDu muLLu cHEsi gunDeloki guchhutunnaavae ohoe.
jilaebi voLLu  chaesinaTTu nuvve aaSapeTTi champutunnaavae..
raakaasive...nilae pedaalalo pogae chesi oorincHi uDikincHi potaavae raakshasi saraa sari nee naDumoo maDatallo nanu maDatapeTTaavae..
oorvaSi nilo nisha nashaalanikanTe O ingleeshu muddeeyavae.. pillaa pillaa ohooo...
naatoaTi neekinta taguvenduke naa muddu naa kivvakaaa.
asalinta neekinta pogarenduke pisaranta muddivvakaa..
naapaina koapamae challaarchuko muddulto vaeDigaa..
aapai ukroshamae teerchaesuko pedaalto teeyaga..
pisinaari naarive godaavari naa gunDello uppongi urikaenta muddeeyavae maree manohari nee mukkOpamandaala kasi teere muddiyavae...
Em maduvu daagundo eemaguvalo choosthene kikkekkelaa..
aa Shaekspirainaa ninu chooseno.. O daevadaasavvaDaa...
nee phrench  kissune andichave? paradaesi naenanaaa...
nee penki muuddunae bharimchagaa swadaesinawwanaa...
O aaDa baambulaa pillaa nuvve nee andaalu paelchesi naa antu telchaesi nwuakliyar reeyaakTarai naa aNuvaNuvu anubaambu muddulto muncheyyavae...
gulaabi kaLLu renDu muLLu cHEsi gunDeloki guchhutunnaavae ohoo.
jilaebi voLLu  chaesinaTTu nuvve aaSapeTTi champutunnaavae..
raakaasive...nilae pedaalalo pogae chesi oorincHi uDikincHi potaavae raakshasi saraa sari nee naDumoo maDatallo nanu
maDatapeTTavae..
oorvasi neelo nisha nashaalanikanTe O ingleeshu muddeeyavae.. pillaa pillaa ohoe...