Showing posts with label vaana. Show all posts
Showing posts with label vaana. Show all posts

Wednesday, March 18, 2026

Eduta nilichindi chudu [ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో] - Vaana

Title :Eduta nilichindi chudu
Movie:Vaana
Singers:Karthik గారు
Lyricist:Sirivennela Sitarama sastry గారు
Composer:Kamalakar గారు
Director:M.S. Raju గారు

ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో 

ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమే

మైమరచిపోయా మాయలో ప్రాణమంత మీటుతుంటే.. వానవీణలా..

ఎదుట నిలిచింది చూడు ...


నిజంలాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలి

కలేఐతే ఆ నిజం ఎలా తట్టుకోవాలి

ఔనో కాదో అడగకంది నా మౌనం

చెలివో శిలవో తెలియకుంది నీ రూపం

చెలి నీ బంధమల్లుకుందే జన్మఖైదులా..

ఎదుట నిలిచింది చూడు ...


నిన్నే చేరుకోలేక ఎటెళ్ళిందో నా లేఖ

వినేవారులేక విసుక్కుంది నా కేక 

నీదో కాదో రాసున్న చిరునామా 

ఉందో లేదో ఆ చోట నా ప్రేమ 

వరం లాంటి శాపమేదో సొంతమైందిలా..

ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో 

ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమే

మైమరచిపోయా మాయలో ప్రాణమంత మీటుతుంటే.. వానవీణలా..

ఎదుట నిలిచింది చూడు ...  

Friday, September 5, 2025

Vaana vallappa vallappa [వాన వల్లప్ప వల్లప్ప వొళ్ళప్పగించేయ్ సామిరంగా] - Annayya

Title :Vaana vallappa vollappaginchey
Movie:Annayya
Singers:Hariharan గారు, Sujata గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Mani sharma గారు
Director:Mutyala Subbayya గారు


వాన వల్లప్ప వల్లప్ప వొళ్ళప్పగించేయ్ సామిరంగా

ఆపు నీగొప్పలే తప్ప నా తిప్పలెట్టా రంగ రంగా

ప్రేమరాగం తేమతాళం జంటకచ్చేరి చేస్తుంటే 

మంచయోగం మాయరోగం అంటకట్టేసి పోతుంటే 

వాన వల్లప్ప వల్లప్ప వొళ్ళప్పగించేయ్ సామిరంగా

ఆపు నీగొప్పలే తప్ప నా తిప్పలెట్టా రంగ రంగా

ప్రేమరాగం తేమతాళం జంటకచ్చేరి చేస్తుంటే 

మంచయోగం మాయరోగం అంటకట్టేసి పోతుంటే 


ఆషాఢమాసంలో నీటి అందాలముసురుల్లో

మేఘాలదేశంలో కొత్తబంధాల మెరుపుల్లో 

ఆడబిడ్డా వొంటినిట్టా ఈడుకుంపట్లుగా చేసే 

జారిపడ్డా జారిపడ్డ నీ కౌగిట్లో దాచేసేయ్

వాన వల్లప్ప వల్లప్ప వొళ్ళప్పగించేయ్ సామిరంగా

ఆపు నీగొప్పలే తప్ప నా తిప్పలెట్టా రంగ రంగా 


వేసంగివానల్లో నను వేధించు వయసుల్లో

పూలంగి గొడుగుల్లో నిను బంధించు ఒడుపుల్లో

అమ్మదొంగా సుబ్బరంగా  మొగ్గ అందించు మోహంగా 

అబ్బరంగా నిబ్బరంగా అగ్గిపుట్టింది వాటంగా 


వాన వల్లప్ప వల్లప్ప వొళ్ళప్పగించేయ్ సామిరంగా

ఆపు నీగొప్పలే తప్ప నా తిప్పలెట్టా రంగ రంగా

ప్రేమరాగం తేమతాళం జంటకచ్చేరి చేస్తుంటే 

మంచయోగం మాయరోగం అంటకట్టేసి పోతుంటే 

వాన వల్లప్ప వల్లప్ప వొళ్ళప్పగించేయ్ సామిరంగా

ఆపు నీగొప్పలే తప్ప నా తిప్పలెట్టా రంగ రంగా

Friday, November 1, 2024

వాన వాన తేనెల వాన (Daddy)

Song Name :Vaana Vaana Tenela Vaana
Movie:Daddy
Singers:Udit Narayan garu, K.S. Chitra garu
Lyricist:Chandra Bose garu
Composer:S.A Rajkumar garu
DirectorSuresh Krishna garu

వాన వాన తేనెల వాన 

వాన వాన వెన్నెల వాన 

కురవని కురవనీ నే నిలువునా కరగనీ 

పాప కంటి చూపులలో పాలపంటి నవ్వులలో 

బాల మేఘమాలికలో జాలువారు తొలకరిలో 

తడిసి తడిసిపోనీ మది మురిసి మురిసిపోనీ 

తడిసి తడిసిపోనీ ముడి బిగిసి బిగిసిపోనీ 

చిరు చిరు పలుకుల చినుకులలో బిర బిర పరుగుల వరదలలో  

తడిసి తడిసిపోనీ మది మురిసి మురిసిపోనీ 

వాన వాన తేనెల వాన 

వాన వాన వెన్నెల వానా...


హైల హైల హలాలారే  హైల హైల హైలారే 

హైల హైల హలాలారే  హైల హైల హైలారే 


ముంగిట్లో మబ్బే వచ్చే మనసులోన మెరుపొచ్చే 

పన్నీటి చినుకే వచ్చే ప్రాణంలోన చిగురొచ్చే 

బుల్లి బుజ్జి వానదేవతొచ్చె గుండెపైన నీళ్ళుజల్లి లాలపోసె నేడే  

ఘల్లు ఘల్లు గాలిదేవతొచ్చె జీవితాన ప్రేమచల్లి లాలిపాట పాడే

ఒహో...శ్రావణలా రాణివచ్చీ, ఉన్న చీకూ చింతా చీకట్లన్ని కడిగే 

ఇంకా ఇంకా ఏంకావాలో అడిగే 

మధురంగా కథే సాగుతుంటే మనబెంగా ఇలా కరుగుతుంటే 

వేగంగా కలే తీరుతుంటే ఆ గంగా ఇలకు జారుతుంటే 

తడిసి తడిసిపోనీ మది మురిసి మురిసిపోనీ 

వాన వాన తేనెల వాన 

వాన వాన వెన్నెల వానా...


చిన్నతనం ముందరికొచ్చే, పెద్దరికం మరుపొచ్చే 

ఏటిగట్లు ఎదురుగవచ్చే, ఇసకగూళ్ళు గురుతొచ్చే 

కారుమబ్బు నీరుచిందుతుంటే, కాగితాల పడవలెన్నో కంటిముందుకొచ్చే 

నీటిలోన ఆటలాడుతుంటే, అమ్మ నోటి తీపితిట్లు జ్ఞాపకానికొచ్చే 

ఒహో.. పైటకొంగే గొడుగుకాగా, ఈ చాటు చోటు ఎంతో ఎంతో ఇరుకే 

ఎమైందంటే నీకు నాకు ఎరుకే 

ఒక్కటిగా ఇలా పక్కనుంటే, ఇద్దరమై సదా సర్దుకుంటే 

ముగ్గురిదీ ఒకే ప్రాణమంటూ, ముద్దులతో కథే రాసుకుంటూ 

తడిసి తడిసిపోనీ మది మురిసి మురిసిపోనీ 

వాన వాన తేనెల వాన 

వాన వాన వెన్నెల వానా...

కురవని కురవనీ నే నిలువునా కరగనీ 

పాప కంటి చూపులలో పాలపంటి నవ్వులలో 

బాల మేఘమాలికలో జాలువారు తొలకరిలో 

తడిసి తడిసిపోనీ మది మురిసి మురిసిపోనీ 

తడిసి తడిసిపోనీ ముడి బిగిసి బిగిసిపోనీ