| Title : | malli kooyave guvva |
| Movie: | Itlu sravani subramanyam |
| Singers: | Hariharan గారు, Kousalya గారు |
| Lyricist: | Kandikonda గారు |
| Composer: | Chakri గారు |
| Director: | Puri Jagannadh గారు |
మళ్ళికూయవే గువ్వా మోగిన అందెల మువ్వ
తుళ్ళిపాడవే పువ్వా గుండెల సవ్వడి నువ్వా
మళ్ళికూయవే గువ్వా మోగిన అందెల మువ్వ
తుళ్ళిపాడవే పువ్వా గుండెల సవ్వడి నువ్వా
విధివరమే నీవేగా నీవేగా కలనిజమై పూచేగా పూచేగా
జిలిబిలి పలుకుల నువ్వా దివిలో తారాజువ్వ
జిలిబిలి పలుకుల నువ్వా దివిలో తారాజువ్వ జువ్వా జువ్వా
మళ్ళికూయవే గువ్వా మోగిన అందెల మువ్వ
తుళ్ళిపాడవే పువ్వా గుండెల సవ్వడి నువ్వా
సిరి సిరి మువ్వలా చిరుసడి వింటే స్మృతిపదమున నీ గానమే
సిరి సిరి మువ్వలా చిరుసడి వింటే స్మృతిపదమున నీ గానమే
పొంగిపారే ఏటిలో తొంగి తొంగి చూస్తే తోచెను ప్రియ నీ రూపమే
సోకేటి పవనం నువ్వు మురిపించే గగనం
కోనేటి కమలం లోలోని అరళం
కలత నిదురలో కలలాగా జారిపోకె జవరాలా
నీలిసంద్రమున అల లాగా హృదయలోగిలిలో నువ్వా నువ్వా నువ్వా
మళ్ళికూయవే గువ్వా మోగిన అందెల మువ్వ
తుళ్ళిపాడవే పువ్వా గుండెల సవ్వడి నువ్వా
తీయ్యనైన ఊసుతో ప్రియ విరహముతో కృంగెను ఎద నీకోసమే
తీయ్యనైన ఊసుతో ప్రియ విరహముతో కృంగెను ఎద నీకోసమే
సాగిపోయె దారిలో వేసే ప్రతి అడుగులో తగిలెను నీ మృదుపాదమె
ఎగిసేటి కెరటం చేరేలే తీరం
చీకటిలో పయనం నువ్వేలే అరుణం
వలపు వరదలో నదిలాగా తడిపిపో జడివానలా
మంచుతెరలలో తడిలాగ నయన చిత్తడిలో నువ్వా నువ్వా నువ్వా
మళ్ళికూయవే గువ్వా మోగిన అందెల మువ్వ
తుళ్ళిపాడవే పువ్వా గుండెల సవ్వడి నువ్వా
మళ్ళికూయవే గువ్వా మోగిన అందెల మువ్వ
తుళ్ళిపాడవే పువ్వా గుండెల సవ్వడి నువ్వా
విధివరమే నీవేగా నీవేగా కలనిజమై పూచేగా పూచేగా
జిలిబిలి పలుకుల నువ్వా దివిలో తారాజువ్వ
జిలిబిలి పలుకుల నువ్వా దివిలో తారాజువ్వ జువ్వా జువ్వా
మళ్ళికూయవే గువ్వా మోగిన అందెల మువ్వ
తుళ్ళిపాడవే పువ్వా గుండెల సవ్వడి నువ్వా

No comments:
Post a Comment