| Title : | Rei rei raaraa |
| Movie: | Peddi |
| Singers: | A.R. Rahman గారు |
| Lyricist: | Ananta Sri ram గారు |
| Composer: | A.R. Rahman గారు |
| Director: | Bucchi babu గారు |
రయ్ రయ్ రారా రయ్ రయ్ రారా అడ్డేలేని దారై రారా
రయ్ రయ్ రారా రయ్ రయ్ రారా హద్దేలేని తీరై రారా
దూకేట్టి జోరై రా పోరాడేట్టి పోరై రా నీలో ఆరునూరై రా మందల్లోంచి వేరై రా
భయం పీకిపారైరా సిగ్గుంటె సీరైరా జైకొట్టేట్టి పేరైరా
నీ రాకచూసి లోకంచేసే హోరై హోరై రారా ..
రయ్ రయ్ రారా రయ్ రయ్ రారా అడ్డేలేని దారై రారా
రయ్ రయ్ రారా రయ్ రయ్ రయ్ రారా హద్దేలేని తీరై రారా రా...
బెరుగ్గ అహ్ బెరుగ్గ, ఇరుగ్గ ఆ ఇరుగ్గా పాతేసుకోకోయలా నువ్ నిన్నే నీ లోపలా
హే పాతికేళ్ళకే నువ్ పాతబడిపోకురా
నిన్నటిలాగే రేపున్నదంటే.. ఈరోజేం పీకావనే
నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేమి పొడిచావనే
మొడెంలో తలదించేటట్టైతే మొలతాడెందుక్కట్టావ్ తెంచేసే
నువ్వు మొత్తం రక్తం మార్చుకునొచ్చేసేయ్
రయ్ రయ్ రారా రయ్ రయ్ రారా అడ్డేలేని దారై రారా
ఆటనుకోకోయ్ ఆటంటే బతుకోయ్ నీ ఆట బతకాలిరోయ్
మాటనుకోకోయ్ గెలుపంటే వెలుగోయ్ గెలుపై నువ్ వెలగాలిరోయ్
మండే గుండే నీలో లేదంటే కాలూ చెయ్యి ఉన్నా లేనట్టే
నీకు నెగ్గే నైజం అర్థం కానట్టే
రయ్ రయ్ రారా రయ్ రయ్ రారా అడ్డేలేని దారై రారా
రయ్ రయ్ రారా రయ్ రయ్ రారా హద్దేలేని తీరై రారా రా
బెరుగ్గ అహ్ బెరుగ్గ, ఇరుగ్గ ఆ ఇరుగ్గా పాతేసుకోకోయలా నువ్ నిన్నే నీ లోపలా
హే పాతికేళ్ళకే నువ్ పాతబడిపోకురా

No comments:
Post a Comment