| Title : | Manaseriginavadu ma devudu |
| Movie: | Pantulamma |
| Singers: | P. Suseela గారు |
| Lyricist: | Veturi Sundararama murthy గారు |
| Composer: | Rajan Nagendra గారు |
| Director: | Singeetam Srinivasarao గారు |
మనసెరిగినవాడు మా దేవుడు శ్రీరాముడు
మనసెరిగినవాడు మా దేవుడు శ్రీరాముడు
మధుర మధుర తర శుభనాముడు సునధాముడు
మనసెరిగినవాడు మా దేవుడు శ్రీరాముడు
ఎరిగినవారికి ఎదలోఉన్నాడు, ఎరుగనివారికి ఎదుటేఉన్నాడు
మానవుడైపుట్టి మాధవుడైనాడు ..
తలచినవారికి తారకనాముడు పిలిచినపలికే చెలికాడు సైదోడు
కొలువైఉన్నాడు కోదండరాముడు మనతోడుగా నీడగా రాముడు
మనసెరిగినవాడు మా దేవుడు శ్రీరాముడు
మధుర మధుర తర శుభనాముడు సునధాముడు
మనసెరిగినవాడు మా దేవుడు శ్రీరాముడు
కరకుబోయను ఆది కవిని చేసినపేరు, గరళకంఠునినోట తరలివచ్చిన పేరు
ఇహపరసాధనకు ఇరవైనపేరు
శబరి ఎంగిలిగంగ తానమాడినపేరు, హనుమ ఎదలో భక్తి ఇనుమడించినపేరు
రామ రామా అంటే కామితమే తీరు, కలకాలము మము కాపాడు పేరు
మనసెరిగినవాడు మా దేవుడు శ్రీరాముడు
మధుర మధుర తర శుభనాముడు సునధాముడు

No comments:
Post a Comment