Wednesday, March 4, 2026

Jaaliga jaabilamma [జాలిగా జాబిలమ్మా] - Swathi Kiranam

Song Name :Jaliga jabilamma
Movie:Swathikiranam
Singers:Vani Jayaram garu, K.S. Chitra garu
Lyricist:Sirivennela seetharama sastry garu
Composer:K.V. Mahadevan garu
DirectorK. Viswanath garu 

జాలిగా జాబిలమ్మా, రేరేయంతా 

జాలిగా జాబిలమ్మా, రేరేయంతా రెప్పవేయనేలేదు ఎందుచేత ఎందుచేత

పదహారు కళలనీ పదిలంగా ఉంచనీ 

పదహారు కళలనీ పదిలంగా ఉంచనీ ఆ కృష్ణపక్షమే ఎదలో చిచ్చుపెట్టుటచేత 

....


కాటుక కంటనీరు పెదవులకంటనీకు 

చిరునవ్వు దీపకళిక చిన్నబోనియ్యకు 

నీ బుజ్జి గణపతినీ బుజ్జగించి చెబుతున్నా 

నీ బుజ్జి గణపతినీ బుజ్జగించి చెబుతున్నా 

నీ కుంకుమకెపుడూ పొద్దుగుంకదమ్మా 

....


సున్నిపిండిని నలిచి చిన్నారిగా మలిచి, సంతసాన మునిగింది సంతులేని పార్వతి 

సుతుడన్న మతిమరిచి శూలాన మెడవిరిచి, పెద్దరికం చూపే చిచ్చుకంటి పెనిమిటి 

ప్రాణపతినంటుందా.. బిడ్డగతికంటుందా 

ప్రాణపతినంటుందా.. బిడ్డగతికంటుందా 

ఆ రెండుకళ్ళల్లో అధికం నీటి చితి, కాలకూటంకన్నా ఘాటైన గరళమిది

గొంతునులిమే గురుతై వెంటనే ఉంటుంది.. 


ఆటుపోటు ఘటనలివి ఆటవిడుపు నటనలివి, ఆదిశక్తివినీవు అంటవునిన్నేవి 

నీ బుజ్జి గణపతినీ బుజ్జగించి చెబుతున్నా, కంచికెళ్ళిపోయేవే కథలన్నీ..

...

No comments:

Post a Comment