Showing posts with label janaki. Show all posts
Showing posts with label janaki. Show all posts

Sunday, September 29, 2024

మహాకనకదుర్గా విజయకనకదుర్గా (Devullu)

Song Name :mahakanakadurga vijayakanakadurga
Movie:Devullu
Singers:S. Janaki garu
Lyricist:Jonnavittula garu
Composer:Vandemataram Srinivas garu
DirectorKodi Ramakrishna garu

మహాకనకదుర్గా విజయకనకదుర్గా పరాశక్తిలలితా శివానందచరితా 

మహాకనకదుర్గా విజయకనకదుర్గా పరాశక్తిలలితా శివానందచరితా 

శివంకరీ శుభంకరీ పూర్ణచంద్రకళాధరీ

బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూలశక్తి

అష్టాదశ పీఠాలను అధీష్టించు ఆదిశక్తి 

మహాకనకదుర్గా విజయకనకదుర్గా పరాశక్తిలలితా శివానందచరితా 


ఓంకారరావాల అమ్మ కృష్ణాతీరంలో, ఇంద్రకీల గిరిపైన వెలసెను కృతయుగములోన 

ఈ కొండపైన అర్జునుడు తపమును గావించెను, పరమశివుని మెప్పించి పాశుపతము పొందెను 

విజయుడైనా అర్జునుని పేరిట విజయవాడ అయినది ఈ నగరము 

జగములన్నియూ జేజేలు పలుకగ, కనకదుర్గకైనది స్థిరనివాసము 

మెలిమిబంగరు ముద్దపసుపు కలగలిపిన వెన్నెలమోము 

కోటి కోటి ప్రభాతాల అరుణిమలే కుంకుమ 

అమ్మ మనసుపడి అడిగి దరించిన కృష్ణవేణి ముక్కుపుడక 

ప్రేమ కరుణ వాత్సల్యము మురిపించే దుర్గరూపం 

ముక్కోటి దేవతలందరికి ఇదియే ముక్తిదీపం 

మహాకనకదుర్గా విజయకనకదుర్గా పరాశక్తిలలితా శివానందచరితా 


దేవినవరాత్రులలో వేదమంత్రపూజలలో స్వర్ణకవచమును దాల్చిన కనకదుర్గాదేవి 

భవబంధాలను బాపె బాలాత్రిపురసుందరి 

నిత్యానందముకూర్చే అన్నపూర్ణాదేవి 

లోకశాంతినే సంరక్షించే సుమంత్రమూర్తీ గాయత్రీ

అక్షయసంపదలెన్నో అవనిజనులకందించే దివ్యరూపిణీ మహాలక్ష్మి

విద్యా కవన గానమొసగు వేదమయీ సరస్వతి  

ఆయురారోగ్యలు భోగభాగ్యాములు ప్రసాదించు మహాదుర్గ  

శత్రువినాసిని శక్తిస్వరూపిణి మహిషాశురమర్ధిని, 

విజయకారిణి అభయరూపిణి శ్రీరాజరాజేశ్వరి 

భక్తులందరికి కన్నులపండుగ అమ్మా నీ దర్శనం.. దుర్గమ్మా నీ దర్శనం 


మహాకనకదుర్గా విజయకనకదుర్గా పరాశక్తిలలితా శివానందచరితా 

మహాకనకదుర్గా విజయకనకదుర్గా పరాశక్తిలలితా శివానందచరితా 


Tuesday, October 6, 2015

Chilaka Pachcha Totalo [ చిలకపచ్చ తోటలో ] - Janaki Ramudu

Song Name :Chilakapachcha totalo
Movie:Jaanaki Raamudu
Singers:S.P.Balu గారు , Chitra గారు 
Lyricist:Veturi Sundararama Murthy గారు 
Composer:K.V. Mahadevan గారు 
Director:K Raghavendra Rao గారు 

చిలకపచ్చ తోటలో చిలిపి కోయిల
చిలకపచ్చ తోటలో చిలిపి కోయిల .. తెలుగు పాట పాడవే తీయగా..హాయిగా.....కుకు
చిలకపచ్చ తోటలో చిలిపి కోయిల .. తెలుగు పాట పాడవే తీయగా..హాయి హాయిగా.. కుకు

వలపులా పిలిచే పాట.. వరదలా పొంగె పాట..
వలపులా పిలిచే పాట.. వరదలా పొంగె పాట..
అరుదైన వరదయ్య .. బిరుదైన క్షేత్రయ్య .. గోపాల మువ్వగోపాల
అని మురిసేటి తెలుగింటి పాట.. అని మురిసేటి తెలుగింటి పాట.. కుకు
చిలకపచ్చ తోటలో చిలిపి కోయిల .. తెలుగు పాట పాడవే తీయగా..హాయిగా.. కుకు

తెలుగులో తేనెల తేట..వెతలలో వెన్నెల బాట..
తెలుగులో తేనెల తేట..వెతలలో వెన్నెల బాట..
రామయ్య భక్తుడై త్యాగయ్య బ్రహ్మమై  .. శ్రీరామ..రారా.. రఘురామ..అని పిలిచేటి తెలుగింటి పాట..
అని పిలిచేటి తెలుగింటి పాట.. కు కు..
చిలకపచ్చ తోటలో చిలిపి కోయిల .. తెలుగు పాట పాడవే తీయగా..హాయి హాయిగా.....కుకు

కు కు...
Watch & Listen 

English

chilakapachcha tOTalO chilipi kOyila
chilakapachcha tOTalO chilipi kOyila .. telugu pATa pADavE tIyagA..hAyigA.....kuku
chilakapachcha tOTalO chilipi kOyila .. telugu pATa pADavE tIyagA..hAyi hAyigA.. kuku

valapulA pilichE pATa.. varadalA poMge pATa..
valapulA pilichE pATa.. varadalA poMge pATa..
arudaina varadayya .. birudaina kShEtrayya .. gOpAla muvvagOpAla 
ani murisETi telugiMTi pATa.. ani murisETi telugiMTi pATa.. kuku
chilakapachcha tOTalO chilipi kOyila .. telugu pATa pADavE tIyagA..hAyigA.. kuku

telugulO tEnela tETa..vetalalO vennela bATa..
telugulO tEnela tETa..vetalalO vennela bATa..
rAmayya bhaktuDai tyAgayya brahmamai  .. SrIrAma..rArA.. raghurAma..ani pilichETi telugiMTi pATa..
ani pilichETi telugiMTi pATa.. ku ku..
chilakapachcha tOTalO chilipi kOyila .. telugu pATa pADavE tIyagA..hAyi hAyigA.....kuku

ku ku...

Monday, December 15, 2008

Om namaha nayana srutulaku telugu lyrics [ఓం నమహా నయన శృతులకు] - Geetanjali

Song Name :Om Namaha
Movie:Geethanjali
Singers:S.P. BalaSubramanyam garu,S, Janaki garu
Lyricist:Veturi Sundara Rama Murthy garu
Composer:Illayaraja garu
Director:Mani Rathnam garu

ఓం నమహా నయన శృతులకు ఓం నమహా హృదయ లయలకు ఓం 
ఓం నమహా అధర జతులకు ఓం నమహా మధుర శ్మృతులకు ఓం 
నీ హృదయం తపన తెలిసీ నా హృదయం కనులు తడిసే వెళలో 
ఈ మంచు బొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే లీలలో

రేగిన కోరికలతో గాలులు వీచగా  .. జీవన వేణువులలో మోహన పాడగా
దూరము లేనిదై లోకము తోచగా   . కాలము లేనిదై గగనము అందగా
సూరిడే ఒదిగి ఒదిగి జాబిల్లి ఒడిని అడిగే వేళా ..
ముద్దుల సద్దుకే నిదుర లేచే  ప్రణయ గీతికి ఓం

ఒంటరి బాటసారి జంటకు చేరగా .. కంటికి పాపవైతే రెప్పగ మారనా
తూరుపు నీవుగా వేకువ నేనుగా.. అల్లిక పాటగా పల్లవి ప్రేమగా
ప్రేమించే పెదవులొకటై పొంగించే సుధలు మనవైతే
జగతికే అతిధులై జననమందిన ప్రేమ జంటకి

ఓం నమహా నయన శృతులకు ఓం నమహా హృదయ లయలకు ఓం  
ఓం నమహా అధర జతులకు ఓం నమహా మధుర శ్మృతులకు ఓం 
నీ హృదయం తపన తెలిసీ నా హృదయం కనులు తడిసే వెళలో 
ఈ మంచు బొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే లీలలో 

Watch & Listen Here