Showing posts with label classic. Show all posts
Showing posts with label classic. Show all posts

Sunday, June 28, 2026

Prema enta madhuram [ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం] - Abhinandana

Title :Prema enta madhuram
Movie:Abhinandana
Singers:గానగంధర్వ  S.P. Balasubramanyam గారు
Lyricist:Aatreya గారు
Composer:Illayaraja గారు
Director:Ashok Kumar గారు

ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం 

ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం 

చేసినాను ప్రేమక్షీరసాగర మధనం, మింగినాను హలాహలం

ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం 

ప్రేమించుటేనా నా దోషము, పూజించుటేనా నా పాపము 

ఎన్నాళ్ళని ఈ ఎదలో ముళ్ళు, కన్నీరుగయి కరిగే కళ్ళు 

నాలోని నీ రూపము, నా జీవనాధారము 

అది ఆరాలి పోవాలి ప్రాణము 

ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం 

నేనోర్వలేను ఈ తేజము, ఆర్పేయరాదా ఈ దీపము 

ఆ చీకటిలో కలిసేపోయి, నా రేపటిని మరిచేపోయి

మానాలి నీ ధ్యానము, కావాలి నే శూన్యము

అపుడాగాలి ఈ మూగ గానము

ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం 

చేసినాను ప్రేమక్షీరసాగర మధనం, మింగినాను హలాహలం

ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం

Wednesday, June 17, 2026

Elluvocchi godaramma [ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్ల పడ్డాదమ్మో] - Devatha

Title :Elluvocchi godaaramma
Movie:Devata / Devatha
Singers:S.P. Balasubramanyam గారు, P. Suseela గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Chakravarthy గారు
Director:K. Raghavendra Rao గారు

ఈ గీతంలో వాడిన తెలుగు మాండలికాన్ని (తూర్పు) మార్చకుండా రాయడం జరిగింది. (రచయిత వ్ బదులుగా యాసలొ య/ఎ ని వాడారు)

ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్ల పడ్డాదమ్మో, ఎన్నెలొచ్చి రెల్లుపూలే ఎండీగిన్నేలయ్యేనమ్మో 

కొంగుదాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే..

ఓరయ్యో రావయ్యో 

ఆగడాల పిల్లోడా నా సోగ్గాడా, మీగడంతా నీదేలే నా బుల్లోడా

ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్ల పడ్డాదమ్మో, ఎన్నెలొచ్చి రెల్లుపూలే ఎండీగిన్నేలయ్యేనమ్మో 

కొంగుచాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే, 

ఓలమ్మో రావమ్మో  

ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు, ఆగడాల పిల్లోడైనా నీవోడు 

ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు, ఆగడాల పిల్లోడైనా నీవోడు 

ఈ కళ్ళకున్న ఆకళ్ళలోనా అందాల విందమ్మ నువ్వు

వాటేసుకుంటే వందేళ్ళపంట వద్దంటే విందమ్మ నవ్వు

చెయ్యేస్తే చేమంతి బుగ్గ, చెంగావి గన్నేరు మొగ్గ

చెయ్యేస్తే చేమంతి బుగ్గ, చెంగావి గన్నేరు మొగ్గ

ఈడొచ్చి నీ చోటు ఈడుంది రమ్మంటే ఏడేసుకుంటవు గూడు 

కౌగిళ్ళలో నన్ను కూడు, ఆకళ్ళ కుంటాది కూడు

గుండెల్లో చోటుంది చూడు 

ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్ల పడ్డాదమ్మో, ఎన్నెలొచ్చి రెల్లుపూలే ఎండీగిన్నేలయ్యేనమ్మో 

కొంగుచాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే

ఓరయ్యో రావయ్యో 

ఆగడాల పిల్లోడా నా సోగ్గాడా, మీగడంతా నీదేలే నా బుల్లోడా

ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు, ఆగడాల పిల్లోడైనా నీవోడు 

నీ కళ్ళుసోక, నా తెల్లకోక అయ్యిందిలే గళ్ళకోక 

నీ మాటవిన్న నా జారుపైట పాడిందిలే గాలిపాట 

కళ్ళల్లో ఉన్నయి ముళ్ళు, నేకోరినా మూడు ముళ్ళు 

కళ్ళల్లో ఉన్నయి ముళ్ళు, నేకోరినా మూడు ముళ్ళు 

పొద్దుల్లో కుంకాలు బొట్టెట్టి పోతుంటే కట్టేయ్యనా తాళిబొట్టు 

నా మాటకీఏరు తోడు, ఏరెండీనా ఊరు తోడు 

నీ తోడులో ఊపిరాడు  

ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్ల పడ్డాదమ్మో, ఎన్నెలొచ్చి రెల్లుపూలే ఎండీగిన్నేలయ్యేనమ్మో 

కొంగుదాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే..

ఓలమ్మో రావమ్మో  

ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు, ఆగడాల పిల్లోడైనా నీవోడు 

ఆగడాల పిల్లోడా నా సోగ్గాడా, మీగడంతా నీదేలే నా బుల్లోడా 

Sunday, June 7, 2026

Vompula vaikhari [వొంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి] - April 1 Vidudala

Title :Vompula vaikhari
Movie:April 1 Vidudala
Singers:S.P. Balasubramanyam గారు,K.S. Chitra గారు
Lyricist:Sirivennela Sitaraama Sastry గారు
Composer:Illayaraja గారు
Director:Vamsi గారు

వొంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి 

వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరి

మోవిని మగతావిని ముడివేయనీయ్యవా 

కాదని అనలేనని గడియైనా ఆగవా 

అదుపు పొదుపు లేని ఆనందం కావాలి

హద్దు పొద్దు లేని ఆరాటం ఆపాలి 

వొంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి 

వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరి

మాంగళ్యం తంతునానేన మమజీవన హేతునాం, కంటేబద్నామి సుభగే 

త్వంజీవ శరదస్సతం త్వంజీవ శరదస్సతం త్వంజీవ శరదస్సతం 

కాంక్షలో కైపు నిప్పు ఎంతగా కాల్చినా, దీక్షగా ఓర్చుకున్నా మోక్షమే ఉండదా

శ్వాశలో మోహదాహం గ్రీష్మమై వీచగా, వాంఛతో వేగు దేహం పరయాగ వాటికా

కాలమే కాలిపోయే ఆజ్యమే పోయవా

మౌనమే గానమయ్యే మూర్తమే చూడవా 

వొంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి 

వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరి

నిష్ఠగా నిన్నుకోరి నీమమే దాటినా, కష్టమే సేదతీరే నేస్తమే నోచనా 

నిగ్రహం నీరుగారే జ్వాలలో దించినా, నేర్పుగా ఈదిచేరే నిశ్చయం మెచ్చనా 

సోయగం సొంతమయ్యే స్వర్గమై చేరవా 

మధనమే అంతమయ్యే అమృతం అందుకో 

వొంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి 

వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరి

హో... 

Saturday, May 30, 2026

Andam Hindolam [అందం హిందోళం అధరం తాంబూలం] - Yamudiki Mogudu

Title :Andam hindolam
Movie:Yamudiki Mogudu
Singers:S.P. Balasubramanyam గారు,  P. Suseela గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Raj-Koti గారు
Director:Raviraja Pinisetty గారు

అందం హిందోళం అధరం తాంబూలం

అసలే చలికాలం తగిలే సుమబాణం 

సంధ్యారాగాలెన్నో పెదవుల దాగినవేళ

వొళ్ళో మెత్తని మన్మధ ఒత్తిడి సాగిన వేళ 

అందనిది అందాల నిది అందగనే సందేళకది

నా శృతి మించెను నీ లయ పెంచెను లే .. హ 

అందం హిందోళం అధరం తాంబూలం

అసలే చలికాలం తగిలే సుమబాణం 

చలిలో దుప్పటికెత్తిన ముద్దుల పంటలలో 

తొలిగా ముచ్చెమటారెను ముచ్చెలి గుంటలలో 

గుమ్మెత్తే కొమ్మమీద గుమ్మళ్ళే కాయగా

పైటమ్మే మానుకుంది పరువాలే దాయగా 

ఉసిగొలిపే రుచితెలిపే తొలివలపే హా

మొటిమలపై మొగమెరుపై జతకలిపే హా

తీయ్యనిది తెర తీయ్యనిది తీరా నీ చేజిక్కినది  

మొగ్గలు విచ్చెను బుగ్గలు పిండగనే.. హా

అందం హిందోళం.. అధరం తాంబూలం..

అసలే చలికాలం.. తగిలే సుమబాణం..

వలపే హత్తుకుపోయిన కౌగిలి అంచులలో 

వయసే జివ్వున లాగిన వెన్నెల మంచులలో 

గిచ్చుళ్ళ వీణమీద కృతులెన్నో పాడగా 

చిచ్చుళ్ళ హాయిమీద నిదరంతా మాయగా 

తొలిఉడూకే ఒడిదుడుకై చలి చినుకై హా.. 

పెనవేసి పెదవడిగే ప్రేమలతో హేయ్

ఇచ్చినది కడునచ్చినది రేపంటే నను గిచ్చినది 

అక్కరకొచ్చిన చక్కని సోయగమే హే 

అందం హిందోళం అధరం తాంబూలం

అసలే చలికాలం తగిలే సుమబాణం 

సంధ్యారాగాలెన్నో పెదవుల దాగినవేళ

వొళ్ళో మెత్తని మన్మధ ఒత్తిడి సాగిన వేళ 

అందనిది అందాల నిది అందగనే సందేళకది

నా శృతి మించెను నీ లయ పెంచెను లే .. హ   

Wednesday, January 14, 2026

Maate raani chinnadaani [మాటేరాని చిన్నదాని కళ్ళుపలికే ఊసులు] - O Paapa laali

Title :Maate raani chinnadaani
Movie:O Paapa laali
Singers:S.P. Balasubramanyam గారు
Lyricist:Rajasri గారు
Composer:Illayaraja గారు
Director:Vasanth గారు

మాటేరాని చిన్నదాని కళ్ళుపలికే ఊసులు, అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు 

ప్రేమే నాకుపంచే జ్ఞాపకాలురా, రేగే మూగతలపే వలపు పంటరా 

మాటేరాని చిన్నదాని కళ్ళుపలికే ఊసులు, అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు 

ప్రేమే నాకుపంచే జ్ఞాపకాలురా, రేగే మూగతలపే వలపు పంటరా 

వెన్నెలల్లె పూలువిరిసి తేనెలు చిలికెను, చెంతచేరి ఆదమరిచి ప్రేమను కొసరెను

చందనాలు జల్లుకురిసె చూపులు కలిసెను, చందమామ పట్టపగలె నింగిని పొడిచెను

కన్నెపిల్ల కలలే నాకిక లోకం, సన్నజాజి కళలే మోహనరాగం 

చిలకల పలుకులు అలకల ఉలుకులు, నా చెలి సొగసులు నన్నే మరిపించే 

మాటేరాని చిన్నదాని కళ్ళుపలికే ఊసులు, అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు 

ముద్దబంతి లేతనవ్వులు చిందెను మధువులు, ఊసులాడు మేనివగలు వన్నెల జిలుగులు 

హరివిల్లులోని లోని రంగులు నా చెలి సొగసులు, వేకువల మేలుకొలుపే నాచెలి పిలుపులు 

సందెవేళ పలికే నాలో పల్లవి, సంతసాల సిరులే నావే అన్నది 

ముసి ముసి తలపులు తరగని వలపులు, నా చెలి సొగసే అన్నీ ఇకనావే 

మాటేరాని చిన్నదాని కళ్ళుపలికే ఊసులు, అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు 

ప్రేమే నాకుపంచే జ్ఞాపకాలురా, రేగే మూగతలపే వలపు పంటరా 

మాటేరాని చిన్నదాని కళ్ళుపలికే ఊసులు, అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు 

Sunday, January 4, 2026

Oh Papalu paapalu [ఓహ్ పాపలు పాపలు i love you] - Nirnayam

Title :Oh papalu papalu
Movie:Nirnayam
Singers:S.P. Balasubramanyam గారు
Lyricist:Ganesh Patro గారు
Composer:Illayaraja గారు
Director:Priyadarshan గారు

ఓహ్ పాపలు పాపలు i love you

ఆ చూపులు ఊపులు i love you

మీ టాపులు షేపులు i love you

ఏ రేపులు మాపులు i love you

ఏమి చదువో ఏమి బ్రతుకో, చీకటైతే పాడుకలలే 

ఓహ్ పాపలు పాపలు i love you

ఆ చూపులు ఊపులు i love you

మీ టాపులు షేపులు i love you

ఏ రేపులు మాపులు i love you

పగలూ రాతుర్లు సరదా జాతర్లు జరిపే వయస్సు అమ్మడు

చదువైపోగానే పద పెళ్ళంటారు, మొగుడు పురుడు బెరడూ

ప్రిపరేషన్‌లేని ఎగ్జాము లోన పాసో ఫైయిలో తెలుసా

అనుమానం లేని అనుభవముండాలి అపుడేకాదే హైలెస్సా 

ఆ కాసులు పాసులు wont save you

ఓహ్ పోకిరి చోకిరి i love you

అందం ఆనందం మందం మన బంధం అంతో ఇంతో సంతోషం తధ్యం 

ఓహ్ పాపలు పాపలు i love you

ఆ చూపులు ఊపులు i love you

మీ టాపులు షేపులు i love you

ఏ రేపులు మాపులు i love you

ఏమి చదువో ఏమి బ్రతుకో, హయ్యో చీకటైతే పాడుకలలే 

ఓహ్ పాపలు పాపలు i love you

ఆ చూపులు ఊపులు i love you

మీ టాపులు షేపులు i love you

అరే, సెబాష్టీన్ మాష్టార్కి సరళా మేడంకి సపపా రపపా తలలా హా..

కెమిస్ట్రీ శ్రీరత్నం గుమాస్తా గుర్నాధం సైటు లెటర్లూ తెలిలా 

గురువుల్ చూపించే గురుతుల్ చాలంట, భయమా మనకా రమ్మంటా 

మదరూ ఫాదర్ల సదరూ సర్దాకే మనమూ జనించాం కదంటా 

ఓహ్ జిందగీ బందగీ i love you

నా అందమైన్ సుందరి i love you

ముసిరే చీకట్లు ముద్దూముచ్చట్లు తీరేదాకా వేరేకాలేను చోకిరి 

ఓహ్ పోకిరి

ఆహ్ ఏమయ్యో రోమియో i hate you

ఆహ్ ఫోజులు ఫ్రేజులూ i hate you 

నీ పాటలు ఆ పాట్లు i hate you

నీ గంతులు రంకెలు i hate you

ఏమి తిమ్మిరో ఏమి పొగరో, తోక నరికి చేతినెడతా 

ఏమయ్యో రోమియో i hate you

ఓహ్ పాపలు పాపలు i love you

నీ గంతులు రంకెలు i hate you

మీ టాపులు షేపులు i love you 

Thursday, January 1, 2026

Chinuku chinuku andelato [చినుకు చినుకు అందెలతో, చిటపట చిరు సవ్వడితో] - Maayalodu

Title :Chinuku chinuku andelato
Movie:Maayalodu
Singers:S.P. Balasubramanyam గారు, K.S. Chitra గారు
Lyricist:Jonnavittula గారు
Composer:S.V. Krishnareddy గారు
Director:S.V. Krishnareddy గారు

చినుకు చినుకు అందెలతో, చిటపట చిరు సవ్వడితో 

నీలిమబ్బు కురుల ముడిని జారవిడిచి ఒళ్ళుమరచి

వానజాణ ఆడింది వయ్యారంగా నీళ్ళపూలు జల్లింది సింగారంగా 

చినుకు చినుకు అందెలతో, చిటపట చిరు సవ్వడితో 

నీలిమబ్బు కురుల ముడిని జారవిడిచి ఒళ్ళుమరచి

వానజాణ ఆడింది వయ్యారంగా నీళ్ళపూలు విసిరింది సింగారంగా 

నింగినేల ఈవేళ చలికి వణికిపోతుంటే, బిగికౌగిలి పొదరింటికి పదపదమంది

ఈ కౌగిలింతలోన ఏలో.. గుండెల్లో ఎండకాసె ఏలో 

అరె, పైన మబ్బు ఉరిమింది పడుచు జింక బెదిరింది, వలవేయక సెలయేరై పెనవేసింది 

అరె, చినుకమ్మ మెరుపమ్మ ఏలో, చిటికేస్తే బుగ్గమీద ఏలో 

తలపూ తొలివలపూ ఇక తకఝం తకఝం, వయసూ తడిసొగసు అరవిరిసే సమయం 

ఆహా ఉహు ఒహోహో 

చినుకు చినుకు అందెలతో, చిటపట చిరు సవ్వడితో 

నీలిమబ్బు కురుల ముడిని జారవిడిచి ఒళ్ళుమరచి

వానజాణ ఆడింది వయ్యారంగా నీళ్ళపూలు జల్లింది సింగారంగా 

మనసు పట్టు తప్పింది వయసు గుట్టు తడిసింది, ఎదలోపల చలిగాలుల సుడిరేగింది 

వానొచ్చే వరదొచ్చే ఏలో, వయసొచ్చే తెలిసొచ్చే ఏలో

మేనిచూపు పో అంది వాలుచూపు సయ్యంది, చెలికోరిక అలవోకగ తలవూపింది 

అరే సరసాలసిందులోన ఏలో సరిగంగతానాలు ఏలో 

ఒడిలో ఇక ఒకటై తక తకతై అంటే, సరసానికి దొరసానికి ముడిపెడుతుంటే 

ఆహా ఉహు ఒహోహో 

చినుకు చినుకు అందెలతో, చిటపట చిరు సవ్వడితో 

నీలిమబ్బు కురుల ముడిని జారవిడిచి ఒళ్ళుమరచి

వానజాణ ఆడింది వయ్యారంగా నీళ్ళపూలు జల్లింది సింగారంగా 

చినుకు చినుకు అందెలతో, చిటపట చిరు సవ్వడితో 

నీలిమబ్బు కురుల ముడిని జారవిడిచి ఒళ్ళుమరచి

వానజాణ ఆడింది వయ్యారంగా నీళ్ళపూలు జల్లింది సింగారంగా  

Monday, August 14, 2023

కంచికి పోతావ కృష్ణమ్మా .. [Kanchiki potava krishnamma]

Song Name:Kanchiki Potava
Movie:
Subhodayam
Singers:S.P. BalaSubramanyam garu, P. Suseela garu
Lyricist:Veturi Sundara Rama Murthy garu
Composer:K.V Mahadevan garu
Director:K. Vishwanadh garu

కంచికి పోతావ కృష్ణమ్మా.. ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా
కంచికి పోతావ కృష్ణమ్మా.. ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా
కంచిలొ ఉన్నది బొమ్మా.. అది బొమ్మ కాదు ముద్దుగుమ్మ
కంచికి పోతావ కృష్ణమ్మా.. ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా
కంచిలొ ఉన్నది బొమ్మా.. అది బొమ్మ కాదు ముద్దుగుమ్మ
కంచికి పోతావ కృష్ణమ్మా..

త్యాగరాజ కీర్తనల్లే ఉన్నాదీ బొమ్మ.. రాగమేదొ తీసినట్టు ఉందమ్మా
త్యాగరాజ కీర్తనల్లే ఉన్నాదీ బొమ్మ.. రాగమేదొ తీసినట్టు ఉందమ్మా
ముసి ముసి నవ్వులు పువ్వులు పూసిందీకొమ్మ..
మువ్వ గోపాలా.. మువ్వ గోపాలా.. మువ్వ గోపాలాన్నట్టుందమ్మా..
అడుగుల్ల సవళ్ళు కావమ్మా.. అవి ఎడదళ్ళ సందళ్ళు లేవమ్మా
అడుగుల్ల సవళ్ళు కావమ్మా.. అవి ఎడదళ్ళ సందళ్ళు లేవమ్మా
కంచికి పోతావ కృష్ణమ్మా.. ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా
కంచిలొ ఉన్నది బొమ్మా.. అది బొమ్మ కాదు ముద్దుగుమ్మ
కంచికి పోతావ కృష్ణమ్మా..

రాసలీల సాగినాక రాధ నీవేనమ్మా.. రాతిరేళకంత నిదర రాదమ్మా
రాసలీల సాగినాక రాధ నీవేనమ్మా.. రాతిరేళకంత నిదర రాదమ్మా
ముసిరిన చీకటి ముంగిట వేచిందీ కొమ్మ.. ముద్దు మురిపాలా మువ్వగోపాలా నీవురావేలా అన్నట్టుందమ్మా  
మనసు దోచుకున్నా ఓయమ్మా ..నీ మనసు దాచుకోకు బుల్లెమ్మా ...
మనసు దోచుకున్నా ఓయమ్మా ..నీ మనసు దాచుకోకు బుల్లెమ్మా ...

కంచికి పోతావ కృష్ణమ్మా.. (ముద్దు మురిపాలా..)
ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా.. (మువ్వ గోపాలా..)
కంచిలొ ఉన్నది బొమ్మా.. అది బొమ్మ కాదు ముద్దుగుమ్మ..
నీవు రావేలా.. కృష్ణమ్మా...

Listen here

kanchiki pOtAva kRShNammA.. A kanchi vaartalEmi kRShNammA
kanchiki pOtAva kRShNammA.. A kanchi vaartalEmi kRShNammA
kanchilo unnadi bommA.. adi bomma kAdu muddugumma
kanchiki pOtAva kRShNammA.. A kanchi vaartalEmi kRShNammA
kanchilo unnadi bommA.. adi bomma kAdu muddugumma
kanchiki pOtAva kRShNammA..

tyaagaraaja kIrtanallE unnAdI bomma.. rAgamEdo tIsinaTTu undammaa
tyaagaraaja kIrtanallE unnAdI bomma.. rAgamEdo tIsinaTTu undammaa
musi musi navvulu puvvulu poosindiikomma..
muvva gOpAlA.. muvva gOpAlA.. muvva gOpAlAnnaTTundammA..
aDugulla savaLLu kAvammA.. avi eDadaLLa sandaLLu lEvammA
aDugulla savaLLu kAvammA.. avi eDadaLLa sandaLLu lEvammA
kanchiki pOtAva kRShNammA.. A kanchi vaartalEmi kRShNammA
kanchilo unnadi bommA.. adi bomma kAdu muddugumma
kanchiki pOtAva kRShNammA..

rAsalIla sAginAka rAdha nIvEnammA.. rAtirELakanta nidara rAdammA
rAsalIla sAginAka rAdha nIvEnammA.. rAtirELakanta nidara rAdammA
musirina chIkaTi mungiTa vEchindI komma.. muddu muripAlA muvvagOpAlA nIvurAvElA annaTTundammA  
manasu dOchukunnA OyammA ..nI manasu dAchukOku bullemmA ...
manasu dOchukunnA OyammA ..nI manasu dAchukOku bullemmA ...

kanchiki pOtAva kRShNammA.. (muddu muripAlA..)
A kanchi vaartalEmi kRShNammA.. (muvva gOpAlA..)
kanchilo unnadi bommA.. adi bomma kAdu muddugumma..
nIvu rAvElA.. kRShNammA...

Sunday, April 19, 2020

చేతిలోన చెయ్యేసి చెప్పేయ్యవా ... [Chetilona cheyyesi cheppeyyava]

Song Name :Chetilona cheyyesi
Movie:Bombayi Priyudu
Singers:S.P. BalaSubramanyam garu,Prathima Rao
Lyricist:Veturi Sundara Rama Murthy garu
Composer:M.M. Keeravani garu
Director:K. Raghavendra rao garu

చేతిలోన చెయ్యేసి చెప్పేయ్యవా ...నను ఎన్నడు విడిపోనని
ప్రేమమీద ఒట్టేసి చెప్పేయ్యవా ..నను వీడనీ జత నీవని
చేతిలోన చెయ్యేసి చెప్పేయ్యవా ...నను ఎన్నడు విడిపోనని
ప్రేమమీద ఒట్టేసి చెప్పేయ్యవా ..నను వీడనీ జత నీవని
ప్రతి క్షణం ప్రేమలో పరీక్షలే వచ్చినా .. తలరాతకు తలవంచదు ప్రేమా..
చేతిలోన చెయ్యేసి చెప్పేయ్యవా ...నను ఎన్నడు విడిపోనని

నీవునేనులే మనస్సు ఒక్కటే.. ఇద్దరైన ఈ మమకారం లో..
నీవునేననె..పదాలులేవులె .. ఏకమైన ఈ ప్రియమంత్రం లో...
నా గుండెలొ కోయిలా.. నీ గొంతు లొ పాడగా..
నా జన్మ ఓ పూవులా.. నీ కొమ్మలో పూయగా..
కలా ఇలా కౌగిలై ..కనే కలే వెన్నెలై ...చెయి కలిపిన చెలిమె అనురాగం.
చేతిలోన చెయ్యేసి చెప్పేయ్యవా ...నను ఎన్నడు విడిపోనని
ప్రేమమీద ఒట్టేసి చెప్పేయ్యవా ..నను వీడనీ జత నీవని

నిన్ను తాకితె దేవతార్చన ..పూజలందుకో పులకింతల్లో
వాలు చూపులే వరాల దీవెనా .. నన్ను దాచుకొ కనుపాపల్లో
నా ప్రేమ గీతానికి  ..నీవెలే తొలి అక్షరం ..
నా ప్రేమ పుట్టింటికీ .. నీవేలే దీపాంకురం..
రసానికో రాగమై రచించనీ కావ్యమై ..చెయి కలిపిన చలవే అనుభంధం ..

చేతిలోన చెయ్యేసి చెప్పేయ్యవా ...నను ఎన్నడు విడిపోనని
ప్రేమమీద ఒట్టేసి చెప్పేయ్యవా ..నను వీడనీ జత నీవని
ప్రతి క్షణం ప్రేమలో పరీక్షలే వచ్చినా .. తలరాతకు తలవంచదు ప్రేమా..
చేతిలోన చెయ్యేసి చెప్పేయ్యవా ...నను ఎన్నడు విడిపోనని .

Watch & Listen Here

English transcript

chEtilOna cheyyEsi cheppEyyavA ...nanu ennaDu viDipOnani
prEmamIda oTTEsi cheppEyyavA ..nanu vIDanI jata nIvani
chEtilOna cheyyEsi cheppEyyavA ...nanu ennaDu viDipOnani
prEmamIda oTTEsi cheppEyyavA ..nanu vIDanI jata nIvani
prati kShaNam prEmalO parIkShalE vachchinA .. talarAtaku talavaMchadu prEmA..
chEtilOna cheyyEsi cheppEyyavA ...nanu ennaDu viDipOnani

nIvunEnulE manassu okkaTE.. iddaraina I mamakAraM lO..
nIvunEnane..padAlulEvule .. Ekamaina I priyamaMtraM lO...
nA guMDelo kOyilA.. nI goMtu lo pADagA..
nA janma O pUvulA.. nI kommalO pUyagA..
kalA ilA kougilai ..kanE kalE vennelai ...cheyi kalipina chelime anurAgaM.
chEtilOna cheyyEsi cheppEyyavA ...nanu ennaDu viDipOnani
prEmamIda oTTEsi cheppEyyavA ..nanu vIDanI jata nIvani

ninnu tAkite dEvatArchana ..pUjalaMdukO pulakiMtallO
vAlu chUpulE varAla dIvenA .. nannu dAchuko kanupApallO
nA prEma gItAniki  ..nIvelE toli akSharaM ..
nA prEma puTTiMTikI .. nIvElE dIpAMkuraM..
rasAnikO rAgamai rachiMchanI kAvyamai ..cheyi kalipina chalavE anubhaMdhaM ..

chEtilOna cheyyEsi cheppEyyavA ...nanu ennaDu viDipOnani
prEmamIda oTTEsi cheppEyyavA ..nanu vIDanI jata nIvani

Wednesday, April 15, 2020

అలక పానుపు ఎక్కనేల చిలిపి గోరింకా [Alaka Paanupu]

Song Name :Alaka paanupu yekkanela
Movie:Srivari Shobhanam
Singers:S. Janaki garu
Lyricist:Veturi Sundara Rama Murthy garu
Composer:Ramesh naidu garu
Director:Jandhyala garu

అలక పానుపు ఎక్కనేల చిలిపి గోరింకా... అలక చాలింక
నాకలకేవిటే...నీ మొహం...ఊరుకో...
అలక పానుపు ఎక్కనేల చిలిపి గోరింకా... అలక చాలింక
సీతాకాలం...సాయంకాలం....
సీతాకాలం...సాయంకాలం....అటు అలిగిపోయెవేల ..చలి కొరికి చంపె వేళ..
అందుకే ..లోపలికి పొతానే ..తల్లి..నన్నొదులు..
అలక పానుపు ఎక్కనేల చిలిపి గోరింకా... అలక చాలింక

రామ రామ శబరి బామ .. నిద్దరేపోదు ..
హు..నువ్విట్టా..ఇంత గొంతుకేసుకుని పాడితె .. నిద్దరెట్టా  పడుతుందే..
రాతిరంతా..చందమామ .. నిదరపోనీదూ
కంటికబురా..పంపలేనూ... ఇంటి గడపా దాటలేనూ..
ఆ దోర నవ్వూ.. దాచకే ..నా నేరమింక ఎంచకే..
ఆ దోర నవ్వూ.. దాచకే ..ఈ నవ్వు నవ్వి చంపకే..
అలక పానుపు ఎక్కనేల చిలిపి గోరింకా... అలక చాలింక

రాసిఉన్న నొసటి గీత చెరపనేలేరు..రాయని ఆ నుదిటి రాత రాయనూ లేరు..
ఆ రాతే రాసుంటే ఇంట్లోనే వెచ్చగా నిదరపోయేదాన్నిగా..
రాసిఉన్న నొసటి గీత చెరపనేలేరు..రాయని ఆ నుదిటి రాత రాయనూ లేరు..
నచ్చిన మహరాజు నీవు...  నచ్చితే మహరాణి నేను..
ఆ మాట యెదో తెలిపితె  .. నీ నోటి ముత్యం రాలునా...
నులక పానుపు నల్లి బాధ..పిల్ల చిలకమ్మ  అల్లరాపమ్మా..
సీతాకాలం...సాయంకాలం....
సీతాకాలం...సాయంకాలం....నను చంపకే తల్లి..జోకొట్టకే గిల్లీ...

Watch & Listen Here

English transcript

alaka pAnupu ekkanEla chilipi gOriMkA... alaka chAliMka
nAkalakEviTE...nI mohaM...UrukO...
alaka pAnupu ekkanEla chilipi gOriMkA... alaka chAliMka
sItAkAlaM...sAyaMkAlaM....
sItAkAlaM...sAyaMkAlaM....aTu aligipOyevEla ..chali koriki chaMpe vELa..
aMdukE ..lOpaliki potAnE ..talli..nannodulu..
alaka pAnupu ekkanEla chilipi gOriMkA... alaka chAliMka

rAma rAma Sabari bAma .. niddarEpOdu ..
hu..nuvviTTA..iMta goMtukEsukuni pADite .. niddareTTA  paDutuMdE..
rAtiraMtA..chaMdamAma .. nidarapOnIdU
kaMTikaburA..paMpalEnU... iMTi gaDapA dATalEnU..
A dOra navvU.. dAchakE ..nA nEramiMka eMchakE..
A dOra navvU.. dAchakE ..I navvu navvi chaMpakE..
alaka pAnupu ekkanEla chilipi gOriMkA... alaka chAliMka

rAsiunna nosaTi gIta cherapanElEru..rAyani A nudiTi rAta rAyanU lEru..
A rAtE rAsuMTE iMTlOnE vechchagA nidarapOyEdAnnigA..
rAsiunna nosaTi gIta cherapanElEru..rAyani A nudiTi rAta rAyanU lEru..
nachchina maharAju nIvu...  nachchitE maharANi nEnu..
A mATa yedO telipite  .. nI nOTi mutyaM rAlunA...
nulaka pAnupu nalli bAdha..pilla chilakamma  allarApammA..
sItAkAlaM...sAyaMkAlaM....
sItAkAlaM...sAyaMkAlaM....nanu chaMpakE talli..jOkoTTakE gillI...
alaka pAnupu ekkanEla chilipi gOriMkA... alaka chAliMka

Monday, December 15, 2008

Om namaha nayana srutulaku telugu lyrics [ఓం నమహా నయన శృతులకు] - Geetanjali

Song Name :Om Namaha
Movie:Geethanjali
Singers:S.P. BalaSubramanyam garu,S, Janaki garu
Lyricist:Veturi Sundara Rama Murthy garu
Composer:Illayaraja garu
Director:Mani Rathnam garu

ఓం నమహా నయన శృతులకు ఓం నమహా హృదయ లయలకు ఓం 
ఓం నమహా అధర జతులకు ఓం నమహా మధుర శ్మృతులకు ఓం 
నీ హృదయం తపన తెలిసీ నా హృదయం కనులు తడిసే వెళలో 
ఈ మంచు బొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే లీలలో

రేగిన కోరికలతో గాలులు వీచగా  .. జీవన వేణువులలో మోహన పాడగా
దూరము లేనిదై లోకము తోచగా   . కాలము లేనిదై గగనము అందగా
సూరిడే ఒదిగి ఒదిగి జాబిల్లి ఒడిని అడిగే వేళా ..
ముద్దుల సద్దుకే నిదుర లేచే  ప్రణయ గీతికి ఓం

ఒంటరి బాటసారి జంటకు చేరగా .. కంటికి పాపవైతే రెప్పగ మారనా
తూరుపు నీవుగా వేకువ నేనుగా.. అల్లిక పాటగా పల్లవి ప్రేమగా
ప్రేమించే పెదవులొకటై పొంగించే సుధలు మనవైతే
జగతికే అతిధులై జననమందిన ప్రేమ జంటకి

ఓం నమహా నయన శృతులకు ఓం నమహా హృదయ లయలకు ఓం  
ఓం నమహా అధర జతులకు ఓం నమహా మధుర శ్మృతులకు ఓం 
నీ హృదయం తపన తెలిసీ నా హృదయం కనులు తడిసే వెళలో 
ఈ మంచు బొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే లీలలో 

Watch & Listen Here