| Title : | Chinuku chinuku andelato |
| Movie: | Maayalodu |
| Singers: | S.P. Balasubramanyam గారు, K.S. Chitra గారు |
| Lyricist: | Jonnavittula గారు |
| Composer: | S.V. Krishnareddy గారు |
| Director: | S.V. Krishnareddy గారు |
చినుకు చినుకు అందెలతో, చిటపట చిరు సవ్వడితో
నీలిమబ్బు కురుల ముడిని జారవిడిచి ఒళ్ళుమరచి
వానజాణ ఆడింది వయ్యారంగా నీళ్ళపూలు జల్లింది సింగారంగా

వానజాణ ఆడింది వయ్యారంగా నీళ్ళపూలు విసిరింది సింగారంగా
నింగినేల ఈవేళ చలికి వణికిపోతుంటే, బిగికౌగిలి పొదరింటికి పదపదమంది
ఈ కౌగిలింతలోన ఏలో.. గుండెల్లో ఎండకాసె ఏలో
అరె, పైన మబ్బు ఉరిమింది పడుచు జింక బెదిరింది, వలవేయక సెలయేరై పెనవేసింది
అరె, చినుకమ్మ మెరుపమ్మ ఏలో, చిటికేస్తే బుగ్గమీద ఏలో
తలపూ తొలివలపూ ఇక తకఝం తకఝం, వయసూ తడిసొగసు అరవిరిసే సమయం
ఆహా ఉహు ఒహోహో
చినుకు చినుకు అందెలతో, చిటపట చిరు సవ్వడితో
నీలిమబ్బు కురుల ముడిని జారవిడిచి ఒళ్ళుమరచి
వానజాణ ఆడింది వయ్యారంగా నీళ్ళపూలు జల్లింది సింగారంగా
మనసు పట్టు తప్పింది వయసు గుట్టు తడిసింది, ఎదలోపల చలిగాలుల సుడిరేగింది
వానొచ్చే వరదొచ్చే ఏలో, వయసొచ్చే తెలిసొచ్చే ఏలో
మేనిచూపు పో అంది వాలుచూపు సయ్యంది, చెలికోరిక అలవోకగ తలవూపింది
అరే సరసాలసిందులోన ఏలో సరిగంగతానాలు ఏలో
ఒడిలో ఇక ఒకటై తక తకతై అంటే, సరసానికి దొరసానికి ముడిపెడుతుంటే
ఆహా ఉహు ఒహోహో
చినుకు చినుకు అందెలతో, చిటపట చిరు సవ్వడితో
నీలిమబ్బు కురుల ముడిని జారవిడిచి ఒళ్ళుమరచి
వానజాణ ఆడింది వయ్యారంగా నీళ్ళపూలు జల్లింది సింగారంగా
చినుకు చినుకు అందెలతో, చిటపట చిరు సవ్వడితో
నీలిమబ్బు కురుల ముడిని జారవిడిచి ఒళ్ళుమరచి
వానజాణ ఆడింది వయ్యారంగా నీళ్ళపూలు జల్లింది సింగారంగా

No comments:
Post a Comment