| Title : | Botany patamundi |
| Movie: | Shiva |
| Singers: | S.P. Balasubramanyam గారు, and S.P. Sailaja గారు |
| Lyricist: | Sirivennela Seetaraama sastry గారు |
| Composer: | Illayaraja గారు |
| Director: | Ram Gopal Varma (RGV) గారు |
బోటనీ పాఠముంది మ్యాటనీ ఆటవుంది దేనికో ఓటు చెప్పరా
హిస్టరీ లెక్చరుంది మిస్టరీ పిక్చరుంది సోదరా ఏది బెస్టురా
బోటనీ క్లాసంటే బోరు బోరు హిస్టరీ రొస్టుకన్న రెస్టుమేలు
పాటలూ ఫైటులున్న ఫిల్ముచూడు, బ్రేకులు డిస్కోలు చూపుతారు
జగడ జగడ జగడ జగడజాం (4)
దువ్వెనే కోడిజుత్తు నవ్వెనే ఏడ్చినట్టు, ఎవ్వరీ కొత్త నవాబు
కన్నెనే చూడనట్టు కన్నులే తేలబెట్టు ఎవ్వరీ వింత గరీబు
జోరుగా వచ్చాడే జేమ్స్‌బాండు, గీరగా వేస్తాడే ఈలసౌండు
నీడలా వెంటాడే జీడిబ్రాండు, ఫొజులే చూస్తుంటే ఒళ్ళుమండు
జగడ జగడ జగడ జగడజాం (4)
అయ్యో మార్చినే తల్చుకుంటే మూర్చలే ముంచుకొచ్చే, మార్గమే చెప్పు గురువా
హే ఛీ తాళం రాదు మార్చిట మార్చి, తాళంలో పాడరా వెధవా ..
మార్చినే తల్చుకుంటే మూర్చలే ముంచుకొచ్చే, మార్గమే చెప్పు గురువా
కొండలా కోర్సువుంది ఎంతకీ తగ్గనంది, ఏందిరో ఇంత గొడవ
ఎందుకీ హైరానా వెర్రినాన్న, వెళ్ళరా సులువైన దారొలోన
వుందిగా సెప్టెంబరు మార్చిపైన, హొయ్ వాయిదా పద్ధతుంది దేనికైనా
మ్యాక్జిమం మార్కులిచ్చు మ్యాథ్సులో ధ్యాసవుంచు, కొద్దిగా వొళ్ళువంచరా రేయ్
తందనా తందనన తందనా తందనన నందనా తందనన నా
క్రాఫుపై వున్న శ్రద్ధ, గ్రాఫుపై పెట్టు కాస్త ఫస్టుర్యాంకు పొందవచ్చురోయ్
తందనా తందనన తందనా తందనన నందనా తందనన నా
అరే ఏంటి సార్
లెక్కలూ ఏక్కాలు దెల్వనోళ్ళు, లక్కుతోని లక్షలల్ల మునిగిపోతరు
పుస్త్కాల్తో కుస్తీలు పట్టెటోళ్ళు, సర్కారి క్లర్కులయ్యి మురిగిపోతరు
జగడ జగడ జగడ జగడజాం (4)

No comments:
Post a Comment