| Title : | Maama chandamaama |
| Movie: | Sambaraala Rambabu |
| Singers: | S.P. Balasubramanyam గారు, P. Suseela గారు |
| Lyricist: | Rajasri గారు |
| Composer: | V. Kumar గారు |
| Director: | G.V.R Seshagiri rao గారు |
మామా .. చందమామా .. వినరావా నా కథా..
మామా .. చందమామా .. వినరావా నా కథా..
వుంటే మనసువుంటే కలిసేవూ నా జత.. మామా .. చందమామా ..
నీ రూపము ఒక దీపము గతిలేని పేదకు..
నీ రూపము ఒక దీపము గతిలేని పేదకు..
నీ కలలే సాటిలేని పాఠాలు ప్రేమకు
నువ్వులేక నువ్వురాక విడలేవు కలువలు
జాబిల్లి నీహాయి పాపలకు జోలలు
మామా .. చందమామా .. వినరావా నా కథా..
వుంటే మనసువుంటే కలిసేవూ నా జత.. మామా .. చందమామా ..
మింటిపైన నీవు ఒంటిగాడివై అందరికీ వెన్నెలపంచా రేయంత తిరగాలి
ఇంటిలోన నేను ఒంటిగాడినై అందరికి సేవలుచేయా రేయిపవలు తిరగాలి
లేరు మనకు బంధువులు లేరు తల్లిదండ్రులు
లేరు మనకు బంధువులు లేరు తల్లిదండ్రులు
మనను చూసి అయ్యోపాపం అనేవారు ఎవ్వరు.. అనేవారు ఎవ్వరు
మామా .. చందమామా .. వినరావా నా కథా..
వింటే మనసువుంటే కలిసేవూ నా జతా..
మామా .. చందమామా

No comments:
Post a Comment