| Title : | Kusalama |
| Movie: | Balpeetam |
| Singers: | S.P. Balasubramanyam గారు, P. Suseela గారు |
| Lyricist: | Devulapalli Venkata Krishna sastry గారు |
| Composer: | Chakravarthi గారు |
| Director: | Dasari Narayana Rao గారు |
కుశలమా నీకు కుశలమేనా, మనసు నిలుపుకోలేక మరీ మరీ అడిగాను అంతే.. అంతే.. అంతే..
కుశలమా మీకు కుశలమేనా, ఇన్నినాళ్ళు వదలలేక ఎదో ఎదో వ్రాసాను అంతే అంతే అంతే..
కుశలమా..
చిన్నతల్లి ఏమంది, నాన్న ముద్దు కావాలంది
పాలుగారు చెక్కిలిపైన పాపాయికి ఒకటి
తేనెలూరు పెదవులపైన దేవిగారికొకటి
ఒకటేనా... ఒకటేనా.. ఎన్నైనా .. హయ్ ఎన్నెన్నో..
మనసు నిలుపుకోలేక మరీ మరీ అడిగాను అంతే అంతే అంతే..
కుశలమా... హయి
పెరటిలోని పూలపానుపు త్వరత్వరగా రమ్మంది
పొగడనీడ పొదరిల్లో దిగులు దిగులుగా ఉంది
ఎన్ని కబురులంపేనో ఎన్ని కమ్మలంపేనో
పూలగాలి రెక్కలపైన నీలిమబ్బు పాయలపైన
అందేనా.. ఒకటైనా.. అందెనులే.. తొందర తెలిసెనులే
ఇన్నినాళ్ళు వదలలేక ఎదో ఎదో వ్రాసాను అంతే అంతే అంతే..
కుశలమా నీకు కుశలమేనా, మనసు నిలుపుకోలేక మరీ మరీ అడిగాను అంతే.. అంతే.. అంతే..
కుశలమా

No comments:
Post a Comment