| Title : | Teeganai mallelu |
| Movie: | Aaraadhana [Chiranjeevi గారు] |
| Singers: | S.P. Balasubramanyam గారు, and S. Janaki గారు |
| Lyricist: | Veturi Sundararamamurthy గారు |
| Composer: | Illayaraja గారు |
| Director: | Bhaarathi Raaja గారు |
తీగనై మల్లెలు పూచిన వేళ, ఆగనా అల్లనా పూజకోమాల
మనసు తెరతీసిన మోమాటమేలా, మమత కలబోసినా మాటకరువేనా
తీగనై మల్లెలు పూచిన వేళ, ఆగనా అల్లనా పూజకోమాల
తెలిసీ తెలియందా ఇది తెలియక జరిగిందా
ఎపుడో జరిగిందా అది ఇపుడే తెలిసిందా
ఆశపడ్డా అందుతుందా అర్హతైనా వుందా
అందుకున్నా పొందికుందా పొత్తుకుదిరేదా
ప్రేమకన్నా పాశముందా పెంచుకుంటే దోషముందా
పెంచుకుంటే తీరుతుందా పంచుకుంటే మరిచేదా
కలలో మెదిలిందా, ఇది కధలో చదివిందా
మెరుపై మెరిసిందా అది వలపై కురిసిందా
రాసివుంటే తప్పుతుందా తప్పునీదఔనా
మారమంటే మారుతుందా మాసిపోతుందా
చేసుకున్నా పుణ్ణెముందా చేరుకునే దారివుందా
చేదుకునే చేయివుందా చేయి చేయి కలిసేనా
తీగనై మల్లెలు పూచిన వేళ, ఆగనా అల్లనా పూజకోమాల
మనసు తెరతీసిన మోమాటమేలా, మమత కలబోసినా మాటకరువేనా
తీగనై మల్లెలు పూచిన వేళ, ఆగనా అల్లనా పూజకోమాల

No comments:
Post a Comment