Showing posts with label rajasri. Show all posts
Showing posts with label rajasri. Show all posts

Sunday, July 26, 2026

Neevega naa pranam [నీవేగా నా ప్రాణం అంట] - Oh Paapa laali

Title :Neevegaa naa pranam anta
Movie:Oh paapa laali
Singers:K.J. Yesudasu గారు, K.S. Chitra
Lyricist:Rajasri గారు
Composer:Illayaraja గారు
Director:Vasanth గారు

నీవేగా నా ప్రాణం అంట, నేడు నీ తోడే నాలోకం అంటా

నీవేగా నా ప్రాణం అంట, నేడు నీ తోడే నాలోకం అంటా

నీ నీడగా నే సాగేనులే నీ వెంటా...

నీవేగా నా ప్రాణం అంట, నేడు నీ తోడే నాలోకం అంటా

వెల్లివిరిసే వెన్నెలల్లే విరుల గంధం నీవుకావే 

ఆలపించే పాటలోని తేనెపలుకే నీవుకావే

పలికించే నే దిద్దుకున్న బొట్టుకొక అర్థముంది అంటనే

పల్లవించే నీ బంధనాల చందనాలు నాకుతెలుసు విన్నానే 

కలిసేనులే నే కరిగేనులే నీలోనా..

నీవేగా నా ప్రాణం అంట, నేడు నీ తోడే నాలోకం అంటా

నీవేగా నా ప్రాణం అంట, నేడు నీ తోడే నాలోకం అంటా

కంటివెలుగై నిలిచిపోనా మనసులోనా నిండిపోనా

కలలలోని కథను నేనై చివరివరకు తోడురానా 

స్వర్గమేలా నా గుండెలోన ఊపిరల్లే నీవు వుంటే అంతేగా

నన్ను పిలిచే నీ మాటలోని శృతినేనే అంతేలే 

నువ్వు లేనిదే ఇక నే లేనులే ఏనాడూ...

నీవేగా నా ప్రాణం అంట, నేడు నీ తోడే నాలోకం అంటా

నీ నీడగా నే సాగేనులే నీ వెంటా...

నీవేగా నా ప్రాణం అంట, నేడు నీ తోడే నాలోకం అంటా 

Sunday, June 14, 2026

Konteganni kattuko [కొంటెగాణ్ణి కట్టుకో కొంగుకేసి చుట్టుకో ] - Gentleman

Title :konteganni kattuko 
Movie:Gentleman
Singers:S.P. Balasubramanyam గారు, S. Janaki గారు
Lyricist:RajaSree  గారు
Composer:A.R. Rahman గారు
Director:Shankar గారు

కొంటెగాణ్ణి కట్టుకో కొంగుకేసి చుట్టుకో కోటివన్నెలున్నదానా

అందమంత ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాలుకళ్ళ పిల్లదానా

తీరాలీ అచ్చట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు (2)

కొంటెగాణ్ణి కట్టుకో కొంగుకేసి చుట్టుకో కోటివన్నెలున్నదానా

అందమంత ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాలుకళ్ళ పిల్లదానా

అందరినీ దోచే దొంగనేనేలే, నాగుండె దోచుకున్న దొరసాని నీవేలే (2)

చిన్నారిమైనా చిన్నదానా నే గాలం వేసానంటే పడితీరాలెవరైనా 

బంగారమంటి సింగారం నీదే అందం సొంతమైతే లేనిదేదీలేదే 

కొంటెగాణ్ణి కట్టుకో కొంగుకేసి చుట్టుకో కోటివన్నెలున్నదానా

అందమంత ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాలుకళ్ళ పిల్లదానా

తీరాలీ అచ్చట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు 

కొంటెగాణ్ణి కట్టుకో కొంగుకేసి చుట్టుకో కోటివన్నెలున్నదానా

అందమంత ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాలుకళ్ళ పిల్లదానా

కొనచూపుతోనే వేసావు బాణం రేపావూ నాలో నిలువెల్లా దాహం 

కొనగానివాడితో మనువు మహదూరం ఈ మొనగాడే నావాడైతే బతుకు బంగారం 

చిగురాకు పరువం సెగరేగే అందం నీకు కానుకంట ప్రతిరోజు పండగంట 

కొంటెగాణ్ణి కట్టుకో కొంగుకేసి చుట్టుకో కోటివన్నెలున్నదానా

అందమంత ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాలుకళ్ళ పిల్లదానా

తీరాలీ అచ్చట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు (2)

కొంటెగాణ్ణి కట్టుకో కొంగుకేసి చుట్టుకో కోటివన్నెలున్నదానా

అందమంత ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాలుకళ్ళ పిల్లదానా 

Sunday, June 7, 2026

Ninnu kori varnam [నిన్ను కోరి వర్ణం వర్ణం] - Gharshana

Song Name :Ninnu kori 
Movie:Gharshana
Singers:K.S. Chitra గారు
Lyricist:Rajasri గారు
Composer:Illayaraja గారు
DirectorMani Rathnam గారు

నిన్ను కోరి వర్ణం వర్ణం .. సరి సరి కలిసేనే నయనం నయనం 

మురికిన వాగల్లే తొలకరి కవితల్లే 

తలపులు కదిలేనే చెలిమది విరిసేనే 

రవికుల రఘురామా అనుదినము 

నిన్ను కోరి వర్ణం వర్ణం .. సరి సరి కలిసేనే నయనం నయనం 

ఉడికించే చిలకమ్మ నిన్నూరించే, ఒలికించే అందాలే ఆలాపించే 

ముత్యాలా బంధాలే నీకందించే, అచ్చట్లూ ముచ్చట్లూ తానాసించే 

మోజుల్లోన చిన్నది నీవేతాను అన్నది 

కలలే విందు చేసెనే నీతో పొందు కోరెనే 

ఉండాలనీ..నీ తోడుచేరిందిలే ఈనాడు సరసకు 

నిన్ను కోరి వర్ణం వర్ణం .. సరి సరి కలిసేనే నయనం నయనం 

మురికిన వాగల్లే తొలకరి కవితల్లే 

తలపులు కదిలేనే చెలిమది విరిసేనే 

రవికుల రఘురామా అనుదినము 

నిన్ను కోరి వర్ణం వర్ణం .. సరి సరి కలిసేనే నయనం నయనం 

ఈ వీణ మీటేది నీవేనంటా, నా తలపూ నా వలపు నీదేనంటా 

పరువాలా పరదాలు తీసే పూట, కలవాలీ కరగాలీ నీలోనంటా 

పలికించాలి స్వాగతం పండించాలి జీవితం

నీకూ నాకు ఈ క్షణం కానీ రాగసంగమం 

నీ జ్ఞాపకం నాలోన సాగేనులే ఏవేళ సరసకు 

నిన్ను కోరి వర్ణం వర్ణం .. సరి సరి కలిసేనే నయనం నయనం 

మురికిన వాగల్లే తొలకరి కవితల్లే  

తలపులు కదిలేనే చెలిమది విరిసేనే 

రవికుల రఘురామా అనుదినము 

నిన్ను కోరి వర్ణం వర్ణం .. సరి సరి కలిసేనే నయనం నయనం

Monday, June 1, 2026

Sivaratiri Nidura [శివరాతిరి నిదుర రాదే.. ] - Michael Madana Kama Raju

Title :Sivarathiri nidura rade
Movie:Michael Madana Kama Raju
Singers:S.P. Balasubramanyam గారు,  K.S. Chitra గారు
Lyricist:Rajasri గారు
Composer:Illayaraja గారు
Director:Singeetam Srinivasa Rao గారు

శివరాతిరి నిదుర రాదే.. హోయ్ తొలిరాతిరి హాయినీదే హోయ్

మంచురాతిరి.. మంచి రాతిరి..శుభరాతిరి హో.. ఒక మాదిరి.. వయసు విరిసే 

శివరాతిరి నిదుర రాదే.. హోయ్ తొలిరాతిరి హాయినీదే హోయ్

అంబరాల చల్లగాలి సంబరాలు చిలికే .. అహ్ ఉహు 

వెచ్చనైన మచ్చికైన ఊసులెన్నో పలికే .. ఉ ఉహు 

చెప్పరాని ఆశలన్ని కళ్ళలోన తగిలే 

కమ్మనైన బాసలేవో గుండెలోన రగిలే 

నీ నవ్వులే మల్లెపూవులే చూపే వెన్నెలే 

నీ మాటలే పసిడికోటలే నీవేనేనులే 

శుభరాతిరి హో.. ఒక మాదిరి.. వయసు విరిసే 

శివరాతిరి నిదుర రాదే.. హోయ్ తొలిరాతిరి హాయినీదే హోయ్

మంచురాతిరి.. మంచి రాతిరి..శుభరాతిరి హో.. ఒక మాదిరి.. వయసు విరిసే 

శివరాతిరి 

వన్నెలన్ని వేచేనేడు వచ్చి చూడవేలా 

చందనాలా తందనాల విందునందుకోవా 

అర్ధరాత్రి అందగాడి ముద్దుతీర్చరాదా 

పాలబువ్వ పక్కకొస్తే స్వర్గమదే కాదా 

పైటంచున దాచుకుంటినే వొయ్యారాలనే 

నా కళ్ళతో నేను చూస్తే వన్నెతరుగునా 

శుభరాతిరి హో.. ఒక మాదిరి.. వయసు విరిసే 

శివరాతిరి నిదుర రాదే.. హోయ్ తొలిరాతిరి హాయినీదే హోయ్

మంచురాతిరి.. మంచి రాతిరి..శుభరాతిరి హో.. ఒక మాదిరి.. వయసు విరిసే 

శివరాతిరి ....నిదుర రాదే.. తొలిరాతిరి హాయినీదే 

శివరాతిరి... 

Saturday, February 14, 2026

Muddabanti puchenule [ముద్దబంతి పూచేనులే తేనెజల్లు చిందేనులే] - Dalapathi

Song Name :Muddabanti poochenule
Movie:Dalapathi
Singers:Mano (Nagur Babu)  గారు , Swarnalatha గారు 
Lyricist:Rajasri garu
Composer:Illayaraja garu
DirectorMani Rathnam garu 

ముద్దబంతి పూచేనులే తేనెజల్లు చిందేనులే, ఊహలన్ని ఊరేగెనే నందనాలు విందుచేసెనే 

ముద్దబంతి పూచేనులే తేనెజల్లు చిందేనులే, ఊహలన్ని ఊరేగెనే నందనాలు విందుచేసెనే 

గుండెల్లో ఊసులన్ని కళ్ళల్లో పొంగెనే, కళ్ళల్లో బాసలన్ని రాగాలై సాగెనే

ముద్దబంతి పూచేనులే తేనెజల్లు చిందేనులే, ఊహలన్ని ఊరేగెనే నందనాలు విందుచేసెనే 

జాబిలి ఆ నింగిలోన మబ్బులలో దాగేనో, వెన్నెలలె దాచేనులో

తీయనీ నీ ధ్యాసలోనే, నిలిచెనే నా ధ్యానం నీతోనే నా లోకం

కనికరించి నన్నే సేదతీర్చు వేళ, కళ్ళలోన ప్రేమ చిలకరించు వేళ

కరిగేనే నీలో 

ముద్దబంతి పూచేనులే తేనెజల్లు చిందేనులే, ఊహలన్ని ఊరేగెనే నందనాలు విందుచేసెనే 

జీవితం పండేనునేడు పలికెనులే ఓ గీతం పాడెనులే సంగీతం 

తోడుగా నీవున్ననాడు ఆశలకే శ్రీకారం మమతలకే ప్రాకారం

చల్లగాలి నీవై సద్దు చేసినావే, చందమామ నీవై పలకరించినావే 

వెలిసేనే నీకై

ముద్దబంతి పూచేనులే తేనెజల్లు చిందేనులే, ఊహలన్ని ఊరేగెనే నందనాలు విందుచేసెనే 

ముద్దబంతి పూచేనులే తేనెజల్లు చిందేనులే, ఊహలన్ని ఊరేగెనే నందనాలు విందుచేసెనే 

గుండెల్లో ఊసులన్ని కళ్ళల్లో పొంగెనే, కళ్ళల్లో బాసలన్ని రాగాలై సాగెనే

ముద్దబంతి పూచేనులే తేనెజల్లు చిందేనులే, ఊహలన్ని ఊరేగెనే నందనాలు విందుచేసెనే 

ముద్దబంతి పూచేనులే తేనెజల్లు చిందేనులే, ఊహలన్ని ఊరేగెనే నందనాలు విందుచేసెనే 

Wednesday, January 14, 2026

Maate raani chinnadaani [మాటేరాని చిన్నదాని కళ్ళుపలికే ఊసులు] - O Paapa laali

Title :Maate raani chinnadaani
Movie:O Paapa laali
Singers:S.P. Balasubramanyam గారు
Lyricist:Rajasri గారు
Composer:Illayaraja గారు
Director:Vasanth గారు

మాటేరాని చిన్నదాని కళ్ళుపలికే ఊసులు, అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు 

ప్రేమే నాకుపంచే జ్ఞాపకాలురా, రేగే మూగతలపే వలపు పంటరా 

మాటేరాని చిన్నదాని కళ్ళుపలికే ఊసులు, అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు 

ప్రేమే నాకుపంచే జ్ఞాపకాలురా, రేగే మూగతలపే వలపు పంటరా 

వెన్నెలల్లె పూలువిరిసి తేనెలు చిలికెను, చెంతచేరి ఆదమరిచి ప్రేమను కొసరెను

చందనాలు జల్లుకురిసె చూపులు కలిసెను, చందమామ పట్టపగలె నింగిని పొడిచెను

కన్నెపిల్ల కలలే నాకిక లోకం, సన్నజాజి కళలే మోహనరాగం 

చిలకల పలుకులు అలకల ఉలుకులు, నా చెలి సొగసులు నన్నే మరిపించే 

మాటేరాని చిన్నదాని కళ్ళుపలికే ఊసులు, అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు 

ముద్దబంతి లేతనవ్వులు చిందెను మధువులు, ఊసులాడు మేనివగలు వన్నెల జిలుగులు 

హరివిల్లులోని లోని రంగులు నా చెలి సొగసులు, వేకువల మేలుకొలుపే నాచెలి పిలుపులు 

సందెవేళ పలికే నాలో పల్లవి, సంతసాల సిరులే నావే అన్నది 

ముసి ముసి తలపులు తరగని వలపులు, నా చెలి సొగసే అన్నీ ఇకనావే 

మాటేరాని చిన్నదాని కళ్ళుపలికే ఊసులు, అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు 

ప్రేమే నాకుపంచే జ్ఞాపకాలురా, రేగే మూగతలపే వలపు పంటరా 

మాటేరాని చిన్నదాని కళ్ళుపలికే ఊసులు, అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు 

Saturday, January 10, 2026

Maama chandamaama [మామా .. చందమామా .. వినరావా నా కథా..] - Samabrala Rambabu

Title :Maama chandamaama
Movie:Sambaraala Rambabu
Singers:S.P. Balasubramanyam గారు, P. Suseela గారు
Lyricist:Rajasri గారు
Composer:V. Kumar గారు
Director:G.V.R Seshagiri rao గారు

మామా .. చందమామా .. వినరావా నా కథా.. 

మామా .. చందమామా .. వినరావా నా కథా.. 

వుంటే మనసువుంటే కలిసేవూ నా జత.. మామా .. చందమామా .. 

నీ రూపము ఒక దీపము గతిలేని పేదకు..

నీ రూపము ఒక దీపము గతిలేని పేదకు..

నీ కలలే సాటిలేని పాఠాలు ప్రేమకు

నువ్వులేక నువ్వురాక విడలేవు కలువలు 

జాబిల్లి నీహాయి పాపలకు జోలలు 

మామా .. చందమామా .. వినరావా నా కథా.. 

వుంటే మనసువుంటే కలిసేవూ నా జత.. మామా .. చందమామా .. 

మింటిపైన నీవు ఒంటిగాడివై అందరికీ వెన్నెలపంచా రేయంత తిరగాలి 

ఇంటిలోన నేను ఒంటిగాడినై అందరికి సేవలుచేయా రేయిపవలు తిరగాలి 

లేరు మనకు బంధువులు లేరు తల్లిదండ్రులు 

లేరు మనకు బంధువులు లేరు తల్లిదండ్రులు  

మనను చూసి అయ్యోపాపం అనేవారు ఎవ్వరు.. అనేవారు ఎవ్వరు 

మామా .. చందమామా .. వినరావా నా కథా.. 

వింటే మనసువుంటే కలిసేవూ నా జతా..  

మామా .. చందమామా 

Sunday, October 19, 2025

Kanulu kanulu kalise samayam [కనులు కనులు కలిసే సమయం] - Pallavi anupallavi

Movie : Pallavi anupallavi
Song : kanulu kanulu lakise
Music Dir: Illayaraja garu
Singer: S.P. Balasubramanyam garu, S. Janaki garu
Director: Mani Ratnam garu
Lyrics: Raja Sri garu

కనులు కనులు కలిసే సమయం, మనసు మనసు చేసే స్నేహం

నీ చేరువలో నీ చేతలలో వినిపించెను శ్రీరాగం 

కనులు కనులు కలిసే సమయం, మనసు మనసు చేసే స్నేహం

నీ నవ్వులో విరిసె మందారము, నీ చూపులో కురిసె శృంగారము 

నీ మాటలోవుంది మమకారము, నా ప్రేమకేనువ్వు శ్రీకారము 

పరువాలు పలికేను సంగీతము, నయనాలుపాడేను నవగీతము 

నేనే నీకు కానా ప్రాణం, నీవే నాకు కావా లోకం 

కనులు కనులు కలిసే సమయం, మనసు మనసు చేసే స్నేహం

నీ గుండెగుడిలో కొలువుండనీ, నీ వెంటనీడల్లె ననుసాగని

నీపూల ఒడిలో నను చేరనీ, నీ నుదుట సింధూరమై నిలవనీ

చెవిలోన గుసగుసలు వినిపించనీ, ఎదలోన మధురిమలు పండించనీ 

నీలో నేనే కరగాలంట, రోజూ స్వర్గం చూడాలంట  

కనులు కనులు కలిసే సమయం, మనసు మనసు చేసే స్నేహం

నీ చేరువలో నీ చేతలలో వినిపించెను శ్రీరాగం  

Sunday, July 6, 2025

Nee gudu chedirindi telugu lyrics [నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది] - Naayakudu or Evaru kottaru

Song Name :Ni gudu chedirindi
Movie:Naayakudu
Singers:S.P. Bala subramanyam garu
Lyricist:Vennelakanti garu
Composer:Illayaraja garu
Director:Mani Ratnam garu

(1)

నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది 

ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారు 

ఎవరు కొట్టారూ నిన్నెవరు కొట్టారు  

ఎవరు కొట్టారూ ఎవరు కొట్టారు 

కనులా నీరు రానీకు, కానీ పయనం కడవరకు 

కదిలే కాలం ఆగేనూ, కథగా నీతో సాగేను 

నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది 

ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారు 

(2)

నీలాల కన్నుల్లో కన్నీటి ముత్యాలు 

నా చిట్టి తల్లి నిను ఎవరు కొట్టారు 

ఎవరు కొట్టారూ ఎవరు కొట్టారు 

ఎవరు కొట్టారూ ఎవరు కొట్టారు 

కనులా నీరే రానీకు, కానీ పయనం కడవరకు 

కదిలే కాలం ఆగేనూ, కథగా నీతో సాగేను 

నీలాల కన్నుల్లో కన్నీటి ముత్యాలు 

నా చిట్టి తల్లి నిను ఎవరు కొట్టారు 

ఎవరు కొట్టారూ ఎవరు కొట్టారు 

ఎవరు కొట్టారూ ఎవరు కొట్టారు 

(3)

ఉదయించు సూరీడు నిదురించెనే నేడు 

నా చిట్టి తండ్రీ ఎవరు కొట్టారు 

ఎవరు కొట్టారూ ఎవరు కొట్టారు 

ఎవరు కొట్టారూ నిన్నెవరు కొట్టారు 

కనులా నీరే రానీకు, కానీ పయనం కడవరకు 

కదిలే కాలం ఆగేనూ, కథగా నీతో సాగేను 

ఉదయించు సూరీడు నిదురించెనే నేడు 

నా చిట్టి తండ్రీ ఎవరు కొట్టారు 

ఎవరు కొట్టారూ ఎవరు కొట్టారు 

ఎవరు కొట్టారూ ఎవరు కొట్టారు 

(4) 

ఓ చుక్క రాలింది ఓ జ్యోతి ఆరింది

కన్నీరు మిగిలింది కథ ముగిసిందీ  

కథ ముగిసిందీ  కథ ముగిసిందీ  

కథ ముగిసిందీ  కథ ముగిసిందీ  

కాలం తోడై కదిలాడు కథ గా తానే మిగిలాడు

మరణం లేను నాయకుదు మదిలో వెలుగై వెలిసాడు 

ఓ చుక్క రాలింది ఓ జ్యోతి ఆరింది

కన్నీరు మిగిలింది కథ ముగిసిందీ  

కథ ముగిసిందీ కథ ముగిసిందీ  

కథ ముగిసిందీ కథ ముగిసిందీ  

Saturday, June 14, 2025

Cheliraava [చెలీరావా వరాలీవా] - Mouna raagam

Song Name :Cheliraava
Movie:Mouna raagam
Singers:S.P. Balasubramanyam garu
Lyricist:Raajasri garu
Composer:Illayaraja garu
DirectorMani Ratnam garu 

చెలీరావా వరాలీవా, నినే కోరే ఓ జాబిల్లీ 

నీజతకై వేచేను నిలువెల్లా నీవే 

చెలీరావా వరాలీవా

ఈ వేదనా తాళలేనే భామా చందమామ 

వెన్నెల్లనే పూలురువ్వి చూడూ ఊసులాడూ 

చెప్పాలనీ నీతో ఎదో చిన్నమాటా 

చెయ్యాలనీ స్నేహం నీతో పూట పూట 

ఊ అంటే నీ నోటా బ్రతుకే వెన్నెల తోటా 

చెలీరావా వరాలీవా

వొయ్యారాల నీలి నింగి పాడే కథలు పాడే 

ఉయ్యాలగా చల్లగాలి ఆడే చిందులాడే 

సుగంధాల ప్రేమా అందించగ రావా..

సుతారాల మాటా చిందించగా రాద 

ఆకాశం పగ అయితే మేఘం కదలాడేనా 

చెలీరావా వరాలీవా, నినే కోరే ఓ జాబిల్లీ 

నీజతకై వేచేను నిలువెల్లా నీవే 

చెలీరావా వరాలీవా, నినే కోరే ఓ జాబిల్లీ 

Malle Poola challa gaali [మల్లెపూల చల్లగాలి] - Mouna Ragam

Song Name :Mallepoola challagali
Movie:Mouna raagam
Singers:S.P. Balasubramanyam garu
Lyricist:Raajasri garu
Composer:Illayaraja garu
DirectorMani Ratnam garu 

మల్లెపూల చల్లగాలి మంటరేపె సందెవేళల్లో ఏలా ఈ వేళ

కోరుకున్న గోరింకను చేరదేల రామచిలుకా ఏలా అదేలా

ఆ వేదనే ఈ నాటికీ మిగిలింది నాకూ 

మల్లెపూల చల్లగాలి మంటరేపె సందెవేళల్లో ఏలా ఈ వేళ

వేదికై పోయే మన కథంతా నాటకం ఆయెనూ మనుగడంతా 

శోధనై పోయే హృదయమంతా బాటలే మారెనే పయనమంతా 

పండించవే వసంతం పంచవేలా సుగంధం 

నాగుండె గుడిలో నిలవాలీ .. రా 

మల్లెపూల చల్లగాలి మంటరేపె సందెవేళల్లో ఏలా ఈ వేళ

కోరుకున్న గోరింకను చేరదేల రామచిలుకా ఏలా అదేలా

ఆ వేదనే ఈ నాటికీ మిగిలింది నాకూ 

మల్లెపూల చల్లగాలి మంటరేపె సందెవేళల్లో ఏలా ఈ వేళ

తామరల పైన నీటిలాగా భర్తయూ భార్యయూ కలవరంటా

తోడుగా చేరి బతికేందుకూ సూత్రమూ మంత్రమూ ఎందుకంటా

సొంతం అనేదిలేక ప్రేమ బంధాలు లేక 

మోడంటి జీవితం ఇంకేలా... హ

మల్లెపూల చల్లగాలి మంటరేపె సందెవేళల్లో ఏలా ఈ వేళ

కోరుకున్న గోరింకను చేరదేల రామచిలుకా ఏలా అదేలా

ఆ వేదనే ఈ నాటికీ మిగిలింది నాకూ 

మల్లెపూల చల్లగాలి మంటరేపె సందెవేళల్లో ఏలా ఈ వేళ

Saturday, March 15, 2025

Oosulade oka jabilata (ఊసులాడే ఒక జాబిలట) - Hrudayam

Song Name :Oosulade oka jabilata
Movie:Hrudayam
Singers:S.P. Balasubramanyam garu
Lyricist:Rajasri garu
Composer:Illayaraja garu
DirectorKathir garu 

ఊసులాడే ఒక జాబిలట సిరిమువ్వలుగా నను తాకెనట 
ఊసులాడే ఒక జాబిలట సిరిమువ్వలుగా నను తాకెనట 
చూపులతో బాణమేసెనట చెలి నా ఎదలో సెగ రేపెనట
మాటే వేదం తానే నా లోకం ప్రేమే యోగం 
ఊసులాడే ఒక జాబిలట సిరిమువ్వలుగా నను తాకెనట 
చూపులతో బాణమేసెనట చెలి నా ఎదలో సెగ రేపెనట

అందాలే చిందే చెలిరూపం నా కోసం
ఆనందం నిలిపేటి ధ్యానం చెలి ధ్యానం 
అదే పేరు నేను జపించేను రోజు
ననే చూసే వేళా అలై పొంగుతాను 
మౌనం సగమై మోహం సగమై, నేనే నాలో రగిలేను 
ఊసులాడే ఒక జాబిలట సిరిమువ్వలుగా నను తాకెనట 
చూపులతో బాణమేసెనట చెలి నా ఎదలో సెగ రేపెనట
మాటే వేదం తానే నా లోకం ప్రేమే యోగం 
ఊసులాడే ఒక జాబిలట సిరిమువ్వలుగా నను తాకెనట 
చూపులతో బాణమేసెనట చెలి నా ఎదలో సెగ రేపెనట

నాలోనూ రేగేనే పాట చెలి పాట 
నీడల్లే సాగే నీ వెంట తన వెంట 
స్వరాలై పొంగేనా వరాలై కోరేనా 
ఇలా ఊహల్లోనా సదా ఉండిపోనా 
ఒకటై ఆడు ఒకటై పాడు, పండగ నాకు ఏనాడో  
ఊసులాడే ఒక జాబిలట సిరిమువ్వలుగా నను తాకెనట 
చూపులతో బాణమేసెనట చెలి నా ఎదలో సెగ రేపెనట
మాటే వేదం తానే నా లోకం ప్రేమే యోగం 
ఊసులాడే ఒక జాబిలట సిరిమువ్వలుగా నను తాకెనట 
చూపులతో బాణమేసెనట చెలి నా ఎదలో సెగ రేపెనట 
 
Thursday, February 13, 2025

Sundari Nene nuvvanta (సుందరి నెనే నువ్వంట) - Dalapathi

Song Name :Sundari nene nuvvanta
Movie:Dalapathi
Singers:S.P. Bala subramanyam garu, K.S. Chitra garu
Lyricist:Rajasri garu
Composer:Illayaraja garu
DirectorMani Rathnam garu 

సుందరి నెనే నువ్వంట, చూడని నీలో నన్నంట 
కానుకే ఇచ్చా మనసంత, జన్మకే తోడై నేనుంట
గుండెలో నిండ మంట నీడగా పాడమంట నా సిరి నీవేనట
సుందరి నెనే నువ్వంట, చూడని నీలో నన్నంట 
కానుకే ఇచ్చా మనసంత, జన్మకే తోడై నేనుంట

అనుకున్న మాటలు సర్వం కరిగిపోతే న్యాయమా
మధురాల మధువులు చిందే చల్లని ప్రేమే మాయమా 
రేపవలు నిద్దరలోనూ ఎద నీ తోడే కోరును
యుద్ధాన ఏమైన నా ఆత్మే నిన్నే చేరును 
ఎద తెలుపు ఈ వేళ ఏల ఈ శొధనా 
జాబిలిని నీవడుగు తెలుపు నా వేదన 
నాలో ప్రేమే మరిచావొ, ప్రేమే నన్నే గెలిచేనే..
కానుకే ఇచ్చా మనసంత, జన్మకే తోడై నేనుంట
సుందరి నెనే నువ్వంట, చూడని నీలో నన్నంట 
గుండెలో నిండ మంట నీడగా పాడమంట నా సిరి నీవేనట
సుందరి నెనే నువ్వంట, చూడని నీలో నన్నంట 
కానుకే ఇచ్చా మనసంత, జన్మకే తోడై నేనుంట

పూవ్వులే ముళ్ళై తోచు నేవే నన్ను వీడితే 
ఊహలే పూలై పూచు నీ యెద మాటున చేరితే 
ఆ..మాసాలు వారాలౌను నీవు నేను కూడితే 
వారాలు మాసాలౌను మాటేమారి సాగితే 
పొంగునీ బంధాలే నీ దరి చేరితే 
గాయాలు ఆరేను నీ యెదుట ఉంటే 
నీవే కదా నా ప్రాణం నీవే కదా నా లోకం 

సుందరి నెనే నువ్వంట, చూడని నీలో నన్నంట 
కానుకే ఇచ్చా మనసంత, జన్మకే తోడై నేనుంట 
గుండెలో నిండ మంట నీడగా పాడమంట నా సిరి నీవేనట
సుందరి నెనే నువ్వంట, చూడని నీలో నన్నంట 
కానుకే ఇచ్చా మనసంత, జన్మకే తోడై నేనుంట  

Friday, January 17, 2025

Neeve amaraswarame [నీవే అమరస్వరమే సాగే శృతిని నేనే ] - Gharshana [1988]

Song Name :Neeve amaraswarame
Movie:Gharshana
Singers:S.P. Balasubramanyam garu, Chitra garu
Lyricist:Rajasri garu
Composer:Illayaraja garu
DirectorMani Ratnam garu

నీవే అమరస్వరమే సాగే శృతిని నేనే 

నీ మనసూ నీ మమతా, వెలిసేనే నా కోసం 

నీలో సర్వం నా సొంతం 

నీవే అమరస్వరమే సాగే శృతిని నేనే 

పలికే నీ అధరాలూ, చిలికేనే మధురాలు 

నింగి వీడి నేల జారిన జాబిలి 

మురిసే నీలో అందం, కురిసే ఊహల గంధం  

మల్లెపూల బంధమీవు ఓ చెలీ 

అంతులేనిదీ కథా, అందరాని సంపద, రాగబంధనం అనురాగచందనం 

అంతులేనిదీ కథా, అందరాని సంపద, రాగబంధనం అనురాగచందనం 

నా ధ్యాసలు నీవే, నీ బాసలు నేనే 

నా ఊహలు నీవే, నీ ఊపిరి నేనే 

నీలో సర్వం నా సొంతం 

నీవే అమరస్వరమే సాగే శృతిని నేనే 

మెరిసే మల్లెలలోకం చిందే చల్లని గానం 

తీయనైన ఆశలన్ని నీ వరం 

తరగని చెరగని కావ్యం ఊహలకిది అనుబంధం 

భావ రాగ భాష్యమే ఈ జీవితం 

పలకరించు చూపులూ పాటపాడు నవ్వులూ కొత్తపల్లవి కొసరీ ఆలపించనే 

పలకరించు చూపులూ పాటపాడు నవ్వులూ కొత్తపల్లవి కొసరీ ఆలపించనే 

నూరేళ్ళూ నీతో సాగాలీ నేనే, నీ గుండెల్లోనా నిండాలీ నేనే 

నీలో సర్వం నా సొంతం 

నీవే అమరస్వరమే సాగే శృతిని నేనే  

నీ మనసూ నీ మమతా, వెలిసేనే నీ కోసం 

నీలో సర్వం నా సొంతం 

నీవే అమరస్వరమే సాగే శృతిని నేనే 

Friday, July 13, 2012

Oh Cheliya.. (ఓ చెలియా నా ప్రియసఖియా)

Song: O cheliya Naa priyasakhiya
Movie: Premikudu
Lyrics: RajaSri
Music: A.R. Rahman
Singer(s): Unni Krishnan

ఓ చెలియా నా ప్రియసఖియా చేజారెను నా మనసే
ఏ చొటా అది జారినదో ఆ జాడే మరచితినే
నీ అందెలలో చికుకుంది అని నీ పదములు చెరితినే
ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే
నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సొలెనులే
ఓ చెలియా నా ప్రియసఖియా చేజారెను నా మనసే

ఈ పూట చెలి నా మాట ఇక కరువైపోయెనులే
అధరము ఉదరము నడుమ ఎదో అలజడి రేగెనులే
వీక్షణలో నిరీక్షణలో అరక్షణమొక యుగమేలే
చూపులన్నీ వెంటాడినట్టు మది కలవరమాయెనులే
ఇది స్వర్గమా నరకమా ఏవిటొ తెలియెదులే
ఈ జీవికి జీవనమరణము నీ చేతిలొ ఉన్నదిలే...
ఓ చెలియా నా ప్రియసఖియా చేజారెను నా మనసే

కోకిలమ్మా నువ్వు సైయ్యంటే నేపాడెను సరిగమలే
గోపురమ నిను చేరుకొని సవరించెను నీకురులే
వెన్నెలమ్మా నీకు జొలపాడి కాలిమెటికెలు విరిచేనే
వీచెటి చలిగాలులకు తెరచాపై నిలిచేనే
నా ఆశలా ఊసులే చెవిలోన చెబుతానే
నీ అదుగుల చెరగని గురుతులే ప్రేమచరితలు అంటానే...
ఓ చెలియా నా ప్రియసఖియా చేజారెను నా మనసే

ఓ చెలియా నా ప్రియసఖియా చేజారెను నా మనసే
ఏ చొటా అది జారినదో ఆ జాడే మరచితినే
నీ అందెలలో చికుకుంది అని నీ పదములు చెరితినే
ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే
నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సొలెనులే
ఓ చెలియా నా ప్రియసఖియా చేజారెను నా మనసే

English

O cheliyA nA priyasaKiyA chEjArenu nA manasE
E choTA adi jArinadO A jADE marachitinE
nI aMdelalO chikukuMdi ani nI padamulu cheritinE
prEmaMTE enni agachATlO mana kalayika telipinadE
nA guMDelalO prEma paravashamai iru kannulu solenulE
O cheliyA nA priyasaKiyA chEjArenu nA manasE

I pUTa cheli nA mATa ika karuvaipOyenulE
adharamu udaramu naDuma edO alajaDi rEgenulE
vIkShaNalO nirIkShaNalO arakShaNamoka yugamElE
chUpulannI veMTADinaTTu madi kalavaramAyenulE
idi swargamA narakamA EviTo teliyedulE
I jIviki jIvanamaraNamu nI chEtilo unnadilE...
O cheliyA nA priyasaKiyA chEjArenu nA manasE

kOkilammA nuvvu saiyyaMTE nEpADenu sarigamalE
gOpurama ninu chErukoni savariMchenu nIkurulE
vennelammA nIku jolapADi kAlimeTikelu virichEnE
vIcheTi chaligAlulaku terachApai nilichEnE
nA AshalA UsulE chevilOna chebutAnE
nI adugula cheragani gurutulE prEmacharitalu aMTAnE...