Showing posts with label revathi. Show all posts
Showing posts with label revathi. Show all posts

Saturday, June 14, 2025

Cheliraava [చెలీరావా వరాలీవా] - Mouna raagam

Song Name :Cheliraava
Movie:Mouna raagam
Singers:S.P. Balasubramanyam garu
Lyricist:Raajasri garu
Composer:Illayaraja garu
DirectorMani Ratnam garu 

చెలీరావా వరాలీవా, నినే కోరే ఓ జాబిల్లీ 

నీజతకై వేచేను నిలువెల్లా నీవే 

చెలీరావా వరాలీవా


ఈ వేదనా తాళలేనే భామా చందమామ 

వెన్నెల్లనే పూలురువ్వి చూడూ ఊసులాడూ 

చెప్పాలనీ నీతో ఎదో చిన్నమాటా 

చెయ్యాలనీ స్నేహం నీతో పూట పూట 

ఊ అంటే నీ నోటా బ్రతుకే వెన్నెల తోటా 

చెలీరావా వరాలీవా


వొయ్యారాల నీలి నింగి పాడే కథలు పాడే 

ఉయ్యాలగా చల్లగాలి ఆడే చిందులాడే 

సుగంధాల ప్రేమా అందించగ రావా..

సుతారాల మాటా చిందించగా రాద 

ఆకాశం పగ అయితే మేఘం కదలాడేనా 

చెలీరావా వరాలీవా, నినే కోరే ఓ జాబిల్లీ 

నీజతకై వేచేను నిలువెల్లా నీవే 

చెలీరావా వరాలీవా, నినే కోరే ఓ జాబిల్లీ 

Malle Poola challa gaali [మల్లెపూల చల్లగాలి] - Mouna Ragam

Song Name :Mallepoola challagali
Movie:Mouna raagam
Singers:S.P. Balasubramanyam garu
Lyricist:Raajasri garu
Composer:Illayaraja garu
DirectorMani Ratnam garu 


మల్లెపూల చల్లగాలి మంటరేపె సందెవేళల్లో ఏలా ఈ వేళ

కోరుకున్న గోరింకను చేరదేల రామచిలుకా ఏలా అదేలా

ఆ వేదనే ఈ నాటికీ మిగిలింది నాకూ 

మల్లెపూల చల్లగాలి మంటరేపె సందెవేళల్లో ఏలా ఈ వేళ


వేదికై పోయే మన కథంతా నాటకం ఆయెనూ మనుగడంతా 

శోధనై పోయే హృదయమంతా బాటలే మారెనే పయనమంతా 

పండించవే వసంతం పంచవేలా సుగంధం 

నాగుండె గుడిలో నిలవాలీ .. రా 

మల్లెపూల చల్లగాలి మంటరేపె సందెవేళల్లో ఏలా ఈ వేళ

కోరుకున్న గోరింకను చేరదేల రామచిలుకా ఏలా అదేలా

ఆ వేదనే ఈ నాటికీ మిగిలింది నాకూ 

మల్లెపూల చల్లగాలి మంటరేపె సందెవేళల్లో ఏలా ఈ వేళ


తామరల పైన నీటిలాగా భర్తయూ భార్యయూ కలవరంటా

తోడుగా చేరి బతికేందుకూ సూత్రమూ మంత్రమూ ఎందుకంటా

సొంతం అనేదిలేక ప్రేమ బంధాలు లేక 

మోడంటి జీవితం ఇంకేలా... హ

మల్లెపూల చల్లగాలి మంటరేపె సందెవేళల్లో ఏలా ఈ వేళ

కోరుకున్న గోరింకను చేరదేల రామచిలుకా ఏలా అదేలా

ఆ వేదనే ఈ నాటికీ మిగిలింది నాకూ 

మల్లెపూల చల్లగాలి మంటరేపె సందెవేళల్లో ఏలా ఈ వేళ


Tuesday, April 29, 2025

Nigga deesi adugu (నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని) - Gaayam

Song Name :Nigga deesi adugu
Movie:Gaayam
Singers:S.P. Balasubramanyam garu
Lyricist:Sirivennela Seeta Rama Sastry garu
Composer:Sri garu
Director:Ram Gopal Varma garu

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని

మారదు లోకం, మారదు కాలం, దేవుడు దిగిరానీ ఎవ్వడు ఏమైపోనీ

మారదు లోకం, మారదు కాలం


గాలివాటు గమనానికి, కాలిబాట దేనికి

గొర్రెతాటు మందకి నీ జ్ఞానబోధ దేనికి

ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం, ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం

రామబాణమార్పిందా రావణకాష్ఠం, క్రిష్ణగీత ఆపిందా నిత్య కురుక్షేత్రం

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని

మారదు లోకం, మారదు కాలం


పాతరాతి గుహలు పాలరాతి గృహాలైనా, అడవినీతి మారిందా ఎన్ని యుగాలైనా 

వేట అదే వేటు అదే నాటి కథే అంతా, నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా 

బలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండా, శతాబ్ధాలు చదవలేద ఈ అరణ్యఖాండా 

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని

మారదు లోకం, మారదు కాలం, దేవుడు దిగిరానీ ఎవ్వడు ఏమైపోనీ

మారదు లోకం, మారదు కాలం

Saturday, April 26, 2025

Evaro okaru epudo apudu [ఎవరో ఒకరు ఎపుడొ అపుడు] - Ankuram

Song Name :Evaro okaru epudo apudu
Movie:Ankuram
Singers:S.P. Balasubramanyam garu, K.S. Chitra garu
Lyricist:Sirivennela Seeta Rama Sastry garu
Composer:Hamsalekha garu
Director:C. Uma Maheswara rao garu

ఎవరో ఒకరు ఎపుడొ అపుడు 
ఎవరో ఒకరు ఎపుడొ అపుడు నడవరా ముందుగా, అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు
మొదటివాడు ఎప్పుడూ ఒక్కడే మరి, మొదటి ఆదుగు ఎప్పుడూ ఒంటరే మరి
వెనుక వచ్చు వాళ్ళకు బాట అయినదీ 
ఎవరో ఒకరు ఎపుడొ అపుడు నడవరా ముందుగా, అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు

కదలరు ఎవ్వరూ వేకువ వచ్చిన, అనుకొని కోడికూత నిదరపోదుగా
జగతికి మేలుకొల్పు మానుకోదుగా
మొదటి చినుకు సూటిగా దూకిరానిదే, మబ్బు పొంగు చాటుగా ఒదిగి దాగితే 
వాన ధార రాదుగా నేల దారికి, ప్రాణమంటు లేదుగా బ్రతకడానికి
ఎవరో ఒకరు ఎపుడొ అపుడు నడవరా ముందుగా, అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు

చెదరకపోదుగా చిక్కని చీకటి మిణుగురు రెక్కచాటు చిన్ని కాంతికీ 
దానికి లెక్కలేదు కాళరాతిరి 
పెదవి ప్రమిద నిలపనీ నవ్వు జ్యోతిని, రెప్పవెనక ఆపనీ కంటి నీటిని 
సాగలేక ఆగితే దారి తరుగునా, జాలిచూపి తీరమే దరికి చేరునా 
ఎవరో ఒకరు ఎపుడొ అపుడు నడవరా ముందుగా, అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు

యుగములు సాగినా నింగిని తాకక ఎగసిన అలల ఆశ అలిసిపోదుగా 
ఓటమి ఒప్పుకుంటు ఆగిపోదుగా 
ఎంతవేడి ఎండతో ఓళ్ళు మండితే , అంత వాడి ఆవిరై వెళ్ళి చేరదా 
అంతగొప్ప సూర్యుడు కళ్ళు మూయడా, నల్లమబ్బు కమ్మితే చల్లబారడా 
ఎవరో ఒకరు ఎపుడొ అపుడు నడవరా ముందుగా, అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు, అటో ఇటో ఎటో వైపు 

Monday, December 13, 2010

ee naade edo ayyindi - Prema




Movie : Prema
Language : Telugu
Music Dir: Illayaraja
Singer: S.P. Balasubramanyam, Chitra
Artists: Venkatesh, Revathi

అతడు: ఈనాడే ఏదో అయ్యింది ఏనాడు నాలొ జరగంది
ఈ అనుభవం మరలా రానిది
ఆనంద రాగం మోగిందీ అందాల లోకం రమ్మందీ

ఆమె: ఈనాడే ఏదో అయ్యింది ఏనాడు నాలొ జరగంది

అతడు: నింగీ నేలా ఏకం కాగ ఈ క్షణమిలాగె ఆగింది
నింగీ నేలా ఏకం కాగ ఈ క్షణమిలాగె ఆగింది

ఆమె: ఒకటే మాటన్నదీ ఒకటై పొమ్మన్నదీ
మనసే ఇమ్మన్నదీ అది నా సొమ్మన్నది

అతడు: పరువాలు నీటి
ఆమె: న న న న న
అతడు: సెలయేటి తొటి
ఆమె: న న న న న

అతడు: పాడాలి నేడు
ఆమె: న న న న న
అతడు: కావాలి తోడు
ఆమె: న న న న న న న న న న న న న న న న

ఆమె: ఈనాడే ఏదో అయ్యింది
అతడు: ఏనాడు నాలొ జరగంది

ఆమె: సూర్యున్ని మాపి చంద్రున్ని ఆపి వెన్నెల రొజంత కాచింది
సూర్యున్ని మాపి చంద్రున్ని ఆపి వెన్నెల రొజంత కాచింది

అతడు: పగలూ రేయన్నదీ అసలే లేదన్నదీ కలలే వద్దన్నదీ నిజమే కమ్మన్నది

ఆమె: ఎదలోని ఆశ
అతడు: న న న న న

ఆమె: ఎదగాలీ భాశై
అతడు: న న న న న

ఆమె: కలవాలి నీవు
అతడు: న న న న న
ఆమె: కరగాలి నేను
అతడు: న న న న న న న న న న న న న న న న

అతడు: ఈనాడే ఏదో అయ్యింది ఏనాడు నాలొ జరగంది
ఆమె: ఈ అనుభవం మరలా రానిది
ఆనంద రాగం మోగిందీ అందాల లోకం రమ్మందీ

అతడు: ఈనాడే ఏదో అయ్యింది
ఆమె: ఏనాడు నాలొ జరగంది

English:

athadu: InAdE EdhO ayyiMdhi EnAdu nAlo jaragaMdhi
I anubhavaM maralA rAnidhi
AnaMdha rAgaM mOgiMdhI aMdhAla lOkaM rammaMdhI

aame: InAdE EdhO ayyiMdhi EnAdu nAlo jaragaMdhi

athadu: niMgI nElA EkaM kAga I kShaNamilAge AgiMdhi
niMgI nElA EkaM kAga I kShaNamilAge AgiMdhi

aame: okatE mAtannadhI okatai pommannadhI
manasE immannadhI adhi nA sommannadhi

athadu: paruvAlu nIti
aame: na na na na na
athadu: selayEti thoti
aame: na na na na na

athadu: pAdAli nEdu
aame: na na na na na
athadu: kAvAli thOdu
aame: na na na na na na na na na na na na na na na na

aame: InAdE EdhO ayyiMdhi
athadu: EnAdu nAlo jaragaMdhi

aame: sUryunni mApi chaMdhrunni Api vennela rojaMtha kAchiMdhi
sUryunni mApi chaMdhrunni Api vennela rojaMtha kAchiMdhi

athadu: pagalU rEyannadhI asalE lEdhannadhI kalalE vadhdhannadhI nijamE kammannadhi

aame: edhalOni Asha
athadu: na na na na na

aame: edhagAlI bhAshai
athadu: na na na na na

aame: kalavAli nIvu
athadu: na na na na na
aame: karagAli nEnu
athadu: na na na na na na na na na na na na na na na na

athadu: InAdE EdhO ayyiMdhi EnAdu nAlo jaragaMdhi
aame: I anubhavaM maralA rAnidhi
AnaMdha rAgaM mOgiMdhI aMdhAla lOkaM rammaMdhI

athadu: InAdE EdhO ayyiMdhi
aame: EnAdu nAlo jaragaMdhi