| Song Name : | Mallepoola challagali |
| Movie: | Mouna raagam |
| Singers: | S.P. Balasubramanyam garu |
| Lyricist: | Raajasri garu |
| Composer: | Illayaraja garu |
| Director | Mani Ratnam garu |
మల్లెపూల చల్లగాలి మంటరేపె సందెవేళల్లో ఏలా ఈ వేళ
కోరుకున్న గోరింకను చేరదేల రామచిలుకా ఏలా అదేలా
ఆ వేదనే ఈ నాటికీ మిగిలింది నాకూ

వేదికై పోయే మన కథంతా నాటకం ఆయెనూ మనుగడంతా
శోధనై పోయే హృదయమంతా బాటలే మారెనే పయనమంతా
పండించవే వసంతం పంచవేలా సుగంధం
నాగుండె గుడిలో నిలవాలీ .. రా
మల్లెపూల చల్లగాలి మంటరేపె సందెవేళల్లో ఏలా ఈ వేళ
కోరుకున్న గోరింకను చేరదేల రామచిలుకా ఏలా అదేలా
ఆ వేదనే ఈ నాటికీ మిగిలింది నాకూ
మల్లెపూల చల్లగాలి మంటరేపె సందెవేళల్లో ఏలా ఈ వేళ
తామరల పైన నీటిలాగా భర్తయూ భార్యయూ కలవరంటా
తోడుగా చేరి బతికేందుకూ సూత్రమూ మంత్రమూ ఎందుకంటా
సొంతం అనేదిలేక ప్రేమ బంధాలు లేక
మోడంటి జీవితం ఇంకేలా... హ
మల్లెపూల చల్లగాలి మంటరేపె సందెవేళల్లో ఏలా ఈ వేళ
కోరుకున్న గోరింకను చేరదేల రామచిలుకా ఏలా అదేలా
ఆ వేదనే ఈ నాటికీ మిగిలింది నాకూ
మల్లెపూల చల్లగాలి మంటరేపె సందెవేళల్లో ఏలా ఈ వేళ

No comments:
Post a Comment