Showing posts with label chitra. Show all posts
Showing posts with label chitra. Show all posts

Thursday, February 13, 2025

Sundari Nene nuvvanta (సుందరి నెనే నువ్వంట) - Dalapathi

Song Name :Sundari nene nuvvanta
Movie:Dalapathi
Singers:S.P. Bala subramanyam garu, K.S. Chitra garu
Lyricist:Rajasri garu
Composer:Illayaraja garu
DirectorMani Rathnam garu 

సుందరి నెనే నువ్వంట, చూడని నీలో నన్నంట 
కానుకే ఇచ్చా మనసంత, జన్మకే తోడై నేనుంట
గుండెలో నిండ మంట నీడగా పాడమంట నా సిరి నీవేనట
సుందరి నెనే నువ్వంట, చూడని నీలో నన్నంట 
కానుకే ఇచ్చా మనసంత, జన్మకే తోడై నేనుంట

అనుకున్న మాటలు సర్వం కరిగిపోతే న్యాయమా
మధురాల మధువులు చిందే చల్లని ప్రేమే మాయమా 
రేపవలు నిద్దరలోనూ ఎద నీ తోడే కోరును
యుద్ధాన ఏమైన నా ఆత్మే నిన్నే చేరును 
ఎద తెలుపు ఈ వేళ ఏల ఈ శొధనా 
జాబిలిని నీవడుగు తెలుపు నా వేదన 
నాలో ప్రేమే మరిచావొ, ప్రేమే నన్నే గెలిచేనే..
కానుకే ఇచ్చా మనసంత, జన్మకే తోడై నేనుంట
సుందరి నెనే నువ్వంట, చూడని నీలో నన్నంట 
గుండెలో నిండ మంట నీడగా పాడమంట నా సిరి నీవేనట
సుందరి నెనే నువ్వంట, చూడని నీలో నన్నంట 
కానుకే ఇచ్చా మనసంత, జన్మకే తోడై నేనుంట

పూవ్వులే ముళ్ళై తోచు నేవే నన్ను వీడితే 
ఊహలే పూలై పూచు నీ యెద మాటున చేరితే 
ఆ..మాసాలు వారాలౌను నీవు నేను కూడితే 
వారాలు మాసాలౌను మాటేమారి సాగితే 
పొంగునీ బంధాలే నీ దరి చేరితే 
గాయాలు ఆరేను నీ యెదుట ఉంటే 
నీవే కదా నా ప్రాణం నీవే కదా నా లోకం 

సుందరి నెనే నువ్వంట, చూడని నీలో నన్నంట 
కానుకే ఇచ్చా మనసంత, జన్మకే తోడై నేనుంట 
గుండెలో నిండ మంట నీడగా పాడమంట నా సిరి నీవేనట
సుందరి నెనే నువ్వంట, చూడని నీలో నన్నంట 
కానుకే ఇచ్చా మనసంత, జన్మకే తోడై నేనుంట  

Tuesday, October 6, 2015

Chilaka Pachcha Totalo [ చిలకపచ్చ తోటలో ] - Janaki Ramudu

Song Name :Chilakapachcha totalo
Movie:Jaanaki Raamudu
Singers:S.P.Balu గారు , Chitra గారు 
Lyricist:Veturi Sundararama Murthy గారు 
Composer:K.V. Mahadevan గారు 
Director:K Raghavendra Rao గారు 

చిలకపచ్చ తోటలో చిలిపి కోయిల
చిలకపచ్చ తోటలో చిలిపి కోయిల .. తెలుగు పాట పాడవే తీయగా..హాయిగా.....కుకు
చిలకపచ్చ తోటలో చిలిపి కోయిల .. తెలుగు పాట పాడవే తీయగా..హాయి హాయిగా.. కుకు

వలపులా పిలిచే పాట.. వరదలా పొంగె పాట..
వలపులా పిలిచే పాట.. వరదలా పొంగె పాట..
అరుదైన వరదయ్య .. బిరుదైన క్షేత్రయ్య .. గోపాల మువ్వగోపాల
అని మురిసేటి తెలుగింటి పాట.. అని మురిసేటి తెలుగింటి పాట.. కుకు
చిలకపచ్చ తోటలో చిలిపి కోయిల .. తెలుగు పాట పాడవే తీయగా..హాయిగా.. కుకు

తెలుగులో తేనెల తేట..వెతలలో వెన్నెల బాట..
తెలుగులో తేనెల తేట..వెతలలో వెన్నెల బాట..
రామయ్య భక్తుడై త్యాగయ్య బ్రహ్మమై  .. శ్రీరామ..రారా.. రఘురామ..అని పిలిచేటి తెలుగింటి పాట..
అని పిలిచేటి తెలుగింటి పాట.. కు కు..
చిలకపచ్చ తోటలో చిలిపి కోయిల .. తెలుగు పాట పాడవే తీయగా..హాయి హాయిగా.....కుకు

కు కు...
Watch & Listen 

English

chilakapachcha tOTalO chilipi kOyila
chilakapachcha tOTalO chilipi kOyila .. telugu pATa pADavE tIyagA..hAyigA.....kuku
chilakapachcha tOTalO chilipi kOyila .. telugu pATa pADavE tIyagA..hAyi hAyigA.. kuku

valapulA pilichE pATa.. varadalA poMge pATa..
valapulA pilichE pATa.. varadalA poMge pATa..
arudaina varadayya .. birudaina kShEtrayya .. gOpAla muvvagOpAla 
ani murisETi telugiMTi pATa.. ani murisETi telugiMTi pATa.. kuku
chilakapachcha tOTalO chilipi kOyila .. telugu pATa pADavE tIyagA..hAyigA.. kuku

telugulO tEnela tETa..vetalalO vennela bATa..
telugulO tEnela tETa..vetalalO vennela bATa..
rAmayya bhaktuDai tyAgayya brahmamai  .. SrIrAma..rArA.. raghurAma..ani pilichETi telugiMTi pATa..
ani pilichETi telugiMTi pATa.. ku ku..
chilakapachcha tOTalO chilipi kOyila .. telugu pATa pADavE tIyagA..hAyi hAyigA.....kuku

ku ku...

Tuesday, June 25, 2013

Chamakku chamakku cham [చమక్కు చమక్కు చాం] - Kondaveeti Donga

Title :
Chamakku chamakku cham
Movie:Kondaveeti Donga
Singers:K.S. Chitra , S.P. Balasubramanyam గారు
Lyricist:
Composer:Illayaraja గారు
Director:A. Kodanda Rami Reddy గారు

అరె చమక్కు చమక్కు చాం చుట్టుకొ చుట్టుకొ ఛాన్సు దొరికెరొ హొయ్యా 
ఝణక్కు ఝణక్కు ఝాం పట్టుకొ పట్టుకొ చంపెదరువులే వెయ్యా
హొయ్యరి హొయ్య హొయ్య హొయ్ వొయ్యారం సయ్యందయ్యా
హొయ్యరి హొయ్య హొయ్య హొయ్ అయ్యారె తస్సాదియ్యా 
ఛాం ఛాం చక్క ఛాం చక్క ఛాం ఛాం త్వరగ ఇచ్చెయ్ నీ లంఛం 
ఛాం ఛాం చక్క ఛాం చక్క ఛాం ఛాం చొరవే చెసేయ్ మరికొంచెం 
అరె చమక్కు చమక్కు చాం చుట్టుకొ చుట్టుకొ ఛాన్సు దొరికెరొ హొయ్యా 
హేయ్ ఝణక్కు ఝణక్కు ఝాం పట్టుకొ పట్టుకొ చంపెదరువులే వెయ్యా

నాగ స్వరములా లాగిందయ్యా తీగ సొగసు చూడయ్యా 
కాగు పొగరుతో రేగిందయ్యా కోడె పడగ కాటెయ్యా
మైకం పుట్టే రాగంవింటూ సాగేదెట్టాగయ్యా 
మంత్రంవేస్తే కస్సూ బుస్సూ ఇట్టే ఆగాలయ్యా 
పందెం వేస్తావా అల్లే అందంతో 
పందెం వేస్తావా తుళ్ళే పంతంతో 
అరె కైపే రేపే కాటే వేస్తా ఖరారుగా .. కధ ముదరగ 

ఝణక్కు ఝణక్కు ఝాం పట్టుకొ పట్టుకొ చంపెదరువులే వెయ్యా
అరె చమక్కు చమక్కు చాం చుట్టుకొ చుట్టుకొ ఛాన్సు దొరికెరొ హొయ్యా 
హొయ్యరి హొయ్య హొయ్య హొయ్ అయ్యారె తస్సాదియ్యా 
హొయ్యరి హొయ్య హొయ్య హొయ్ వొయ్యారం సయ్యందయ్యా
ఛాం ఛాం చక్క ఛాం చక్క ఛాం ఛాం చొరవే చెసేయ్ మరికొంచెం 
ఛాం ఛాం చక్క ఛాం చక్క ఛాం ఛాం త్వరగ ఇచ్చెయ్ నీ లంఛం 

అగ్గిజల్లులా కురిసే వయసే నెగ్గలేకపోతున్నా 
ఈతముళ్ళులా యెదలో దిగిరో జాతివన్నెదీ జాణ 
అంతో ఇంతో సాయంచెయ్యా చెయ్యందించాలయ్యా 
తీయని గాయం మాయం చేసె మార్గం చూడాలమ్మా 
రాజీకొస్తాలే కాగే కౌగిల్లో 
రాజ్యం ఇస్తాలే నీకే నావొళ్ళో 
ఇక రేపో మాపో ఆపే ఊపే హుషారుగా .. పదపదమని  

అరె చమక్కు చమక్కు చాం చుట్టుకొ చుట్టుకొ ఛాన్సు దొరికెరొ హొయ్యా 
ఝణక్కు ఝణక్కు ఝాం పట్టుకొ పట్టుకొ చంపెదరువులే వెయ్యా
హొయ్యరి హొయ్య హొయ్య హొయ్ వొయ్యారం సయ్యందయ్యా
హొయ్యరి హొయ్య హొయ్య హొయ్ అయ్యారె తస్సాదియ్యా 
ఛాం ఛాం చక్క ఛాం చక్క ఛాం ఛాం త్వరగ ఇచ్చెయ్ నీ లంఛం 
ఛాం ఛాం చక్క ఛాం చక్క ఛాం ఛాం చొరవే చెసేయ్ మరికొంచెం 
అరె చమక్కు చమక్కు చాం చుట్టుకొ చుట్టుకొ ఛాన్సు దొరికెరొ హొయ్యా 
అహ ఝణక్కు ఝణక్కు ఝాం పట్టుకొ పట్టుకొ చంపెదరువులే వెయ్యా

Watch and Listen

English
are chamakku chamakku chAM chuTTuko chuTTuko ChAnsu dorikero hoyyA 
jhaNakku jhaNakku jhAM paTTuko paTTuko chaMpedaruvulE veyyA
hoyyari hoyya hoyya hoy voyyAraM sayyaMdayyA
hoyyari hoyya hoyya hoy ayyAre tassAdiyyA 
ChAM ChAM chakka ChAM chakka ChAM ChAM tvaraga ichchey nI laMChaM 
ChAM ChAM chakka ChAM chakka ChAM ChAM choravE chesEy marikoMcheM 
are chamakku chamakku chAM chuTTuko chuTTuko ChAnsu dorikero hoyyA 
hEy jhaNakku jhaNakku jhAM paTTuko paTTuko chaMpedaruvulE veyyA

nAga swaramulA lAgiMdayyA tIga sogasu chUDayyA 
kAgu pogarutO rEgiMdayyA kODe paDaga kATeyyA
maikaM puTTE rAgaMviMTU sAgEdeTTAgayyA 
maMtraMvEstE kassU bussU iTTE AgAlayyA 
paMdeM vEstAvA allE aMdaMtO 
paMdeM vEstAvA tuLLE paMtaMtO 
are kaipE rEpE kATE vEstA kharArugA .. kadha mudaraga 

jhaNakku jhaNakku jhAM paTTuko paTTuko chaMpedaruvulE veyyA
are chamakku chamakku chAM chuTTuko chuTTuko ChAnsu dorikero hoyyA 
hoyyari hoyya hoyya hoy ayyAre tassAdiyyA 
hoyyari hoyya hoyya hoy voyyAraM sayyaMdayyA
ChAM ChAM chakka ChAM chakka ChAM ChAM choravE chesEy marikoMcheM 
ChAM ChAM chakka ChAM chakka ChAM ChAM tvaraga ichchey nI laMChaM 

aggijallulA kurisE vayasE neggalEkapOtunnA 
ItamuLLulA yedalO digirO jAtivannedI jANa 
aMtO iMtO sAyaMcheyyA cheyyaMdiMchAlayyA 
tIyani gAyaM mAyaM chEse mArgaM chUDAlammA 
rAjIkostAlE kAgE kougillO 
rAjyaM istAlE nIkE nAvoLLO 
ika rEpO mApO ApE UpE hushArugA .. padapadamani  

are chamakku chamakku chAM chuTTuko chuTTuko ChAnsu dorikero hoyyA 
jhaNakku jhaNakku jhAM paTTuko paTTuko chaMpedaruvulE veyyA
hoyyari hoyya hoyya hoy voyyAraM sayyaMdayyA
hoyyari hoyya hoyya hoy ayyAre tassAdiyyA 
ChAM ChAM chakka ChAM chakka ChAM ChAM tvaraga ichchey nI laMChaM 
ChAM ChAM chakka ChAM chakka ChAM ChAM choravE chesEy marikoMcheM 
are chamakku chamakku chAM chuTTuko chuTTuko ChAnsu dorikero hoyyA 
aha jhaNakku jhaNakku jhAM paTTuko paTTuko chaMpedaruvulE veyyA

Sunday, April 14, 2013

Chukkalu Temmannaa [చుక్కలు తెమ్మన్నా] - April 1 Vidudala

Title :Chukkalu Temmanna
Movie:April 1 Vidudala
Singers:Mano, Chitra గారు
Lyricist:Sirivennela Sitaraama Sastry గారు
Composer:Illayaraja గారు
Director:Vamsy గారు

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా.. చూస్తావా నా మైనా.. చేస్తానే ఎమైనా..
చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా.. చూస్తావా నా మైనా.. చేస్తానే ఎమైనా..
నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను వస్తానమ్మ ఎట్టాగైనా..
చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా.. చూస్తావా నా మైనా.. చేస్తానే ఎమైనా..

షోలే ఉందా..ఇదిగో ఇంద... చాల్లే ఇది జ్వాలకాదా.. తెలుగులొ తీసారే బాలా..
ఖైదీ ఉందా.. ఇదిగో ఇంద.. ఖైదీకన్నయ్య కాదే.. వీడికి అన్నయ్య వాడే..
జగదేక వీరుడి కధ ఇది పాత పిక్చరు కద.. అతిలోక సుందరి తల అతికించి ఇస్తా పద..
ఏ మాయ చేసైనా ఒప్పించే తీరాలి...
చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా.. చూస్తావా నా మైనా.. చేస్తానే ఎమైనా..

ఒకటా రెండా.. పదులా వందా.. బాకీ ఎగవేయకుండా.. బదులే తీర్చేది ఉందా..
మెదడే ఉందా.. మతిపోయిందా..చాల్లే మీ కాకి గోలా.. వెళాపాళంటూ  లేదా...
ఎమైంది భాగ్యం కధ.. కదిలిందాలేదా కధ.. వ్రతమేదో చేస్తుందట అందాక ఆగాలట..
లౌఖ్యంగా బ్రతకాలి.. సౌఖ్యాలే పొందాలి..

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా.. చూస్తావా నా మైనా.. చేస్తానే ఎమైనా..
నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను వస్తానమ్మ ఎట్టాగైనా..
చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా.. చూస్తావా నా మైనా.. చేస్తానే ఎమైనా..

English

chukkalu temmannA teMchuku rAnA.. chUstAvA nA mainA.. chEstAnE emainA..
chukkalu temmannA teMchuku rAnA.. chUstAvA nA mainA.. chEstAnE emainA..
ninnE meppistAnu nannE arpistAnu vastAnamma eTTAgainA..
chukkalu temmannA teMchuku rAnA.. chUstAvA nA mainA.. chEstAnE emainA..

ShOlE uMdA..idigO iMda... chAllE idi jwAlakAdA.. telugulo tIsArE bAlA..
KhaidI uMdA.. idigO iMda.. KhaidIkannayya kAdE.. vIDiki annayya vADE..
jagadEka vIruDi kadha idi pAta pikcharu kada.. atilOka suMdari tala atikiMchi istA pada..
E mAya chEsainA oppiMchE tIrAli...
chukkalu temmannA teMchuku rAnA.. chUstAvA nA mainA.. chEstAnE emainA..

okaTA reMDA.. padulA vaMdA.. bAkI egavEyakuMDA.. badulE tIrchEdi uMdA..
medaDE uMdA.. matipOyiMdA..chAllE mI kAki gOlA.. veLApALaMTU  lEdA...
emaiMdi bhAgyaM kadha.. kadiliMdAlEdA kadha.. vratamEdO chEstuMdaTa aMdAka AgAlaTa..
louKyaMgA bratakAli.. souKyAlE poMdAli..

chukkalu temmannA teMchuku rAnA.. chUstAvA nA mainA.. chEstAnE emainA..
ninnE meppistAnu nannE arpistAnu vastAnamma eTTAgainA..
chukkalu temmannA teMchuku rAnA.. chUstAvA nA mainA.. chEstAnE emainA..

Saturday, March 23, 2013

Swapna Venuvedo [స్వప్నవేణువేదొ] - Ravoyi Chandamaama

Title :Swapna Venuvedo
Movie:Raavoyi chandamaama
Singers:S.P. Bala Subramanyam గారు , Chitra గారు
Lyricist:Veturi గారు
Composer:Mani Sharma
Director:Jayanth C Paranji

స్వప్నవేణువేదొ సంగీతమాలపించె.. సుప్రభాతవేళ శుభమస్తు గాలివీచె 
జోడైన రెండు గుండెల ఏకతాళమో.. జోరైన ఎవ్వనాలలొ ప్రేమగీతమో
లేలేత పూలబాసలు..కాలేవా చేతిరాతలు..
స్వప్నవేణువేదొ సంగీతమాలపించె.. సుప్రభాతవేళ శుభమస్తు గాలివీచె 

నీవే ప్రాణం నీవే సర్వం .. నీకై చేసా వెన్నెల జాగారం 
ప్రేమ నేను.. రేయి పగలు... హారాలల్లే మల్లెలు నీకోసం 
కోటి చుక్కలు అష్ట దిక్కులు నిన్ను చూచువేళ.. నిండు ఆశలే రెండు కన్నులై చూస్తె నే రానా..
కాలాలే ఆగిపోయినా.. గానాలే మూగబోవునా..

నాలొ మోహం..రేగే దాహం.. దాచేదెపుడొ.. విరిచే కన్నుల్లో 
ఓడే పందెం.. గెలిచే భంధం... రెండు ఒకటే కలిసే జంటల్లో 
మనషి నీడగ మనసు తోడుగ మలుచుకున్న భంధం.. పెను తుఫానులె ఎదురువచ్చిన చేరాలి తీరం 
వారేవా ప్రేమ పావురం... వాలేదే ప్రణయ గోపురం...
స్వప్నవేణువేదొ సంగీతమాలపించె.. సుప్రభాతవేళ శుభమస్తు గాలివీచె 
జోడైన రెండు గుండెల ఏకతాళమో.. జోరైన ఎవ్వనాలలొ ప్రేమగీతమో
లేలేత పూలబాసలు..కాలేవా చేతిరాతలు..
స్వప్నవేణువేదొ సంగీతమాలపించె.. సుప్రభాతవేళ శుభమస్తు గాలివీచె 

Video and Audio

English

swapnavENuvEdo saMgItamAlapiMche.. suprabhAtavELa Subhamastu gAlivIche 
jODaina reMDu guMDela EkatALamO.. jOraina evvanAlalo prEmagItamO
lElEta pUlabAsalu..kAlEvA chEtirAtalu..
swapnavENuvEdo saMgItamAlapiMche.. suprabhAtavELa Subhamastu gAlivIche 

nIvE prANaM nIvE sarwaM .. nIkai chEsA vennela jAgAraM 
prEma nEnu.. rEyi pagalu... hArAlallE mallelu nIkOsaM 
kOTi chukkalu ashTa dikkulu ninnu chUchuvELa.. niMDu ASalE reMDu kannulai chUste nE rAnA..
kAlAlE AgipOyinA.. gAnAlE mUgabOvunA..

nAlo mOhaM..rEgE dAhaM.. dAchEdepuDo.. virichE kannullO 
ODE paMdeM.. gelichE bhaMdhaM... reMDu okaTE kalisE jaMTallO 
manashi nIDaga manasu tODuga maluchukunna bhaMdhaM.. penu tuphAnule eduruvachchina chErAli tIraM 
vArEvA prEma pAvuraM... vAlEdE praNaya gOpuraM...
swapnavENuvEdo saMgItamAlapiMche.. suprabhAtavELa Subhamastu gAlivIche 
jODaina reMDu guMDela EkatALamO.. jOraina evvanAlalo prEmagItamO
lElEta pUlabAsalu..kAlEvA chEtirAtalu..
swapnavENuvEdo saMgItamAlapiMche.. suprabhAtavELa Subhamastu gAlivIche 

Thursday, January 24, 2013

Chukkallara chuoopullara [చుక్కల్లార చూపుల్లార] - Aapadbhandhavudu

Title : Chukkallara Choopullara
Movie: Aapadbaandhavudu
Singers: S.P. Bala Subramanyam 
గారు ,  K.S. Chitra గారు 
Lyricist: Sirivennela SitaRaamasastry గారు 
Composer: M.M. Keeravaani గారు 
Director: K. Vishwanath గారు 

చుక్కల్లార చూపుల్లార ఎక్కడమ్మా జాబిలి... మబ్బుల్లార మంచుల్లార తప్పుకోండే దారికి 
వెళ్ళనివ్వరా వెన్నెలింటికి.. విన్నవించరా వెండిమింటికి 
జోజో...లాలీ.. జోజో లాలీ 

మలిసంద్యవేళాయే చలిగాలివేణువాయే నిదురమ్మా ఎటుపోతివే 
మునిమాపువేళాయే కనుపాప నిన్నుకోరే కునుకమ్మా ఇటు చేరవే 
నిదురమ్మా ఎటుపోతివే ... కునుకమ్మా ఇటు చేరవే 
నిదురమ్మా ఎటుపోతివే ... కునుకమ్మా ఇటు చేరవే 
గోధూళివేళాయే గూళ్ళన్నీ కనులాయే....
గోధూళివేళాయే గూళ్ళన్నీ కనులాయే గువ్వల్ల రెక్కల పైనా రివ్వు రివ్వున రావే 

జోలపాడవా బేలకళ్ళకీ వెళ్ళనివ్వరా వెన్నెలింటికీ 
జోజో...లాలీ.. జోజో లాలీ 
జోజో...లాలీ.. జోజో లాలీ 

పట్టుపరుపులేల పండువెన్నెలేల.. అమ్మవొడి చాలదా బజ్జోవెతల్లి 
పట్టుపరుపులేలనే పండువెన్నెలేలనే.. అమ్మవొడి చాలునే నిన్ను చల్లంగ జోకొట్టునే 
నారదాదులేల నాదబ్రహ్మలేల... అమ్మలాలి చాలదా బజ్జోవెతల్లి 
నారదాదులేలనే నాదబ్రహ్మలేలనే ... అమ్మలాలి చాలునే నిను కమ్మంగ లాలించునే 
చిన్ని చిన్ని కన్నుల్లో.. ఎన్నివేల వెన్నెల్లో.. తీయనైన కలలెన్నో ఊయలూగు వెళల్లో 
అమ్మలాలపైడి కొమ్మల్లాల ఏడి ఏవయ్యాడు అంతులేడియ్యాల కోటితందనాల ఆనందలాలా 
గోవుల్లాల పిల్లంగోవుల్లాల గొల్లభామల్లాల యాడనుంది ఆల నాటి నందనాల ఆనందలీల 
జాడచెప్పరా చిట్టితల్లికీ... వెళ్ళనివ్వరా వెన్నెలింటికీ 
జోజో...లాలీ.. జోజో లాలీ 

చుక్కల్లార చూపుల్లార ఎక్కడమ్మా జాబిలి... మబ్బుల్లార మంచుల్లార తప్పుకోండే దారికి 
వెళ్ళనివ్వరా వెన్నెలింటికి.. విన్నవించరా వెండిమింటికి 

English

chukkallAra chUpullAra ekkaDammA jAbili... mabbullAra maMchullAra tappukOMDE dAriki 
veLLanivvarA venneliMTiki.. vinnaviMcharA veMDimiMTiki 
jOjO...lAlI.. jOjO lAlI 

malisaMdyavELAyE chaligAlivENuvAyE nidurammA eTupOtivE 
munimApuvELAyE kanupApa ninnukOrE kunukammA iTu chEravE 
nidurammA eTupOtivE ... kunukammA iTu chEravE 
nidurammA eTupOtivE ... kunukammA iTu chEravE 
gOdhULivELAyE gULLannI kanulAyE....
gOdhULivELAyE gULLannI kanulAyE guvvalla rekkala painA rivvu rivvuna rAvE 

jOlapADavA bElakaLLakI veLLanivvarA venneliMTikI 
jOjO...lAlI.. jOjO lAlI 
jOjO...lAlI.. jOjO lAlI 

paTTuparupulEla paMDuvennelEla.. ammavoDi chAladA bajjOvetalli 
paTTuparupulElanE paMDuvennelElanE.. ammavoDi chAlunE ninnu challaMga jOkoTTunE 
nAradAdulEla nAdabrahmalEla... ammalAli chAladA bajjOvetalli 
nAradAdulElanE nAdabrahmalElanE ... ammalAli chAlunE ninu kammaMga lAliMchunE 
chinni chinni kannullO.. ennivEla vennellO.. tIyanaina kalalennO UyalUgu veLallO 
ammalAlapaiDi kommallAla EDi EvayyADu aMtulEDiyyAla kOTitaMdanAla AnaMdalAlA 
gOvullAla pillaMgOvullAla gollabhAmallAla yADanuMdi Ala nATi naMdanAla AnaMdalIla 
jADachepparA chiTTitallikI... veLLanivvarA venneliMTikI 
jOjO...lAlI.. jOjO lAlI 

chukkallAra chUpullAra ekkaDammA jAbili... mabbullAra maMchullAra tappukOMDE dAriki 
veLLanivvarA venneliMTiki.. vinnaviMcharA veMDimiMTiki 

Saturday, January 19, 2013

Bharata Vedamuga [భరతవేదముగ] - Pournami

Title : Bharata Vedamuga
Movie: Pournami
Singers: Chitra
Lyricist: Sirivennela SitaRama Sastry

Composer: Devi Sri Prasad

శంభో శంకరా.... హరహర మహాదేవ హరహర మహాదేవ హరహర మహాదేవ హరహర మహాదేవ
తద్దిందాధిం ధింధినీ ద్వనుల తాండవకేళీ తత్పర  
గౌరీమంజులషింజిని చతుర లాస్య వినోదవ శంకర 

భరతవేదముగ నిరతనాట్యముగ కదిలిన పదమిది ఈశా
శివ నివేదనగ అవని వేదనగ పలికెను పదము పరేశ
నీలకంథరా జాలిపొందరా కరుణతొ నను గనరా 
నీలకంథరా శైనమందిరా మొరవిని బదులిడరా  
నగజా మనోజ జగదీశ్వరా బాలేందుశేఖర శంకర
భరతవేదముగ నిరతనాట్యముగ కదిలిన పదమిది ఈశా
శివ నివేదనగ అవని వేదనగ పలికెను పదము పరేశ

హరహర మహాదేవ హరహర మహాదేవ హరహర మహాదేవ హరహర మహాదేవ
ఆ......

అంతకాంత నీసతి అగ్నితప్తమైనది - మేనుత్యాగమిచ్చి నీలో లీనమైనది 
ఆదిశక్తి ఆకౄతి అత్రిజాత పార్వతి - తాణువైన ప్రాణధవుని చెంతకు చేరుకున్నది 

భవుని భువికి తరలించేలా తరళి దివిని తలపించేల 
రసతరంగిణి లీల యతిని నౄత్యరతుని చేయగలిగె ఈ వేళ
భరతవేదముగ నిరతనాట్యముగ కదిలిన పదమిది ఈశా
శివ నివేదనగ అవని వేదనగ పలికెను పదము పరేశ 

జంగమసావర గంగార్చితశిరమౄదమండితకర పురహరా 
భక్తశుభంకర బమదాశంకర స్వరహరదక్షా ద్వరహరా 
బాలవిలోచన పాలితజణగణ కాలకాలవిశ్వేస్వర 
ఆశుతోష అగనాసతిషాశన జయగిరీష బ్రిహదీశ్వరా 
హరహర మహాదేవ హరహర మహాదేవ

వ్యోమకేశ నిను హిమగిరిపరసుత ప్రేమపాశమున పిలువంగ 
యోగివేష నీ మనసునకలగద రాగలేసమైనా 
హే మహేష నీ భయదపదాహతి దైత్యషొషనము జరుపంగ 
భోగిభూష భ్వనాళిని నిలుపవ అభయముద్రలోన
నమక చమకముల నాదానా యమక గమకముల యోగానా 
పలుకుతున్న ప్రాణానా ప్రణవనాధ ప్రధమనాట శౄతివినరా 
హరహర మహాదేవ 

English

SaMbhO SaMkarA.... harahara mahAdEva harahara mahAdEva harahara mahAdEva harahara mahAdEva
taddiMdAdhiM dhiMdhinI dwanula tAMDavakELI tatpara
gowrImaMjulashiMjini chatura lAsya vinOdava SaMkara

bharatavEdamuga niratanATyamuga kadilina padamidi ISA
Siva nivEdanaga avani vEdanaga palikenu padamu parESa
nIlakaMtharA jAlipoMdarA karuNato nanu ganarA
nIlakaMtharA SainamaMdirA moravini baduliDarA
nagajA manOja jagadISwarA bAlEMduSEkhara SaMkara
bharatavEdamuga niratanATyamuga kadilina padamidi ISA
Siva nivEdanaga avani vEdanaga palikenu padamu parESa

harahara mahAdEva harahara mahAdEva harahara mahAdEva harahara mahAdEva
A......

aMtakAMta nIsati agnitaptamainadi - mEnutyAgamichchi nIlO lInamainadi
AdiSakti AkRuti atrijAta pArvati - tANuvaina prANadhavuni cheMtaku chErukunnadi

bhavuni bhuviki taraliMchElA taraLi divini talapiMchEla
rasataraMgiNi lIla yatini nRutyaratuni chEyagalige I vELa
bharatavEdamuga niratanATyamuga kadilina padamidi ISA
Siva nivEdanaga avani vEdanaga palikenu padamu parESa

jaMgamasAvara gaMgArchitaSiramRudamaMDitakara puraharA
bhaktaSubhaMkara bamadASaMkara swaraharadakShA dwaraharA
bAlavilOchana pAlitajaNagaNa kAlakAlaviSwEswara
ASutOSha aganAsatiShASana jayagirISha brihadISwarA
harahara mahAdEva harahara mahAdEva

vyOmakESa ninu himagiriparasuta prEmapASamuna piluvaMga
yOgivESha nI manasunakalagada rAgalEsamainA
hE mahESha nI bhayadapadAhati daityaShoshanamu jarupaMga
bhOgibhUSha bhvanALini nilupava abhayamudralOna
namaka chamakamula nAdAnA yamaka gamakamula yOgAnA
palukutunna prANAnA praNavanAdha pradhamanATa SRutivinarA
harahara mahAdEva

Monday, December 13, 2010

ee naade edo ayyindi - Prema

Movie : Prema
Language : Telugu
Music Dir: Illayaraja
Singer: S.P. Balasubramanyam, Chitra
Artists: Venkatesh, Revathi

అతడు: ఈనాడే ఏదో అయ్యింది ఏనాడు నాలొ జరగంది
ఈ అనుభవం మరలా రానిది
ఆనంద రాగం మోగిందీ అందాల లోకం రమ్మందీ

ఆమె: ఈనాడే ఏదో అయ్యింది ఏనాడు నాలొ జరగంది

అతడు: నింగీ నేలా ఏకం కాగ ఈ క్షణమిలాగె ఆగింది
నింగీ నేలా ఏకం కాగ ఈ క్షణమిలాగె ఆగింది

ఆమె: ఒకటే మాటన్నదీ ఒకటై పొమ్మన్నదీ
మనసే ఇమ్మన్నదీ అది నా సొమ్మన్నది

అతడు: పరువాలు నీటి
ఆమె: న న న న న
అతడు: సెలయేటి తొటి
ఆమె: న న న న న

అతడు: పాడాలి నేడు
ఆమె: న న న న న
అతడు: కావాలి తోడు
ఆమె: న న న న న న న న న న న న న న న న

ఆమె: ఈనాడే ఏదో అయ్యింది
అతడు: ఏనాడు నాలొ జరగంది

ఆమె: సూర్యున్ని మాపి చంద్రున్ని ఆపి వెన్నెల రొజంత కాచింది
సూర్యున్ని మాపి చంద్రున్ని ఆపి వెన్నెల రొజంత కాచింది

అతడు: పగలూ రేయన్నదీ అసలే లేదన్నదీ కలలే వద్దన్నదీ నిజమే కమ్మన్నది

ఆమె: ఎదలోని ఆశ
అతడు: న న న న న

ఆమె: ఎదగాలీ భాశై
అతడు: న న న న న

ఆమె: కలవాలి నీవు
అతడు: న న న న న
ఆమె: కరగాలి నేను
అతడు: న న న న న న న న న న న న న న న న

అతడు: ఈనాడే ఏదో అయ్యింది ఏనాడు నాలొ జరగంది
ఆమె: ఈ అనుభవం మరలా రానిది
ఆనంద రాగం మోగిందీ అందాల లోకం రమ్మందీ

అతడు: ఈనాడే ఏదో అయ్యింది
ఆమె: ఏనాడు నాలొ జరగంది

English:

athadu: InAdE EdhO ayyiMdhi EnAdu nAlo jaragaMdhi
I anubhavaM maralA rAnidhi
AnaMdha rAgaM mOgiMdhI aMdhAla lOkaM rammaMdhI

aame: InAdE EdhO ayyiMdhi EnAdu nAlo jaragaMdhi

athadu: niMgI nElA EkaM kAga I kShaNamilAge AgiMdhi
niMgI nElA EkaM kAga I kShaNamilAge AgiMdhi

aame: okatE mAtannadhI okatai pommannadhI
manasE immannadhI adhi nA sommannadhi

athadu: paruvAlu nIti
aame: na na na na na
athadu: selayEti thoti
aame: na na na na na

athadu: pAdAli nEdu
aame: na na na na na
athadu: kAvAli thOdu
aame: na na na na na na na na na na na na na na na na

aame: InAdE EdhO ayyiMdhi
athadu: EnAdu nAlo jaragaMdhi

aame: sUryunni mApi chaMdhrunni Api vennela rojaMtha kAchiMdhi
sUryunni mApi chaMdhrunni Api vennela rojaMtha kAchiMdhi

athadu: pagalU rEyannadhI asalE lEdhannadhI kalalE vadhdhannadhI nijamE kammannadhi

aame: edhalOni Asha
athadu: na na na na na

aame: edhagAlI bhAshai
athadu: na na na na na

aame: kalavAli nIvu
athadu: na na na na na
aame: karagAli nEnu
athadu: na na na na na na na na na na na na na na na na

athadu: InAdE EdhO ayyiMdhi EnAdu nAlo jaragaMdhi
aame: I anubhavaM maralA rAnidhi
AnaMdha rAgaM mOgiMdhI aMdhAla lOkaM rammaMdhI

athadu: InAdE EdhO ayyiMdhi
aame: EnAdu nAlo jaragaMdhi

Monday, October 19, 2009

Kannullo nee roopame [కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే] - Ninne Pelladatha

Title :Kannullo ni roopame
Movie:Ninne Pelladuta
Singers:HariHaran గారు, K.S. Chitra గారు
Lyricist:Sirivennela seetaramasastry గారు
Composer:Sandeep Chowta గారు
Director:Krishna Vamsi గారు

కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే
నా అశ నీ స్నేహమే నా శ్వాశ నీ కోసమే
ఆ ఊసుని తెలిపేందుకు నా భాష ఈ మౌనమే
కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే
నా అశ నీ స్నేహమే నా శ్వాశ నీ కోసమే

మది దాచుకున్న రహస్యాన్ని వెతికేటి నీ చూపునాపేదెలా
నీ నీలి కన్నుల్లొ పడి మునకలేస్తున్న నా మనసు తేలేదెలా
గిలిగింత పెడుతున్న నీ చిలిపి తలపులతొ ఏమో ఎలా వేగడం
కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే
నా అశ నీ స్నేహమే నా శ్వాశ నీ కోసమే

అదిరేటి పెదవుల్ని బ్రతిమాలుతున్నాను మదిలోని మాటేదని
తల వంచుకుని నేను తెగ ఎదురు చూసాను నీ తెగువ చూడాలనీ
చూస్తూనే వెళంత తెలవారిపొతుందొ ఏమో ఎలా ఆపడం

కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే
నా అశ నీ స్నేహమే నా శ్వాశ నీ కోసమే
ఆ ఊసుని తెలిపేందుకు నా భాష ఈ మౌనం
కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే
నా అశ నీ స్నేహమే నా శ్వాశ నీ కోసమే

Thursday, October 8, 2009

Nelaraaja - Surya IPS

Title: Nelaraajaa
Movie : Surya IPS
Language : Telugu
Music Dir: Illayaraja
Singer: S.P. Balasubramanyam, Chitra

ఓ.. ఓ.. ఓ.. ఓ...
నెలరాజా... ఇటుచూడరా..
నెలరాజా ఇటుచూడరా.. ఉలుకేలరా కులుకేలరా వలరాజా తగువేళరా తగవేలరా రవితేజా..
నవరోజా తెరతీయవా... నవరోజా తెరతీయవా..

నీ కొసం ఆశగా నిరీక్షించె ప్రాణం నీ చెతుల వాలగా చిగిర్చింది ప్రాయం
నీవైపే దీక్షగా చలించింది పాదం నీ రూపే దీపమై ప్రయాణించె జీవం
నివాళిచ్చి నవనవలన్ని నివేదించనా నువ్వేలేని నిమిషాలన్ని నిషేదించనా
రతిరాజువై జతచేరవా విరివానవై ననుతాకవా
నవరోజా తెరతీయవా... నవరోజా తెరతీయవా..
దివితారక తవితీరగా నినుచూచా జవనాలతొ జరిపించవే జతపూజా
నెలరాజా... ఇటుచూడరా.. నెలరాజా... ఇటుచూడరా..

ఈ వెన్నెల సాక్షిగా యుగాలాగిపోని ఈ స్నేహం జంటగా జగాలేలుకోనీ
నీ కన్నులపాపగా కలలొ ఆడుకోని నీ కౌగిలి నీడలో సదాసాగిపోని
ప్రపంచాల అంచులుదాటి ప్రయాణించిపోనీ దిగంతాల కొటలుదాటి ప్రవేశించనీ
గతజన్మనే బ్రతికించనీ ప్రణయాలలో శ్రుతిపెంచనీ

నెలరాజా... ఇటుచూడరా.. నవరోజా తెరతీయవా...
ఉలుకేలరా కులుకేలరా వలరాజా జవనాలతొ జరిపించవే జతపూజా
నెలరాజా... ఇటుచూడరా.. నవరోజా తెరతీయవా...

O.. O.. O.. O...
nelarAjA... ituchoodarA..
nelarAjA ituchoodarA.. ulukaelarA kulukaelarA valarAjA thaguvaeLarA thagavaelarA ravithaejA..
navarOjA therathIyavA... navarOjA therathIyavA..

nI kosaM AshagA nirIkShiMche prANaM nI chethula vAlagA chigirchiMdhi prAyaM
nIvaipae dhIkShagA chaliMchiMdhi pAdhaM nI roopae dhIpamai prayANiMche jIvaM
nivALichchi navanavalanni nivaedhiMchanA nuvvaelaeni nimiShAlanni niShaedhiMchanA
rathirAjuvai jathachaeravA virivAnavai nanuthAkavA
navarOjA therathIyavA... navarOjA therathIyavA..
dhivithAraka thavithIragA ninuchUchA javanAlatho jaripiMchavae jathapUjA
nelarAjA... ituchoodarA.. nelarAjA... ituchoodarA..

I vennela sAkShigA yugAlAgipOni I snaehaM jaMtagA jagAlaelukOnI
nI kannulapApagA kalalo AdukOni nI kaugili nIdalO sadhAsAgipOni
prapaMchAla aMchuludhAti prayANiMchipOnI dhigaMthAla KotaludhAti pravaeshiMchanI
gathajanmanae brathikiMchanI praNayAlalO shruthipeMchanI

nelarAjA... ituchoodarA.. navarOjA therathIyavA...
ulukaelarA kulukaelarA valarAjA javanAlatho jaripiMchavae jathapUjA
nelarAjA... ituchoodarA.. navarOjA therathIyavA...

Friday, June 26, 2009

Alupannadhi unda - Gaayam

Movie : Gaayam
Language : Telugu
Music Dir: Raj - Koti
Singer: Chitra
Artists: Jagapathibabu, Revathi

అలుపన్నది ఉందా ఎగిసే అలకు ఎదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు
మెలికలు తిరిగే నది నడకలకు మరిమరి ఉరికే మదితలపులకు
లల ల ల లలలలా
అలుపన్నది ఉందా ఎగిసే అలకు ఎదలోని లయకు

నాకోసమే చినుకై కరిగి ఆకాశమే దిగదా ఇలకు
నాసేవకే సిరులే చిలికి దాసోహమే అనదా వెలుగు
ఆరారు కాలాలు అందాలు బహుమతికావా నా ఊహలకు కలలను తేవా నా కన్నులకు
లల ల ల లలలలా
అలుపన్నది ఉందా ఎగిసే అలకు ఎదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు

నీ చూపులే తడిపేవరకు ఏమైనదో నాలో వయసు
నీ ఊపిరే తగిలే వరకు ఎటువున్నదో మెరిసే సొగసు
ఏడేడు లొకాల ద్వారాల తలుపులు తెరిచే తరుణం కొరకు ఎదురుగ నడిచె తొలి ఆశలకు
లల ల ల లలలలా
అలుపన్నది ఉందా ఎగిసే అలకు ఎదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు