Showing posts with label vijayashanti. Show all posts
Showing posts with label vijayashanti. Show all posts

Thursday, July 31, 2025

Poddunne puttindi chandamama [పొద్దునే పుట్టింది చందమామ] - Satruvu

Song Name :Poddunne puttindi chandamaama
Movie:Satruvu
Singers:Mano garu, K.S. Chitra garu
Lyricist:Sirivennela Seetharama sastry garu
Composer:Raj-Koti garu
Director:Kodi Ramakrishna garu


పొద్దునే పుట్టింది చందమామ, మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ

మౌనంగా పుట్టావా గీతిక, స్నెహంతో మీటావా మెల్లగా

తొలిపొద్దంటి అందాలు ఈనాడు నిద్దరలేచి ముత్యాల ముగ్గులుపెట్టే వన్నెల వాకిట్లో

పొద్దునే పుట్టింది చందమామ, మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ


ఉగ్గెట్టా పట్టాలో నలుగెట్టా పెట్టాలో లాలెట్టా పోయాలోయమ్మా ఓ రబ్బరుబొమ్మా లాలిచ్చేదెట్టా చెప్పమ్మా 

మొగ్గంటీ బుగ్గల్లో అగ్గల్లే సిగ్గొస్తే జాబిల్లిని రప్పించాలయ్యో ఓ ముద్దుల కన్నా కౌగిట్లో జోకొట్టాలయ్యో 

నా కంటిపాపల్లో ఉయ్యాల వెయ్యాలా, ఈ కొంటె పాపాయికి 

ముందు మునుపూ లేని ఈ పొద్దటి వెన్నెల ఆవిరిలో, ముద్దు మురిపాలన్ని పండించేదెట్టాగో 

ఇక ఏ పేరు పెట్టాలో ఇన్నాళ్ళు ఎరగని ఈ కొంటె చక్కిలిగింతల ఉక్కిరిబిక్కిరికి 

పొద్దునే పుట్టింది చందమామ, మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ


నీకోసం పుట్టాను నిలువెల్లా పూసాను గుండెల్లో గూడే కట్టాను నా బంగరుగువ్వ గుమ్మంలో చూపులు పెట్టాను 

నీ నేస్తం కట్టాను నీ దారే పట్టాను కళ్ళల్లో కాపురముంటాను నా పచ్చని కొమ్మ పొమ్మన్నా పక్కకి పోలేను 

శృంగార స్నేహాల సంకెళ్ళు వెయ్యాలా, చిన్నారి చిందాటతో 

ఉరికే గోదారంటి నా ఉడుకూ దుడుకూ తగ్గించి, కొంగున కట్టేసేనీ కిటుకేదో చెప్పమ్మా 

పశి పరువాలు చూస్తుంటే బరువైన కన్నుల్లో పగలేదొ రేయేదో తెలియదులేవయ్యో  

పొద్దునే పుట్టింది చందమామ, మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ

మౌనంగా పుట్టావా గీతిక, స్నెహంతో మీటావా మెల్లగా

తొలిపొద్దంటి అందాలు ఈనాడు నిద్దరలేచి ముత్యాల ముగ్గులుపెట్టే వన్నెల వాకిట్లో

Friday, July 11, 2025

Sandhya raagapu [సంధ్యారాగపు సరిగమలో ] - Indrudu Chandrudu

Song Name :Sandhya ragapu
Movie:Indrudu chandrudu
Singers:S.P. Bala subramanyam garu, S. Janaki garu
Lyricist:Veturi Sundararama murthy  garu
Composer:Illayaraja garu
DirectorSuresh krishna garu 


సంధ్యారాగపు సరిగమలో తొలి కలయికలో

సాయంకాలపు చలి చలి ఊహల పకపకలో

డోరేమీ రాగాల జోరేమీ, దాసాదా నా ప్రేమ నీ మీద శృతి కలిసిన 

సంధ్యారాగపు సరిగమలో తొలి కలయికలో

సాయంకాలపు చలి చలి ఊహల పకపకలో


చినుకు చినుకు నడుములో చిలకలులికి పడెనులే 

కనుల కనుల నడుమలో అలల సుడులు తిరిగెలే 

పెదవి పెదవి తడుపులో వలపు మధువు తొలికెలే 

తనువు తనువు కుదుపులో తమకమొకటి మెరిసెలే 

సంధ్యలో తార లాగా స్వప్నమై పోకుమా 

కన్నెలో సోయగాలు కంటితోనె తాగుమా 

హంసలా హాయిగా ఆమనీ రేయిలా వాలిపో ప్రియ

ఓ..సంధ్యారాగపు సరిగమలో తొలి కలయికలో

సాయంకాలపు చలి చలి ఊహల పకపకలో

డోరేమీ రాగాల జోరేమీ, దాసాదా నా ప్రేమ నీ మీద శృతి కలిసిన 

సంధ్యారాగపు సరిగమలో తొలి కలయికలో

సాయంకాలపు చలి చలి ఊహల పకపకలో


ఎదుట పడిన బిడీయమే, చెమట నుదుట చిలికెలే

వొణుకు తొణుకు పరువమే, వడికి వయసు కలిపెలే 

వలపు పొడుపు కథలలో, చిలిపి ముడులు విడెనులే 

మరుల విరుల పొదలలో, మరుడి పురుడు జరిగెలే 

తేనెలే దోచుకెళ్ళే తుమ్మెదై పోకుమా 

గాలికే గంధమిచ్చే కౌగిలింతే దూరమా 

పాటలా కోటలో పల్లవే ప్రేమగా పాడుకో ప్రియ 

ఓ..సంధ్యారాగపు సరిగమలో తొలి కలయికలో

సాయంకాలపు చలి చలి ఊహల పకపకలో

డోరేమీ రాగాల జోరేమీ, దాసాదా నా ప్రేమ నీ మీద శృతి కలిసిన 

సంధ్యారాగపు సరిగమలో తొలి కలయికలో 

సాయంకాలపు చలి చలి ఊహల పకపకలో

Friday, October 18, 2024

సమరం సమరం పొంగే రుధిరం (Karthavyam)

Song Name :Samaram Samaram
Movie:Karthavyam
Singers:S.P. BalaSubramanyam garu
Lyricist:Veturi Sundara rama murthy garu
Composer:Raj - Koti garu
DirectorMohan Gandhi garu

సమరం సమరం పొంగే రుధిరం

కృషికే విజయం కాదు శిథిలం

నీకర్తవ్యం నీకర్తవ్యం నీకర్తవ్యం 

ఆశయానికిది ఆరంభం ఆత్మసాధనకు అధ్యాయం 

నీ ఊరుకు సాగిన తూరుపులో, వెలగనున్నదీ ఒక ఉదయం  

నిన్నటి చీకటి నిట్టూరుపులో నివురైపోయెనులే విలయం  

సమరం సమరం పొంగే రుధిరం

కృషికే విజయం కాదు శిథిలం


పెట్టుకున్నగురి ధృవతార ఆకశానికది పొలిమేరా   

పెట్టుకున్నగురి ధృవతార ఆకశానికది పొలిమేరా 

జరిగే జీవనవ్యాయామంలో  మరిగేకన్నుల భాష్పజలంలో  

రక్తం పొంగే నీగాయం అరుణవిప్లవాక్షరగేయం 

సమరం సమరం పొంగే రుధిరం 

కృషికే విజయం కాదు శిథిలం


నిరాశవద్దు నిస్పృహవద్దు నిశ్చేతనమే కావద్దు 

కర్మయోగికి కాళరాత్రులలో భయమేలేదు లేదు 

సహకరించని అంగాంగాలను సమిధలుగా ఇక ప్రేల్చు 

అగ్నిహోత్రివై యజ్ఞహోతవై యజ్ఞకర్తవై యజ్ఞభోక్తవై   

నీచకీచకపు కామమేచకపు భ్రష్టులనే ఇలరల్చు 

రాక్షసాధనుల రాక్షసత్వముల పాలననే పరిమార్చు  

సమరం సమరం పొంగే రుధిరం

కృషికే విజయం కాదు శిథిలం

ఆశయానికిది ఆరంభం ఆత్మసాధనకు అధ్యాయం 

నీ ఊరుకు సాగిన తూరుపులో, వెలగనున్నదీ ఒక ఉదయం  

నిన్నటి చీకటి నిట్టూరుపులో నివురైపోయెనులే విలయం  

సమరం సమరం పొంగే రుధిరం

కృషికే విజయం కాదు శిథిలం

నీకర్తవ్యం నీకర్తవ్యం నీకర్తవ్యం  


Sunday, October 11, 2009

Chakkani Chukkala - Pasivadi pranam

Title: Chakkani Chukkala Sandita Breakdance
Movie : Pasivaadi PraanamLanguage : TeluguMusic Dir: ChakravarthiSinger: S.P. Balasubramanyam, S. Janaki
స్వీటీ.... స్వీటీ... 

చక్కని చుక్కల సందిట బ్రేక్ డ్యాన్స్ 

చక్కిలిగింతల చాటున షేక్ డ్యాన్స్నీ 

పిట్ట నడుమున పుట్టిన ఫొక్ డ్యాన్స్ 

నీ బుట్ట అడుగున సాగిన స్నేక్ డ్యాన్స్ 

ఇద్దరి దరువుకు మధ్యన బ్రేక్ డ్యాన్స్ బ్రేక్ బ్రేక్ బ్రేక్ 

స్వీటీ.... స్వీటీ... యహ్.. 

హేయ్ నీ అందం అరువిస్తావా నా సొంతం కానిస్తావా 

నీ సత్తా చూపిస్తావా సరికొత్త ఊపిస్తావా 

హేయ్ పిల్లానినల్లాడిస్తా పిడుగంటి అడుగులతొ 

పై తాళం పరుగుల్తోబ్రేక్ బ్రేక్ బ్రేక్ స్వీటీ.... స్వీటీ...

చక్కని చుక్కల సందిట బ్రేక్ డ్యాన్స్ 

చక్కిలిగింతల చాటున షేక్ డ్యాన్స్నీ 

పిట్ట నడుమున పుట్టిన ఫొక్ డ్యాన్స్ నీ బుట్ట అడుగున సాగిన స్నేక్ డ్యాన్స్

ఇద్దరి దరువుకు మధ్యన బ్రేక్ డ్యాన్స్ బ్రేక్ బ్రేక్ బ్రేక్ స్వీటీ.... స్వీటీ... 

నా ముద్దుని శ్రుతిచేస్తావా నా మువ్వకు లయలేస్తావా

 నా చిందుకు చిటికేస్తావా నా పొందుకు చిత్తవుతావా 

పిల్లడా నిన్నోడిస్త కడగంటి చూపుల్తో .. హేయ్ కైపెక్కే తైతక్కల్లో 

బ్రేక్ బ్రేక్ బ్రేక్ నాటీ.... నాటీ...

 చక్కని చుక్కల సందిట బ్రేక్ డ్యాన్స్ 

చక్కిలిగింతల చాటున షేక్ డ్యాన్స్నీ 

పిట్ట నడుమున పుట్టిన ఫొక్ డ్యాన్స్ 

నీ బుట్ట అడుగున సాగిన స్నేక్ డ్యాన్స్

 ఇద్దరి దరువుకు మధ్యన బ్రేక్ డ్యాన్స్ బ్రేక్ బ్రేక్ బ్రేక్ స్వీటీ.... స్వీటీ...

 

 svItI.... svItI...chakkani chukkala saMdhita braek dyAns chakkiligiMthala chAtuna Shaek dyAnsnI pitta nadumuna puttina phok dyAns nI butta aduguna sAgina snaek dyAnsidhdhari dharuvuku maDhyana braek dyAns braek braek braek svItI.... svItI... yah..haey nee aMdhaM aruvisthAvA nA soMthaM kAnisthAvAnI saththA chUpisthAvA sarikoththa UpisthAvAhaey pillAninallAdisthA pidugaMti adugulatho pai thaaLaM parugulthObraek braek braek svItI.... svItI...chakkani chukkala saMdhita braek dyAns chakkiligiMthala chAtuna Shaek dyAnsnI pitta nadumuna puttina phok dyAns nI butta aduguna sAgina snaek dyAnsidhdhari dharuvuku maDhyana braek dyAns braek braek braek svItI.... svItI...nA mudhdhuni shruthichaesthAvA nA muvvaku layalaesthAvAnA chiMdhuku chitikaesthAvA nA poMdhuku chiththavuthAvApilladA ninnOdistha kadagaMti chUpulthO .. haey kaipekkae thaithakkallObraek braek braek nAtI.... nAtI...chakkani chukkala saMdhita braek dyAns chakkiligiMthala chAtuna Shaek dyAnsnI pitta nadumuna puttina phok dyAns nI butta aduguna sAgina snaek dyAnsidhdhari dharuvuku maDhyana braek dyAns braek braek braek svItI.... svItI...
x

Thursday, October 8, 2009

Nelaraaja - Surya IPS

Title: Nelaraajaa
Movie : Surya IPS
Language : Telugu
Music Dir: Illayaraja
Singer: S.P. Balasubramanyam, Chitra

ఓ.. ఓ.. ఓ.. ఓ...
నెలరాజా... ఇటుచూడరా..
నెలరాజా ఇటుచూడరా.. ఉలుకేలరా కులుకేలరా వలరాజా తగువేళరా తగవేలరా రవితేజా..
నవరోజా తెరతీయవా... నవరోజా తెరతీయవా..

నీ కొసం ఆశగా నిరీక్షించె ప్రాణం నీ చెతుల వాలగా చిగిర్చింది ప్రాయం
నీవైపే దీక్షగా చలించింది పాదం నీ రూపే దీపమై ప్రయాణించె జీవం
నివాళిచ్చి నవనవలన్ని నివేదించనా నువ్వేలేని నిమిషాలన్ని నిషేదించనా
రతిరాజువై జతచేరవా విరివానవై ననుతాకవా
నవరోజా తెరతీయవా... నవరోజా తెరతీయవా..
దివితారక తవితీరగా నినుచూచా జవనాలతొ జరిపించవే జతపూజా
నెలరాజా... ఇటుచూడరా.. నెలరాజా... ఇటుచూడరా..

ఈ వెన్నెల సాక్షిగా యుగాలాగిపోని ఈ స్నేహం జంటగా జగాలేలుకోనీ
నీ కన్నులపాపగా కలలొ ఆడుకోని నీ కౌగిలి నీడలో సదాసాగిపోని
ప్రపంచాల అంచులుదాటి ప్రయాణించిపోనీ దిగంతాల కొటలుదాటి ప్రవేశించనీ
గతజన్మనే బ్రతికించనీ ప్రణయాలలో శ్రుతిపెంచనీ

నెలరాజా... ఇటుచూడరా.. నవరోజా తెరతీయవా...
ఉలుకేలరా కులుకేలరా వలరాజా జవనాలతొ జరిపించవే జతపూజా
నెలరాజా... ఇటుచూడరా.. నవరోజా తెరతీయవా...

O.. O.. O.. O...
nelarAjA... ituchoodarA..
nelarAjA ituchoodarA.. ulukaelarA kulukaelarA valarAjA thaguvaeLarA thagavaelarA ravithaejA..
navarOjA therathIyavA... navarOjA therathIyavA..

nI kosaM AshagA nirIkShiMche prANaM nI chethula vAlagA chigirchiMdhi prAyaM
nIvaipae dhIkShagA chaliMchiMdhi pAdhaM nI roopae dhIpamai prayANiMche jIvaM
nivALichchi navanavalanni nivaedhiMchanA nuvvaelaeni nimiShAlanni niShaedhiMchanA
rathirAjuvai jathachaeravA virivAnavai nanuthAkavA
navarOjA therathIyavA... navarOjA therathIyavA..
dhivithAraka thavithIragA ninuchUchA javanAlatho jaripiMchavae jathapUjA
nelarAjA... ituchoodarA.. nelarAjA... ituchoodarA..

I vennela sAkShigA yugAlAgipOni I snaehaM jaMtagA jagAlaelukOnI
nI kannulapApagA kalalo AdukOni nI kaugili nIdalO sadhAsAgipOni
prapaMchAla aMchuludhAti prayANiMchipOnI dhigaMthAla KotaludhAti pravaeshiMchanI
gathajanmanae brathikiMchanI praNayAlalO shruthipeMchanI

nelarAjA... ituchoodarA.. navarOjA therathIyavA...
ulukaelarA kulukaelarA valarAjA javanAlatho jaripiMchavae jathapUjA
nelarAjA... ituchoodarA.. navarOjA therathIyavA...