Showing posts with label raj-koti. Show all posts
Showing posts with label raj-koti. Show all posts

Saturday, May 30, 2026

Vanajallu gillutunte [వానజల్లు గిల్లుతుంటే ఎట్టాగమ్మా] - Yamudiki mogudu

Title :Vanajallu gillutunte
Movie:Yamudiki Mogudu
Singers:S.P. Balasubramanyam గారు,  S. Janaki గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Raj-Koti గారు
Director:Raviraja Pinisetty గారు

వానజల్లు గిల్లుతుంటే ఎట్టాగమ్మా, నీటిముళ్ళే గుచ్చుకుంటే ఎట్టాగమ్మా 

సన్న తొడిమంటి నడుముందిలే లయలేచూసి లాలించుకో..

ఓ..వానజల్లు గిల్లుడింక తప్పదమ్మా వొంటిమొగ్గా విచ్చుకోకా తప్పదమ్మా 

చితచితలాడు ఈ చిందులో జతులాడాలి జతచేరుకో ..

ఓ..వానజల్లు గిల్లుతుంటే ఎట్టాగమ్మా


వానవిల్లు చీరచాటు వన్నెలేరుకో వద్దులేదు నా భాషలో 

మబ్బుచాటు చందమామ సారెపెట్టుకో హద్దులేదు ఈ హాయిలో

కోడె ఊపిరే తాకితే ఈడు ఆవిరే ఆరదా..

కోకగాలులే హోయ్ సోకితే కోరికన్నదే రేగదా  

వడగట్టేసి బిడియాలనే వొడిచేరాను వాటేసుకో..

వానజల్లు గిల్లుడింక తప్పదమ్మా .. నీటిముళ్ళే గుచ్చుకుంటే ఎట్టాగమ్మా 


అందమంత ఝల్లుమంటే అడ్డుతాకునా..చీరకట్టు తానాగునా..

పాలపుంత ఎల్లువైతే పొంగుదాగునా జారుపైట తానాగునా..

కొత్తకోణమే ఎక్కడో పూలబాణమై తాకగా 

చల్లగాలిలో సన్నగా కూనిరాగమే సాగదా 

తొడకొట్టేసి జడివానకే గొడుగేసాను తలదాచుకో.. 


వానజల్లు గిల్లుతుంటే ఎట్టాగమ్మా, నీటిముళ్ళే గుచ్చుకుంటే ఎట్టాగమ్మా 

చితచితలాడు ఈ చిందులో జతులాడాలి జతచేరుకో ..

ఓ.. 

Andam Hindolam [అందం హిందోళం అధరం తాంబూలం] - Yamudiki Mogudu

Title :Andam hindolam
Movie:Yamudiki Mogudu
Singers:S.P. Balasubramanyam గారు,  P. Suseela గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Raj-Koti గారు
Director:Raviraja Pinisetty గారు

అందం హిందోళం అధరం తాంబూలం

అసలే చలికాలం తగిలే సుమబాణం 

సంధ్యారాగాలెన్నో పెదవుల దాగినవేళ

వొళ్ళో మెత్తని మన్మధ ఒత్తిడి సాగిన వేళ 

అందనిది అందాల నిది అందగనే సందేళకది

నా శృతి మించెను నీ లయ పెంచెను లే .. హ 

అందం హిందోళం అధరం తాంబూలం

అసలే చలికాలం తగిలే సుమబాణం 


చలిలో దుప్పటికెత్తిన ముద్దుల పంటలలో 

తొలిగా ముచ్చెమటారెను ముచ్చెలి గుంటలలో 

గుమ్మెత్తే కొమ్మమీద గుమ్మళ్ళే కాయగా

పైటమ్మే మానుకుంది పరువాలే దాయగా 

ఉసిగొలిపే రుచితెలిపే తొలివలపే హా

మొటిమలపై మొగమెరుపై జతకలిపే హా

తీయ్యనిది తెర తీయ్యనిది తీరా నీ చేజిక్కినది  

మొగ్గలు విచ్చెను బుగ్గలు పిండగనే.. హా

అందం హిందోళం.. అధరం తాంబూలం..

అసలే చలికాలం.. తగిలే సుమబాణం..


వలపే హత్తుకుపోయిన కౌగిలి అంచులలో 

వయసే జివ్వున లాగిన వెన్నెల మంచులలో 

గిచ్చుళ్ళ వీణమీద కృతులెన్నో పాడగా 

చిచ్చుళ్ళ హాయిమీద నిదరంతా మాయగా 

తొలిఉడూకే ఒడిదుడుకై చలి చినుకై హా.. 

పెనవేసి పెదవడిగే ప్రేమలతో హేయ్

ఇచ్చినది కడునచ్చినది రేపంటే నను గిచ్చినది 

అక్కరకొచ్చిన చక్కని సోయగమే హే 


అందం హిందోళం అధరం తాంబూలం

అసలే చలికాలం తగిలే సుమబాణం 

సంధ్యారాగాలెన్నో పెదవుల దాగినవేళ

వొళ్ళో మెత్తని మన్మధ ఒత్తిడి సాగిన వేళ 

అందనిది అందాల నిది అందగనే సందేళకది

నా శృతి మించెను నీ లయ పెంచెను లే .. హ   

Ekku Bandekku mava [ఎక్కు బండెక్కు మావ ఎక్కి లాగించు మావ] - Yamudiki Mogudu

Title :Ekku bandekku mava
Movie:Yamudiki Mogudu
Singers:Nagur babau (mano) గారు,  P. Suseela గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Raj-Koti గారు
Director:Raviraja Pinisetty గారు

ఎక్కు బండెక్కు మావ ఎక్కి లాగించు మావ చుక్క చూరెక్కిపోయే అయ్యో రామా

గువ్వ గూడెక్కె మావ గుండే వేడెక్కె మావ గూట్లో చాటుంది రారా అయ్యో రామా 

ఇదిగున్నది ఈడొచ్చాకా అది ఆగదు మనసిచ్చాకా 

నేను రమ్మంటే విందుకు మోమాటమెందుకు అందగాడా 

లేచి రమ్మంటే ముందుకు జున్నంటి ముద్దుకు చంటివాడా 

ఎక్కు బండెక్కు మావ ఎక్కి లాగించు మావ చుక్క చూరెక్కిపోయే అయ్యో  రామా 


కన్నే కొట్టేసి చూడు చెయ్యే పట్టేసి చూడు ఘాటుగా కాస్త ఘాటుగా 

నన్నే చుట్టేసి చూడు చుట్టుకొలతెంతో చూడు చాటుగా చెట్టు చాటుగా 

ఊళ్ళో పాపిష్ఠి కళ్ళు చేలో పాపిష్ఠి ముళ్ళు వొళ్ళంత గుచ్చుకోవా

నాకే ఇచ్చేసి వొళ్ళు నాలో కట్టేసి ఇల్లు రేయంత రెచ్చిపోకా 

నీ మగసిరితోటే బేరం నా సొగసే నీకిక లాభం 

గుత్తి వంకాయ కూరలా గుమ్మెత్తి పోయెరా వన్నెలాడి 

కొత్త నాటావకాయలా చిర్రెత్తినప్పుడే నువ్వు జోడీ..

ఎక్కు బండెక్కు మావ ఎక్కి లాగించు మావ చుక్క చూరెక్కిపోయే అయ్యో 

గువ్వ గూడెక్కె మావ గుండే వేడెక్కె మావ గూట్లో చాటుంది రారా అయ్యో రామా 


రవ్వ లడ్డెట్టుకుంట రాత్రి ముద్దెట్టుకుంట నేర్పవా దారి చూపవా

ఈడే తెడ్డేసుకుంటా ఈదీ బొడ్డందుకుంటా తగ్గవా చేత చిక్కవా 

ఉప్పూకారాలు తిన్న ఊపే నీదగ్గరుంటే నీ జంట కట్టుకోనా 

ఉలకాతాడంటి నిన్ను ముద్దు పోకంటి నీలో ముప్పూట వండుకోనా 

నీ తట్టలు నే దులిపేస్తా నీ పిట్టకు నే వలవేస్తా 

ఎంత బాలాకుమారుడే లీలా వినోదుడే పిల్లవాడు 

అబ్బ నందాకిశోరుడే అందాలచోరుడే చిన్నవాడు 


ఎక్కు బండెక్కు మావ ఎక్కి లాగించు మావ చుక్క చూరెక్కిపోయే అయ్యో రామా

గువ్వ గూడెక్కె భామ గుండే వేడెక్కె భామ గూట్లో రూపాయి బిళ్ళ నాదే భామా

ఇదిగున్నది ఈడొచ్చాకా అది ఆగదు మనసిచ్చాకా 

నిను రమ్మంటే విందుకు మోమాటమెందుకు అందగాడా 

లేచి రమ్మంటే ముందుకు వచ్చాను అందుకు ముద్దులాడా 

Saturday, April 11, 2026

Ni Navve chalu pubanti [నీ నవ్వేచాలు పూబంతీ చామంతి] - Peddarikam

Title :ni navve chalu 
Movie:Peddarikam
Singers:S.P. Balasubramanyam గారు, K.S. Chitra గారు
Lyricist:Bhuvana chandra గారు
Composer:Raj-Koti గారు
Director:A.M. Rathnam గారు

నీ నవ్వేచాలు పూబంతీ చామంతి, ప్రేమించా నిన్ను వాసంతీ మాలతి

ఆ మాటే చాలు నెలవంకా రా ఇక, ప్రేమిస్తా నిన్ను సందేహం లేదిక 

విలాసాల దారికాసా సరాగాల గాలమేసా 

కులాశాల పూలు కోసా వయ్యారాల మాల వేసా 

మరో నవ్వు రువ్వరాదటే ..

నీ నవ్వేచాలు పూబంతీ చామంతి, ప్రేమించా నిన్ను వాసంతీ మాలతి


మల్లెపూల మంచమేసి హుషారించనా, జమాయించి జాజిమొగ్గ నిషాచూడనా

తెల్లచీర టెక్కులేవో చెలాయించనా, విర్రవీగు కుర్రవాణ్ణి నిభాయించనా 

అతివకు ఆత్రము తగదటగా, తుంటరి చేతులు విడువవుగ మనసుపడే పడుచు ఒడి

నీ నవ్వేచాలు పూబంతీ చామంతి, ప్రేమించా నిన్ను వాసంతీ మాలతి


కోరమీసమున్నవాడి కసేచూడనా, దోర దోర జామపళ్ళ రుచే చూపనా 

కొంగుచాటు హంగులన్ని పటాయించనా, రెచ్చి రేగు కుర్రదాన్ని ఘుమాయించనా 

పరువము పరుపుల పరమటగా, వయసున సరసము సులువటగా తధిగిణతోం మొదలెడదాం 


నీ నవ్వేచాలు పూబంతీ చామంతి, ప్రేమించా నిన్ను వాసంతీ మాలతి

విలాసాల దారికాసా సరాగాల గాలమేసా 

కులాశాల పూలు కోసా వయ్యారాల మాల వేసా 

మరో నవ్వు రువ్వరాదటే ..

నీ నవ్వేచాలు పూబంతీ చామంతి, ఆ మాటే చాలు నెలవంకా రా ఇక 

Saturday, March 7, 2026

Kannepetta ro kannukottaro [కన్నెపెట్టరో కన్నుకొట్టరో ] - Hello Brother

Song Name :Kannepetta ro kannukotta ro
Movie:Hello Brother
Singers:S.P. Balasubramanyam garu
Lyricist:Bhuvana Chandra garu
Composer:Raj - Koti garu
DirectorE.V.V Satyanarayana garu

అట్టా ఎర్రిమొహాలేస్కోని సూత్తారేంట్రా... వాయించండీ ...

కన్నెపెట్టరో కన్నుకొట్టరో ఓ..ఓహో..

ఓయ్..పాలపిట్టరో పైటపట్టరో.. ఓ..ఓహో..

అరే అరే అరే

కన్నెపెట్టరో కన్నుకొట్టరో ఓ..ఓహో.. పాలపిట్టరో పైటపట్టరో.. ఓ..ఓహో..

గుట్టుగుట్టుగా జట్టుకట్టరో జంటచేరితే గంటకొట్టరో 

ఒట్టూ గిట్టూ పెట్టావంటే ఊరుకోను, బెట్టే కట్టి ఉట్టేకొట్టి తీరతాను 

ఓ..ఓ..ఓహో..   ఓ..ఓ..ఓహో..


చూపు చూపుకొక చిటికెల మేళం చూసిపెట్టనా చిట్టెమ్మో

ఊపు ఊపుకొక తకధిమి తాళం వేసిపెట్టనా చెప్పమ్మో

అదిరిపడిన కుడిఎడమల నడుమున ఉడుకువయసు ముడిపెట్టుకోనా 

అసలు సిసలు లవ్ కిటుకులు తెలిసిన పడుచుపనులు మొదలెట్టుకోనా 

అదిరే సరుకు ముదిరే వరకు 

అటో ఇటో ఎటో ఎటో పడి పడి, కలేయ్యనా అదో ఇదో కలబడి 

ఓ..ఓ..ఓహో..   ఓ..ఓ..ఓహో..

కన్నెపెట్టరో కన్నుకొట్టరో ఓ..ఓహో..

ఓయ్..పాలపిట్టరో పైటపట్టరో.. ఓ..ఓహో..


హేయ్, గవ్వ తిరగబడి గలగలమంటే గువ్వ గుండెలో రిం ఝిం ఝిం

వేడి వేడి ఒడి చెడుగుడు అంటే సోకులాడి పని రం పం పం 

మిడిసిపడిన తడి తళుకుల మెరుపులు మెరిసి మెరిసి పని పట్టమంటే  

మతులుచెడిన చెలి జిగిబిగి బిగువులు అరిచి అరిచి మొరపెట్టుకుంటే 

పనిలో పనిగా ఒడిలో పడనా 

చలో చలో ఎకాఎకి చం చం కలేసుకో ప్రియా ప్రియా కం కం 

ఓ..ఓ..ఓహో..   ఓ..ఓ..ఓహో..

కన్నెపెట్టరో కన్నుకొట్టరో ఓ..ఓహో..

ఓయ్..పాలపిట్టరో పైటపట్టరో.. ఓ..ఓహో..

గుట్టుగుట్టుగా జట్టుకట్టరో జంటచేరితే గంటకొట్టరో 

ఒట్టూ గిట్టూ పెట్టావంటే ఊరుకోను, బెట్టే కట్టి ఉట్టేకొట్టి తీరతాను  

Monday, January 26, 2026

Love me my hero [లవ్ మీ మైహీరో మజాగా ముద్దిస్తారారో] - Rowdy Alludu

Title :Love me my hero
Movie:Rowdy Alludu
Singers:S.P. Balasubramanyam గారు, K.S. Chitra గారు
Lyricist:Bhuvanachandra గారు
Composer:Raj-Koti గారు
Director:K. Raghavendra Rao గారు

లవ్ మీ మైహీరో మజాగా ముద్దిస్తారారో ఖుషీగా కౌగిట్లో మారో 

ఓకే మైలేడీ అలాగే కానీ అమ్మాడీ చలో చూసేస్తా నీ వేడీ

తనువే బహుమానం ముదిరే చలికాలం 

లవ్ మీ మైహీరో మజాగా ముద్దిస్తారారో ఖుషీగా కౌగిట్లో మారో 

అరె.. ఓకే మైలేడీ అలాగే కానీ అమ్మాడీ చలో చూసేస్తా నీ వేడీ హా 


హో.. ఒకటో ముద్దు వయస్సుకిచ్చేసా, రెండో ముద్దు రౌండప్‌చేసేసా 

మూడో ముద్దు మరింత లాగించేయ్, నాల్గో ముద్దు నిషాలు చూపించేయ్

పనిలో పని పదవే మరి, ప్రాక్టీసు మొదలెడదాం 

లవ్ మీ మైహీరో మజాగా ముద్దిస్తారారో ఖుషీగా కౌగిట్లో మారో 


ఐదో ముద్దు ఇక్కడ పెట్టాలి, ఆరో ముద్దు అక్కర తీర్చాలి

ఏడో ముద్దు ఏదో ఇమ్మంటే, ఎమ్దో ముద్దు ఇచ్చేదిస్తుంటే 

లెక్కెందుకు పద ముందుకు ముద్దుల్లో ముంచేందుకు 

ఓకే మైలేడీ అలాగే కానీ అమ్మాడీ చలో చూసేస్తా నీ వేడీ


లవ్ మీ మైహీరో మజాగా ముద్దిస్తారారో ఖుషీగా కౌగిట్లో మారో 

ముదిరే చలికాలం తనువే బహుమానం .. ఆహా.. 

Saturday, January 24, 2026

Hey Paapa [హేయ్ పాపా] - Trinetrudu

Title :Hey paapa
Movie:Trinetrudu
Singers:S.P. Balasubramanyam గారు
Lyricist:Veturi Sundararamamurthy గారు
Composer:Raj-Koti గారు
Director:A. Kodandarami reddy గారు

we are the dance future in the place to be 

we got face the one zip zap zip then face it up

if you are ready, are you ready, everybody get ready 

introducing the fastest, greatest dancer of world 


keep you guys beat, phase out phase out 

హేయ్ పాపా పాప్ప్ పా పాప ఓహ్ పాపా పాప్ప్ పా పాప రీ పాపా పాప్ప్ పా పాపా

టినేజీ గర్ళ్స్ నా జట్టు, కాలేజీ గయ్స్ నా పట్టు, బ్రేకేస్తే షేకు నీకే లేరా 

నా ఫ్యాన్సూ లేతసొగసరి లేడీసు, నన్ను తలుచుకు రోమాన్సూ చెయ్యగలిగిన గడసరి యువకులు


బేవర్లీ కొండల్లో గజగజ, హాలీవుడ్ తారల్లో గిజగిజ, డిస్నీల్యాండ్ గుండెల్లో గడబిడగా 

బేవర్లీ కొండల్లో గజగజ, హాలీవుడ్ తారల్లో గిజగిజ, డిస్నీల్యాండ్ గుండెల్లో గడబిడగా 

పాపలంత మెచ్చుకున్న పట్టుచూడరో, ఫ్రాకులోని సోకుచూడరో 

వొళ్ళుదాటి తుళ్ళిపడ్డ వొంపుచూడరో, జంపులాడి సొంపుచూడరో 

థ్రిల్లురో వొళ్ళుగిల్లురో గుండెఝల్లురో 

హేయ్ పాపా పాప్ప్ పా పాప ఓహ్ పాపా పాప్ప్ పా పాప రీ పాపా పాప్ప్ పా పాపా

టినేజీ గర్ళ్స్ నా జట్టు, కాలేజీ గయ్స్ నా పట్టు, బ్రేకేస్తే షేకు నీకే లేరా 


సిల్వర్‌స్క్రీన్ శృంగార మధురిమ, ఎవర్‌గ్రీన్ పరువాల ఘుమ ఘుమ, సోమర్‌సాల్ట్ నాట్యాల రిమ రిమ లో

సిల్వర్‌స్క్రీన్ శృంగార మధురిమ, ఎవర్‌గ్రీన్ పరువాల ఘుమ ఘుమ, సోమర్‌సాల్ట్ నాట్యాల రిమ రిమ లో

ఈజ్ చూడు ఫోజ్ చూడు ఈవ్‌టిజ్‌లో, మొగ్గవిచ్చుకున్న మోజులో 

చూపు చూడు ఊపుచూడు టాపుచూదరో జీన్సుకున్న ఛాన్సు చూడరో 

అల్లరో నాగవల్లరో చూసివెళ్ళరో 


టినేజీ గర్ళ్స్ నా జట్టు, కాలేజీ గయ్స్ నా పట్టు, బ్రేకేస్తే షేకు నీకే లేరా 

నా ఫ్యాన్సూ లేతసొగసరి లేడీసు, నన్ను తలుచుకు రోమాన్సూ చెయ్యగలిగిన గడసరి యువకులు 


Saturday, December 27, 2025

era roi surinni jabilli [ఏరా రోయ్... సూరీణ్ణి జాబిల్లి వాటేసుకుంది ] - Raja Vikramarka

Title :surinni jabilli
Movie:Raja Vikramarka
Singers:S.P. Bala subramanyam గారు
Lyricist:Veturi Sundara Ramayya garu గారు
Composer:Raj-Koti గారు
Director:Ravi Raja Pinisetty గారు

ఏరా రోయ్... సూరీణ్ణి జాబిల్లి వాటేసుకుంది 

ఏరా రోయ్... మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది 

ఏరా రోయ్... సూరీణ్ణి జాబిల్లి వాటేసుకుంది 

ఏరా రోయ్... మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది 

తాగినోళ్ళా తందనాలు, వాగకుంటే వందనాలు 

తైతక్కలాడేటి రేచుక్కనే చూసి కైపెక్కి పోతారు.. 

ఏరా రోయ్... సూరీణ్ణి జాబిల్లి వాటేసుకుంది 

ఏరా రోయ్... మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది 


పల్లవొచ్చే నాగొంతులో, వెల్లువొచ్చే నా గుండెలో 

పుట్టుకొచ్చే ఎన్నెన్ని రాగాలో..

మందుకొట్టి వొళ్ళెందుకో, చిందులేసే తుళ్ళింతలో 

కైపులోన ఎన్నెన్ని కావ్యాలో..

రేపన్నదే లేదని ఉమరు ఖయ్యాము అన్నాడురా 

నేడన్నదే నీదని గుడిపాటి చలమయ్య చెప్పాడురా 

రసవీరా కసితీరా ఏడింటి చేపల్లె గాలింటి గువ్వల్లె నే తేలిపోతారోయ్ 

ఏరా రోయ్... సూరీణ్ణి జాబిల్లి వాటేసుకుంది 

ఏరా రోయ్... మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది 


దేవదాసు తాగాడురా వేదమేదో చెప్పాడురా, విస్వదాభి రాముణ్ణి నేనేరోయ్..

వొంటికేమో ఈడొచ్చెరా ఇంటికొస్తే తోడేదిరా, పుత్తడంటి పూర్ణమ్మ యాడుందో..

శృంగార శ్రీనాథుడు ఎన్నెన్నో సీసాలు చెప్పాడురా

సంసార శ్రీనాథుడై ఎన్నెన్నో వ్యాసాలు రాస్తానురా 

ప్రియురాలా జవరాలా నీచేపకన్నల్లే నీకంటిపాపల్లే నేనుండిపోతాలే 


ఏరా రోయ్... సూరీణ్ణి జాబిల్లి వాటేసుకుంది 

ఏరా రోయ్... మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది 

తాగినోళ్ళా తందనాలు, వాగకుంటే వందనాలు 

తైతక్కలాడేటి రేచుక్కనే చూసి కైపెక్కి పోతారు.. 

ఏరా రోయ్... సూరీణ్ణి జాబిల్లి వాటేసుకుంది 

ఏరా రోయ్... మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది 

ఏరా రోయ్...  

Monday, December 22, 2025

Padaharella vayasu [పదహారేళ్ళ వయసు, పడి పడి లేచె మనసు] - Lankeswarudu

Title :padaharella vayasu
Movie:Lankeswarudu
Singers:S.P. Balasubramanyam గారు, S. Janaki గారు
Lyricist:Dasari Narayana Rao గారు
Composer:Raj- Koti గారు
Director:Dasari Narayana Rao గారు

clap clap.. 

clap to clap - hand to hands

clap to clap - boys and girls

hand to hand - girls and boys

clap clap clap clap clap clap clap clap clap clap.. 


పదహారేళ్ళ వయసు, పడి పడి లేచె మనసు 

పదహారేళ్ళ వయసు, పడి పడి లేచె మనసు 

పట్టుకో పట్టుకో కళ్ళమేసి పట్టుకో, 

కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో

పదహారేళ్ళ వయసు, పడి పడి లేచె మనసు ...

everybody పదహారేళ్ళ వయసు that's good

పడి పడి లేచె మనసు 

పట్టుకో పట్టుకో కళ్ళమేసి పట్టుకో, 

కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో


రెండు రెండు కళ్ళు, చూడ చూడ వొళ్ళు

వేడి వేడి సెగలూ..ప్రేమకోరు పొగలు

చూడ గుండెఘొల్లు, లోన వానజల్లు

లేనిపోను దిగులు రేయిపగలు రగులు

ఆడపిల్ల సబ్బుబిళ్ళ రాసుకుంటే.. 

కన్నెపిల్ల అగ్గిపుల్ల రాజుకుంటే..

ఓహ్.. ఆడపిల్ల సబ్బుబిళ్ళ కన్నెపిల్ల అగ్గిపుల్ల, రాసుకుంటే రాజుకుంటే 

హెయ్.. ఒహేయ్..ఎహాయ్..

పట్టుకో పట్టుకో కళ్ళమేసి పట్టుకో, 

కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో

పదహారేళ్ళ వయసు, పడి పడి లేచె మనసు ...

common girls  పదహారేళ్ళ వయసు, పడి పడి లేచె మనసు ...


పిల్లదాని ఊపు, కుర్రకారు ఆపు 

పైన చూడ పొగరు, లోనచూడ వగరు 

పిల్లకాదు పిడుగు, గుండెకోసి అడుగు

దాచలేని ఉడూకు, దోచుకోని సరుకు 

అందమైన ఆడాపిల్ల పట్టుకుంటే, చూడలేక చందమామ తప్పుకుంటే 

ఓహ్.. అందమైన ఆడాపిల్ల చూడలేక చందమామ, పట్టుకుంటే తప్పుకుంటే 

హెయ్.. ఒహేయ్..ఎహాయ్..

పట్టుకో పట్టుకో కళ్ళమేసి పట్టుకో, 

కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో

పదహారేళ్ళ వయసు, పడి పడి లేచె మనసు ...

common girls  పదహారేళ్ళ వయసు, పడి పడి లేచె మనసు ...

పట్టుకో పట్టుకో కళ్ళమేసి పట్టుకో, 

కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో 

Saturday, November 22, 2025

Narmada nadi teeramlo [నర్మదా నదితీరంలో] - Rathasarathi

Title :Narmada nadi teeramlo
Movie:Rathasarathi
Singers:S.P. Balasubramanyam గారు, K.S. Chitra గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Raj Koti గారు
Director:Sarath గారు

నర్మదా నదితీరంలో, నవమన్మధ అనుకుంట

నర్మదా నదితీరంలో, నవమన్మధ అనుకుంట

గౌతమీ నదితీరంలో, సుఖవీణలో చలిగంట

కన్నులా గీటుకో, గీటుతో గిచ్చుకో 

చూపులా చుట్టుకో ఊపులో..

నర్మదా నదితీరంలో, నవమన్మధ అనుకుంట

గౌతమీ నదితీరంలో, సుఖవీణలో చలిగంట


ఎగుడు దిగుడు ఎదలోన మొగలిపొదలు రగిలేనే

పగలె మసక పడుతుంటే పెదవి పెదవినడిగేనే 

తోయకే మల్లెలా మాయలో మత్తులా 

చేయకూ చిత్తిలా అందనీ ఎత్తులా 

సొంపుకో సొగసుని చూపి, దింపకే దిగులు సఖి

చెపకో చెరుకుల ముద్దు పంపర పదసరుకి

ప్రేమలో ఏదటో ఏదిటో....

నర్మదా నదితీరంలో, నవమన్మధ అనుకుంట

గౌతమీ నదితీరంలో, సుఖవీణలో చలిగంట


చిలిపి చిలిపి కలలెన్నో, నెమలి కనులు నెమరేసే 

వదులు వదులు వలదంటే చిగురు వలపు ముదరేసే 

పాడకే కోకిలా ఈడులో కోడిలా 

ఆడితే షోకిలా వేడిలో వెన్నెలా 

సందెకో చలి అటువచ్చీ అందమే వణికెనుగా 

పొద్దుకో పొడుపులు వచ్చీ నిద్దరే చిరిగెనులే 

ప్రేమలో ఏవిటో ఈడిటో..

నర్మదా నదితీరంలో, నవమన్మధ అనుకుంట

గౌతమీ నదితీరంలో, సుఖవీణలో చలిగంట

కన్నులా గీటుకో, గీటుతో గిచ్చుకో 

చూపులా చుట్టుకో ఊపులో.. 

Saturday, September 13, 2025

Jivvumani Kondagali [జివ్వుమని కొండగాలి ] - Lankeswarudu

Title :Jivvumani kondagali
Movie:Lankeswarudu
Singers:Mano (Nagur babu) గారు, S. Janaki గారు
Lyricist:Dasari Narayana Rao గారు
Composer:Raj- Koti గారు
Director:Dasari Narayana Rao గారు


జివ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతుంది, వెచ్చని కోరిక రగిలిందిలే

నీవే నా ప్రేయసివే, నీకేలే అందుకో ప్రేమగీతం 

కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది , తియ్యని కానుక దొరికిందిలే 

నీవేనా ప్రేమవులే, నీకేలే అందుకో ప్రేమగీతం 

జివ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతుంది 


ఒంపుల్లో సొంపుల్లో అందముంది, కసి చూపుల్లో ఊపుల్లో పందెముంది

ఒంపుల్లో సొంపుల్లో అందముంది, కసి చూపుల్లో ఊపుల్లో పందెముంది

కాశ్మీరకొండల్లో అందాలకే, కొత్త అందాలు ఇచ్చావో 

కాశ్మీరవాగుల్లో పరుగులకే, కొత్త అడుగుల్ని నేర్పావో

నేనే నిను కోరి చేరి వాలిపోయాలి

కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది 


మంచల్లే కరగాలి మురిపాలు, సెలయేరల్లే ఉరకాలి యెవ్వనాలు

మంచల్లే కరగాలి మురిపాలు, సెలయేరల్లే ఉరకాలి యెవ్వనాలు

కొమ్మల్లో పూలన్ని కానుకగా మన ముందుంచే పూలగాలి

పూవుల్లో దాగున్న అందాలనే మన ముందుంచే గంధాలుగా

నేనే నిను కోరి చేరి వాలిపోవాలి 

 

జివ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతుంది

కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది 

Monday, January 27, 2025

Priya Ragale gundelona - ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళా [Hello Brother]

Song Name :Priya ragale gundelona
Movie:Hello Brother
Singers:S.P. Balasubramanyam garu, K.S. Chitra garu
Lyricist:Bhuvana Chandra garu
Composer:Raj - Koti garu
DirectorE.V.V Satyanarayana garu


ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళా..

ప్రియగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళా

చేరాలి సొగసుల తీరం సాగాలి తకధిమి తాళం.

తగ్గాలి తనువుల దూరం తీరాలి వయసుల తాపం 

ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళా..

ప్రియగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళా


అల్లరి కోయిల పాడిన పల్లవి స్వరాలలో నీవుంటే పదాలలో నేనుంట

వేకువపూచిన తొలి తొలి గీతిక ప్రియా ప్రియా నీవైతే శృతీ లయా నేనౌతా

కలకాలం కౌగిలై నినేచేరుకోని, కనురెప్పల నీడలో కలే ఒదిగిపోనీ 

ఓ ప్రియా... ఓ..దరిచేరితే దాచుకోనా, తొలిప్రేమలే దోచుకోనా

ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళా..

ప్రియగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళా


సవ్వడి చేయని యెవ్వనవీణలు  అలా అలా సవరించు పదే పదే పలికించు 

వయసులు కోరిన వెన్నెల మధువులు సఖీ చెలీ అందించు సుఖాలలో తేలించు 

పెదవులతొ కమ్మనీ కధే రాసుకోన 

వొడిచేరి వెచ్చగా చలే కాసుకోన 

ఓ ప్రియా ఓ.. పరువాలనే పంచుకోనీ, పడుచాటలే సాగిపోనీ 


ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళా..

ప్రియగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళా

చేరాలి సొగసుల తీరం సాగాలి తకధిమి తాళం. 

తగ్గాలి తనువుల దూరం తీరాలి వయసుల తాపం 

ఓ.. ఓ.. ఓ...


Friday, October 18, 2024

సమరం సమరం పొంగే రుధిరం (Karthavyam)

Song Name :Samaram Samaram
Movie:Karthavyam
Singers:S.P. BalaSubramanyam garu
Lyricist:Veturi Sundara rama murthy garu
Composer:Raj - Koti garu
DirectorMohan Gandhi garu

సమరం సమరం పొంగే రుధిరం

కృషికే విజయం కాదు శిథిలం

నీకర్తవ్యం నీకర్తవ్యం నీకర్తవ్యం 

ఆశయానికిది ఆరంభం ఆత్మసాధనకు అధ్యాయం 

నీ ఊరుకు సాగిన తూరుపులో, వెలగనున్నదీ ఒక ఉదయం  

నిన్నటి చీకటి నిట్టూరుపులో నివురైపోయెనులే విలయం  

సమరం సమరం పొంగే రుధిరం

కృషికే విజయం కాదు శిథిలం


పెట్టుకున్నగురి ధృవతార ఆకశానికది పొలిమేరా   

పెట్టుకున్నగురి ధృవతార ఆకశానికది పొలిమేరా 

జరిగే జీవనవ్యాయామంలో  మరిగేకన్నుల భాష్పజలంలో  

రక్తం పొంగే నీగాయం అరుణవిప్లవాక్షరగేయం 

సమరం సమరం పొంగే రుధిరం 

కృషికే విజయం కాదు శిథిలం


నిరాశవద్దు నిస్పృహవద్దు నిశ్చేతనమే కావద్దు 

కర్మయోగికి కాళరాత్రులలో భయమేలేదు లేదు 

సహకరించని అంగాంగాలను సమిధలుగా ఇక ప్రేల్చు 

అగ్నిహోత్రివై యజ్ఞహోతవై యజ్ఞకర్తవై యజ్ఞభోక్తవై   

నీచకీచకపు కామమేచకపు భ్రష్టులనే ఇలరల్చు 

రాక్షసాధనుల రాక్షసత్వముల పాలననే పరిమార్చు  

సమరం సమరం పొంగే రుధిరం

కృషికే విజయం కాదు శిథిలం

ఆశయానికిది ఆరంభం ఆత్మసాధనకు అధ్యాయం 

నీ ఊరుకు సాగిన తూరుపులో, వెలగనున్నదీ ఒక ఉదయం  

నిన్నటి చీకటి నిట్టూరుపులో నివురైపోయెనులే విలయం  

సమరం సమరం పొంగే రుధిరం

కృషికే విజయం కాదు శిథిలం

నీకర్తవ్యం నీకర్తవ్యం నీకర్తవ్యం  


Monday, October 7, 2024

స్వాతిలో ముత్యమంత [Bangaru bullodu]

Song Name :Swatilo mutyamanta
Movie:Bangaru Bullodu
Singers:S.P. Balasubramanyam garu, K.S. Chitra Garu
Lyricist:Veturi Sundara rama murthy garu
Composer:Raj-Koti garu
DirectorRaviraja Pinisetty garu

వాన వాన వచ్చేనంట వాగు వంక మెచ్చేనంట  
తీగ డొంక కదిలేనంట  తట్టా బుట్ట తడిసేనంట
ఎండా వానా పెళ్ళాడంగ కోండా కోనా నీళ్ళాడంగ
కృష్ణా గోదరమ్మ కలిసి పరవళ్ళెత్తి పరుగెత్తంగ
వాన వాన వచ్చేనంట వాగు వంక మెచ్చేనంట  

స్వాతిలో ముత్యమంత, ముద్దులా ముట్టుకుంది సందె వానా
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోనా
అల్లో మల్లో అందాలెన్నో యాలో యాల  
స్వాతిలో ముత్యమంత, ముద్దులా ముట్టుకుంది సందె వానా
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోనా

తాకిడి పెదవుల మీగడ తరకలు కరిగే వేళ
మేనక మెరుపులు ఊర్వశి ఉరుములు కలిసేనమ్మా
కోకకు దరువులు రైకకు బిగువులు పెరిగే వేళ
శ్రావణ సరిగమ యెవ్వన ఘుమఘుమలయ నీదమ్మా
వానా వానా వల్లపా వాటేస్తేనే తప్పా
సిగ్గు యెగ్గు చెల్లప్పా కాదయ్యో నీ గొప్పా
నీలో మేఘం నాలో దాహం యాలో యాల
స్వాతిలో ముత్యమంత, ముద్దులా ముట్టుకుంది సందె వానా
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోనా
 
వాన వాన వచ్చేనంట వాగు వంక మెచ్చేనంట  
తీగ డొంక కదిలేనంట  తట్టా బుట్ట తడిసేనంట
ఎండా వానా పెళ్ళాడంగ కోండా కోనా నీళ్ళాడంగ
కృష్ణా గోదరమ్మ కలిసి పరవళ్ళెత్తి పరుగెత్తంగ

తుమ్మెద చురకలు తేనెల మరకలు కడిగే వానా
తిమ్మిరి నడుమున కొమ్మల తొడిమను వొణికే వాన
జన్మకు దొరకని మన్మధ తళుకులు ముదిరే వానా
చాలని గొడుగున నాలుగు ఆదుగుల నటనే వాన
వానల్లోన సంపెంగా వొళ్ళంత ఓ బెంగా
గాలివానా గుళ్ళోనా ముద్దేలే జేగంట
నాలో రూపం నీలో తాపం యాలో యాల


వాన వాన వచ్చేనంట వాగు వంక మెచ్చేనంట  
తీగ డొంక కదిలేనంట  తట్టా బుట్ట తడిసేనంట
ఎండా వానా పెళ్ళాడంగ కోండా కోనా నీళ్ళాడంగ
కృష్ణా గోదరమ్మ కలిసి పరవళ్ళెత్తి పరుగెత్తంగ