Song Name : | Poddunne puttindi chandamaama |
Movie: | Satruvu |
Singers: | Mano garu, K.S. Chitra garu |
Lyricist: | Sirivennela Seetharama sastry garu |
Composer: | Raj-Koti garu |
Director: | Kodi Ramakrishna garu |
పొద్దునే పుట్టింది చందమామ, మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ
మౌనంగా పుట్టావా గీతిక, స్నెహంతో మీటావా మెల్లగా
తొలిపొద్దంటి అందాలు ఈనాడు నిద్దరలేచి ముత్యాల ముగ్గులుపెట్టే వన్నెల వాకిట్లో
పొద్దునే పుట్టింది చందమామ, మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ
ఉగ్గెట్టా పట్టాలో నలుగెట్టా పెట్టాలో లాలెట్టా పోయాలోయమ్మా ఓ రబ్బరుబొమ్మా లాలిచ్చేదెట్టా చెప్పమ్మా
మొగ్గంటీ బుగ్గల్లో అగ్గల్లే సిగ్గొస్తే జాబిల్లిని రప్పించాలయ్యో ఓ ముద్దుల కన్నా కౌగిట్లో జోకొట్టాలయ్యో
నా కంటిపాపల్లో ఉయ్యాల వెయ్యాలా, ఈ కొంటె పాపాయికి
ముందు మునుపూ లేని ఈ పొద్దటి వెన్నెల ఆవిరిలో, ముద్దు మురిపాలన్ని పండించేదెట్టాగో
ఇక ఏ పేరు పెట్టాలో ఇన్నాళ్ళు ఎరగని ఈ కొంటె చక్కిలిగింతల ఉక్కిరిబిక్కిరికి
పొద్దునే పుట్టింది చందమామ, మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ
నీకోసం పుట్టాను నిలువెల్లా పూసాను గుండెల్లో గూడే కట్టాను నా బంగరుగువ్వ గుమ్మంలో చూపులు పెట్టాను
నీ నేస్తం కట్టాను నీ దారే పట్టాను కళ్ళల్లో కాపురముంటాను నా పచ్చని కొమ్మ పొమ్మన్నా పక్కకి పోలేను
శృంగార స్నేహాల సంకెళ్ళు వెయ్యాలా, చిన్నారి చిందాటతో
ఉరికే గోదారంటి నా ఉడుకూ దుడుకూ తగ్గించి, కొంగున కట్టేసేనీ కిటుకేదో చెప్పమ్మా
పశి పరువాలు చూస్తుంటే బరువైన కన్నుల్లో పగలేదొ రేయేదో తెలియదులేవయ్యో
పొద్దునే పుట్టింది చందమామ, మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ
మౌనంగా పుట్టావా గీతిక, స్నెహంతో మీటావా మెల్లగా
తొలిపొద్దంటి అందాలు ఈనాడు నిద్దరలేచి ముత్యాల ముగ్గులుపెట్టే వన్నెల వాకిట్లో
No comments:
Post a Comment