Saturday, July 26, 2025

Chiguraku chaatu chilaka [చిగురాకు చాటు చిలక ] - Gudumba Shankar

Song Name :Chiguraku chatu chilaka
Movie:Gudumba Shankar
Singers:S.P. Charan garu, Sujata garu
Lyricist:Sirivennela Seetarama sastry  garu
Composer:Mani Sharma garu
DirectorVeera Shankar garu 

చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా, అలవాటు లేదుగనక మది సులువుగ నమ్మదుగా 

చిగురాకు చాటు చిలక తను నడవద ధీమాగా, అనుకోనిదారి గనక ఈ తికమక తప్పదుగా 

తనుకూడా నాలాగా అనుకుంటే మేలేగా, ఐతే అది తేలనిదే అడుగు పడదుగా

సరికొత్తగ నా వంక, చూస్తుందే చిత్రంగా ఏమైందో స్పష్టంగా బయటపడదుగా

చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా, అలవాటు లేదుగనక మది సులువుగ నమ్మదుగా 

చెప్పకు అంటు చెప్పమంటు చర్చితేలేనా, తప్పనుకుంటు తప్పదంటు తర్కమాగేనా 

సంగతిచూస్తూ జాలివేస్తు కదలలేకున్నా, తేలనిగుట్టు తేనెపట్టు కదపలేకున్నా 

వొణికే నా పెదవుల్లో తొణికే తడిపిలుపేదో, నాకే సరిగా ఇంకా తెలియకున్నదీ 

తనలో తను ఏదేదో గొణిగే ఆ కబురేదో, ఆ వైనం మౌనంలో మునిగివున్నదీ 

చిగురాకు చాటు చిలక తను నడవద ధీమాగా, అనుకోనిదారి గనక ఈ తికమక తప్పదుగా 

ఎక్కడినుంచో మధురగానం మదినిమీటిందీ, ఇక్కడినుంచే నీ ప్రయాణం మొదలు అంటోంది 

గలగల వీచే పిల్లగాలి ఎందుకాగిందీ, కొంపలుముంచే తుఫానొచ్చే సూచనేమో ఇదీ 

వేరే ఎదో లోకం చేరే ఊహలవేగం, ఏదో తియ్యని మైకం  పెంచుతున్నదీ

దారే తెలియని దూరం, తీరే తెలపని తీరం, తనలో కలవరమేదో రేపుతున్నదీ 

చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా, అలవాటు లేదుగనక మది సులువుగ నమ్మదుగా 

చిగురాకు చాటు చిలక తను నడవద ధీమాగా, అనుకోనిదారి గనక ఈ తికమక తప్పదుగా 

తనుకూడా నాలాగా అనుకుంటే మేలేగా, ఐతే అది తేలనిదే అడుగు పడదుగా

సరికొత్తగ నా వంక, చూస్తుందే చిత్రంగా ఏమైందో స్పష్టంగా బయటపడదుగా

చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా, అలవాటు లేదుగనక మది సులువుగ నమ్మదుగా 

No comments:

Post a Comment