Showing posts with label pavankalyan. Show all posts
Showing posts with label pavankalyan. Show all posts

Sunday, May 24, 2026

Naraju gakura ma annaya [నారాజుగాకుర మా అన్నయ్య ] - Jhonny

Title :Naraju gakura ma annayya
Movie:Jhonny
Singers:Ramana Gogula గారు
Lyricist:Mastarji గారు
Composer:Ramana Gogula గారు
Director:Pavan Kalyan గారు

మనిషి పుట్టినాక పుట్టింది మతం, పుట్టి ఆ మనిషినే వెనక్కి నెట్టింది మతం

తల్లి కడుపులోనుండి వెళ్ళినట్టి మనిషి తలచకు రా ఏ చెడ్డకథను  

నారాజుగాకుర మా అన్నయ్య నసీరు అన్నయ్య ముద్దుల కన్నయ్య

హేయ్ మనరోజు మనకుంది మన్నయ్యా 

నారాజుగాకుర మా అన్నయ్య నసీరు అన్నయ్య ముద్దుల కన్నయ్య

అరే మనరోజు మనకుంది మన్నయ్యో

అనువుగాని చోట నువ్ అధికుడన్నమాట అనవద్దునంటనన్న వేమన్నగారి మాట 

వినలేదనువ్వు బేట బంగారుగనుల బాట హేయ్

నారాజుగాకుర మా అన్నయ్య నసీరు అన్నయ్య ముద్దుల కన్నయ్య

అరే మనరోజు మనకుంది మన్నయ్యో

అక్కన్నలు మాదన్నలు తానీషా మంత్రులుగా ఉన్ననాడే రామదాసు రాముని గుడి కట్టెనుగా 

కులీ కుతుబ్‌షాహి ప్రేమ ప్రేయసికి చిహ్నంగా భాగమతికి పేర భాగ్యనగరం నిర్మించెనుగా 

నవాబులు నిర్మించిన నగరములంటూ.. 

నవాబులు నిర్మించిన నగరములంటూ.. కులమతాల గొడవలు మనకెందుకురన్నా 

ఇంకెందుకురన్నా .. హేయ్

నారాజుగాకుర మా అన్నయ్య నసీరు అన్నయ్య ముద్దుల కన్నయ్య

హేయ్ మనరోజు మనకుంది మన్నయ్యా 

విన్నావా సోదరుడా మొన్న నీమ్సు దవఖానలో జరిగినట్టి సంఘటన మానవతకు మచ్చుతునక 

తనచావుతో ముస్లీము మన హిందు సోదరులకి ప్రాణదానమిచ్చిండు తన కిడ్నీలను తీసి 

మనుషులంత ఒక్కటని శాస్త్రమన్నా ... మనుషులంత ఒక్కటని శాస్త్రమన్నా 

మనుషుల్లో సైతాన్లకు పట్టదన్నా ఇది పట్టదన్నా .. హేయ్ 

నారాజుగాకుర మా అన్నయ్య నసీరు అన్నయ్య ముద్దుల కన్నయ్య

హేయ్ మనరోజు మనకుంది మన్నయ్యా 

పీర్ల పండగొచ్చిందా ఊళ్ళల్లో మనవాళ్ళు డప్పుల దరువేసుకుంటు కోలాటలు ఆడతారు 

సదరు పండగొచ్చిందా పటనంలో ప్రతివారు దున్నపోతులాడిస్తు దిల్‌ఖుషీలు చేస్తుంటరు 

ఎవడేమి అంటే మనకేమిటన్నా... ఎవడేమి అంటే మనకేమిటన్నా...

జాషువా విశ్వనరుడు నువ్వేరన్నా .. ఎప్పుడు నువ్వేరన్నా..హేయ్ 

నారాజుగాకుర మా అన్నయ్య నసీరు అన్నయ్య ముద్దుల కన్నయ్య

హేయ్ మనరోజు మనకుంది మన్నయ్యా 

నమ్మొద్దు నమ్మొద్దురన్నో నాయకుని గుమ్మానికురితీస్తాడమ్మో నమ్మినోణ్ణి (2) 

తన బ్రతుకులో వెలుగుకొరకు నాయకుడు మనదీపాలార్పేస్తాడమ్మో నాయకుడు (2) 

మా దేవుడు గొప్పంటాడో నాయకుడు, మా ధర్మం భేషంటాడమ్మో నాయకుడు 

మా గుడిలో మొక్కంటాడమ్మో నాయకుడు, మా ప్రార్థన చెయ్యంటాడమ్మో నాయకుడు 

దేముండ్లానడ్డంగా పెట్టి నాయకుడు దేవుండ్లా దోచేస్తాడమ్మో నాయకుడు 

అధికారం తనపదవి కొరకు నాయకుడు మతకలహం అడ్డేస్తాడమ్మో నాయకుడు 

మతకలహం అడ్డేస్తాడమ్మో నాయకుడు (6) 

Friday, February 6, 2026

Gelupu talupule [గెలుపు తలుపులే తీసె ఆకాశమే నేడు నా కోసమే] - Teen maar

Title :Gelupu talupule
Movie:Teen maar
Singers:Sri rama chandra గారు
Lyricist:rahaman గారు
Composer:Manisharma గారు
Director:Jayant C Paranji గారు

గెలుపు తలుపులే తీసె ఆకాశమే నేడు నా కోసమే

అడుగు మెరుపులా మారే ఆనందమే వీడదీ బంధమే 

ఎటువైపు వెళుతున్నా వెలుగుల్నే చూస్తున్నా మెరిసావే రంగుల్లోనా 

కల తీరే సమయానా అలనేనై లేస్తున్నా అనుకుందే చేసేస్తున్నా

దారులన్ని నాతో పాటుగా ఊయలూగి పాటే పాడగా 

నను వీడి కదలదు కాలమొక క్షణమైనా 

గెలుపు తలుపులే తీసె ఆకాశమే నేడు నా కోసమే

ఎదలో ఆశలన్ని ఎదిగే కళ్ళముందరే 

ఎగిరే ఊహలన్ని నిజమై నన్ను చేరెలే 

సందేహమేమి లేదుగా సంతోషమంత నాదిగా, చుక్కల్లొ చేరి చూపగా

ఉప్పొంగుతున్న హోరుగా చిందేసి పాదమాడగా, దిక్కుల్ని మీటి వీణగా

చెలరేగి కదిలెను గాలి తరగల పైన..

గెలుపు తలుపులే తీసె ఆకాశమే నేడు నా కోసమే

అలుపేరాదు అంటూ కొలిచా నింగి అంచులనే

జగమే ఏలుకొంటూ పరిచా కోటి కాంతులే 

ఇవ్వాళ గుండెలో ఇలా చల్లారిపోని శ్వాశలా, కమ్మేసుకుంది నీ కల 

ఇన్నాళ్ళు లేని లోటులా తెల్లారిపోరి రేయిలా, నన్నల్లుకుంటె నువ్విలా 

నను నేను గెలిచిన, ఒంటరిగ నిలిచానే 

గెలుపు తలుపులే తీసె ఆకాశమే నేడు నా కోసమే 

Saturday, July 26, 2025

Emantaro Telugu lyrics [ఏమంటారో నాకు నీకున్న ఇదినీ] - Gudumba Shankar

Song Name :Emantaro naku nikunna idini
Movie:Gudumba Shankar
Singers:S.P. Charan garu, Harini garu
Lyricist:Chandrabose garu
Composer:Mani Sharma garu
DirectorVeera Shankar garu 

ఏమంటారో నాకు నీకున్న ఇదినీ, ఏమంటారో నువ్వు నేనైన అదినీ 

ఏమంటారో మారిపోతున్న కథనీ, ఏమంటారో జారిపోతున్న మతిని 

చూసే పెదవినీ మాటాడే కనులనీ , నవ్వే నడకనీ కనిపించే శ్వాశనీ 

ఇచ్చి పుచ్చుకున్న మనసుని, ఇదా అదా ఎదా విధా మరి 

ఏమంటారో నాకు నీకున్న ఇదినీ, ఏమంటారో నువ్వు నేనైన అదినీ 

ఏమంటారో మారిపోతున్న కథనీ, ఏమంటారో జారిపోతున్న మతిని 

ఎదురుగా వెలుగుతున్న నీడని, బెదురుగా కలుగుతున్న హాయిని హో హో.. 

తనువునా తొణుకుతున్న చురుకునీ, మనసున ముసురుకున్న చెమటనీ

ఇష్ట కష్టాలని ఇపుడేమంటారో, ఈ మోహమాటాలని మరి ఏమంటారో 

స్వల్ప భారాలని ఇపుడేమంటారో, సమీపదూరలని అసలేమంటారో 

జారేనింగినీ దొరలాంటి దొంగని, కాడే కొంగుని పరిమళించే రంగుని

పొంగుతున్న సుధాగంగని, ఇదా అదా అదే ఇదా మరి

ఏమంటారో మారిపోతున్న కథనీ, ఏమంటారో జారిపోతున్న మతిని 

జాబిలై తళుకుమన్నా చుక్కని, బాధ్యతై దొరుకుతున్న హక్కుని

దేవుడై ఎదుగుతున్న భక్తుని, సూత్రమై బిగియనున్న సాక్షిని 

పాతలో కొత్తని ఇపుడేమంటారో, పోట్లాటలో శాంతినీ మరి ఏమంటారో 

తప్పులో ఒప్పుని ఇపుడేమంటారో, గతజన్మలో అప్పుని అసలేమంటారో 

నాలో నువ్వుని ఇక నీలో నేనుని, మాకే మేమని మనదారే మనదనీ 

రాసుకున్న ఆత్మచరితని అదా ఇదా ఇదే అదా మరి

ఏమంటారో నాకు నీకున్న ఇదినీ, ఏమంటారో నువ్వు నేనైన అదినీ 

ఏమంటారో మారిపోతున్న కథనీ, ఏమంటారో జారిపోతున్న మతిని 

Chiguraku chaatu chilaka [చిగురాకు చాటు చిలక ] - Gudumba Shankar

Song Name :Chiguraku chatu chilaka
Movie:Gudumba Shankar
Singers:S.P. Charan garu, Sujata garu
Lyricist:Sirivennela Seetarama sastry  garu
Composer:Mani Sharma garu
DirectorVeera Shankar garu 

చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా, అలవాటు లేదుగనక మది సులువుగ నమ్మదుగా 

చిగురాకు చాటు చిలక తను నడవద ధీమాగా, అనుకోనిదారి గనక ఈ తికమక తప్పదుగా 

తనుకూడా నాలాగా అనుకుంటే మేలేగా, ఐతే అది తేలనిదే అడుగు పడదుగా

సరికొత్తగ నా వంక, చూస్తుందే చిత్రంగా ఏమైందో స్పష్టంగా బయటపడదుగా

చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా, అలవాటు లేదుగనక మది సులువుగ నమ్మదుగా 

చెప్పకు అంటు చెప్పమంటు చర్చితేలేనా, తప్పనుకుంటు తప్పదంటు తర్కమాగేనా 

సంగతిచూస్తూ జాలివేస్తు కదలలేకున్నా, తేలనిగుట్టు తేనెపట్టు కదపలేకున్నా 

వొణికే నా పెదవుల్లో తొణికే తడిపిలుపేదో, నాకే సరిగా ఇంకా తెలియకున్నదీ 

తనలో తను ఏదేదో గొణిగే ఆ కబురేదో, ఆ వైనం మౌనంలో మునిగివున్నదీ 

చిగురాకు చాటు చిలక తను నడవద ధీమాగా, అనుకోనిదారి గనక ఈ తికమక తప్పదుగా 

ఎక్కడినుంచో మధురగానం మదినిమీటిందీ, ఇక్కడినుంచే నీ ప్రయాణం మొదలు అంటోంది 

గలగల వీచే పిల్లగాలి ఎందుకాగిందీ, కొంపలుముంచే తుఫానొచ్చే సూచనేమో ఇదీ 

వేరే ఎదో లోకం చేరే ఊహలవేగం, ఏదో తియ్యని మైకం  పెంచుతున్నదీ

దారే తెలియని దూరం, తీరే తెలపని తీరం, తనలో కలవరమేదో రేపుతున్నదీ 

చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా, అలవాటు లేదుగనక మది సులువుగ నమ్మదుగా 

చిగురాకు చాటు చిలక తను నడవద ధీమాగా, అనుకోనిదారి గనక ఈ తికమక తప్పదుగా 

తనుకూడా నాలాగా అనుకుంటే మేలేగా, ఐతే అది తేలనిదే అడుగు పడదుగా

సరికొత్తగ నా వంక, చూస్తుందే చిత్రంగా ఏమైందో స్పష్టంగా బయటపడదుగా

చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా, అలవాటు లేదుగనక మది సులువుగ నమ్మదుగా 

Tuesday, September 10, 2024

ఆలయాన హారతిలో ఆఖరి చితిమంటలలో (Aalayana haarathilo)

Song Name :Aalayana haarathilo    
Movie:Suswagatam
Singers:S.P. Bala subramanyam garu
Lyricist:Sirivennela Sitarama sastry garu
Composer:S A Rajkumar garu
Director:Bhimineni Srinivasa rao garu

ఆలయాన హారతిలో ఆఖరి చితిమంటలలో, రెండిటిలొ నిజానికున్నది ఒకటే అగ్నిగుణం 

ఆలయాన హారతిలో ఆఖరి చితిమంటలలో, రెండిటిలొ నిజానికున్నది ఒకటే అగ్నిగుణం 

ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం 

దీపాన్ని చూపెడుతుందొ, తాపాన బలిపెడుతుందొ

అమృతమో హాలహలమో ఎమో ప్రేమ గుణం , ఏ క్షణాన ఎలాగ మారునొ ప్రేమించే హృదయం 

ఆలయాన హారతిలో ఆఖరి చితిమంటలలో, రెండిటిలొ నిజానికున్నది ఒకటే అగ్నిగుణం 

ఎండమావిలొ ఎంతవెతికినా నీటిచెమ్మ దొరికేన, గుండె బావిలొ ఉన్న ఆశ తడి ఆవిరి అవుతున్నా 

ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమ, ఎలా నిన్ను కనిపెట్టాలొ ఆచూకీ ఇవ్వమ్మా 

నీ జాడ తెలియని ప్రాణం, చేస్తోంది గగన ప్రయాణం 

ఎదర ఉంది నడిరేయంది ఈ సంధ్యా సమయం, ఏ క్షణాన ఎలాగ మారునొ ప్రేమించే హృదయం 

ఆలయాన హారతిలో ఆఖరి చితిమంటలలో, రెండిటిలొ నిజానికున్నది ఒకటే అగ్నిగుణం 

సూర్యబింబమే అస్తమించనిదె మేలుకోని కలకోసం, కళ్ళుమూసుకుని కలవరించెనీ కంటిపాప పాపం

ఆయువిచ్చి పెంచిన బంధం మౌనంలో మసియైనా, రేయిచాటు స్వప్నంకోసం ఆలాపన ఆగేన 

పొందేది ఏదేమైనా, పోయింది తిరిగొచ్చేనా 

కంటిపాప కల అడిగిందని నిదురించెను నయనం, ఏ క్షణాన ఎలాగ మారునొ ప్రేమించే హృదయం 