Showing posts with label chilaka. Show all posts
Showing posts with label chilaka. Show all posts

Saturday, March 28, 2026

urike chilaka [ఉరికే చిలక వేచిఉంటాను కడవరకు] - Bombay

Title :urike chilaka 
Movie:Bombay
Singers:Hari haran గారు, K.S. Chitra గారు
Lyricist:Veturi Sundararama murthy  గారు
Composer:A.R. Rahman గారు
Director:Mani rathnam గారు

ఉరికే చిలక వేచిఉంటాను కడవరకు, కురిసే చినుకా ఎల్లువైనావే ఎదవరకు 

చెలివై సఖివై రెండుహృదయాల కథలువిను

బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను 

కాటుకా కళ్ళతో కాటువేసావు నన్ ఎపుడో, కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇప్పుడు 

ఉరికే చిలక వేచిఉంటాను కడవరకు, కురిసే చినుకా ఎల్లువైనావే ఎదవరకు

నీరాక కోసం తొలిప్రాణమైనా దాచింది నా వలపే 

మనసంటి మగువ ఏ జామురాక చితిమంటలే రేపే 

నా కడ ప్రాణం పోనివ్వు కథమాసిపోదు అది కాదు నా వేదనా

విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే ఎద కృంగి పోయేనులే 

మొదలో తుదలో వదిలేసాను నీకే ప్రియా 

ఉరికే చిలకే వచ్చివాలింది కలతవిడి

చెలిగా సఖిలా తానుచేరింది చెలుని ఒడి 

నెలవే తెలిపే నిన్ను చేరింది గతము విడి 

కలకీ ఇలకీ ఊయలూగింది కంటపడి 

కాటుకా కళ్ళతో కాటువేసావు నన్ ఎపుడో, కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇప్పుడు 

ఉరికే చిలక వేచిఉంటాను కడవరకు, కురిసే చినుకా వెల్లువైనావే ఎదవరకు

తొలిప్రాణమైన ఒకనాటిప్రేమ మాసేదికాదు సుమా 

ఒక కంటి గీతం జలపాతమైతే మరుకన్ను నవ్వదమ్మా 

నా పరువాల పరదాలు తొలగించి వస్తే కన్నీటి ముడుపాయెలే 

నే పురివిప్పి పరుగెత్తి గాలల్లేవచ్చా నీ వేణుగానానికి 

అరెరే అరెరే నేడు కన్నీట తేనె కలిసే 

ఉరికే చిలక వేచిఉంటాను కడవరకు, కురిసే చినుకా ఎల్లువైనావే ఎదవరకు 

చెలివై సఖివై రెండుహృదయాల కథలువిను

మోహమో మైకమో రెండు మనసుల్లో విరిసినది, పాశమో బంధమో ఉన్న దూరాలు చెరిపినది

ఉరికే చిలకే వచ్చివాలింది కలతవిడి

చెలిగా సఖిలా తానుచేరింది చెలుని ఒడి 

నెలవే తెలిపే నిన్ను చేరింది గతము విడి 

Saturday, July 26, 2025

Chiguraku chaatu chilaka [చిగురాకు చాటు చిలక ] - Gudumba Shankar

Song Name :Chiguraku chatu chilaka
Movie:Gudumba Shankar
Singers:S.P. Charan garu, Sujata garu
Lyricist:Sirivennela Seetarama sastry  garu
Composer:Mani Sharma garu
DirectorVeera Shankar garu 

చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా, అలవాటు లేదుగనక మది సులువుగ నమ్మదుగా 

చిగురాకు చాటు చిలక తను నడవద ధీమాగా, అనుకోనిదారి గనక ఈ తికమక తప్పదుగా 

తనుకూడా నాలాగా అనుకుంటే మేలేగా, ఐతే అది తేలనిదే అడుగు పడదుగా

సరికొత్తగ నా వంక, చూస్తుందే చిత్రంగా ఏమైందో స్పష్టంగా బయటపడదుగా

చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా, అలవాటు లేదుగనక మది సులువుగ నమ్మదుగా 

చెప్పకు అంటు చెప్పమంటు చర్చితేలేనా, తప్పనుకుంటు తప్పదంటు తర్కమాగేనా 

సంగతిచూస్తూ జాలివేస్తు కదలలేకున్నా, తేలనిగుట్టు తేనెపట్టు కదపలేకున్నా 

వొణికే నా పెదవుల్లో తొణికే తడిపిలుపేదో, నాకే సరిగా ఇంకా తెలియకున్నదీ 

తనలో తను ఏదేదో గొణిగే ఆ కబురేదో, ఆ వైనం మౌనంలో మునిగివున్నదీ 

చిగురాకు చాటు చిలక తను నడవద ధీమాగా, అనుకోనిదారి గనక ఈ తికమక తప్పదుగా 

ఎక్కడినుంచో మధురగానం మదినిమీటిందీ, ఇక్కడినుంచే నీ ప్రయాణం మొదలు అంటోంది 

గలగల వీచే పిల్లగాలి ఎందుకాగిందీ, కొంపలుముంచే తుఫానొచ్చే సూచనేమో ఇదీ 

వేరే ఎదో లోకం చేరే ఊహలవేగం, ఏదో తియ్యని మైకం  పెంచుతున్నదీ

దారే తెలియని దూరం, తీరే తెలపని తీరం, తనలో కలవరమేదో రేపుతున్నదీ 

చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా, అలవాటు లేదుగనక మది సులువుగ నమ్మదుగా 

చిగురాకు చాటు చిలక తను నడవద ధీమాగా, అనుకోనిదారి గనక ఈ తికమక తప్పదుగా 

తనుకూడా నాలాగా అనుకుంటే మేలేగా, ఐతే అది తేలనిదే అడుగు పడదుగా

సరికొత్తగ నా వంక, చూస్తుందే చిత్రంగా ఏమైందో స్పష్టంగా బయటపడదుగా

చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా, అలవాటు లేదుగనక మది సులువుగ నమ్మదుగా 

Thursday, March 6, 2025

Chilaka ye toduleka (చిలక ఏ తోడులేక ) - Subhalagnam

Song Name :Chilaka ye toduleka
Movie:Subhalagnam
Singers:S.P. Balasubramanyam garu
Lyricist:Sirivennela Sitaramasastry garu
Composer:S.V. Krishna reddy garu
DirectorS.V. Krishna reddy garu 

చిలక ఏ తోడులేక ఎటేపమ్మ ఒంటరి నడక, తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశలవెనక

మంగళసూత్రం అంగడిసరుకా కొనగలవా చెయిజారాక, లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాకా

చిలక ఏ తోడులేక ఎటేపమ్మ ఒంటరి నడక, తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశలవెనక

బతుంకంతా బలిచేసే పేరాశను ప్రేమించావే

బతుంకంతా బలిచేసే పేరాశను ప్రేమించావే

వెలుగుల్నే వెలివేసే కలలోనే జీవించావే

అమృతమే చెల్లించి ఆ విలువతో, హలాహలం కొన్నావే అతితెలివితో 

కురిసే ఈ కాసుల జడిలో తడిసీ నిరుపేదైనావే 

చిలక ఏ తోడులేక ఎటేపమ్మ ఒంటరి నడక, తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశలవెనక

అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో 

అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో 

మమకారం విలువెంతో మరిచావా సిరిమైకంలో 

ఆనందం కొనలేని ధనరాశితో, అనథగా మిగిలావే అమవాశలో 

తీరా నువ్ కనుతెరిచాకా తీరం కనబడదే ఇంకా 