Showing posts with label bombay. Show all posts
Showing posts with label bombay. Show all posts

Saturday, March 28, 2026

urike chilaka [ఉరికే చిలక వేచిఉంటాను కడవరకు] - Bombay

Title :urike chilaka 
Movie:Bombay
Singers:Hari haran గారు, K.S. Chitra గారు
Lyricist:Veturi Sundararama murthy  గారు
Composer:A.R. Rahman గారు
Director:Mani rathnam గారు

ఉరికే చిలక వేచిఉంటాను కడవరకు, కురిసే చినుకా ఎల్లువైనావే ఎదవరకు 

చెలివై సఖివై రెండుహృదయాల కథలువిను

బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను 

కాటుకా కళ్ళతో కాటువేసావు నన్ ఎపుడో, కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇప్పుడు 

ఉరికే చిలక వేచిఉంటాను కడవరకు, కురిసే చినుకా ఎల్లువైనావే ఎదవరకు

నీరాక కోసం తొలిప్రాణమైనా దాచింది నా వలపే 

మనసంటి మగువ ఏ జామురాక చితిమంటలే రేపే 

నా కడ ప్రాణం పోనివ్వు కథమాసిపోదు అది కాదు నా వేదనా

విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే ఎద కృంగి పోయేనులే 

మొదలో తుదలో వదిలేసాను నీకే ప్రియా 

ఉరికే చిలకే వచ్చివాలింది కలతవిడి

చెలిగా సఖిలా తానుచేరింది చెలుని ఒడి 

నెలవే తెలిపే నిన్ను చేరింది గతము విడి 

కలకీ ఇలకీ ఊయలూగింది కంటపడి 

కాటుకా కళ్ళతో కాటువేసావు నన్ ఎపుడో, కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇప్పుడు 

ఉరికే చిలక వేచిఉంటాను కడవరకు, కురిసే చినుకా వెల్లువైనావే ఎదవరకు

తొలిప్రాణమైన ఒకనాటిప్రేమ మాసేదికాదు సుమా 

ఒక కంటి గీతం జలపాతమైతే మరుకన్ను నవ్వదమ్మా 

నా పరువాల పరదాలు తొలగించి వస్తే కన్నీటి ముడుపాయెలే 

నే పురివిప్పి పరుగెత్తి గాలల్లేవచ్చా నీ వేణుగానానికి 

అరెరే అరెరే నేడు కన్నీట తేనె కలిసే 

ఉరికే చిలక వేచిఉంటాను కడవరకు, కురిసే చినుకా ఎల్లువైనావే ఎదవరకు 

చెలివై సఖివై రెండుహృదయాల కథలువిను

మోహమో మైకమో రెండు మనసుల్లో విరిసినది, పాశమో బంధమో ఉన్న దూరాలు చెరిపినది

ఉరికే చిలకే వచ్చివాలింది కలతవిడి

చెలిగా సఖిలా తానుచేరింది చెలుని ఒడి 

నెలవే తెలిపే నిన్ను చేరింది గతము విడి 

Sunday, October 19, 2025

Kuchi kuchi kunamma [కుచ్చికుచ్చి కూనమ్మ ] - Bombay

Movie : Bombay
Song : Kuchi kuchi kunamma
Music Dir: A.R. Rahman garu
Singer: Hari Haran garu, Swarna latha garu
Director: Mani Rathnam garu
Lyrics: Veturi Sundara Rama murthy garu

కుచ్చికుచ్చి కూనమ్మ పిల్లనివ్వు, కుందనాల కూనమ్మ పిల్లనివ్వు

ఊరువాడా నిద్దరోయే, కోడికూడా సద్దుచేసే, కుచ్చి కుచ్చి కూనమ్మ, కుందనాల కూనమ్మ

కుచ్చికుచ్చి కూనమ్మ పిల్లనివ్వు, ఏ కుందనాల కూనమ్మ పిల్లనివ్వు

ఊరువాడా నిద్దరోయే, కోడికూడా సద్దుచేసే, కుచ్చి కుచ్చి కూనమ్మ, కుందనాల కూనమ్మ

కుచ్చికుచ్చి కూనమ్మ ఇవ్వదంటా, నీ కొంటె వేషమింక చాలు వెళ్ళమంట 

ఊరువాడా సద్దులాయె, కోడికూడా నిద్దరోయె 

కుచ్చికుచ్చి కూనమ్మ ఇవ్వదంటా, నీ కొంటె వేషమింక చాలు వెళ్ళమంట 

ఆటనెమిలికీ మెరుపు సుఖం, గానకోకిలకు పిలుపు సుఖం 

చెట్టువేరుకు పాదు సుఖం, హే అమ్మడన్ను పిలుపు సుఖం  

రాకుమారుడికి గెలుపు సుఖం, చంటి కడుపుకి పాలు సుఖం 

మొగుడు శ్రీమతి అలకలలో ముద్దు కన్న ముడుపు సుఖం 

రేయిపగలు కన్నీట్లో ఉన్నా రాదు మీనుకి చలికాలం 

అల్లిబిల్లిగా లాలిస్తుంటే గారాల పూబాల కోరేది సరసం 

బుజ్జి బుజ్జి పాపనివ్వు, పోకిరాట వేషమొద్దు 

బుజ్జి బుజ్జి పాపనివ్వు, పోకిరాట వేషమొద్దు 

వేడెక్కా అందాలెపెట్టు వేధిస్తే నామీదే ఒట్టు 

కుచ్చికుచ్చి కూనమ్మ ఇవ్వదంటా, నీ కొంటె వేషమింక చాలు వెళ్ళమంట 

ఊరువాడా సద్దులాయె, కోడికూడా నిద్దరోయె 

కుచ్చికుచ్చి కూనమ్మ ఇవ్వదంటా, నీ కొంటె వేషమింక చాలు వెళ్ళమంట 

ఊరువాడా సద్దులాయె, కోడికూడా నిద్దరోయె 

కుచ్చికుచ్చి కూనమ్మ ఇవ్వదంటా, నీ కొంటె వేషమింక చాలు వెళ్ళమంట 

ఊరువాడా సద్దులాయె, కోడికూడా నిద్దరోయె 

చిరుత రెక్కలే పక్షివిలే, చిటికె వెలుగులే దివ్వెవిలే  

తోడు నీడ ఇక నీదేలే, తరగని పుణ్యమిదే 

తనువు తోటివే తపనలులే, ఉరుముతోటివే మెరుపులులే 

ఉన్న తోడు ఇక నీవేలే విలువలు తెలియవులే 

భూమి తిరగడం నిలబడితే, భువిని కాలమే మారదులే 

మగని ఆదరణ కరువైతే ఇల్లాలి ప్రేమంత వేసంగిపాలే 

పొద్దుకోరుకున్న ఆశ అంటుకుంది అగ్గిలాగ 

పొద్దుకోరుకున్న ఆశ అంటుకుంది అగ్గిలాగ 

బుద్ది ఉంటె మంచిదంట దూరాలు కోరింది ఆశ 

కుచ్చి కూనమ్మ, కుందనాల కూనమ్మ

కుచ్చికుచ్చి కూనమ్మ ఇవ్వదంటా, నీ కొంటె వేషమింక చాలు వెళ్ళమంట 

ఊరువాడా సద్దులాయె, కోడికూడా నిద్దరోయె 

కుచ్చికుచ్చి కూనమ్మ ఇవ్వదంటా, నీ కొంటె వేషమింక చాలు వెళ్ళమంట 

ఊరువాడా సద్దులాయె, కోడికూడా నిద్దరోయె