| Song Name : | Yedalo tolivalape |
| Movie: | Erra gulabilu |
| Singers: | S.P. Bala subramanyam garu, S. Janaki garu |
| Lyricist: | Veturi Sundara rama murthy garu |
| Composer: | Illayaraja garu |
| Director: | Bharati raja garu |
ఎదలో తొలివలపే, విరహం జతకలిసే
మధురం ఆ తలపే నీ పిలుపే
ఎదలో తొలివలపే, విరహం జతకలిసే
మధురం ఆ తలపే నీ పిలుపే
ఎదలో తొలివలపే
రోజాలతో పూజించనీ, విరితేనెలే నను తాగనీ
నా యవ్వనం పులకించనీ, అనురాగమే పలికించనీ
కలగన్నది నిజమైనది, కథలే నడిపింది
ఎదలో తొలివలపే, విరహం జతకలిసే
మధురం ఆ తలపే నీ పిలుపే
ఎదలో తొలివలపే
పయనించనా నీ బాటలో, మురిపించనా నా ప్రేమలో
ఈ కమ్మనీ తొలిరేయిని, కొనసాగనీ మన జంటనీ
మోహాలలో మన ఊహలే, సాగే చెలరేగే
ఎదలో తొలివలపే, విరహం జతకలిసే
మధురం ఆ తలపే నీ పిలుపే
ఎదలో తొలివలపే, విరహం జతకలిసే
మధురం ఆ తలపే నీ పిలుపే
ఎదలో తొలివలపే

No comments:
Post a Comment