Showing posts with label tolivalape. Show all posts
Showing posts with label tolivalape. Show all posts

Friday, April 3, 2026

Tolivalape tiyyanidi [తొలివలపే తీయ్యనిది ఆ బాధే తీరనిది] - Yuvaraju

Title :Tolivalape tiyyanidi
Movie:Yuvaraju
Singers:Hariharan గారు, K.S. Chitra గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Ramana Gogula గారు
Director:Y.V.S. Chowdary గారు

తొలివలపే తీయ్యనిది  ఆ బాధే తీరనిది

కాలంలా కరిగిపోనిది దానంలా తిరిపోదది


వేదంలాగా లిపి లేనిది

వేదిస్తున్నా సుఖమైనది

ఓడిస్తున్నా గెలుపే అది

ఓదార్చే ఓ పిలుపైనది

చుక్కలనే ఇరుపునది దిక్కులనే కలుపునది.. అకాశం తానే ఉన్నది

ఒక్కరిలో ఇద్దరది, ఇద్దరిలో ఒక్కటది నీకోసం నేనై ఉన్నది

తొలివలపే... ఆ బాధే...


గుండెల్లోన గూడే ఇది

గుచ్చే రోజామాలే అది

మాటల్లోన మౌనం అది

మనసుల్లోన ధ్యానం అది 

ఏ రుణమో తెలియనది ఏ వరమో అడగనిది, ఏ మజిలి చేరేనో అది

ఎప్పటిదో ఎరుగనిది ఎన్నటికి మరువనిది ఓ కథలా చేరే కంచికి


తొలివలపే తీయ్యనిది  ఆ బాధే తీరనిది

ఎదకన్నా లోతుగుంటది బతుకల్లే తోడు ఉంటది 

Sunday, July 6, 2025

Yedalo tolivalape telugu lyrics [ఎదలో తొలివలపే, విరహం జతకలిసే] - Erra Gulabilu

Song Name :Yedalo tolivalape
Movie:Erra gulabilu
Singers:S.P. Bala subramanyam garu, S. Janaki garu
Lyricist:Veturi Sundara rama murthy garu
Composer:Illayaraja garu
Director:Bharati raja garu

ఎదలో తొలివలపే, విరహం జతకలిసే 

మధురం ఆ తలపే నీ పిలుపే 

ఎదలో తొలివలపే, విరహం జతకలిసే 

మధురం ఆ తలపే నీ పిలుపే 

ఎదలో తొలివలపే


రోజాలతో పూజించనీ, విరితేనెలే నను తాగనీ 

నా యవ్వనం పులకించనీ, అనురాగమే పలికించనీ

కలగన్నది నిజమైనది, కథలే నడిపింది 

ఎదలో తొలివలపే, విరహం జతకలిసే 

మధురం ఆ తలపే నీ పిలుపే 

ఎదలో తొలివలపే


పయనించనా నీ బాటలో, మురిపించనా నా ప్రేమలో 

ఈ కమ్మనీ తొలిరేయిని, కొనసాగనీ మన జంటనీ 

మోహాలలో మన ఊహలే, సాగే చెలరేగే 

ఎదలో తొలివలపే, విరహం జతకలిసే 

మధురం ఆ తలపే నీ పిలుపే 

ఎదలో తొలివలపే, విరహం జతకలిసే 

మధురం ఆ తలపే నీ పిలుపే 

ఎదలో తొలివలపే