Showing posts with label Sridevi. Show all posts
Showing posts with label Sridevi. Show all posts

Friday, June 19, 2026

Sirimalle puvva [సిరిమల్లేపువ్వా సిరిమల్లేపువ్వా చిన్నారి చిలకమ్మా] - Padahaarella vayasu

Title :Sirimalle puvva
Movie:Padaharella vayasu
Singers:S. Janaki గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Chakravarthy గారు
Director:K. Raghavendra Rao గారు

సిరిమల్లేపువ్వా.. సిరిమల్లేపువ్వా సిరిమల్లేపువ్వా.. చిన్నారి చిలకమ్మా 

నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే 

సిరిమల్లేపువ్వా సిరిమల్లేపువ్వా చిన్నారి చిలకమ్మా 

నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే 

సిరిమల్లేపువ్వా ...

తెల్లారబోతుంటే నా కల్లోకివస్తాడే

కళ్ళారా చూదామంటే నా కళ్ళు మూస్తాడే

ఆ అందగాడు నా ఈడూ జోడు ఏడే

ఈ సందేకాడ నా చందమామ రాడే

చుక్కల్లారా దిక్కులుదాటి వాడెన్నాళ్ళకొస్తాడో

సిరిమల్లేపువ్వా.. సిరిమల్లేపువ్వా సిరిమల్లేపువ్వా.. చిన్నారి చిలకమ్మా 

నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే 

సిరిమల్లేపువ్వా 

కొండల్లో కోనల్లో కూయన్న ఓ కోయిల

ఈ పూల వానల్లో ఝుమ్మన్న ఓ తుమ్మెద

వయసంతా వలపై మనసే మైమరుపై ఊగేనే 

పగలంతా దిగులు రేయంతా వగలు రేగేనే 

చుక్కల్లారా దిక్కులుదాటి వాడెన్నాళ్ళకొస్తాడో

సిరిమల్లేపువ్వా.. సిరిమల్లేపువ్వా సిరిమల్లేపువ్వా.. చిన్నారి చిలకమ్మా 

నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే 

సిరిమల్లేపువ్వా.. సిరిమల్లేపువ్వా సిరిమల్లేపువ్వా..  

Wednesday, June 17, 2026

Elluvocchi godaramma [ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్ల పడ్డాదమ్మో] - Devatha

Title :Elluvocchi godaaramma
Movie:Devata / Devatha
Singers:S.P. Balasubramanyam గారు, P. Suseela గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Chakravarthy గారు
Director:K. Raghavendra Rao గారు

ఈ గీతంలో వాడిన తెలుగు మాండలికాన్ని (తూర్పు) మార్చకుండా రాయడం జరిగింది. (రచయిత వ్ బదులుగా యాసలొ య/ఎ ని వాడారు)

ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్ల పడ్డాదమ్మో, ఎన్నెలొచ్చి రెల్లుపూలే ఎండీగిన్నేలయ్యేనమ్మో 

కొంగుదాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే..

ఓరయ్యో రావయ్యో 

ఆగడాల పిల్లోడా నా సోగ్గాడా, మీగడంతా నీదేలే నా బుల్లోడా

ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్ల పడ్డాదమ్మో, ఎన్నెలొచ్చి రెల్లుపూలే ఎండీగిన్నేలయ్యేనమ్మో 

కొంగుచాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే, 

ఓలమ్మో రావమ్మో  

ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు, ఆగడాల పిల్లోడైనా నీవోడు 

ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు, ఆగడాల పిల్లోడైనా నీవోడు 

ఈ కళ్ళకున్న ఆకళ్ళలోనా అందాల విందమ్మ నువ్వు

వాటేసుకుంటే వందేళ్ళపంట వద్దంటే విందమ్మ నవ్వు

చెయ్యేస్తే చేమంతి బుగ్గ, చెంగావి గన్నేరు మొగ్గ

చెయ్యేస్తే చేమంతి బుగ్గ, చెంగావి గన్నేరు మొగ్గ

ఈడొచ్చి నీ చోటు ఈడుంది రమ్మంటే ఏడేసుకుంటవు గూడు 

కౌగిళ్ళలో నన్ను కూడు, ఆకళ్ళ కుంటాది కూడు

గుండెల్లో చోటుంది చూడు 

ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్ల పడ్డాదమ్మో, ఎన్నెలొచ్చి రెల్లుపూలే ఎండీగిన్నేలయ్యేనమ్మో 

కొంగుచాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే

ఓరయ్యో రావయ్యో 

ఆగడాల పిల్లోడా నా సోగ్గాడా, మీగడంతా నీదేలే నా బుల్లోడా

ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు, ఆగడాల పిల్లోడైనా నీవోడు 

నీ కళ్ళుసోక, నా తెల్లకోక అయ్యిందిలే గళ్ళకోక 

నీ మాటవిన్న నా జారుపైట పాడిందిలే గాలిపాట 

కళ్ళల్లో ఉన్నయి ముళ్ళు, నేకోరినా మూడు ముళ్ళు 

కళ్ళల్లో ఉన్నయి ముళ్ళు, నేకోరినా మూడు ముళ్ళు 

పొద్దుల్లో కుంకాలు బొట్టెట్టి పోతుంటే కట్టేయ్యనా తాళిబొట్టు 

నా మాటకీఏరు తోడు, ఏరెండీనా ఊరు తోడు 

నీ తోడులో ఊపిరాడు  

ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్ల పడ్డాదమ్మో, ఎన్నెలొచ్చి రెల్లుపూలే ఎండీగిన్నేలయ్యేనమ్మో 

కొంగుదాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే..

ఓలమ్మో రావమ్మో  

ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు, ఆగడాల పిల్లోడైనా నీవోడు 

ఆగడాల పిల్లోడా నా సోగ్గాడా, మీగడంతా నీదేలే నా బుల్లోడా 

Saturday, August 16, 2025

Ammayi muddu ivvande [అమ్మాయి ముద్దు ఇవ్వందే ] - Kshna Kshanam

Title :ammayi muddu ivvande
Movie:Kshana Kshanam
Singers:S.P. Balasubramanyam గారు, K.S. Chitra గారు
Lyricist:Sririvennela Seetaramasastry గారు
Composer:M.M. Keeravani గారు
Director:Ram Gopal Varma  గారు

అమ్మాయి ముద్దు ఇవ్వందే ఈ రేయి తెల్లవారనివ్వనంతే  

అబ్బాయి నీ ముద్దు చెల్లించితే అమ్మమ్మమ్మా గొడవలే 

ముద్దిమ్మంది బుగ్గ వద్దంటు అడ్డం రాకే నువ్వు సిగ్గులేని సిగ్గా 

ముద్దిమంటే బుగ్గ అగ్గల్లెవస్తే ఆగేదెట్టా హద్దూ పద్దూ వద్దా 

మోజులేదనకు, ఉందనుకో ఇందరిలో ఎల్లా మనకు 

మోగిపొమ్మనకు, చీకటిలో ఇద్దరమే ఉన్నామనుకో

చూడదా సహించని వెన్నెల, దహించిన కన్నులా 

కళ్ళు మూసేసుకో హాయిగా

అమ్మాయి ముద్దు ఇవ్వందే ఈ రేయి తెల్లవారనివ్వనంతే  

అబ్బాయి నీ ముద్దు చెల్లించితే అమ్మమ్మమ్మా గొడవలే 

పారిపోను కదా, అదిసరే అసలుకధ అవ్వాలికదా 

ఏది ఆ సరదా, అన్నిటికీ సిద్ధపడే వచ్చాను కదా 

అందుకే అటూఇటు చూడకు, సుఖాలను వీడకు 

తొందరేముందిలే విందుకు

ముద్దిమ్మంది బుగ్గ వద్దంటు అడ్డం రాకే నువ్వు సిగ్గులేని సిగ్గా 

ముద్దిమంటే బుగ్గ అగ్గల్లెవస్తే ఆగేదెట్టా హద్దూ పద్దూ వద్దా 

అమ్మాయి ముద్దు ఇవ్వందే ఈ రేయి తెల్లవారనివ్వనంతే  

అబ్బాయి నీ ముద్దు చెల్లించితే అమ్మమ్మమ్మా గొడవలే 

ముద్దిమ్మంది బుగ్గ వద్దంటు అడ్డం రాకే నువ్వు సిగ్గులేని సిగ్గా 

ముద్దిమంటే బుగ్గ అగ్గల్లెవస్తే ఆగేదెట్టా హద్దూ పద్దూ వద్దా 

Sunday, July 6, 2025

Yedalo tolivalape telugu lyrics [ఎదలో తొలివలపే, విరహం జతకలిసే] - Erra Gulabilu

Song Name :Yedalo tolivalape
Movie:Erra gulabilu
Singers:S.P. Bala subramanyam garu, S. Janaki garu
Lyricist:Veturi Sundara rama murthy garu
Composer:Illayaraja garu
Director:Bharati raja garu

ఎదలో తొలివలపే, విరహం జతకలిసే 

మధురం ఆ తలపే నీ పిలుపే 

ఎదలో తొలివలపే, విరహం జతకలిసే 

మధురం ఆ తలపే నీ పిలుపే 

ఎదలో తొలివలపే

రోజాలతో పూజించనీ, విరితేనెలే నను తాగనీ 

నా యవ్వనం పులకించనీ, అనురాగమే పలికించనీ

కలగన్నది నిజమైనది, కథలే నడిపింది 

ఎదలో తొలివలపే, విరహం జతకలిసే 

మధురం ఆ తలపే నీ పిలుపే 

ఎదలో తొలివలపే

పయనించనా నీ బాటలో, మురిపించనా నా ప్రేమలో 

ఈ కమ్మనీ తొలిరేయిని, కొనసాగనీ మన జంటనీ 

మోహాలలో మన ఊహలే, సాగే చెలరేగే 

ఎదలో తొలివలపే, విరహం జతకలిసే 

మధురం ఆ తలపే నీ పిలుపే 

ఎదలో తొలివలపే, విరహం జతకలిసే 

మధురం ఆ తలపే నీ పిలుపే 

ఎదలో తొలివలపే 

Sunday, May 11, 2025

Andama Anduma [అందమా అందుమా.. అందనంటే అందమా] - Govinda Govinda

Song Name :Andama anduma
Movie:Govinda Govinda
Singers:S.P. Balasubramanyam garu, K.S. Chitra garu
Lyricist:Sirivennala seetarama sastry garu
Composer:Raj - Koti garlu
DirectorRam Gopal Varma garu 

అందమా అందుమా.. అందనంటే అందమా

చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా 

ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూలకొమ్మ పరవశాలు పంచవమ్మ పాలసంద్రమా ... 

అందమా అందుమా.. అందనంటే అందమా

చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా 

ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూలకొమ్మ పరవశాలు పంచవమ్మ పాలసంద్రమా ...

ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మ.. 

అందమా అందుమా.. అందనంటే అందమా

ఆకలుండదే దాహముండదే ఆకతాయి కోరిక, కొరుక్కుతింటదీ 

ఆగనంటదే దాగనంటదే ఆకుచాటు వేడుక, కిర్రెక్కమంటదే 

వన్నెపూల విన్నపాలు విన్నానమ్మీ, చిటికవేలు ఇచ్చి ఏలుకుంటానమ్మి

రాసిపెట్టిఉంది గనుక నిన్నే నమ్మి, ఊసులన్ని పూసగుచ్చి ఇస్తాసుమ్మీ 

ఆలనా పాలనా చూడగా చేరనా చెంత 

అందమా అందుమా.. అందనంటే అందమా

చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా 

వెయ్యిచెప్పినా లక్షచెప్పినా లక్ష్యపెట్టదే ఎలా, ఇదేమి విల విల

తీయ తియ్యగా నచ్చచెప్పనీ చిచ్చికొట్టనీ ఇలా, వయ్యారి వెన్నెలా 

నిలవనీదు నిదురపోదు నారాయణ, వగలమారి వయసుపోరు నా వల్లనా 

చిపి ఆశ చిటికలోన తీర్చెయ్యనా, మంత్రమేసి మంచిచేసి లాలించనా 

ఆదుకో నాయనా ఆర్చవా తీర్చవా చింత 

అందమా అందుమా.. అందనంటే అందమా

చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా 

ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూలకొమ్మ పరవశాలు పంచవమ్మ పాలసంద్రమా ...

ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మ.. 

Abbani tiyyani debba [అబ్బనీ తియ్యనీ దెబ్బ] - Jagadeka Veerudu Atiloka sundari

Song Name :Abbani tiyyani debba
Movie:Jagadeka Veerudu Atiloka sundari
Singers:S.P. Balasubramanyam garu, K.S. Chitra garu
Lyricist:Veturi Sundara rama murthy garu
Composer:Illayaraja garu
DirectorK. Raghavendra Rao garu 

అబ్బనీ తియ్యనీ దెబ్బ, ఎంతొ కమ్మగా వుందిరోయబ్బా

అమ్మనీ నున్ననీ బుగ్గ, ఎంత లేతగా ఉన్నదే మొగ్గా

అబ్బనీ తియ్యనీ దెబ్బ, ఎంతొ కమ్మగా వుందిరోయబ్బా

వయ్యారాలా వెల్లువా వాటేస్తుంటే వారెవా..

పురుషుల్లోనా పుంగవా పులకింతొస్తే ఆగవా

అబ్బనీ తియ్యనీ దెబ్బ, ఎంతొ కమ్మగా వుందిరోయబ్బా

అమ్మనీ నున్ననీ బుగ్గ, ఎంత లేతగా ఉన్నదే మొగ్గా

చిటపట నడుముల ఊపులో, ఒక ఇరుసున వరసలు కలవగా 

ముసిరిన కసి కసి వయసులో, ఒక ఎదనస పదనిస కలవగా 

కాదంటూనె కలపడు, అది లేదనంటూనే ముడిపడూ

ఏమంటున్నా మదనుడు తెగ ప్రేమించాకా వదలడు 

చూస్తా సొగసు కోస్తా, వయసు నిలబడు కౌగిట 

అబ్బనీ తియ్యనీ దెబ్బ, ఎంతొ కమ్మగా వుందిరోయబ్బా

అమ్మనీ నున్ననీ బుగ్గ, ఎంత లేతగా ఉన్నదే మొగ్గా

పురుషుల్లోనా పుంగవా పులకింతొస్తే ఆగవా

వయ్యారాలా వెల్లువా వాటేస్తుంటే వారెవా..

అబ్బనీ తియ్యనీ దెబ్బ, ఎంతొ కమ్మగా వుందిరోయబ్బా

అమ్మనీ నున్ననీ బుగ్గ, ఎంత లేతగా ఉన్నదే మొగ్గా

అడగక అడిగినదేమిటో, లిపి చిలిపిగ ముదిరిన కవితగా 

అదివిని అదిమిన షోకులో, పురి విడిచిన నెమలికి సవతిగా 

నిన్నే నావి పెదవులూ, అవి నేడైనాయి మధువులు 

రెండున్నాయి తనువులు, అవి రేపవ్వాలి మనువులు 

వస్తా వలచి వస్తా మనకు ముదిరిన ముచ్చట  

అబ్బనీ తియ్యనీ దెబ్బ, ఎంతొ కమ్మగా వుందిరోయబ్బా

అమ్మనీ నున్ననీ బుగ్గ, ఎంత లేతగా ఉన్నదే మొగ్గా

పురుషుల్లోనా పుంగవా పులకింతొస్తే ఆగవా

వయ్యారాలా వెల్లువా వాటేస్తుంటే వారెవా..

అబ్బనీ తియ్యనీ దెబ్బ, ఎంతొ కమ్మగా వుందిరోయబ్బా

అమ్మనీ నున్ననీ బుగ్గ, ఎంత లేతగా ఉన్నదే మొగ్గా

Monday, March 31, 2025

Yamaho ni yama yama andam [యమహో నీ యమా యమా అందం] - Jagadeka Veerudu Atiloka Sundari

Song Name :Yamaho ni yama yama 
Movie:Jagadeka Veerudu Atiloka sundari
Singers:S.P. Balasubramanyam garu, S. Janaki garu
Lyricist:Veturi Sundara rama murthy garu
Composer:Illayaraja garu
DirectorK. Raghavendra Rao garu 

యమహో నీ యమా యమా అందం, చెలరేగింది ఎగా దిగా తాపం

నమహో నీ ఝమా ఝమా వాటం, సుడి రేగింది ఎడా పెడా తాళం 

ఫొజుల్లో నేను యముడంత వాణ్ణి, మోజుల్లో నీకు మొగుడంటి వాణ్ణి

అల్లారు ముద్దుల్లో గాయం, విరబూసింది పువ్వంటీ ప్రాయం

యమహో నీ యమా యమా అందం, చెలరేగింది ఎగా దిగా తాపం

నమహో నీ ఝమా ఝమా వాటం, సుడి రేగింది ఎడా పెడా తాళం 

నల్లని కాటుక పెట్టి, గాజులు పెట్టి, గజ్జా కట్టీ 

గుట్టుగ సెంటే కొట్టి వడ్డాణాలే వంటికి పెట్టి

తెల్లనీ చీరా కట్టి మల్లెలు చుట్టీ కొప్పున పెట్టి

పచ్చనీ పాదాలకే ఎర్రని బొట్టూ పరాణెట్టి

చీకటింట దీపామెట్టీ చీకుచింత పక్కానెట్టి 

నిన్ను నాలొ దాచిపెట్టీ, నన్ను నీకు దోచీపెట్టీ 

పెట్టూ పోతా వద్దే చిట్టెంకీ, చెయి పట్టిన్నాడే కూసే వల్లంకి 

పెట్టేదీ మూడే ముళ్ళమ్మీ, నువ్ పుట్టిందీ నాకోసమమ్మి  

ఇక నీ సొగసూ నా వయసూ పేనుకొనే ప్రేమలలో 

యమహో నీ యమా యమా అందం, చెలరేగింది ఎగా దిగా తాపం

నమహో నీ ఝమా ఝమా వాటం, సుడి రేగింది ఎడా పెడా తాళం 

పట్టెమంచమేసీ పెట్టీ పాలుబెట్టీ పండూబెట్టీ 

పక్కమీద పూలూకొట్టీ పక్కాపక్కాలొళ్ళూ పెట్టీ 

ఆకులో వక్కాలెట్టి సున్నాలెట్టి చిలకాచుట్టీ 

ముద్దుగా నోట్లోపెట్టీ పరువాలన్నీ పండాబెట్టి 

చీరగుట్టు సారేబెట్టీ సిగ్గులన్నీ ఆరాబెట్టీ 

కళ్ళలోన వొత్తూలెట్టీ కౌగిలింత మాటూబెట్టీ 

వొట్టేపెట్టి వొగ్గేసాకా మావా నిను వొళ్ళో బెట్టీ లాలించేదే ప్రేమా 

పెట్టేయీ సందెసీకట్లోనా నను తట్టేయి కౌగిలింతల్లోన 

ఇక ఆ గొడవ ఈ చొరవా ఆగవులే అలజడిలో 

యమహో నీ యమా యమా అందం, చెలరేగింది ఎగా దిగా తాపం

నమహో నీ ఝమా ఝమా వాటం, సుడి రేగింది ఎడా పెడా తాళం 

ఫొజుల్లో నేను యముడంత వాణ్ణి, మోజుల్లో నీకు మొగుడంటి వాణ్ణి

అల్లారు ముద్దుల్లో గాయం, విరబూసింది పువ్వంటీ ప్రాయం

యమహో నీ యమా యమా అందం, చెలరేగింది ఎగా దిగా తాపం

Sunday, May 31, 2009

Kshana Kshanam - Ko antey Koti

Movie : Kshana Kshanam
Language : Telugu
Music Dir: M.M. Keeravani
Singer: S.P. Balasubramanyam, Sridevi
Artists: Venkatesh, Sridevi

King la kanipistunnadu mari vangi vangi dannalenduku edutunnadu
ema sarada gammattuga leda ema sarada
Raajaina raraajaina money unna mana mundu salam kottavalasindey
ee tppu debba tagilindantey boltha padavalasindey; paisa untey parigettuku raada paramaatmaina
Ko antey Koti dorlukuntu vastundi konda meedi kothi....
tandatharadha tandatharadhdaa tandatharadha(2)

Ho yabbo ...maya sabha laaga yamaaga undi yemi maaya lokamidi
achcha telugu lo aidu taarala poota koolla illu,
makeu vesi maro bhashalo five star hotel antaaru.... cha
Yes... do u have any reservation? ayyayyo ledey
welcome sir, welcome lady; we are glad to have you here.
to serve you is our pleasure.
reparepa laadey rangu kaagtha emitidi?
devullaina devulladey antha mahatyam emundi...
sreee lakshmi devi swahastham tho santakam chesina patram...
evarakkada antey chittam antundi ee lokam mottham..
chekkantaaru deenni... check in sir..
Ko antey Koti dorlukuntu vastundi konda meedi kothi....

wow ayyayyo...oh oh.....I cant believe it..
ayybaaboi kada idi... swargamemo kada idi..
paisa lo power idi panneeti shower idi
kaasu mundu gaalaina condition lo untundi...
paikam tho rapanchmantha padaggadiki vastundi..
mabbulatho parupulu kutti, paala nurugu duppati chutti..
parichi unchina paanupu choosthey, melukova kalalanni....
tandatharadha tandatharadhdaa tandatharadha(2)

Tuesday, December 23, 2008

Kanne pillavani kannulunnavani telugu lyrics [కన్నెపిల్లవని కన్నులున్నవని ] - Aakali Raajyam

Movie Name: Aakali Rajyam (1980)
Singer: S.P. Balasubramanyam garu, S, Janaki garu
Music Director: M.S. Viswanathan garu
Lyrics: Aatreya garu
Director: K. Balachander garu

తన తన్ననాన తన తన్ననాన తాన తాన తన్ననా 

ఓహొ.. కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి  
లల్ల లల్ల లాల లల్ల లల్ల లాల లాలల్లల్లాల లాలాలాలా లాలాలా 
చిన్న నవ్వు నవ్వి వన్నెలెన్ని రువ్వి ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి 

కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి  
చిన్న నవ్వు నవ్వి వన్నెలెన్ని రువ్వి ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి 
ఏవంటావ్? 

సంగీతం, న న నా నువ్వైతే, రీ స రీ సాహిత్యం, ఊ హూ ఊ నేనఔతా 
సంగీతం నువ్వైతే సాహిత్యం నేనౌతా 

కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి  
చిన్న నవ్వు నవ్వి వన్నెలెన్ని రువ్వి ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి 

న న న నా నా say it once again 
న న న నా నా ..ఊ.. స్వరము నీవై
తరనన తరరనానా, స్వరమున పదము నేనై ok 
తానే తానే తాన, ఓహో అలాగా.. గానం గీతం కాగా  
తరనతానా, కవిని నెనై
తానా ననన తానా, నాలో కవిత నీవై 
నాననాననా లలలా తననా తాననా, beautiful కావ్యమైనదీ తలపో పలుకో మనసో 

కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి  
చిన్న నవ్వు నవ్వి వన్నెలెన్ని రువ్వి ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి 
సంగీతం నువ్వైతే సాహిత్యం నేనౌతా 

ఇప్పుడు చూద్దాం 
తననా తననా తన్నా, ఉహూ.. తననా తననా అన్నా 
తానా తన్నా తానం తరనా తన, తానా అన్న తాళం ఒకటే కదా 
తనన టాన తాననాన తానా, అహా అయ్యబాబోయ్.. తనన టాన తాననాన తానా
ఊ.. పదముచేర్చి పాటకూర్చలేదా  
శెభాష్..!
దనిని దససా అన్నా నీదా అన్న స్వరమే రాగం కదా
నీవు నేననీ అన్నా మనమే కాదా, నీవు నేననీ అన్నా మనమే కాదా 

కన్నే పిల్లవని కన్నులున్నవని కవితచెప్పి మెప్పించావే గడసరీ 
చిన్న నవ్వు నవ్వి నిన్ను దువ్వి దువ్వి కలిసి నేను మెప్పించేదీ ఎపుడనీ 
కన్నే పిల్లవని కన్నులున్నవని కవితచెప్పి మెప్పించావే గడసరీ 
చిన్న నవ్వు నవ్వి నిన్ను దువ్వి దువ్వి కలిసి నేను మెప్పించేదీ ఎపుడనీ 

ఊ.. అహాహా ల ల లా ఊహూహూ ఆహహా 
ల ల లా, ల ల లా, ల ల లా, ల ల లా  ...