Showing posts with label telugu classics. Show all posts
Showing posts with label telugu classics. Show all posts

Friday, July 31, 2026

Hello guru. [హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం] - Nirnayam

Title :Hello guru prema kosameroy
Movie:Nirnayam
Singers:S.P. Balasubramanyam గారు
Lyricist:Sirivennela Seetharama sastry గారు
Composer:Illayaraja గారు
Director:Priyadarshan గారు

హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం

ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే, మహామహా సుందరాంగులే పొందలేనివాణ్ణి హార్నీ

హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం

ఉంగరాల జుట్టువాన్ని ఒడ్డుపొడుగు వున్నవాణ్ణి, చదువు సంధ్య గల్గినోడ్ని చౌకబేరమా

గొప్ప ఇంటి కుర్రవాణ్ణి అక్కినేని అంతటోడ్ని, కోరి నిన్ను కోరుకుంటే పెద్దనేరమా

నాకన్నా నీకున్న తాకీదులేంటమ్మా, నా ఎత్తు నా బరువు నీకన్న మోరమ్మా

నేనంటే కాదన్న లేడీసే లేరమ్మ, నాకంటె ప్రేమించే మొనగాడు ఎవరమ్మ 

I love you darling. because you are charming 

ఎలాగొలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్లే, why not

హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం

ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే, మహామహా సుందరాంగులే పొందలేనివాణ్ణి Yeah Yeah 

హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం , మగాడితో ఆడదానికేలా పౌరుషం

కట్టుకుంటె నిన్నే  తప్ప కట్టుకోనె కట్టుకోను, ఒట్టు పెట్టుకుంటినమ్మా బెట్టు చేయకే

అల్లిబిల్లి గారడీలు చెల్లవింక చిన్నదానా, అల్లుకోవె నన్నెనీవు  మల్లెతీగలా 

నీచేతే పాడిస్తా లవ్‌సాంగ్లు డ్యూయెట్లు, నా చేత్తో తినిపిస్తా మన పెళ్ళి బొబ్బట్లూ 

ఆహా నా పెళ్ళంట ఓహో నాపెళ్ళంటా, అభిమన్యుడు శశిరేఖ  అందాల జంటంటా 

అచ్చా మైనె ప్యార్ కియా, లుచ్చా కాం నహీ కియా , అమీ తుమీ తేలకుంటె నిను లేవదీస్కుపోతా 

are you ready?

హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం

ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే, మహామహా సుందరాంగులే పొందలేనివాణ్ణి హార్నీ  

Wednesday, June 17, 2026

Elluvocchi godaramma [ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్ల పడ్డాదమ్మో] - Devatha

Title :Elluvocchi godaaramma
Movie:Devata / Devatha
Singers:S.P. Balasubramanyam గారు, P. Suseela గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Chakravarthy గారు
Director:K. Raghavendra Rao గారు

ఈ గీతంలో వాడిన తెలుగు మాండలికాన్ని (తూర్పు) మార్చకుండా రాయడం జరిగింది. (రచయిత వ్ బదులుగా యాసలొ య/ఎ ని వాడారు)

ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్ల పడ్డాదమ్మో, ఎన్నెలొచ్చి రెల్లుపూలే ఎండీగిన్నేలయ్యేనమ్మో 

కొంగుదాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే..

ఓరయ్యో రావయ్యో 

ఆగడాల పిల్లోడా నా సోగ్గాడా, మీగడంతా నీదేలే నా బుల్లోడా

ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్ల పడ్డాదమ్మో, ఎన్నెలొచ్చి రెల్లుపూలే ఎండీగిన్నేలయ్యేనమ్మో 

కొంగుచాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే, 

ఓలమ్మో రావమ్మో  

ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు, ఆగడాల పిల్లోడైనా నీవోడు 

ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు, ఆగడాల పిల్లోడైనా నీవోడు 

ఈ కళ్ళకున్న ఆకళ్ళలోనా అందాల విందమ్మ నువ్వు

వాటేసుకుంటే వందేళ్ళపంట వద్దంటే విందమ్మ నవ్వు

చెయ్యేస్తే చేమంతి బుగ్గ, చెంగావి గన్నేరు మొగ్గ

చెయ్యేస్తే చేమంతి బుగ్గ, చెంగావి గన్నేరు మొగ్గ

ఈడొచ్చి నీ చోటు ఈడుంది రమ్మంటే ఏడేసుకుంటవు గూడు 

కౌగిళ్ళలో నన్ను కూడు, ఆకళ్ళ కుంటాది కూడు

గుండెల్లో చోటుంది చూడు 

ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్ల పడ్డాదమ్మో, ఎన్నెలొచ్చి రెల్లుపూలే ఎండీగిన్నేలయ్యేనమ్మో 

కొంగుచాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే

ఓరయ్యో రావయ్యో 

ఆగడాల పిల్లోడా నా సోగ్గాడా, మీగడంతా నీదేలే నా బుల్లోడా

ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు, ఆగడాల పిల్లోడైనా నీవోడు 

నీ కళ్ళుసోక, నా తెల్లకోక అయ్యిందిలే గళ్ళకోక 

నీ మాటవిన్న నా జారుపైట పాడిందిలే గాలిపాట 

కళ్ళల్లో ఉన్నయి ముళ్ళు, నేకోరినా మూడు ముళ్ళు 

కళ్ళల్లో ఉన్నయి ముళ్ళు, నేకోరినా మూడు ముళ్ళు 

పొద్దుల్లో కుంకాలు బొట్టెట్టి పోతుంటే కట్టేయ్యనా తాళిబొట్టు 

నా మాటకీఏరు తోడు, ఏరెండీనా ఊరు తోడు 

నీ తోడులో ఊపిరాడు  