Showing posts with label ramgopalvarma. Show all posts
Showing posts with label ramgopalvarma. Show all posts

Monday, June 15, 2026

Enniyallo malliyallo [ఎన్నీయల్లో మల్లియల్లో ఎన్నిన్ని అందాలో] - Shiva

Title :enniyallo malliyallo
Movie:Shiva
Singers:S.P. Balasubramanyam గారు, K.S. Chitra  గారు
Lyricist:Veturi Sundararamamurthuy  గారు
Composer:Illayaraja గారు
Director:Ram Gopal Varma గారు

ఎన్నీయల్లో మల్లియల్లో ఎన్నిన్ని అందాలో

కవ్వింతల్లో తుళ్ళింతల్లో ఎన్నిన్ని కావ్యాలో

ఒంపుల్లొ ఉన్న హంపి శిల్పాలు

ఒళ్ళంటుకుంటే చాలు నాట్యాలు 

శృంగార వీణ రాగాలే...హోయ్

ఎన్నీయల్లో మల్లియల్లో ఎన్నిన్ని అందాలో

కవ్వింతల్లో తుళ్ళింతల్లో ఎన్నిన్ని కావ్యాలో

సిగ్గేయగా బుగ్గామొగ్గ మందారధూళే దులిపే 

జారేసిన పైటంచున అబ్బాయి కళ్ళే నిలిచే

సందిళ్ళకే చలివేస్తుంటే అందించవా సొగసంతా

వొత్తిళ్ళతో వొలిచేస్తుంటే వడ్డించనా వయసంతా

వెలుగులో కలబడే కళలు కన్నా, తనువులో తపనలే కదిపిన కథకళిలోన

ఎన్నీయల్లో మల్లియల్లో ఎన్నిన్ని అందాలో

కవ్వింతల్లో తుళ్ళింతల్లో ఎన్నిన్ని కావ్యాలో 

ఈ చీకటే ఓ చీరగా నా చాటు అందాలడిగే

ఈ దివ్వెలా క్రీనీడలే నీ సోకులన్నీ కడిగే

నీ మబ్బుల్లే గుడికడుతుంటే జాబిల్లిలా పడుకోనా

తబ్బిబ్బుతో తడబడుతుంటే నీ గుండెలో నిదరోనా 

ఉదయమే అరుణమై ఉరుముతున్నా, చెదరని నిదరలో కుదిరిన పడకలలోన

ఎన్నీయల్లో మల్లియల్లో ఎన్నిన్ని అందాలో

కవ్వింతల్లో తుళ్ళింతల్లో ఎన్నిన్ని కావ్యాలో

ఒంపుల్లొ ఉన్న హంపి శిల్పాలు

ఒళ్ళంటుకుంటే చాలు నాట్యాలు 

శృంగార వీణ రాగాలే...హోయ్

ఎన్నీయల్లో మల్లియల్లో ఎన్నిన్ని అందాలో 

Sunday, June 7, 2026

Andanata etta tara teeram [అందనంత ఎత్తా తారాతీరం సంగతేంటో చూద్దాం దా] - Kshana kshanam

Title :Andanata etta tara tiram
Movie:Kshana kshanam
Singers:S.P. Balasubramanyam గారు, K.S. Chitra గారు
Lyricist:Sirivennela Sitaraama Sastry గారు
Composer:M.M. Keeravani గారు
Director:Ram Gopal Varma గారు

అందనంత ఎత్తా తారాతీరం సంగతేంటో చూద్దాం దా 

ఆ అందమంత కొత్త తాళంతీస్తే సందెవిందు సొంతం కాదా 

అందనంత ఎత్తా తారాతీరం సంగతేంటో చూద్దాం దా 

ఆ అందమంత కొత్త తాళంతీస్తే సందెవిందు సొంతం కాదా 

చిందే సరదా పొంగే వరద స్వర్గం మన సమీపమయ్యేంత 

అందనంత ఎత్తా తారాతీరం సంగతేంటో చూద్దాం దా 

ఆ అందమంత కొత్త తాళంతీస్తే సందెవిందు సొంతం కాదా 

అందనంత ఎత్తా తారాతీరం సంగతేంటో చూద్దాం దా 

గువ్వనీడలో గూడుకట్టుకో కుర్రవేడిలో కూకూ కూతపెట్టుకో 

దిక్కులన్ని తెగించే వేగంతో రెక్కవిప్పు నిషాలెన్నో 

గుప్పెడంత కులాసా గుండెల్లో గుప్పుమన్న ఖుషీలెన్నో 

తోటమాలి చూడకుంటె ఏటవాలు పాటవెంట  మొగ్గనవ్వు చేరుకుంటె చుక్కలింట పండగంట 

అందనంత ఎత్తా తారాతీరం సంగతేంటో చూద్దాం దా 

ఆ అందమంత కొత్త తాళంతీస్తే సందెవిందు సొంతం కాదా 

అందనంత ఎత్తా తారాతీరం సంగతేంటో చూద్దాం దా 

కొంటెకోనలో కోటకట్టుకో కొత్తకోకలో కో కో కోరికందుకో 

కోలకళ్ళ గులాబీ గుమ్మంలో కాచుకున్న కబుర్లెన్నో 

కమ్ముకున్న కిలాడీ కొమ్మల్లో గుచ్చుకున్న గుణాలెన్నో 

లాగుతున్న గాలివెంట సాగుతున్న పూలమంట తాకుతుంటే దాగదంట ఆకశాన పాలపుంత  

అందనంత ఎత్తా తారాతీరం సంగతేంటో చూద్దాం దా 

ఆ అందమంత కొత్త తాళంతీస్తే సందెవిందు సొంతం కాదా 

అందనంత ఎత్తా తారాతీరం సంగతేంటో చూద్దాం దా 

Saturday, January 17, 2026

Botany paatamundi [బోటనీ పాఠముంది మ్యాటనీ ఆటవుంది ] - Shiva / Siva

Title :Botany patamundi
Movie:Shiva
Singers:S.P. Balasubramanyam గారు, and S.P. Sailaja గారు
Lyricist:Sirivennela Seetaraama sastry గారు
Composer:Illayaraja గారు
Director:Ram Gopal Varma (RGV) గారు

బోటనీ పాఠముంది మ్యాటనీ ఆటవుంది దేనికో ఓటు చెప్పరా

హిస్టరీ లెక్చరుంది మిస్టరీ పిక్చరుంది సోదరా ఏది బెస్టురా 

బోటనీ క్లాసంటే బోరు బోరు హిస్టరీ రొస్టుకన్న రెస్టుమేలు

పాటలూ ఫైటులున్న ఫిల్ముచూడు, బ్రేకులు డిస్కోలు చూపుతారు

జగడ జగడ జగడ జగడజాం (4)

దువ్వెనే కోడిజుత్తు నవ్వెనే ఏడ్చినట్టు, ఎవ్వరీ కొత్త నవాబు 

కన్నెనే చూడనట్టు కన్నులే తేలబెట్టు ఎవ్వరీ వింత గరీబు 

జోరుగా వచ్చాడే జేమ్స్‌బాండు, గీరగా వేస్తాడే ఈలసౌండు

నీడలా వెంటాడే జీడిబ్రాండు, ఫొజులే చూస్తుంటే ఒళ్ళుమండు

జగడ జగడ జగడ జగడజాం (4)

అయ్యో మార్చినే తల్చుకుంటే మూర్చలే ముంచుకొచ్చే, మార్గమే చెప్పు గురువా 

హే ఛీ తాళం రాదు మార్చిట మార్చి, తాళంలో పాడరా వెధవా ..

మార్చినే తల్చుకుంటే మూర్చలే ముంచుకొచ్చే, మార్గమే చెప్పు గురువా 

కొండలా కోర్సువుంది ఎంతకీ తగ్గనంది, ఏందిరో ఇంత గొడవ

ఎందుకీ హైరానా వెర్రినాన్న, వెళ్ళరా సులువైన దారొలోన 

వుందిగా సెప్టెంబరు మార్చిపైన, హొయ్ వాయిదా పద్ధతుంది దేనికైనా 

మ్యాక్జిమం మార్కులిచ్చు మ్యాథ్సులో ధ్యాసవుంచు, కొద్దిగా వొళ్ళువంచరా రేయ్

తందనా తందనన తందనా తందనన నందనా తందనన నా 

క్రాఫుపై వున్న శ్రద్ధ, గ్రాఫుపై పెట్టు కాస్త ఫస్టుర్యాంకు పొందవచ్చురోయ్

తందనా తందనన తందనా తందనన నందనా తందనన నా 

అరే ఏంటి సార్

లెక్కలూ ఏక్కాలు దెల్వనోళ్ళు, లక్కుతోని లక్షలల్ల మునిగిపోతరు  

పుస్త్కాల్తో కుస్తీలు పట్టెటోళ్ళు, సర్కారి క్లర్కులయ్యి మురిగిపోతరు 

జగడ జగడ జగడ జగడజాం (4) 

Sunday, May 11, 2025

Andama Anduma [అందమా అందుమా.. అందనంటే అందమా] - Govinda Govinda

Song Name :Andama anduma
Movie:Govinda Govinda
Singers:S.P. Balasubramanyam garu, K.S. Chitra garu
Lyricist:Sirivennala seetarama sastry garu
Composer:Raj - Koti garlu
DirectorRam Gopal Varma garu 

అందమా అందుమా.. అందనంటే అందమా

చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా 

ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూలకొమ్మ పరవశాలు పంచవమ్మ పాలసంద్రమా ... 

అందమా అందుమా.. అందనంటే అందమా

చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా 

ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూలకొమ్మ పరవశాలు పంచవమ్మ పాలసంద్రమా ...

ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మ.. 

అందమా అందుమా.. అందనంటే అందమా

ఆకలుండదే దాహముండదే ఆకతాయి కోరిక, కొరుక్కుతింటదీ 

ఆగనంటదే దాగనంటదే ఆకుచాటు వేడుక, కిర్రెక్కమంటదే 

వన్నెపూల విన్నపాలు విన్నానమ్మీ, చిటికవేలు ఇచ్చి ఏలుకుంటానమ్మి

రాసిపెట్టిఉంది గనుక నిన్నే నమ్మి, ఊసులన్ని పూసగుచ్చి ఇస్తాసుమ్మీ 

ఆలనా పాలనా చూడగా చేరనా చెంత 

అందమా అందుమా.. అందనంటే అందమా

చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా 

వెయ్యిచెప్పినా లక్షచెప్పినా లక్ష్యపెట్టదే ఎలా, ఇదేమి విల విల

తీయ తియ్యగా నచ్చచెప్పనీ చిచ్చికొట్టనీ ఇలా, వయ్యారి వెన్నెలా 

నిలవనీదు నిదురపోదు నారాయణ, వగలమారి వయసుపోరు నా వల్లనా 

చిపి ఆశ చిటికలోన తీర్చెయ్యనా, మంత్రమేసి మంచిచేసి లాలించనా 

ఆదుకో నాయనా ఆర్చవా తీర్చవా చింత 

అందమా అందుమా.. అందనంటే అందమా

చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా 

ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూలకొమ్మ పరవశాలు పంచవమ్మ పాలసంద్రమా ...

ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మ.. 

Tuesday, April 29, 2025

Nigga deesi adugu (నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని) - Gaayam

Song Name :Nigga deesi adugu
Movie:Gaayam
Singers:S.P. Balasubramanyam garu
Lyricist:Sirivennela Seeta Rama Sastry garu
Composer:Sri garu
Director:Ram Gopal Varma garu

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని

మారదు లోకం, మారదు కాలం, దేవుడు దిగిరానీ ఎవ్వడు ఏమైపోనీ

మారదు లోకం, మారదు కాలం

గాలివాటు గమనానికి, కాలిబాట దేనికి

గొర్రెతాటు మందకి నీ జ్ఞానబోధ దేనికి

ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం, ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం

రామబాణమార్పిందా రావణకాష్ఠం, క్రిష్ణగీత ఆపిందా నిత్య కురుక్షేత్రం

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని

మారదు లోకం, మారదు కాలం

పాతరాతి గుహలు పాలరాతి గృహాలైనా, అడవినీతి మారిందా ఎన్ని యుగాలైనా 

వేట అదే వేటు అదే నాటి కథే అంతా, నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా 

బలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండా, శతాబ్ధాలు చదవలేద ఈ అరణ్యఖాండా 

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని

మారదు లోకం, మారదు కాలం, దేవుడు దిగిరానీ ఎవ్వడు ఏమైపోనీ

మారదు లోకం, మారదు కాలం

Monday, April 28, 2025

Nazam pori nasdiku jeri [నైజాముపోరి నజ్దీకుచేరి నవ్విందొ ఓసారి] - Gaayam

Song Name :Najamu pori nasdiku jeri
Movie:Gaayam
Singers:Mano (nagur babu) garu, K.S. Chitra garu, Eashwar garu
Lyricist:Sirivennela Seeta Rama Sastry garu
Composer:Sri garu
Director:Ram Gopal Varma garu

అరే గిదేం షురూ జేషినావమ్మా.. ఈయాలరేపు గిదెవడింటాడు పాటపాడితే కిక్కుండాలే 

నైజాముపోరి నజ్దీకుచేరి నవ్విందొ ఓసారి, నా జంట కోరి నకరాలమారి వచ్చిందిబై ప్యారీ 

నైజాముపోరి నజ్దీకుచేరి నవ్విందొ ఓసారి, నా జంట కోరి నకరాలమారి వచ్చిందిబై ప్యారీ 

బాగుందిబై జరలాగిందిబై దిమ్మాక్కుపాయె దిల్లు దిమ్మెక్కిపాయె

పంజగుట్ట ఠాణ జూసి, పంజరాన పెడతామంటె పట్టలేక పారిపోయెరో

జింగారే జీగిచాక జింగిచాక, జింగారే జీగిచాక జింగిచాక 

జింగారే జీగిచాక జింగిచాక, జింగారే జీగిచాక జింగిచాక 

జింగారే జింగిచాక జింగిచాక, జింగారే జింగిచాక జింగిచాక 

పైటను చూడగానె పైత్యమొస్తదా, పాడుబుద్ది కోడెగాడు పడ్తరేమి మీద మీద 

పైలపచ్చీసు ఈడు గమ్మునుంటదా మన్ను తిన్న పాములెక్క ఊరుకుంటె పరువుపోదా 

పబ్లిక్కు చూస్తరన్న ఖాతరుండదా ఇజ్జత్తుపోతదన్న జ్ఞానమైన కాస్తలేద 

ముస్తాబు మస్తుగుంటే నోరుఊరదా ఊకేనే ఉండమంటె మంచి మౌక జారిపోదా 

ఆహాఅ...అ... వామ్మో వొద్దమ్మో... కిక్కూ ఊపూ అరె ఉండాలమ్మో 

గుక్కేఆపు ఎందుకు ఏడ్పు చమకు చమకు చిలకా 

జింగారే జీగిచాక జింగిచాక, జింగారే జీగిచాక జింగిచాక 

యాద్గిరిగుట్టకాడ ఎదురుబడ్డదీ థూత్తెరి అంటా నన్ను గుస్సజేసి కస్సుమందీ 

ఒంటరి ఆడపిల్ల అంతలోకువా తుంటరి పిల్లగాడ అక్కసెల్లీ నీకులేరా ..

ఏ మస్తిన్నాం తీయ్ తీయ్ ...

అక్కలుసెల్లెళ్ళు అందరుండినా సక్కని సుక్కలాంటి ఆలి తక్కువాయెమల్ల  

come come baby dont be shy, why dont you take me on a date with you

oh my love.. my Darling....yaah.. యెయెయే....ఏందయ్యో... 

ఏంటా స్పీడూ లేదా బ్రేకూ.. అరె ఆటా పాటా సాగాలంటా ఫికరు దేనికంటా ..