Song Name : | Uruko uruko bangarukonda |
Movie: | Aatmabandham |
Singers: | S.P. Balasubramanyam garu, K.S. Chitra garu |
Lyricist: | Sirivennela Seetharama sastry garu |
Composer: | M.M. Keeravani garu |
Director: | Suneel Varma garu |
ఊరుకో ఊరుకో బంగారుకొండ నల్లకలువ కళ్ళు ఎర్రబారనీకుండ
దాయి దాయి దాయి దాయి దమ్మనీ, చేయిజారిపోయిన జాబిల్లిని
తేలేని తల్లిని ఏడిపించకుండా
ఊరుకో ఊరుకో బంగారుకొండ నల్లకలువ కళ్ళు ఎర్రబారనీకుండ
ఇంకిపోని గంగలా కంటినీరు పొంగినా చల్లబడకుందే ఎడారి.. ఎదలో
జ్ఞాపకాల జ్వాలలో రేపులన్ని కాలినా కొంటెఊపిరింకా మిగిలుంది
చల్లనీ నీ కళ్ళలో కమ్మని కలలే చెమ్మగిల్లనీయ్యకుమా కరిగిపోతాను
దాయి దాయి దాయి దాయి దమ్మనీ, చేయిజారిపోయిన జాబిల్లిని
తేలేని తల్లిని ఏడిపించకుండా
ఊరుకో ఊరుకో బంగారుకొండ నల్లకలువ కళ్ళు ఎర్రబారనీకుండ
గుక్కపట్టి ఏడ్చినా ఉగ్గుపట్టవేమని తప్పుపట్టి తిట్టేవారేరీ .. తండ్రీ
అమ్మ వొట్టి మొద్దురా జట్టు ఉండొద్దురా అంటు ఊరడించే నాన్నేరీ
చెప్పరా ఆ గుండెలో చప్పుడే నేనని జన్మలెన్ని దాటైనా చేరుకుంటానని
దాయి దాయి దాయి దాయి దమ్మనీ, చేయిజారిపోయిన జాబిల్లిని
తేలేని తల్లిని ఏడిపించకుండా
ఊరుకో ఊరుకో బంగారుకొండ నల్లకలువ కళ్ళు ఎర్రబారనీకుండ
దాయి దాయి దాయి దాయి దమ్మనీ, చేయిజారిపోయిన జాబిల్లిని
తేలేని తల్లిని ఏడిపించకుండా
No comments:
Post a Comment