Showing posts with label dalapathi. Show all posts
Showing posts with label dalapathi. Show all posts

Saturday, February 14, 2026

Muddabanti puchenule [ముద్దబంతి పూచేనులే తేనెజల్లు చిందేనులే] - Dalapathi

Song Name :Muddabanti poochenule
Movie:Dalapathi
Singers:Mano (Nagur Babu)  గారు , Swarnalatha గారు 
Lyricist:Rajasri garu
Composer:Illayaraja garu
DirectorMani Rathnam garu 

ముద్దబంతి పూచేనులే తేనెజల్లు చిందేనులే, ఊహలన్ని ఊరేగెనే నందనాలు విందుచేసెనే 

ముద్దబంతి పూచేనులే తేనెజల్లు చిందేనులే, ఊహలన్ని ఊరేగెనే నందనాలు విందుచేసెనే 

గుండెల్లో ఊసులన్ని కళ్ళల్లో పొంగెనే, కళ్ళల్లో బాసలన్ని రాగాలై సాగెనే

ముద్దబంతి పూచేనులే తేనెజల్లు చిందేనులే, ఊహలన్ని ఊరేగెనే నందనాలు విందుచేసెనే 

జాబిలి ఆ నింగిలోన మబ్బులలో దాగేనో, వెన్నెలలె దాచేనులో

తీయనీ నీ ధ్యాసలోనే, నిలిచెనే నా ధ్యానం నీతోనే నా లోకం

కనికరించి నన్నే సేదతీర్చు వేళ, కళ్ళలోన ప్రేమ చిలకరించు వేళ

కరిగేనే నీలో 

ముద్దబంతి పూచేనులే తేనెజల్లు చిందేనులే, ఊహలన్ని ఊరేగెనే నందనాలు విందుచేసెనే 

జీవితం పండేనునేడు పలికెనులే ఓ గీతం పాడెనులే సంగీతం 

తోడుగా నీవున్ననాడు ఆశలకే శ్రీకారం మమతలకే ప్రాకారం

చల్లగాలి నీవై సద్దు చేసినావే, చందమామ నీవై పలకరించినావే 

వెలిసేనే నీకై

ముద్దబంతి పూచేనులే తేనెజల్లు చిందేనులే, ఊహలన్ని ఊరేగెనే నందనాలు విందుచేసెనే 

ముద్దబంతి పూచేనులే తేనెజల్లు చిందేనులే, ఊహలన్ని ఊరేగెనే నందనాలు విందుచేసెనే 

గుండెల్లో ఊసులన్ని కళ్ళల్లో పొంగెనే, కళ్ళల్లో బాసలన్ని రాగాలై సాగెనే

ముద్దబంతి పూచేనులే తేనెజల్లు చిందేనులే, ఊహలన్ని ఊరేగెనే నందనాలు విందుచేసెనే 

ముద్దబంతి పూచేనులే తేనెజల్లు చిందేనులే, ఊహలన్ని ఊరేగెనే నందనాలు విందుచేసెనే 

Thursday, February 13, 2025

Sundari Nene nuvvanta (సుందరి నెనే నువ్వంట) - Dalapathi

Song Name :Sundari nene nuvvanta
Movie:Dalapathi
Singers:S.P. Bala subramanyam garu, K.S. Chitra garu
Lyricist:Rajasri garu
Composer:Illayaraja garu
DirectorMani Rathnam garu 

సుందరి నెనే నువ్వంట, చూడని నీలో నన్నంట 
కానుకే ఇచ్చా మనసంత, జన్మకే తోడై నేనుంట
గుండెలో నిండ మంట నీడగా పాడమంట నా సిరి నీవేనట
సుందరి నెనే నువ్వంట, చూడని నీలో నన్నంట 
కానుకే ఇచ్చా మనసంత, జన్మకే తోడై నేనుంట

అనుకున్న మాటలు సర్వం కరిగిపోతే న్యాయమా
మధురాల మధువులు చిందే చల్లని ప్రేమే మాయమా 
రేపవలు నిద్దరలోనూ ఎద నీ తోడే కోరును
యుద్ధాన ఏమైన నా ఆత్మే నిన్నే చేరును 
ఎద తెలుపు ఈ వేళ ఏల ఈ శొధనా 
జాబిలిని నీవడుగు తెలుపు నా వేదన 
నాలో ప్రేమే మరిచావొ, ప్రేమే నన్నే గెలిచేనే..
కానుకే ఇచ్చా మనసంత, జన్మకే తోడై నేనుంట
సుందరి నెనే నువ్వంట, చూడని నీలో నన్నంట 
గుండెలో నిండ మంట నీడగా పాడమంట నా సిరి నీవేనట
సుందరి నెనే నువ్వంట, చూడని నీలో నన్నంట 
కానుకే ఇచ్చా మనసంత, జన్మకే తోడై నేనుంట

పూవ్వులే ముళ్ళై తోచు నేవే నన్ను వీడితే 
ఊహలే పూలై పూచు నీ యెద మాటున చేరితే 
ఆ..మాసాలు వారాలౌను నీవు నేను కూడితే 
వారాలు మాసాలౌను మాటేమారి సాగితే 
పొంగునీ బంధాలే నీ దరి చేరితే 
గాయాలు ఆరేను నీ యెదుట ఉంటే 
నీవే కదా నా ప్రాణం నీవే కదా నా లోకం 

సుందరి నెనే నువ్వంట, చూడని నీలో నన్నంట 
కానుకే ఇచ్చా మనసంత, జన్మకే తోడై నేనుంట 
గుండెలో నిండ మంట నీడగా పాడమంట నా సిరి నీవేనట
సుందరి నెనే నువ్వంట, చూడని నీలో నన్నంట 
కానుకే ఇచ్చా మనసంత, జన్మకే తోడై నేనుంట