Sunday, October 19, 2025

Kanulu kanulu kalise samayam [కనులు కనులు కలిసే సమయం] - Pallavi anupallavi

Movie : Pallavi anupallavi
Song : kanulu kanulu lakise
Music Dir: Illayaraja garu
Singer: S.P. Balasubramanyam garu, S. Janaki garu
Director: Mani Ratnam garu
Lyrics: Raja Sri garu

కనులు కనులు కలిసే సమయం, మనసు మనసు చేసే స్నేహం

నీ చేరువలో నీ చేతలలో వినిపించెను శ్రీరాగం 

కనులు కనులు కలిసే సమయం, మనసు మనసు చేసే స్నేహం

నీ నవ్వులో విరిసె మందారము, నీ చూపులో కురిసె శృంగారము 

నీ మాటలోవుంది మమకారము, నా ప్రేమకేనువ్వు శ్రీకారము 

పరువాలు పలికేను సంగీతము, నయనాలుపాడేను నవగీతము 

నేనే నీకు కానా ప్రాణం, నీవే నాకు కావా లోకం 

కనులు కనులు కలిసే సమయం, మనసు మనసు చేసే స్నేహం

నీ గుండెగుడిలో కొలువుండనీ, నీ వెంటనీడల్లె ననుసాగని

నీపూల ఒడిలో నను చేరనీ, నీ నుదుట సింధూరమై నిలవనీ

చెవిలోన గుసగుసలు వినిపించనీ, ఎదలోన మధురిమలు పండించనీ 

నీలో నేనే కరగాలంట, రోజూ స్వర్గం చూడాలంట  

కనులు కనులు కలిసే సమయం, మనసు మనసు చేసే స్నేహం

నీ చేరువలో నీ చేతలలో వినిపించెను శ్రీరాగం  

No comments:

Post a Comment