| Title : | kurisenu virijallule |
| Movie: | Gharshana |
| Singers: | S.P. Balasubramanyam గారు, Vani Jayaram గారు |
| Lyricist: | Veturi Sundararama murthy గారు |
| Composer: | Illayaraja గారు |
| Director: | Mani Rathnam గారు |
కురిసేను విరిజల్లులే, ఒకటయ్యేను ఇరుచూపులే
అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను
శృంగారమునకీవె శ్రీకారమేకావే
కురిసేను విరిజల్లులే, ఒకటయ్యేను ఇరుచూపులే
ఆకులపై రాలు... ఆ... ఆ...
ఆకులపై రాలు హిమబిందువు వోలె, నా చెలి వొడిలోన పవళించనా
ఆకులపై రాలు హిమబిందువు వోలె, నా చెలి వొడిలోన పవళించనా
రాతిరిపగలు, మురిపాలు పండించు చెలికాని ఎదచేర్చి లాలించనా
నేను నీకు రాగతాళం, నీవు నాకు వేదనాదం
ఆ... ఆ...
కురిసేను విరిజల్లులే, ఒకటయ్యేను ఇరుచూపులే
అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను
శృంగారమునకీవె శ్రీకారమేకావే
కురిసేను విరిజల్లులే, ఒకటయ్యేను ఇరుచూపులే
కన్నుల కదలాడు ఆశలు శృతిపాడు వన్నెల మురిపాల కథ ఏమిటో
తలపుల మాటుల్లో వలపుల తోటల్లో ఊహలు పలికించు కలలేవిటో
పెదవుల తెరలోన మధురాల సిరివాన మధురిమలందించు సుధలేమిటో
పరవశమే సాగి పరువాలు చెలరేగి మనసులు కరిగించు సుఖమేమిటో
పల్లవించే మోహబంధం ఆలపించే రాగబంధం
ఆ... ఆ...
కురిసేను విరిజల్లులే, ఒకటయ్యేను ఇరుచూపులే
అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను
శృంగారమునకీవె శ్రీకారమేకావే
కురిసేను విరిజల్లులే, ఒకటయ్యేను ఇరుచూపులే

No comments:
Post a Comment