| Title : | Oh priya priya |
| Movie: | Geetanjali |
| Singers: | S.P. Balasubramanyam గారు, K.S. Chitraగారు |
| Lyricist: | Veturi Sundararama murthy గారు |
| Composer: | Illayaraja గారు |
| Director: | Mani Rathnam గారు |
ఆ....
ఓ.. ప్రియ ప్రియా... నా ప్రియ ప్రియా
ఏల గాలిమేడలు రాలు పూలదండలు
నీదో లోక నాదో లోకం, నింగినేల తాకేదెలాగా
ఓ.. ప్రియ ప్రియా... నా ప్రియ ప్రియా
ఓ.. ప్రియ ప్రియా... నా ప్రియ ప్రియా
ఏల జాలిమాటలు మాసిపోవు ఆశలు
నింగినేల తాకెవేళ నీవే నేనైపోయె వేళయి
నేడు కాదులే రేపు లేదులే, వీడుకోలిదే వీడుకోలిదే
నిప్పులోన కాలదు నీటిలోన నానదు, గాలిలాగ మారదు ప్రేమ సత్యము
రాచవీటి కన్నెది రంగు రంగు స్వప్నము, పేదవాడి కంటిలో ప్రేమరక్తము
గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో, జననాలు మరణాలు పిలిచేది ప్రేమతో
ఎన్ని బాధలొచ్చినా ఎదురులేదు ప్రేమకు, రాజశాశనాలకి లొంగిపోవు ప్రేమలు
సవాలుగా తీసుకో ఓ నీ ప్రేమ
ఓ.. ప్రియ ప్రియా... నా ప్రియ ప్రియా
ఓ.. ప్రియ ప్రియా... నా ప్రియ ప్రియా
కాళిదాసు గీతికి, కృష్ణ రాసలీలకి, ప్రణయమూర్తి రాధకి ప్రేమ పల్లవి
ఆ అనారు ఆశకి, తాజ్‌మహల్ శొభకి, పేదవాడిప్రేమకి చావుపల్లకి
నిధికన్న ఎదమిన్న గెలిపించు ప్రేమని, కథకాదు బ్రతుకంటే బలికానీ ప్రేమని
వెళ్ళీపోకు నేస్తమా ప్రాణమైన బంధమా, పెంచుకున్న పాశమే తెంచివెళ్ళిపోకుమ
జయించేదిఒక్కటే ఓ నీ ప్రేమ
ఓ.. ప్రియ ప్రియా... నా ప్రియ ప్రియా
ఓ.. ప్రియ ప్రియా... నా ప్రియ ప్రియా
కాలమన్న ప్రేయశి తీర్చమంది లే కసి
నింగినేల తాకెవేళ నీవే నేనైపోయె క్షణాన, లేదు శాశనం లేదు బంధనం
ప్రేమకే జయం, ప్రేమదే జయం..

No comments:
Post a Comment