| Title : | nandi konda vaagullo |
| Movie: | Geetanjali |
| Singers: | S.P. Balasubramanyam గారు, K.S. Chitraగారు |
| Lyricist: | Veturi Sundararama murthy గారు |
| Composer: | Illayaraja గారు |
| Director: | Mani Rathnam గారు |
ఓ... ఓ...
నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో
చంద్రవంక కోనల్లోన సందెపొద్దు సీకట్లో
నీడల్లే ఉన్నా, నీతో వస్తున్నా
నా ఊరేది ఏదీ, నా పెరేది ఏదీ..నా దారేది ఏదీ, నా వారేరీ... ఓ... ఓ...
ఏనాడో ఆరింది నావెలుగు, నీ దరికే నా పరుగు
ఆనాడే కోరాను నీ మనసు, నీ వరమే నన్నడుగు
మోహినీ పిశాచి నా చెలిలే, డాకినీ విశూచి నా సఖిలే
మోహినీ పిశాచి నా చెలిలే, డాకినీ విశూచి నా సఖిలే
విడవకురా వదలనురా ప్రేమే రా నీ నీడా
నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో
భూత ప్రేత పిశాచ బేతాళ మారిచం భం జడం భం భం
నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో
చంద్రవంక కోనల్లోన సందెపొద్దు సీకట్లో
నీడల్లే ఉన్నా, నీతో వస్తున్నా
నీ కబళం పడతా నిను కట్టుకుపోతా, నీ భరతం పడతా నిను పట్టుకుపోతా
ఆ.... ఓ....
ఢాకిని ధక్కా ముక్కల చెక్కా ఢంబో తినిపిస్తాన్, తాటకివనిపిస్తే తాటను వొలిచేస్తాన్
తుంటరి నక్క డొక్కల చొక్క అంభో అనిపిస్తాన్, నక్కను తొక్కిస్తాన్ చుక్కలు కక్కిస్తాన్
రక్కసి మట్ట తొక్కిస బుట్ట పంబేదులిపేస్తాన్, తీతువు పిట్ట ఆయువుచిట్టా నేనే తిరగేస్తాన్
రక్కసి మట్ట తొక్కిస బుట్ట పంబేదులిపేస్తాన్, తీతువు పిట్ట ఆయువుచిట్టా నేనే తిరగేస్తాన్
అస్త్రాయ ఫట్ ఫట్ ఫట్ ఫట్, వస్త్రాయ ఝట్ ఝట్ ఝట్ ఫట్
గోపాలా మసజసతతగ శార్ధూలా
నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో
చంద్రవంక కోనల్లోన సందెపొద్దు సీకట్లో
నీడల్లే ఉన్నా.. న...నా , నీతో వస్తున్నా
నీ కబళం పడతా నిను కట్టుకుపోతా, నీ భరతం పడతా నిను పట్టుకుపోతా
ఆ.... ఓ....
నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో
చంద్రవంక కోనల్లోన సందెపొద్దు సీకట్లో

No comments:
Post a Comment