Song : Chinnari Ponnari kittayya
Music Dir: Illayaraja garu
Singer: S.P. Balasubramanyam garu, S. Janaki garu
Director: K. Viswanath garu
Lyrics: Acharya Aatreya garu
చిన్నారి పొన్నారి కిట్టయ్య, నిన్నెవరు కొట్టారయ్యా
చిన్నారి పొన్నారి కిట్టయ్య, నిన్నెవరు కొట్టారయ్యా
చిన్నారి పొన్నారి కిట్టయ్య, నిన్నెవరు కొట్టారయ్యా
అమ్మ నన్ను కొట్టింది బాబోయ్, అమ్మ నన్ను తిట్టింది బాబోయ్
ఊరుకో నా నాన్న, నిన్నూరడించ నేనున్నా
చిన్నారి పొన్నారి కిట్టయ్య, నిన్నెవరు కొట్టారయ్యా
చిన్నారి పొన్నారి కిట్టయ్య, నిన్నెవరు కొట్టారమ్మా
నల్లనయ్య కనరాక కన్నవాళ్ళు నిదరోక
తల్లిమనసు తానెంత తల్లడిల్లిపోయిందో
వెన్నకై దొంగలా వెళ్ళితివేమో
మన్నుతిని చాటుగా దాగితివేమో
అమ్మా మన్నుతినంగనే శిశువును ఆకొంటినో వెర్రినో
చూడూ నోరు ఆ...
వెర్రిదీ అమ్మేరా...
వెర్రిదీ అమ్మేరా పిచ్చిదాని కోపం రా
పచ్చికొట్టి వెళ్దామా బూచికిచ్చి పోదామా
ఆ..ఏడుపొస్తోంది నాకేడుపొస్తోంది
పచ్చికొట్టిపోయామా పాలెవరిస్తారు కదూ..
బూచాడికి ఇచ్చామా బువ్వెవరు పెడతారు చెప్పు
అమ్మతోనె ఉంటాము అమ్మనొదిలిపోలేము
అన్నమైన తింటాము తన్నులైన తింటాము
కొట్టమ్మా కొట్టు బాగా కొట్టు ఇంకా కొట్టు కొట్టూ
చిన్నారి పొన్నారి కిట్టయ్య, నిన్నెవరు కొట్టారయ్యా
చిన్నారి పొన్నారి కిట్టయ్య, నిన్నెవరు కొట్టారునాన్నా ఎవరమ్మా
చిన్నవాడవైతేను చెయ్యెత్తి కొట్టేను
పెద్దవాడవైతేను బుద్ధిమతి నేర్పేను
ఎశోదనుకానురా నినుదండింపా
సత్యనూ కానురా నిను సాధించా
ఎవ్వరు నువ్వనీ .... ఎవ్వరు నువ్వని నన్ను అడగకు
ఎవరూ కానని విడిచివెళ్ళకు నన్నూ విడిచివెళ్ళకు
వెళ్ళము వెళ్ళము లేమ్మా
చిన్నారి పొన్నారి కిట్టయ్య, నిన్నెవరు కొట్టారయ్యా
చిన్నారి పొన్నారి కిట్టయ్య, నిన్నెవరు కొట్టారయ్యా
అమ్మ నన్ను కొట్టింది బాబోయ్, అమ్మ నన్ను తిట్టింది బాబోయ్
ఊరుకో నా నాన్న అహా ఊరుకోను, నిన్నూరడించ నేనున్నా
చిన్నారి పొన్నారి కిట్టయ్య, నిన్నెవరు కొట్టారయ్యా
చిన్నారి పొన్నారి కిట్టయ్య, నిన్నెవరు కొట్టారయ్యా

No comments:
Post a Comment