Song : ni andam na prema gita
Music Dir: Illayaraja garu
Singer: S.P. Balasubramanyam garu, K.S. Chitra garu
Director: Mohan Gandhi garu
Lyrics: Veturi Sundara Rama murthy garu
నీ అందం నాప్రేమగీత గోవిందం, నీ వర్ణం నా కీరవాణి సంకేతం
నీ రఘం ఏ ప్రేమవీణ సంగీతం, ఈ యోగం ఏ జీవధార సంయోగం
వొయ్యారి రూపం గాంధార శిల్పం శృంగారదీపం వెలిగిస్తే
నీ చూపుకోణం సంధించు బాణం నాలేత ప్రాణం వేధిస్తే
నీ అందం నాప్రేమగీత గోవిందం, ఈ యోగం ఏ జీవధార సంయోగం
జీరాడు కుచ్చిళ్ళ పారాడు పాదాల మారాణి వేదాలు గమకించగా
కోరాడు మీసాల తారాడు మోసాల నామందహాసాలు చమకించగా
ఆరారు రుతువుల్లొ అల్లారు ముద్దుల్లో ఎదజంట తాళాలు వినిపించగా
ఆషాఢ మేఘాల ఆవేశ గీతాలు సరికొత్త భావాలు సవరించగా
నీకోసమే ఈడూనేనూ వేచాములే, నీకోసమే నాలో నన్నే దాచానులే
నిను పిలిచాను మలిసందే పేరంటం, ఇక మొదలాయె పొదరింటి పోరాటం ఆరాటం
నీ అందం నాప్రేమగీత గోవిందం, ఈ యోగం ఏ జీవధార సంయోగం
హంసల్లే వచ్చింది హింసల్లే గిచ్చింది నీ నవ్వు నా పువ్వు వికసించగా
మాటల్లే వచ్చింది మనసేదో విప్పింది వద్దన్న నీ మాట వలపించగా
రెప్పల్లోకొచ్చింది రేపల్లెకాడింది నానువ్వు నీనేను క్రీడించగా
గాధల్లో నిదరోయి రాధమ్మ లేచింది నా వేణువే నాకు వినిపించగ
నీ పింఛమే కిలికించితాలు చేసిందిలే నాకోసమే ఈ పారిజాతం పూసిందిలే
మన హృదయాలలో ప్రేమ తారంగం, స్వరబృందావిహారాల చిందేటి ఆనందం
నీ రఘం ఏ ప్రేమవీణ సంగీతం, ఈ యోగం ఏ జీవధార సంయోగం
వొయ్యారి రూపం గాంధార శిల్పం శృంగారదీపం వెలిగిస్తే
నీ చూపుకోణం సంధించు బాణం నాలేత ప్రాణం వేధిస్తే
నీ అందం నాప్రేమగీత గోవిందం, ఈ యోగం ఏ జీవధార సంయోగం

No comments:
Post a Comment