Showing posts with label jonnavittula. Show all posts
Showing posts with label jonnavittula. Show all posts

Thursday, January 1, 2026

Chinuku chinuku andelato [చినుకు చినుకు అందెలతో, చిటపట చిరు సవ్వడితో] - Maayalodu

Title :Chinuku chinuku andelato
Movie:Maayalodu
Singers:S.P. Balasubramanyam గారు, K.S. Chitra గారు
Lyricist:Jonnavittula గారు
Composer:S.V. Krishnareddy గారు
Director:S.V. Krishnareddy గారు

చినుకు చినుకు అందెలతో, చిటపట చిరు సవ్వడితో 

నీలిమబ్బు కురుల ముడిని జారవిడిచి ఒళ్ళుమరచి

వానజాణ ఆడింది వయ్యారంగా నీళ్ళపూలు జల్లింది సింగారంగా 

చినుకు చినుకు అందెలతో, చిటపట చిరు సవ్వడితో 

నీలిమబ్బు కురుల ముడిని జారవిడిచి ఒళ్ళుమరచి

వానజాణ ఆడింది వయ్యారంగా నీళ్ళపూలు విసిరింది సింగారంగా 

నింగినేల ఈవేళ చలికి వణికిపోతుంటే, బిగికౌగిలి పొదరింటికి పదపదమంది

ఈ కౌగిలింతలోన ఏలో.. గుండెల్లో ఎండకాసె ఏలో 

అరె, పైన మబ్బు ఉరిమింది పడుచు జింక బెదిరింది, వలవేయక సెలయేరై పెనవేసింది 

అరె, చినుకమ్మ మెరుపమ్మ ఏలో, చిటికేస్తే బుగ్గమీద ఏలో 

తలపూ తొలివలపూ ఇక తకఝం తకఝం, వయసూ తడిసొగసు అరవిరిసే సమయం 

ఆహా ఉహు ఒహోహో 

చినుకు చినుకు అందెలతో, చిటపట చిరు సవ్వడితో 

నీలిమబ్బు కురుల ముడిని జారవిడిచి ఒళ్ళుమరచి

వానజాణ ఆడింది వయ్యారంగా నీళ్ళపూలు జల్లింది సింగారంగా 

మనసు పట్టు తప్పింది వయసు గుట్టు తడిసింది, ఎదలోపల చలిగాలుల సుడిరేగింది 

వానొచ్చే వరదొచ్చే ఏలో, వయసొచ్చే తెలిసొచ్చే ఏలో

మేనిచూపు పో అంది వాలుచూపు సయ్యంది, చెలికోరిక అలవోకగ తలవూపింది 

అరే సరసాలసిందులోన ఏలో సరిగంగతానాలు ఏలో 

ఒడిలో ఇక ఒకటై తక తకతై అంటే, సరసానికి దొరసానికి ముడిపెడుతుంటే 

ఆహా ఉహు ఒహోహో 

చినుకు చినుకు అందెలతో, చిటపట చిరు సవ్వడితో 

నీలిమబ్బు కురుల ముడిని జారవిడిచి ఒళ్ళుమరచి

వానజాణ ఆడింది వయ్యారంగా నీళ్ళపూలు జల్లింది సింగారంగా 

చినుకు చినుకు అందెలతో, చిటపట చిరు సవ్వడితో 

నీలిమబ్బు కురుల ముడిని జారవిడిచి ఒళ్ళుమరచి

వానజాణ ఆడింది వయ్యారంగా నీళ్ళపూలు జల్లింది సింగారంగా  

Friday, July 25, 2025

Sarigamapadanini [సరిగమపదనిని నీ దానిని] - Swarakalpana

Song Name :sarigamapadani
Movie:Swara kalpana
Singers:S.P. Bala subramanyam garu, S. Janaki garu
Lyricist:Jonnavittula Ramalingeswara rao  garu
Composer:Gangai Amaran garu
DirectorVamsy garu 

సరిగమపదనిని నీ దానిని

సరిగమపదనిని నీ దానిని, సరిగా సాగనీ నీ దారిని

సరిగమపదనిని నీ దానిని

దాగని నిగనిగ ధగధగ మని, దా మరి మానిని సరిదారిని

దా మరి మానిని సరిదారిని

సామ సాగరిని సాగనీ నీదరినీ, సామసాగరిని సాగనీ నీదరినీ 

సగమని మరి నీ సగమనీ 

నీదాపామని పాదని సాదని 

నీదాపామని పాదని సాదని 

గరిమగ మగనిగ మరి మరి సాగని

సరిగమపదనిని నీ దానిని

దా మరి మానిని సరిదారిని

నిగమాగమాపగా నీసరిగ గాగ 

నిగమాగమాపగా నీసరిగ గాగ 

సరిగమపదనీ గనిగా దా, సరిగమపదనీ గనిగా దా 

నీ గరిమని గని నీ దరిని మని

నీ గరిమని గని నీ దరిని మని

సాగనీ సమపద సమాగమమనీ 

దాగని నిగనిగ ధగధగ మని, దా మరి మానిని సరిదారిని

దా మరి మానిని సరిదారిని

సరిగమపదనిని నీ దానిని, సరిగా సాగనీ నీ దారిని

సరిగమపదనిని నీ దానిని 

Saturday, April 5, 2025

Andari bandhuvaya bhadrachala ramayya [అందరి బంధువయా భద్రాచల రామయ్య] - Devullu

Song Name :Andari bandhuvaya bhadrachala ramayya
Movie:Devullu
Singers:S.P. Balasubramanyam garu, 
Lyricist:Jonnavittula Ramalingeswara rao garu
Composer:Vandemataram Srinivas garu
DirectorKodi Rama Krishna garu 

రామా... రామా...

అందరి బంధువయా భద్రాచల రామయ్య

ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య

అందరి బంధువయా భద్రాచల రామయ్య

ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య

చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య

చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య

కోర్కెలుతీర్చే వాడయ్య కోదండ రామయ్య

అందరి బంధువయా భద్రాచల రామయ్య

ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య

రామా ... రామా....

తెల్లవారితే చక్రవర్తియై రాజ్యమునేలే రామయ్య

తండ్రి మాటకై పదవిని వదలి అడవులకేగెనయా 

మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయా

ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా 

అశురిని తృంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయా 

చాకలి నిందకు సత్యము చాటగ కుల సతినే విడనాడెనయా 

నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా ..

నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా ..

సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా 

కరుణ హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా 

అందరి బంధువయా భద్రాచల రామయ్య

ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య

భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం 

భక్తుడు భద్రుని  కొండగమార్చి కొలువై ఉన్న స్థలం 

రామభక్తితో రామదాసుని ఆలయమును కట్టించెనయా 

సీతా రామ లక్ష్మణులకు ఆభరణములే చేయించెనయా 

పంచవటిని ఆ జానకిరాముల పర్ణశాల అదిగో 

సీతారాములు జలకములాదిన శేషతీర్థమదిగో 

రామభక్తితో నదిగామారిన శబరి ఇదేనయ్యా..

రామభక్తితో నదిగామారిన శబరి ఇదేనయ్యా..

శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరియయ్యా..

ఈ క్షేత్రం తీర్థం దర్శించిన జన్మ ధన్యమయ్యా..

అందరి బంధువయా భద్రాచల రామయ్య

ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య

చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య

కోర్కెలుతీర్చే వాడయ్య కోదండ రామయ్య

అందరి బంధువయా భద్రాచల రామయ్య

ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య

Friday, April 4, 2025

Appe cheyani vadu gaadida [అప్పేచేయని వాడు గాడిద] - Appula Appa rao

Song Name :Appe cheyani vadu gaadida
Movie:Appula Appa Rao
Singers:S.P. Balasubramanyam garu, 
Lyricist:Jonnavittula garu
Composer:Rajan Nagendra garlu
DirectorE.V.V Satyanarayana garu 

అప్పు తప్పుకాదు చిప్ప పట్టుట తప్పు

అప్పు వలన కలుగు గొప్పతనమూ 

అప్పు వలన తప్పు తిప్పలూ ముప్పులూ 

అప్పారావు మాట అప్పు మూటా... 

అప్పేచేయని వాడు గాడిద, ఛస్తే తీర్చకు వెయ్యి వాయిదా 

అసలుకు పెట్టరా ఎసరు నాయనా 

ఐ.పీ ఐ.పీ ఐ.పీ పెట్టినోడే వి.ఐ.పీ జగాన, వెరీ ఇంపార్టెంట్ పర్సన్

అప్పేచేయని వాడు గాడిద, ఛస్తే తీర్చకు వెయ్యి వాయిదా 

అంధకారమలమినపుడు అప్పులకై వెతుకు, అప్పులతో వైభవంగ వందేళ్ళూ బతుకు 

ఈ అప్పువలన చెడిపోదు పరువు, కలికాలమందు ఇదే బ్రతుకుదెరువు

దేశమంటే ప్రజలుకాదు వెర్రినాయన, దేశమంటే అప్పులురా పిచ్చినాయనా

అప్పుచేసి చూడరన్నా, వడ్డీ రేటు చూడకన్నా .. అన్నో..

అప్పన్నదో కళ నాయనా ఆ కళకు సామ్రాట్టు నేనే 

అప్పుచ్చుకో తప్పించుకో అయినోళ్ళ మెప్పందుకోరా 

అప్పుచేసి కొండనెక్కె వెంకటేశుడు, గోవిందా అందుకనీ...

అప్పేచేయని వాడు గాడిద, ఛస్తే తీర్చకు వెయ్యి వాయిదా 

ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది క్షౌరకారణం 

నరజాతి చరిత్ర సమస్తం రుణతోరణ పరాయణత్వం  

రుణ ప్రపంచం తృణ ప్రపంచం పణ ప్రపంచం పిలిచిందీ

దారిపొడుగునా సిగ్గు బిడియములు అర్పణ చేస్తూ 

పదండి ముందుకు పదండి కాసుకు పదండి తోసుకు 

ప్రపంచ బ్యాంకుకి పరిగెడదాం 

ప్రపంచ బ్యాంకుకి పరిగెడదాం 

అప్పులడగ వచ్చినోణ్ణె అప్పులడగరా, ముప్పుతిప్పల చ్చెరువుల ముంచి తేల్చరా 

నోటురాసి చూడరన్నా, టంగుక్లీనరెందుకన్నా 

సాపాటుకీ సయ్యాటకీ నా రూటు దీ బెస్టుయన్నా  

ఆరులోంచీ ఏడుపోదూ పక్కనుంచి అప్పు తెచ్చుకోరా 

తీసివేత లెక్కలన్ని తిరిగినేర్చుకో, నైనా అందుకనీ 

అప్పేచేయని వాడు గాడిద, ఛస్తే తీర్చకు వెయ్యి వాయిదా 

అసలుకు పెట్టరా ఎసరు నాయనా 

ఐ.పీ ఐ.పీ ఐ.పీ పెట్టినోడే వి.ఐ.పీ జగాన, హీ ఇజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పర్సన్

అప్పేచేయని వాడు గాడిద, ఛస్తే తీర్చకు వెయ్యి వాయిదా 

రుణగీత, 

అప్పుల అప్పారావు అప్పులు చేయుట తెలియని అల్పులకు ఉపదేశించిన 

రుణగ్రహణ రుణసూక్ష్మ రుణసన్యాస యోగములు సమాప్తము 

రుణస్తే రుణస్తే రుణస్తే యమహా.. 

Friday, March 14, 2025

Aakaasam loni chandamama (ఆకాశంలోని చందామామా) - Devi Putrudu

Song Name :Aakasam loni chandamana
Movie:Deviputrudu
Singers:S.P. Balasubramanyam garu, K.S. Chitra garu
Lyricist:Jonnavittula Ramalingeswara rao garu
Composer:Mani sharma garu
DirectorKodi Rama Krishna garu 

ఆకాశంలోని చందామామా బంగారుపాపై వచ్చేనమ్మా 
సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే 
నాలోని ప్రేమా ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే 
ఆకాశంలోని చందామామా బంగారుపాపై వచ్చేనమ్మా 
సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే 
నాలోని ప్రేమా ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే 

నింగిలో నీలమంతా ఉంగరం చేసి ఇస్తా ఊరేగిస్తా 
సాగరం పొంగులన్నీ గవ్వల గౌను చేస్తా గారాంచేస్తా 
తెల్లని ఏనుగుపై నాపాపని ఎక్కిస్తా 
చిలకలు హంసలనీ ఆడేందుకు రప్పిస్తా 
హరివిల్లే కాగా ఉయ్యాలలే కోయిలలే పాడే నా జోలలే 
బొమ్మలుగా మారే ఆ చుక్కనే దిష్టంతా తీసే నలు దిక్కునే 

పాపలో అందమంతా బ్రహ్మకే అందనంతా ఎంతో వింత 
అమ్మలో ప్రేమ అంతా నాన్నలో ఠీవి అంతా వచ్చేనటా 
తీయన్నవ్వేమో దివితారల వెలుగంతా, 
కమ్మని పిలుపేమో ఈ అమ్మకు పులకింతా 
అడుగేసితీస్తే హంస జోడీ , కులుకుల్లో తానే కూచిపూడి 
చిరునవ్వులోన శ్రీ రమణీ మారాము చేసే బాలామణి 

ఆకాశంలోని చందామామా బంగారుపాపై వచ్చేనమ్మా 
సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే 
నాలోని ప్రేమా ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే 

Saturday, February 22, 2025

Siva Siva Shankara (శివ శివ శంకర హర హర శంకర) - Dhamarukam

Song Name :Siva siva shankara
Movie:Dhamarukam
Singers:Shankar mahadevan garu
Lyricist:Jonnavittula Rama lingeswara rao garu
Composer:Devi Sri Prasad garu
DirectorSrinivasa reddy 

సర్పప్రావిత దర్పప్రాభవ విప్రప్రేరిత పరా, దిక్పూరప్రద  కర్పూరప్రభ అర్పింతుము శంకరా 
సర్పప్రావిత దర్పప్రాభవ విప్రప్రేరిత పరా, దిక్పూరప్రద కర్పూరప్రభ అర్పింతుము శంకరా 
శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా
ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా
శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా
ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా
ఓం పరమేశ్వరాపరా ఓం నిఖిలేశ్వరా హరా ఓం జీవేశ్వరేస్వరా కనరారా 
ఓం మంత్రేశ్వరా స్వరా ఓం యంత్రేశ్వరా స్థిరా ఓం తంత్రేశ్వరా వరా రావేరా  
శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా
ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా
సర్పప్రావిత దర్పప్రాభవ విప్రప్రేరిత పరా, దిక్పూరప్రద కర్పూరప్రభ అర్పింతుము శంకరా 

ఆకాశ లింగమై ఆవహించరా, ఢమ ఢమ ఢమ మని ఢమరుకధ్వని సలిపి చడతని వదిలించరా 
శ్రీ వాయులింగమై సంచరించరా ఆణువణువణువున తనతనువున నిలిచి చలనమె కలిగించరా 
భస్మం చేసై అసురునే అగ్నిలింగమై ప్రవికారా, వరదై ముంచై జలలింగమై ఘోరా 
వరమై వశమై ప్రభలమౌ భూలింగమై వరమిడరా, జగమే నడిపే పంచభూతలింగేశ్వరా కరుణించరా 
శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా
ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా
సర్పప్రావిత దర్పప్రాభవ విప్రప్రేరిత పరా, దిక్పూరప్రద కర్పూరప్రభ అర్పింతుము శంకరా 

విశ్వేశలింగమై కనికరించరా, విధిలిఖితమునిక పరపరపర చెరిపీ అమృతమే కురిపించరా 
రామేశలింగమై మహిమ చూపరా, పలు శుభములగని అభయములిడి హితము సతతము అందించరా 
గ్రహణం నిదనం బాపరా కాళహస్తిలింగేశ్వరా ప్రాణం నీవై ఆలింగనమ్మీరా   
యదలో కొలువై హర హర ఆత్మలింగమై  నిలబడరా 
ద్రుతివై గతివై సర్వజీవలోకేశ్వరా రక్షించరా 
శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా
ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా
శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా
ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా
శివ శివ హర హర జయ జయ
శివ శివ హర హర జయ జయ దిగిరారా 
ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా

సర్పప్రావిత దర్పప్రాభవ విప్రప్రేరిత పరా, దిక్పూరప్రద కర్పూరప్రభ అర్పింతుము శంకరా 

Thursday, February 13, 2025

Jagadananda karaka (జగదానందకారకా జయ జానకీ ప్రాణనాయకా ) - Sri Rama Rajyam

Song Name :Jagadananda karaka
Movie:Sri Rama Rajyam
Singers:S.P. Bala subramanyam garu, Shreya Goshal garu
Lyricist:Jonnavittula garu
Composer:Illayaraja garu
DirectorBapu garu 

జగదానందకారకా జయ జానకీ ప్రాణనాయకా 

జగదానందకారకా జయ జానకీ ప్రాణనాయకా సుభస్వాగతం ప్రియ పరిపాలకా 

జగదానందకారకా జయ జానకీ ప్రాణనాయకా సుభస్వాగతం ప్రియ పరిపాలకా 

మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక ఔగాక, మా జీవనమే ఇక పావనమౌగాకా 

నీ పాలన శ్రీకరమౌగాక, సుఖశాంతులు సంపదలిడుగాక, నీ రాజ్యము ప్రేమసుధామయమౌగాక 

జగదానందకారకా జయ జానకీ ప్రాణనాయకా సుభస్వాగతం ప్రియ పరిపాలకా 

సార్వభౌమునిగ పూర్వకుంభముల స్వాగతాలుపలికే, రాజ్యమేలమని ధర్మదేవతే రాగమాలపాడే 

నాల్గువేదములు తన్మయత్వమున జలధి మారుమ్రోగే, న్యాయదేవతే శంఖమూదగ పూలవానకురిసే 

రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం

సూర్యవంశ సింహాసనం పులకించిచేసె అభివందనం 

సామ్రాజ్యలక్ష్మియే పాదస్పర్శకి పరవశించిపోయే 

జగదానందకారకా జయ జానకీ ప్రాణనాయకా సుభస్వాగతం ప్రియ పరిపాలకా  

జగదానందకారకా జయ జానకీ ప్రాణనాయకా సుభస్వాగతం ప్రియ పరిపాలకా 

రామపాలనము కామధేనువని వ్యోమసీమ చాటే, రామ శాసనము తిరుగులేనిదని జలధి గోధ చేసే 

రామదర్శనము జన్మధన్యమని రాయికూడ తెలిపే, రామరాజ్యమే పౌరులందరిని నీతిబాట నిలిపే 

రామమంత్రమే తారకం బహు శక్తి ముక్తి సందాయకం 

రామనామమే అమృతం శ్రీరామకీర్తనం సుకృతం 

ఈ రామచంద్రుడే లోకరక్ష అని అంతరాత్మ పలికే 

జగదానందకారకా జయ జానకీ ప్రాణనాయకా సుభస్వాగతం ప్రియ పరిపాలకా 

జగదానందకారకా జయ జానకీ ప్రాణనాయకా సుభస్వాగతం ప్రియ పరిపాలకా 

మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక ఔగాక, మా జీవనమే ఇక పావనమౌగాకా 

నీ పాలన శ్రీకరమౌగాక, సుఖశాంతులు సంపదలిడుగాక, నీ రాజ్యము ప్రేమసుధామయమౌగాక 

జగదానందకారకా జయ జానకీ ప్రాణనాయకా సుభస్వాగతం ప్రియ పరిపాలకా  

Sunday, September 29, 2024

మహాకనకదుర్గా విజయకనకదుర్గా (Devullu)

Song Name :mahakanakadurga vijayakanakadurga
Movie:Devullu
Singers:S. Janaki garu
Lyricist:Jonnavittula garu
Composer:Vandemataram Srinivas garu
DirectorKodi Ramakrishna garu

మహాకనకదుర్గా విజయకనకదుర్గా పరాశక్తిలలితా శివానందచరితా 

మహాకనకదుర్గా విజయకనకదుర్గా పరాశక్తిలలితా శివానందచరితా 

శివంకరీ శుభంకరీ పూర్ణచంద్రకళాధరీ

బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూలశక్తి

అష్టాదశ పీఠాలను అధీష్టించు ఆదిశక్తి 

మహాకనకదుర్గా విజయకనకదుర్గా పరాశక్తిలలితా శివానందచరితా 

ఓంకారరావాల అమ్మ కృష్ణాతీరంలో, ఇంద్రకీల గిరిపైన వెలసెను కృతయుగములోన 

ఈ కొండపైన అర్జునుడు తపమును గావించెను, పరమశివుని మెప్పించి పాశుపతము పొందెను 

విజయుడైనా అర్జునుని పేరిట విజయవాడ అయినది ఈ నగరము 

జగములన్నియూ జేజేలు పలుకగ, కనకదుర్గకైనది స్థిరనివాసము 

మెలిమిబంగరు ముద్దపసుపు కలగలిపిన వెన్నెలమోము 

కోటి కోటి ప్రభాతాల అరుణిమలే కుంకుమ 

అమ్మ మనసుపడి అడిగి దరించిన కృష్ణవేణి ముక్కుపుడక 

ప్రేమ కరుణ వాత్సల్యము మురిపించే దుర్గరూపం 

ముక్కోటి దేవతలందరికి ఇదియే ముక్తిదీపం 

మహాకనకదుర్గా విజయకనకదుర్గా పరాశక్తిలలితా శివానందచరితా 

దేవినవరాత్రులలో వేదమంత్రపూజలలో స్వర్ణకవచమును దాల్చిన కనకదుర్గాదేవి 

భవబంధాలను బాపె బాలాత్రిపురసుందరి 

నిత్యానందముకూర్చే అన్నపూర్ణాదేవి 

లోకశాంతినే సంరక్షించే సుమంత్రమూర్తీ గాయత్రీ

అక్షయసంపదలెన్నో అవనిజనులకందించే దివ్యరూపిణీ మహాలక్ష్మి

విద్యా కవన గానమొసగు వేదమయీ సరస్వతి  

ఆయురారోగ్యలు భోగభాగ్యాములు ప్రసాదించు మహాదుర్గ  

శత్రువినాసిని శక్తిస్వరూపిణి మహిషాశురమర్ధిని, 

విజయకారిణి అభయరూపిణి శ్రీరాజరాజేశ్వరి 

భక్తులందరికి కన్నులపండుగ అమ్మా నీ దర్శనం.. దుర్గమ్మా నీ దర్శనం 

మహాకనకదుర్గా విజయకనకదుర్గా పరాశక్తిలలితా శివానందచరితా 

మహాకనకదుర్గా విజయకనకదుర్గా పరాశక్తిలలితా శివానందచరితా 

Thursday, January 3, 2013

Urvasi Glou Haa - Maharshi ( ఊర్వశి గ్లౌం హా)

Movie:  Maharshi
Song: Oorvasi / Urvasi
Lyrics: Jonnavittula
Music: Illayaraja
Singer(s): SP Balu

ఊర్వశి గ్లౌం భా ప్రేయశి హ్రీం మా  (2)

అస్మత్ విద్వత్ విద్యుత్ దీపిక త్వంయేవ - రసవత్ విలసత్ విభవత్ గీతిక త్వంయేవ (2)

ఊర్వశి గ్లౌం భా ప్రేయశి హ్రీం మా
లసత్ చమత్క్రుతి నటత్ ప్రతిద్యుతి ఘనత్ హరిత్మని త్వంయేవ
షుంబద్ ప్రమోద ఝుంబద్ ప్రవాహ ధవళ గగనధుని త్వంయేవ
లసత్ చమత్క్రుతి నటత్ ప్రతిద్యుతి ఘనత్ హరిత్మని త్వంయేవ
షుంబద్ ప్రమోద ఝుంబద్ ప్రవాహ ధవళ గగనధుని త్వంయేవ

అస్మత్ విద్వత్ విద్యుత్ దీపిక త్వంయేవ - రసవత్ విలసత్ విభవత్ గీతిక త్వంయేవ (2)
త్వంయేవ త్వంయేవ ఏవ
ఊర్వశి గ్లౌం భా ప్రేయశి హ్రీం మా

భజే భజే భజరే భజే భజే - భజే భజే భజరే భజే భజే
భజరే భజించరే - జపరే జపించరే (2)
భజ భజ భజ భజ - జప జప జప జప (2)
నమ్రామ్రద్రుమ థమ్రణవోద్యమ స్వరభుత్సుకసఖి త్వంయేవ
నికట ప్రకట ఘట ఘటిత త్రిపుట స్పుట నినద నిదానం త్వంయేవ
అస్మత్ విద్వత్ విద్యుత్ దీపిక త్వంయేవ - రసవత్ విలసత్ విభవత్ గీతిక త్వంయేవ (2)
త్వంయేవ త్వంయేవ ఏవ
ఊర్వశి గ్లౌం భా ప్రేయశి హ్రీం మా

ఊర్వశి గ్లౌం భా ప్రేయశి హ్రీం మా
అస్మత్ విద్వత్ విద్యుత్ దీపిక త్వంయేవ - రసవత్ విలసత్ విభవత్ గీతిక త్వంయేవ (2)

ఊర్వశి గ్లౌం భా ప్రేయశి హ్రీం మా (2)

oorvaSi glouM bhA prEyaSi hrIM mA  (2)

asmat vidvat vidyut dIpika tvaMyEva - rasavat vilasat viBhavat gItika tvaMyEva (2)

oorvaSi glouM bhA prEyaSi hrIM mA
lasat chamatkruti naTat pratidyuti ghanat haritmani tvaMyEva
shumbad pramOda JuMbad pravAha dhavaLa gaganadhuni tvaMyEva

tvaMyEva tvaMyEva Eva
oorvaSi glouM bhA prEyaSi hrIM mA

bhajE bhajE bhajarE bhajE bhajE - bhajE bhajE bhajarE bhajE bhajE
bhajarE bhajiMcharE - japarE japiMcharE (2)
bhaja bhaja bhaja bhaja - japa japa japa japa (2)
namrAmradruma thamraNavOdyama svarabhutsukasakhi tvaMyEva
nikaTa prakaTa ghaTa ghaTita tripuTa spuTa ninada nidAnaM tvaMyEva
asmat vidvat vidyut dIpika tvaMyEva - rasavat vilasat viBhavat gItika tvaMyEva (2)
tvaMyEva tvaMyEva Eva
oorvaSi glouM bhA prEyaSi hrIM mA

oorvaSi glouM bhA prEyaSi hrIM mA
asmat vidvat vidyut dIpika tvaMyEva - rasavat vilasat viBhavat gItika tvaMyEva (2)

oorvaSi glouM bhA prEyaSi hrIM mA (2)

P.S: This lyrics might not be completely correct. We have put our best effort to get to this shape. Thanks to our contributor Raja.