Showing posts with label rama. Show all posts
Showing posts with label rama. Show all posts

Saturday, September 13, 2025

Rama rama [రామ రామ రామ రామ] - Viswambhara

Title :Rama Rama Rama Rama
Movie:Viswambhara
Singers:Shankar Mahadevan గారు, Lipsika
Lyricist:RamaJogayya Sastry గారు
Composer:M.M. Keeravani గారు
Director:Vassishta గారు


రామ...శ్రీ రామా. జై శ్రీరామ్


రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ (4)


హే తయ్యతక్క తక్కధిమి చెక్కాభజనాలాడి రాములోరి గొప్ప చెప్పుకుందామా 

ఆ సాములోరి పక్కనున్న సీతామాలచ్చుమమ్మ లక్షణాలు ముచ్చటించుకుందామా 

నీ గొంతుకలిపి మా వంత పాడగ రావయ్య అంజని హనుమా 

రామయ్య కీర్తన నోరార పలుకగ చిరంజీవి నీ జనుమ 


రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ (4)


శివుని ధనువు వొంచినోడు, రావణ మదము తెంచినోడు 

ధర్మము విలువ పెంచినోడు, దశరథ సుతుడు

అతడిజంటగ అమ్మతోడూ, మాయమ్మ సీతమ్మ సరిజోడు 

పట్టినమగని కొనవేలు , వీడలేదు ఎపుడూ  

పాదుకల్ని మోసినోడు తమ్ముడంటె వాడు 

ఆ తమ్ముడికి రాజ్యమిచ్చి అడవికేగినాడు 

అన్నయ్యంటే ఇతడు 

హే, రంగరంగ వైభవాల రామాకళ్యణవేళ, సంబరాల పాటపాడుకుందామ 

హే రంగురంగు ఉత్సవాల కోలాటమాడుకుంటు, చిన్నపెద్ద చిందులాడుకుందామా 

నీ గొంతుకలిపి మా వంత పాడగ రావయ్య అంజని హనుమా 

రామయ్య కీర్తన నోరార పలుకగ చిరంజీవి నీ జనుమ 

 

రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ (4) 

Saturday, April 5, 2025

Andari bandhuvaya bhadrachala ramayya [అందరి బంధువయా భద్రాచల రామయ్య] - Devullu

Song Name :Andari bandhuvaya bhadrachala ramayya
Movie:Devullu
Singers:S.P. Balasubramanyam garu, 
Lyricist:Jonnavittula Ramalingeswara rao garu
Composer:Vandemataram Srinivas garu
DirectorKodi Rama Krishna garu 


రామా... రామా...

అందరి బంధువయా భద్రాచల రామయ్య

ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య

అందరి బంధువయా భద్రాచల రామయ్య

ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య

చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య

చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య

కోర్కెలుతీర్చే వాడయ్య కోదండ రామయ్య

అందరి బంధువయా భద్రాచల రామయ్య

ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య


రామా ... రామా....

తెల్లవారితే చక్రవర్తియై రాజ్యమునేలే రామయ్య

తండ్రి మాటకై పదవిని వదలి అడవులకేగెనయా 

మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయా

ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా 

అశురిని తృంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయా 

చాకలి నిందకు సత్యము చాటగ కుల సతినే విడనాడెనయా 

నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా ..

నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా ..

సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా 

కరుణ హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా 

అందరి బంధువయా భద్రాచల రామయ్య

ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య


భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం 

భక్తుడు భద్రుని  కొండగమార్చి కొలువై ఉన్న స్థలం 

రామభక్తితో రామదాసుని ఆలయమును కట్టించెనయా 

సీతా రామ లక్ష్మణులకు ఆభరణములే చేయించెనయా 

పంచవటిని ఆ జానకిరాముల పర్ణశాల అదిగో 

సీతారాములు జలకములాదిన శేషతీర్థమదిగో 

రామభక్తితో నదిగామారిన శబరి ఇదేనయ్యా..

రామభక్తితో నదిగామారిన శబరి ఇదేనయ్యా..

శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరియయ్యా..

ఈ క్షేత్రం తీర్థం దర్శించిన జన్మ ధన్యమయ్యా..


అందరి బంధువయా భద్రాచల రామయ్య

ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య

చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య

కోర్కెలుతీర్చే వాడయ్య కోదండ రామయ్య

అందరి బంధువయా భద్రాచల రామయ్య

ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య

Friday, March 21, 2025

Anta rama mayam (అంతా రామమయం ఈ జగమంతా రామమయం) - Sri Ramadasu

Song Name :Anta ramamayam
Movie:Sri rama dasu
Singers:S.P. Balasubramanyam garu
Lyricist:Potana garu, Ramadasu garu
Composer:M.M. Keeravani garu
DirectorK. Raghavendra rao garu 


అంతా రామమయం ఈ జగమంతా రామమయం

రామ రామ రామ రామ రామ రామ రామ రామ (3)

అంతా రామమయం ఈ జగమంతా రామమయం

అంతా రామమయం ఈ జగమంతా రామమయం

అంతా రామమయం


అంతరంగమున ఆత్మారాముడు, అనంత రూపముల వింతలు సలుపగ

సోమసూర్యులును సురలు తారలును, ఆ మహాంబుదులు అవనీజంబులు

అంతా రామమయం ఈ జగమంతా రామమయం

అంతా రామమయం


అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాడంబులు బ్రహ్మలు మొదలుగా 

నదులు వనంబులు నానా మృగములు, విహిత కర్మములు వేద శాస్త్రములు 

అంతా రామమయం ఈ జగమంతా రామమయం


సిరికిన్ జెప్పడు శంఖచక్ర యుగముంచేదోయి సంధింపడు 

ఏ పరివారంబును జీరడు అభ్రకపతిన్ బంధింపడు 

ఆకర్ణికాంతర ధన్విల్లము చక్క నొక్కడు 

నివాధప్రోద్ధిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు, గజప్రాణావనోత్సాహియై 

 



Thursday, February 13, 2025

Jagadananda karaka (జగదానందకారకా జయ జానకీ ప్రాణనాయకా ) - Sri Rama Rajyam

Song Name :Jagadananda karaka
Movie:Sri Rama Rajyam
Singers:S.P. Bala subramanyam garu, Shreya Goshal garu
Lyricist:Jonnavittula garu
Composer:Illayaraja garu
DirectorBapu garu 


జగదానందకారకా జయ జానకీ ప్రాణనాయకా 

జగదానందకారకా జయ జానకీ ప్రాణనాయకా సుభస్వాగతం ప్రియ పరిపాలకా 

జగదానందకారకా జయ జానకీ ప్రాణనాయకా సుభస్వాగతం ప్రియ పరిపాలకా 

మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక ఔగాక, మా జీవనమే ఇక పావనమౌగాకా 

నీ పాలన శ్రీకరమౌగాక, సుఖశాంతులు సంపదలిడుగాక, నీ రాజ్యము ప్రేమసుధామయమౌగాక 

జగదానందకారకా జయ జానకీ ప్రాణనాయకా సుభస్వాగతం ప్రియ పరిపాలకా 


సార్వభౌమునిగ పూర్వకుంభముల స్వాగతాలుపలికే, రాజ్యమేలమని ధర్మదేవతే రాగమాలపాడే 

నాల్గువేదములు తన్మయత్వమున జలధి మారుమ్రోగే, న్యాయదేవతే శంఖమూదగ పూలవానకురిసే 

రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం

సూర్యవంశ సింహాసనం పులకించిచేసె అభివందనం 

సామ్రాజ్యలక్ష్మియే పాదస్పర్శకి పరవశించిపోయే 

జగదానందకారకా జయ జానకీ ప్రాణనాయకా సుభస్వాగతం ప్రియ పరిపాలకా  

జగదానందకారకా జయ జానకీ ప్రాణనాయకా సుభస్వాగతం ప్రియ పరిపాలకా 


రామపాలనము కామధేనువని వ్యోమసీమ చాటే, రామ శాసనము తిరులేనిదని జలధి గోధ చేసే 

రామదర్శనము జన్మధన్యమని రాయికూడ తెలిపే, రామరాజ్యమే పౌరులందరిని నీతిబాట నిలిపే 

రామమంత్రమే తారకం బహు శక్తి ముక్తి సందాయకం 

రామనామమే అమృతం శ్రీరామకీర్తనం సుకృతం 

ఈ రామచంద్రుడే లోకరక్ష అని అంతరాత్మ పలికే 

జగదానందకారకా జయ జానకీ ప్రాణనాయకా సుభస్వాగతం ప్రియ పరిపాలకా 


జగదానందకారకా జయ జానకీ ప్రాణనాయకా సుభస్వాగతం ప్రియ పరిపాలకా 

మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక ఔగాక, మా జీవనమే ఇక పావనమౌగాకా 

నీ పాలన శ్రీకరమౌగాక, సుఖశాంతులు సంపదలిడుగాక, నీ రాజ్యము ప్రేమసుధామయమౌగాక 

జగదానందకారకా జయ జానకీ ప్రాణనాయకా సుభస్వాగతం ప్రియ పరిపాలకా