Showing posts with label devullu. Show all posts
Showing posts with label devullu. Show all posts

Saturday, April 5, 2025

Andari bandhuvaya bhadrachala ramayya [అందరి బంధువయా భద్రాచల రామయ్య] - Devullu

Song Name :Andari bandhuvaya bhadrachala ramayya
Movie:Devullu
Singers:S.P. Balasubramanyam garu, 
Lyricist:Jonnavittula Ramalingeswara rao garu
Composer:Vandemataram Srinivas garu
DirectorKodi Rama Krishna garu 


రామా... రామా...

అందరి బంధువయా భద్రాచల రామయ్య

ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య

అందరి బంధువయా భద్రాచల రామయ్య

ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య

చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య

చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య

కోర్కెలుతీర్చే వాడయ్య కోదండ రామయ్య

అందరి బంధువయా భద్రాచల రామయ్య

ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య


రామా ... రామా....

తెల్లవారితే చక్రవర్తియై రాజ్యమునేలే రామయ్య

తండ్రి మాటకై పదవిని వదలి అడవులకేగెనయా 

మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయా

ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా 

అశురిని తృంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయా 

చాకలి నిందకు సత్యము చాటగ కుల సతినే విడనాడెనయా 

నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా ..

నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా ..

సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా 

కరుణ హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా 

అందరి బంధువయా భద్రాచల రామయ్య

ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య


భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం 

భక్తుడు భద్రుని  కొండగమార్చి కొలువై ఉన్న స్థలం 

రామభక్తితో రామదాసుని ఆలయమును కట్టించెనయా 

సీతా రామ లక్ష్మణులకు ఆభరణములే చేయించెనయా 

పంచవటిని ఆ జానకిరాముల పర్ణశాల అదిగో 

సీతారాములు జలకములాదిన శేషతీర్థమదిగో 

రామభక్తితో నదిగామారిన శబరి ఇదేనయ్యా..

రామభక్తితో నదిగామారిన శబరి ఇదేనయ్యా..

శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరియయ్యా..

ఈ క్షేత్రం తీర్థం దర్శించిన జన్మ ధన్యమయ్యా..


అందరి బంధువయా భద్రాచల రామయ్య

ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య

చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య

కోర్కెలుతీర్చే వాడయ్య కోదండ రామయ్య

అందరి బంధువయా భద్రాచల రామయ్య

ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య

Sunday, September 29, 2024

మహాకనకదుర్గా విజయకనకదుర్గా (Devullu)

Song Name :mahakanakadurga vijayakanakadurga
Movie:Devullu
Singers:S. Janaki garu
Lyricist:Jonnavittula garu
Composer:Vandemataram Srinivas garu
DirectorKodi Ramakrishna garu

మహాకనకదుర్గా విజయకనకదుర్గా పరాశక్తిలలితా శివానందచరితా 

మహాకనకదుర్గా విజయకనకదుర్గా పరాశక్తిలలితా శివానందచరితా 

శివంకరీ శుభంకరీ పూర్ణచంద్రకళాధరీ

బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూలశక్తి

అష్టాదశ పీఠాలను అధీష్టించు ఆదిశక్తి 

మహాకనకదుర్గా విజయకనకదుర్గా పరాశక్తిలలితా శివానందచరితా 


ఓంకారరావాల అమ్మ కృష్ణాతీరంలో, ఇంద్రకీల గిరిపైన వెలసెను కృతయుగములోన 

ఈ కొండపైన అర్జునుడు తపమును గావించెను, పరమశివుని మెప్పించి పాశుపతము పొందెను 

విజయుడైనా అర్జునుని పేరిట విజయవాడ అయినది ఈ నగరము 

జగములన్నియూ జేజేలు పలుకగ, కనకదుర్గకైనది స్థిరనివాసము 

మెలిమిబంగరు ముద్దపసుపు కలగలిపిన వెన్నెలమోము 

కోటి కోటి ప్రభాతాల అరుణిమలే కుంకుమ 

అమ్మ మనసుపడి అడిగి దరించిన కృష్ణవేణి ముక్కుపుడక 

ప్రేమ కరుణ వాత్సల్యము మురిపించే దుర్గరూపం 

ముక్కోటి దేవతలందరికి ఇదియే ముక్తిదీపం 

మహాకనకదుర్గా విజయకనకదుర్గా పరాశక్తిలలితా శివానందచరితా 


దేవినవరాత్రులలో వేదమంత్రపూజలలో స్వర్ణకవచమును దాల్చిన కనకదుర్గాదేవి 

భవబంధాలను బాపె బాలాత్రిపురసుందరి 

నిత్యానందముకూర్చే అన్నపూర్ణాదేవి 

లోకశాంతినే సంరక్షించే సుమంత్రమూర్తీ గాయత్రీ

అక్షయసంపదలెన్నో అవనిజనులకందించే దివ్యరూపిణీ మహాలక్ష్మి

విద్యా కవన గానమొసగు వేదమయీ సరస్వతి  

ఆయురారోగ్యలు భోగభాగ్యాములు ప్రసాదించు మహాదుర్గ  

శత్రువినాసిని శక్తిస్వరూపిణి మహిషాశురమర్ధిని, 

విజయకారిణి అభయరూపిణి శ్రీరాజరాజేశ్వరి 

భక్తులందరికి కన్నులపండుగ అమ్మా నీ దర్శనం.. దుర్గమ్మా నీ దర్శనం 


మహాకనకదుర్గా విజయకనకదుర్గా పరాశక్తిలలితా శివానందచరితా 

మహాకనకదుర్గా విజయకనకదుర్గా పరాశక్తిలలితా శివానందచరితా 


Friday, November 2, 2012

jaya jaya subhakara [జయ జయ శుభకర] - Devullu

Title :Jaya Jaya subhakara
Movie:Devullu
Singers:S.P. Bala Subramanyam గారు
Lyricist:Jonnavittula గారు
Composer:Vandemataram Srinivas గారు
Director:Kodi Ramakrishna గారు

వకృతుండ మహాఖాయ.. కోటి సూర్యసమప్రభ..
నిర్విఘ్నం కురుమేదేవా.. సర్వకార్యేషు సర్వదా..

జయ జయ శుభకర వినాయక - శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక !
జయ జయ శుభకర వినాయక - శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక !

బాహుదా నది తీరములోన.. బావిలోన వెలసిన దేవ..
మహిలో జనులకు మహిమలు చాటి, ఇహపరములనిడు మహానుభావ
ఇష్టమైనదీ వొదిలిన నీ కడ, ఇష్టకామ్యములు తీర్చే గణపతి
కరుణను కురియుచు, వరముల నొసగుచు, నిరతము పెరిగే - మహాకృతి

సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి
నీ గుడి లో చేసే - సత్య ప్రమాణం, ధర్మ దేవతకు నిలుపును ప్రాణం
విజయ కారణం, విఘ్న నాశనం - కాణిపాకమున నీ దర్శనం !! 

జయ జయ శుభకర వినాయక - శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక !
జయ జయ శుభకర వినాయక - శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక !

పిండి బొమ్మవై ప్రతిభ చూపి - బ్రహ్మాండ నాయకుడివైనావు
మాతా పితలకు ప్రదక్షిణముతో మహా గణపతిగ మారావూ
భక్తుల మొరలాలించి, బ్రోచుటకు - గజముఖ గణపతివైనావు
బ్రహ్మాండమునే బొజ్జలో దాచి - లంబోదరుడవు అయినావు

లాభము, శుభమూ, కీర్తి ని కూర్పగ - లక్ష్మీ గణపతివైనావు
వేద పురాణములఖిల శాస్త్రములు - కళలూ చాటును నీ వైభవం
వక్రతుండమే - ఓంకారమై ... విబుధులు చేసే నీ కీర్తనం !! 

జయ జయ శుభకర వినాయక - శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక !
జయ జయ శుభకర వినాయక - శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక !