Showing posts with label s. Show all posts
Showing posts with label s. Show all posts

Sunday, November 2, 2025

Malli malli idi raani roju [మళ్ళి మళ్ళి ఇది రానిరోజు] - Rakshasudu

Title :Malli malli idi raani roju
Movie:Rakshasudu
Singers:S.P. Balasubramanyam గారు, S. Janaki గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Illayaraja గారు
Director:Kodanda Rami reddy  గారు

మళ్ళి మళ్ళి ఇది రానిరోజు, మల్లిజాజి అల్లుకున్న రోజు 

జాబిలంటి ఈ చిన్నదాన్ని, చూడకుంటే నాకు వెన్నెలేది 

ఎదో అడగాలని, ఎంతో చెప్పాలని

రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమికాను

మళ్ళి మళ్ళి ఇది రానిరోజు, మల్లిజాజి అల్లుకున్న రోజు 

చేరువైన రాయబారాలే చెప్పబోతే మాట మౌనం 

దూరమైన ప్రేమ ధ్యానాలే పాడలేని భావగీతం

ఎండల్లో వెన్నెల్లో ఎంచేతో, ఒక్కరం ఇద్దరం అవుతున్నా 

వసంతాలు ఎన్నొస్తున్నా కోకిలమ్మ కబురేది

గున్నమావి విరబూస్తున్నా తోటమాలి జాడేది 

నా ఎదే తుమ్మెదై సన్నిదే చేరగా..

మళ్ళి మళ్ళి ఇది రానిరోజు, మల్లిజాజి అల్లుకున్న రోజు 

కళ్ళనిండ నీలి స్వప్నాలే మోయలేని వింత మోహం

దేహమున్న లేవు ప్రాణాలే నీవుకాదా నాకు ప్రాణం

సందిట్లో ఈ మొగ్గే పూయని, రాగాలే బుగ్గల్లో దాయని

గులాబీలు పూయిస్తున్నా, తేనెటీగ అథిదేడి 

సందెమబ్బులెన్నోస్తున్నా స్వాతిచినుకు తడుపేది

రేవులో నావలా నీ జతే కోరగా 

జాబిలంటి ఈ చిన్నదాన్నీ, చూడకుంటే నీకు వెన్నెలేదీ 

ఎదో అడగాలని, ఎంతో చెప్పాలని 

రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమికాను 

మళ్ళి మళ్ళి ఇది రానిరోజు, మల్లిజాజి అల్లుకున్న రోజు 

Sunday, September 29, 2024

మహాకనకదుర్గా విజయకనకదుర్గా (Devullu)

Song Name :mahakanakadurga vijayakanakadurga
Movie:Devullu
Singers:S. Janaki garu
Lyricist:Jonnavittula garu
Composer:Vandemataram Srinivas garu
DirectorKodi Ramakrishna garu

మహాకనకదుర్గా విజయకనకదుర్గా పరాశక్తిలలితా శివానందచరితా 

మహాకనకదుర్గా విజయకనకదుర్గా పరాశక్తిలలితా శివానందచరితా 

శివంకరీ శుభంకరీ పూర్ణచంద్రకళాధరీ

బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూలశక్తి

అష్టాదశ పీఠాలను అధీష్టించు ఆదిశక్తి 

మహాకనకదుర్గా విజయకనకదుర్గా పరాశక్తిలలితా శివానందచరితా 

ఓంకారరావాల అమ్మ కృష్ణాతీరంలో, ఇంద్రకీల గిరిపైన వెలసెను కృతయుగములోన 

ఈ కొండపైన అర్జునుడు తపమును గావించెను, పరమశివుని మెప్పించి పాశుపతము పొందెను 

విజయుడైనా అర్జునుని పేరిట విజయవాడ అయినది ఈ నగరము 

జగములన్నియూ జేజేలు పలుకగ, కనకదుర్గకైనది స్థిరనివాసము 

మెలిమిబంగరు ముద్దపసుపు కలగలిపిన వెన్నెలమోము 

కోటి కోటి ప్రభాతాల అరుణిమలే కుంకుమ 

అమ్మ మనసుపడి అడిగి దరించిన కృష్ణవేణి ముక్కుపుడక 

ప్రేమ కరుణ వాత్సల్యము మురిపించే దుర్గరూపం 

ముక్కోటి దేవతలందరికి ఇదియే ముక్తిదీపం 

మహాకనకదుర్గా విజయకనకదుర్గా పరాశక్తిలలితా శివానందచరితా 

దేవినవరాత్రులలో వేదమంత్రపూజలలో స్వర్ణకవచమును దాల్చిన కనకదుర్గాదేవి 

భవబంధాలను బాపె బాలాత్రిపురసుందరి 

నిత్యానందముకూర్చే అన్నపూర్ణాదేవి 

లోకశాంతినే సంరక్షించే సుమంత్రమూర్తీ గాయత్రీ

అక్షయసంపదలెన్నో అవనిజనులకందించే దివ్యరూపిణీ మహాలక్ష్మి

విద్యా కవన గానమొసగు వేదమయీ సరస్వతి  

ఆయురారోగ్యలు భోగభాగ్యాములు ప్రసాదించు మహాదుర్గ  

శత్రువినాసిని శక్తిస్వరూపిణి మహిషాశురమర్ధిని, 

విజయకారిణి అభయరూపిణి శ్రీరాజరాజేశ్వరి 

భక్తులందరికి కన్నులపండుగ అమ్మా నీ దర్శనం.. దుర్గమ్మా నీ దర్శనం 

మహాకనకదుర్గా విజయకనకదుర్గా పరాశక్తిలలితా శివానందచరితా 

మహాకనకదుర్గా విజయకనకదుర్గా పరాశక్తిలలితా శివానందచరితా 

Monday, December 15, 2008

Om namaha nayana srutulaku telugu lyrics [ఓం నమహా నయన శృతులకు] - Geetanjali

Song Name :Om Namaha
Movie:Geethanjali
Singers:S.P. BalaSubramanyam garu,S, Janaki garu
Lyricist:Veturi Sundara Rama Murthy garu
Composer:Illayaraja garu
Director:Mani Rathnam garu

ఓం నమహా నయన శృతులకు ఓం నమహా హృదయ లయలకు ఓం 
ఓం నమహా అధర జతులకు ఓం నమహా మధుర శ్మృతులకు ఓం 
నీ హృదయం తపన తెలిసీ నా హృదయం కనులు తడిసే వెళలో 
ఈ మంచు బొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే లీలలో

రేగిన కోరికలతో గాలులు వీచగా  .. జీవన వేణువులలో మోహన పాడగా
దూరము లేనిదై లోకము తోచగా   . కాలము లేనిదై గగనము అందగా
సూరిడే ఒదిగి ఒదిగి జాబిల్లి ఒడిని అడిగే వేళా ..
ముద్దుల సద్దుకే నిదుర లేచే  ప్రణయ గీతికి ఓం

ఒంటరి బాటసారి జంటకు చేరగా .. కంటికి పాపవైతే రెప్పగ మారనా
తూరుపు నీవుగా వేకువ నేనుగా.. అల్లిక పాటగా పల్లవి ప్రేమగా
ప్రేమించే పెదవులొకటై పొంగించే సుధలు మనవైతే
జగతికే అతిధులై జననమందిన ప్రేమ జంటకి

ఓం నమహా నయన శృతులకు ఓం నమహా హృదయ లయలకు ఓం  
ఓం నమహా అధర జతులకు ఓం నమహా మధుర శ్మృతులకు ఓం 
నీ హృదయం తపన తెలిసీ నా హృదయం కనులు తడిసే వెళలో 
ఈ మంచు బొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే లీలలో 

Watch & Listen Here