Showing posts with label ramajogayyasastry. Show all posts
Showing posts with label ramajogayyasastry. Show all posts

Friday, October 2, 2026

Naarayanamma [నారాయణమ్మ] - Aadarsa Kutumbam

Title :naarayanamma
Movie:Asdarsa Kutumbam
Singers:Ram Miriyala గారు, Prabha గారు
Lyricist:Rama jogayya sastry గారు
Composer:Thaman గారు
Director:Trivikram Srinivas గారు

ఏమని సెప్పను ఎన్నని సెప్పను తస్సలదియ్యా..

నా తింగరి మొగుడు తిక్కల చేష్టలు ఒకటా వెయ్యా

పుణ్ణెంకొద్దీ పురుషుడని అంటారుగానీ

నా కర్మ కాలి ఇట్టాంటోడికి పెళ్ళామైపొయ్యా

అయ్యో పాపం ఏంచేసాడేటి


రాజనాల బియ్యమొండి బొమ్మిడాల పులుసు పెడితే 

రాజనాల బియ్యమొండి బొమ్మిడాల పులుసు పెడితే 

రాగిముద్దలడుగుతాడే నారాయణమ్మ.. వేటకూరలేదని సణుగుతాడే నారాయణమ్మ

రాగిముద్దలడుగుతాడే నారాయణమ్మ.. వేటకూరలేదని సణుగుతాడే నారాయణమ్మ

సంకురాత్రి అల్లుడని మాఇంటోళ్ళు స్కూటరిత్తే

సంకురాత్రి అల్లుడని మాఇంటోళ్ళు స్కూటరిత్తే

బుర్రు బుర్రు గుంటూరుపొయ్యి నారాయణమ్మ.. ఆ రంగమణితో కులుకుతాడే నారాయణమ్మ 

బుర్రు బుర్రు గుంటూరుపొయ్యి నారాయణమ్మ.. ఆ రంగమణితో కులుకుతాడే నారాయణమ్మ 


చేరే తారంగి చేరే తారంగి, కూడే తారంగి చేరే తారంగి 

చేరే తారంగి చేరే తారంగి, కూడే తారంగి చేరే తారంగి 

మందార చిందూర పూవ్వై జారే నీయే వన్నెల్లో 

ముంథిరి పంచిరి పెయ్యనుపోలే నీయే నిన్నల్లో 

అంబాడ చెంబాడ మేళం కాదల్ కేట్టల్లో 

విసిలు విలిచు ఆడిచు పోలిక్కు లేలో ఓలేలో 

తోడంగు తోడంగు తోడంగు తోడంగు లేలో ఓ లేలో 

చేరే తారంగి చేరే తారంగి, కూడే తారంగి చేరే తారంగి 

చేరే తారంగి చేరే తారంగి, కూడే తారంగి చేరే తారంగి 


ఆ.. ముచ్చటాటకుందమంటే మేడ పడకలేసినాను

ముద్దుకడ్డమొస్తదంటే ముక్కుపుడక తీసినాను

తెల్లవారి చూసుకుంటే నారాయణమ్మ, ముక్కుపుడక లేదు వాడులేడు నారాయణమ్మ

తెల్లవారి చూసుకుంటే నారాయణమ్మ, ముక్కుపుడక లేదు వాడులేడు నారాయణమ్మ

ఎంత పని జరిగినాదే, ఎంత పని జరిగినాదే, ఎంత పని జరిగినాదే నారాయణమ్మ 

నీకు దొంగమొగుడు దొరికినాడే నారాయణమ్మ 

తాడిసెట్టు తల్లికాదే తగిలినోడు మొగుడూ కాదే 

ఈతసెట్టు ఇల్లుకాదే ఇయ్యనోడు దేవుడు కాదే 

వాడినింక వదిలిపెట్టే నారాయణమ్మ..


పుడకపాయే నారాయణమ్మ, పడకపాయే నారాయణమ్మ 

ఉడుకు ఈడు ఉరక పాయే నారాయణమ్మ 

పెద్దోళ్ళిచ్చిన కట్నంపాయే పెనిమిటి శాల్తీ పట్నంపాయే 

కాకులు పొడిచే కాపురమాయే నారాయణమ్మ 

All ok all ok all ok  

Saturday, August 1, 2026

Dheevara Asama Souryadhaara [ధీవర ప్రసర శౌర్యధార ఉత్సర స్థిరగంభీరా] - Baahubali 1 / Bahubali 1

Title :Dhivara prasara souradhara
Movie:Baahubali - The Beginning
Singers:Ramya Behera గారు, Deepu గారు
Lyricist:Ramajogayya Sastry గారు, Siva sakthi datta  గారు
Composer:M.M. Keeravani గారు
Director:S.S. Rajamouli గారు

హునన హూనన హూనన హూన నచ్చానా

హునన హూనన హూనన హూన అంతగానా 

అందనిలోకపు చంద్రికనై ఆహ్వానిస్తున్నా అల్లరి ఆశల అభిసారికనై నీకైచూస్తున్నా ఆ..

ధీవర ప్రసర శౌర్యధార ఉత్సర స్థిరగంభీరా  

ధీవర ప్రసర శౌర్యధార ఉత్సర స్థిరగంభీరా  

నననన యువ యువ యువ యువన యువయువన


అలసినా సొలసినా ఒడిలో నిన్ను లాలించనా 

అడుగునై నడపనా నీ జంట పయనించనా 

పడిపడి తలపడి వడివడి త్వరపడి వస్తున్నా ఎదేమైనా  

సిగముడి విడిచిన శిఖరపు జలసిరి ధారల్ని జటాజూటంలా ఢీకొని సవాళ్లని తెగించి నీవైపు దూసుకొస్తున్నా  

ఉత్క్రమ అసమశౌర్యధామ ప్రోద్గమ తవ భీతిర్మ

ఉత్క్రమ అసమశౌర్యధామ ప్రోద్గమ తవ భీతిర్మ 


నిలువునా ఎదగరా నినురమ్మంది నాతొందరా  

కదలికే కదనమై గగనానికెదురీదరా   

విజితరిపు రుధిరధారా కలిత అసిధర కఠోరా    

పులకుధర తులిత గంభీరా జయవిరాట్ వీరా  

విలయగగనతలభీకరా  గర్జద్ధారాధరా హృదయరసకాసారా  విజితమధుపారాపార 

భయకరం శౌ విభవసింధు  శుభరదం గం భరణరంధిం  

భయకరం శౌ విభవసింధు  శుభరదం గం భరణరంధిం  

భయకరం శౌ విభవసింధు  శుభరదం గం భరణరంధిం   


ధీవర ప్రసర శౌర్యధార ఉత్సర స్థిరగంభీరా  

ధీవర ప్రసర శౌర్యధార ఉత్సర స్థిరగంభీరా  

ధీవర ప్రసర శౌర్యధార దరికిచేరరారా ఉత్సర సుందరా స్థిరగంభీరా చెలి నీదేరా 

Wednesday, December 31, 2025

Nilavade madi nilavade [నిలవదే మది నిలవదే సిరిసొగసుని చూసి] - Satamaanam Bhavati

Title :Nilavade madi nilavade
Movie:Satamaanam Bhavati
Singers:S.P. Balasubramanyam గారు
Lyricist:Rama Jogayya sastri గారు
Composer:Mickey J Meyer గారు
Director:Satish Vegesna గారు

నిలవదే మది నిలవదే సిరిసొగసుని చూసి

ఉలకదే మరి పలకదే తొలివలపునతడిసీ 

దేవదాసే కాళిదాసై ఎంతపొగిడినా కొంతమిగిలిపోయేంత అందం నీది

నిలవదే మది నిలవదే సిరిసొగసుని చూసి

ఉలకదే మరి పలకదే తొలివలపునతడిసీ 

 

అలానువ్వు చూస్తేచాలు వెళుతూవెళుతూ వెనుతిరిగి

అదోలాంటీ తేనెలబాణం దిగదా ఎదలోకి 

నువ్వునడిచే దారులలో పూలగంధాలె ఊపిరిగా

జతనడిచే మనసుకదే హాయిరాగాల ఆమనిగా దినమొకరకముగ పెరిగిన సరదా నినువిడి మనగలదా

నిలవదే మది నిలవదే సిరిసొగసుని చూసి

ఉలకదే మరి పలకదే తొలివలపునతడిసీ 


ఎలా నీకు అందించాలో యదలోకదిలే మధురిమలూ 

నేనే ప్రేమలేఖగమారి ఎదుటేనిలిచాను    

చదువుకుని బదులిదని చెప్పుకొలేవులేమనసా 

పదములతో పనిపడని మౌనమే ప్రేమపరిభాష 

గెలుపొకతెలిపిన వలపొకవరమని కడలిగ అలలెగసా 

నిలవదే మది నిలవదే సిరిసొగసుని చూసి

ఉలకదే మరి పలకదే తొలివలపునతడిసీ 

దేవదాసే కాళిదాసై ఎంతపొగిడినాకొంతమిగిలిపోయేంత అందం నీది 

Saturday, September 13, 2025

Rama rama [రామ రామ రామ రామ] - Viswambhara

Title :Rama Rama Rama Rama
Movie:Viswambhara
Singers:Shankar Mahadevan గారు, Lipsika
Lyricist:RamaJogayya Sastry గారు
Composer:M.M. Keeravani గారు
Director:Vassishta గారు


రామ...శ్రీ రామా. జై శ్రీరామ్


రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ (4)


హే తయ్యతక్క తక్కధిమి చెక్కాభజనాలాడి రాములోరి గొప్ప చెప్పుకుందామా 

ఆ సాములోరి పక్కనున్న సీతామాలచ్చుమమ్మ లక్షణాలు ముచ్చటించుకుందామా 

నీ గొంతుకలిపి మా వంత పాడగ రావయ్య అంజని హనుమా 

రామయ్య కీర్తన నోరార పలుకగ చిరంజీవి నీ జనుమ 


రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ (4)


శివుని ధనువు వొంచినోడు, రావణ మదము తెంచినోడు 

ధర్మము విలువ పెంచినోడు, దశరథ సుతుడు

అతడిజంటగ అమ్మతోడూ, మాయమ్మ సీతమ్మ సరిజోడు 

పట్టినమగని కొనవేలు , వీడలేదు ఎపుడూ  

పాదుకల్ని మోసినోడు తమ్ముడంటె వాడు 

ఆ తమ్ముడికి రాజ్యమిచ్చి అడవికేగినాడు 

అన్నయ్యంటే ఇతడు 

హే, రంగరంగ వైభవాల రామాకళ్యణవేళ, సంబరాల పాటపాడుకుందామ 

హే రంగురంగు ఉత్సవాల కోలాటమాడుకుంటు, చిన్నపెద్ద చిందులాడుకుందామా 

నీ గొంతుకలిపి మా వంత పాడగ రావయ్య అంజని హనుమా 

రామయ్య కీర్తన నోరార పలుకగ చిరంజీవి నీ జనుమ 

 

రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ (4) 

Saturday, July 5, 2025

Mastaru mastaru song telugu lyrics [మాష్టారు మాష్టారు నా మనసుని గెలిచారు] - Sir

Song Name :Mastaru mastaru
Movie:sir
Singers:G.V. Prakash, Swetha Mohan
Lyricist:Rama Jogayya Sastry garu
Composer:G.V. Prakash
DirectorVenky Atluri garu 


సీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది, సీతకుమల్లే నీతో అడుగేసే మాటడిగింది 

నీకునువ్వే గుండెలోనన్నదంతా విన్నాలే, అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే 

ఇంకపైన నీకు నాకు ప్రేమ పాఠాలే

మాష్టారు మాష్టారు నా మనసుని గెలిచారు

అచ్చం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు

మాష్టారు మాష్టారు నా మనసుని గెలిచారు

అచ్చం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు


ఏ వైపు పోనీవె నన్ను కాస్తైనా , ఏకంగా కనుపాప మొత్తం నువ్వేగా

ఇష్టంగా ఏ చోట నువ్వేం చేస్తున్నా, చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా 

గుండెపై అలా నల్లపూసలా, వంద ఏళ్ళు అందంగా నిన్ను మొయ్యాలంటున్నా 

ఒంటిపేరుతో ఇంటిపేరుగా జంటగా నిను రాయాలంటున్నా 

మాష్టారు మాష్టారు నా మనసుని గెలిచారు

అచ్చం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు

మాష్టారు మాష్టారు నా మనసుని గెలిచారు

Sunday, February 9, 2025

Chuttamalle [చుట్టమల్లే చుట్టేస్తాంది ] - Devara

Song Name :Chuttamalle chuttestandi
Movie:Devara
Singers:Shilpa Rao
Lyricist:Rama Jogayya Sastri garu
Composer:Anirudh Ravichandran
DirectorKoratala Siva 


చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు.. ఊరికే ఉండదు కాస్సేపూ..

అస్తమానం నీ లోకమే నా మైమరపు.. చేతనైతే నువ్వే నన్నాపూ

రా నా నిద్దరి కులాశా నీ కలలకిచ్చేశా

నీ కోసం వయసు వాకిలి కాసా

రా నా ఆసలు పోగేసా నీ గుండెకు అచ్చేశా 

నీ రాకకు రంగం సిద్ధం చేశా ...ఆ..

ఎందుకు పుట్టిందో పుట్టిందీ, ఎమో నువ్వంటే ముచ్చట పుట్టింది..ఆ

పుడతానే నీ పిచ్చి పట్టిందీ 

నీ పేరు పెట్టిందీ వయ్యారం వోణీ కట్టింది గోరింట పెట్టిందీ ఆ

సామికి మొక్కులు కట్టింది 


చుట్టమల్లే చుట్టేస్తాంది .. హా చుట్టేస్తాంది..

చుట్టమల్లే చుట్టేస్తాంది .. ఆ.అఆ అరరరె అరె 

చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు.. ఊరికే ఉండదు కాస్సేపూ.. 


మత్తుగా మెలేసింది నీ వరాల మగసిరి, హత్తుకోలేవా మరి సరసన చేరి 

వాస్తుగా పెంచానిట్టా వందకోట్ల సొగసిరి  

వాసిగా అల్లేసుకొ కొసరీ కొసరీ 

చేయరా ముద్దుల దాడి, ఇష్టమేలే నీ సందడీ 

ముట్టడించి ముట్టేసుకోలేవా ఓ సారీ  చేజారి 

రా.. ఏ బంగరు నక్లీసు నా ఓంటికి నచ్చట్లే నీ కౌగిలితో నన్ను సింగారించూ 

రా ఏ వెన్నెల జోలాలి నన్ను నిద్దర పుచ్చట్లే నా తిప్పలు కొంచెం ఆలోచించూ .. ఆ..

ఎందుకు పుట్టిందో పుట్టిందీ, ఎమో నువ్వంటే ముచ్చట పుట్టింది..ఆ

పుడతానే నీ పిచ్చి పట్టిందీ 

నీ పేరు పెట్టిందీ వయ్యారం వోణీ కట్టింది గోరింట పెట్టిందీ ఆ

సామికి మొక్కులు కట్టింది 


చుట్టమల్లే చుట్టేస్తాంది .. హా చుట్టేస్తాంది..

చుట్టమల్లే చుట్టేస్తాంది .. ఆ.అఆ అరరరె అరె 

చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు.. ఊరికే ఉండదు కాస్సేపూ..