Showing posts with label koratalasiva. Show all posts
Showing posts with label koratalasiva. Show all posts

Sunday, February 9, 2025

Chuttamalle [చుట్టమల్లే చుట్టేస్తాంది ] - Devara

Song Name :Chuttamalle chuttestandi
Movie:Devara
Singers:Shilpa Rao
Lyricist:Rama Jogayya Sastri garu
Composer:Anirudh Ravichandran
DirectorKoratala Siva 

చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు.. ఊరికే ఉండదు కాస్సేపూ..

అస్తమానం నీ లోకమే నా మైమరపు.. చేతనైతే నువ్వే నన్నాపూ

రా నా నిద్దరి కులాశా నీ కలలకిచ్చేశా

నీ కోసం వయసు వాకిలి కాసా

రా నా ఆసలు పోగేసా నీ గుండెకు అచ్చేశా 

నీ రాకకు రంగం సిద్ధం చేశా ...ఆ..

ఎందుకు పుట్టిందో పుట్టిందీ, ఎమో నువ్వంటే ముచ్చట పుట్టింది..ఆ

పుడతానే నీ పిచ్చి పట్టిందీ 

నీ పేరు పెట్టిందీ వయ్యారం వోణీ కట్టింది గోరింట పెట్టిందీ ఆ

సామికి మొక్కులు కట్టింది 

చుట్టమల్లే చుట్టేస్తాంది .. హా చుట్టేస్తాంది..

చుట్టమల్లే చుట్టేస్తాంది .. ఆ.అఆ అరరరె అరె 

చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు.. ఊరికే ఉండదు కాస్సేపూ.. 

మత్తుగా మెలేసింది నీ వరాల మగసిరి, హత్తుకోలేవా మరి సరసన చేరి 

వాస్తుగా పెంచానిట్టా వందకోట్ల సొగసిరి  

వాసిగా అల్లేసుకొ కొసరీ కొసరీ 

చేయరా ముద్దుల దాడి, ఇష్టమేలే నీ సందడీ 

ముట్టడించి ముట్టేసుకోలేవా ఓ సారీ  చేజారి 

రా.. ఏ బంగరు నక్లీసు నా ఓంటికి నచ్చట్లే నీ కౌగిలితో నన్ను సింగారించూ 

రా ఏ వెన్నెల జోలాలి నన్ను నిద్దర పుచ్చట్లే నా తిప్పలు కొంచెం ఆలోచించూ .. ఆ..

ఎందుకు పుట్టిందో పుట్టిందీ, ఎమో నువ్వంటే ముచ్చట పుట్టింది..ఆ

పుడతానే నీ పిచ్చి పట్టిందీ 

నీ పేరు పెట్టిందీ వయ్యారం వోణీ కట్టింది గోరింట పెట్టిందీ ఆ

సామికి మొక్కులు కట్టింది 

చుట్టమల్లే చుట్టేస్తాంది .. హా చుట్టేస్తాంది..

చుట్టమల్లే చుట్టేస్తాంది .. ఆ.అఆ అరరరె అరె 

చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు.. ఊరికే ఉండదు కాస్సేపూ.. 

Sunday, October 27, 2024

లాహే లాహే (Acharya)

Song Name :Laahe laahe
Movie:Acharya
Singers:Harika Narayana, Sahithi Chaganti
Lyricist:Ramajogayya Sastry garu
Composer:Manisharma garu
DirectorKoratala Siva garu

లాహే లాహే లాహే లాహే .. లాహే లాహే లాహే లాహే 

లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే రే 

కొండలరాజు బంగరుకొండా కొండజాతికి అండా దండా, మధ్యరాతిరిలేసి మంగళగౌరి మల్లెలు కోసిందే 

ఆటిని మాలలుకడతా మంచుకొండల సామిని తలిసిందే 

లాహే లాహే లాహే లాహే .. లాహే లాహే లాహే లాహే 

లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే రే 

మెళ్ళో మెలికల నాగుల దండ వలపుల వేడికి ఎగిరిపడంగా 

వొంటి ఇబూది జలజల రాలిపడంగ సాంబడు కదిలిండే 

అమ్మా పిలుపుకి సామి అత్తరుసెగలై విలవిల నలిగిండే

లాహే లాహే లాహే లాహే .. లాహే లాహే లాహే లాహే 

లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే రే 

కొర కొర కొరువులు మండే కళ్ళు, జడలిరబోసిన సింపిరి కురులూ 

ఎర్రటి కోపాలెగసిన కుంకంబొట్టు యెన్నెలకాసిందే 

పెనిమిటి రాకనుతెలిసి శీమాతంగి సిగ్గులుపూసిందే  

వుబలాటంగా ముందటికురికీ అయ్యవతారం చూసిన కలికి 

ఏందా శంఖంశూలం బైరాగేసం ఏందని సణిగిందే 

ఇంపుగ ఈపూటైన రాలేవా అని సనువుగ కసిరిందే 

లాహే లాహే లాహే లాహే .. లాహే లాహే లాహే లాహే 

లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే రే 

లోకాలేలే ఎంతోడైనా లోకువమడిసే సొంతింట్లోనా 

అమ్మోరి గెడ్డంపట్టీ బతిమాలినవి అడ్డాలనామాలు 

ఆలు మగల నడుమన అడ్డం రావులె ఇట్టంటి నీమాలు 

ఒకటోజామున కలిగిన విరహం, రెండొ జాముకి ముదిరిన విరసం 

సర్దుకుపోయే సరసం కుదిరే యేళకి మూడో జామాయే 

ఒద్దిక పెరిగే నాలుగో జాముకి గుళ్ళో గంటలు మొదలాయే

లాహే లాహే లాహే లాహే .. లాహే లాహే లాహే లాహే 

లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే రే 

లాహే లాహే లాహే లాహే .. లాహే లాహే లాహే లాహే 

లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే రే 

ప్రతిఒక రోజిది జరిగే ఘట్టం, ఎడమొఖమయ్యీ ఎకం అవడం 

అనాది అలవాటీళ్ళకి అలకలలోనే కిలకిలమనుకోటం 

స్వయాన చెబుతున్నారు అనుబంధాలు కడతేరే పాఠం