| Title : | Vompula vaikhari |
| Movie: | April 1 Vidudala |
| Singers: | S.P. Balasubramanyam గారు,K.S. Chitra గారు |
| Lyricist: | Sirivennela Sitaraama Sastry గారు |
| Composer: | Illayaraja గారు |
| Director: | Vamsi గారు |
వొంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి
వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరి
మోవిని మగతావిని ముడివేయనీయ్యవా
కాదని అనలేనని గడియైనా ఆగవా
అదుపు పొదుపు లేని ఆనందం కావాలి
హద్దు పొద్దు లేని ఆరాటం ఆపాలి
వొంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి
వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరి
మాంగళ్యం తంతునానేన మమజీవన హేతునాం, కంటేబద్నామి సుభగే
త్వంజీవ శరదస్సతం త్వంజీవ శరదస్సతం త్వంజీవ శరదస్సతం
కాంక్షలో కైపు నిప్పు ఎంతగా కాల్చినా, దీక్షగా ఓర్చుకున్నా మోక్షమే ఉండదా
శ్వాశలో మోహదాహం గ్రీష్మమై వీచగా, వాంఛతో వేగు దేహం పరయాగ వాటికా
కాలమే కాలిపోయే ఆజ్యమే పోయవా
మౌనమే గానమయ్యే మూర్తమే చూడవా
వొంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి
వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరి
నిష్ఠగా నిన్నుకోరి నీమమే దాటినా, కష్టమే సేదతీరే నేస్తమే నోచనా
నిగ్రహం నీరుగారే జ్వాలలో దించినా, నేర్పుగా ఈదిచేరే నిశ్చయం మెచ్చనా
సోయగం సొంతమయ్యే స్వర్గమై చేరవా
మధనమే అంతమయ్యే అమృతం అందుకో
వొంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి
వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరి
హో...

No comments:
Post a Comment