Monday, June 22, 2026

Raade cheli nammaraade cheli [రాదేచెలి నమ్మరాదేచెలి మగవారినిలా నమ్మరాదేచెలి] - Mr Pellam

Title :Raade cheli nammaraadecheli
Movie:Mr Pellam
Singers:K.S. Chitra గారు
Lyricist:Aarudra గారు
Composer:M.M. Keeravani గారు
Director:Bapu గారు

రాదేచెలి నమ్మరాదేచెలి మగవారినిలా నమ్మరాదేచెలి

రాదేచెలి నమ్మరాదేచెలి మగనాలీమనసమ్మ రాదేచెలి


నాడు పట్టుచీర కట్టవద్దు బరువన్నాడే 

నేడు నూలుచీరకే డబ్బులు కరువన్నాడే 

నెలపట్టిన నెలత తనకు పరువన్నాడే

నేడు నెలబాలుని చేతికిస్తే బరువన్నాడే

ముంగురులని చూసి తాను మురిసిపోయాడే 

ఆ కురులకి విరులివ్వడమే మరిచిపోయాడే

ప్రేమించు సీజన్లో పెద్దమాటలు, పెళ్ళయ్యాకా ప్లేటు ఫిరాయింపులు

మొదటివలపు మధురకథలు మరచెను ఘనుడు.. మగవారినిలా నమ్మరాదేచెలి

రాదేచెలి నమ్మరాదేచెలి మగవారినిలా నమ్మరాదేచెలి


మాటల్తో కోటకట్టాడే.. అమ్మో.. నా మహారాణి నీవన్నాడే

కాలు కింద పెడితేనే కందిపోవునన్నాడే 

గాలితాకితే మోమున పాలు విరుగునన్నాడే 

కవ్వించుకున్నాడే కౌగిలికోసం

ఆ కాస్తా తీరాకా మొదటికి మోసం 

మనవి వినడు, మనసు కనడు మాయల మొగుడు.. మగవారినిలా నమ్మరాదేచెలి

రాదేచెలి నమ్మరాదేచెలి మగవారినిలా నమ్మరాదేచెలి

రాదేచెలి నమ్మరాదేచెలి మగనాలీమనసమ్మ రాదేచెలి


తలలో నాలుకలా పూసలలో దారంబుమాట్టే 

సతిమదిలోనన్ మెలగెడు పురుషుడు కలుగుట

తొలిజన్మము నోముఫలము తోయుజనేత్రా 

తనుగా వలచిన వరుడేనా ఈ పురుషోత్తముడు 

వ్రతములు సలిపిన సతులకు గతికలదా 

వినదా కలదా లేదా 

No comments:

Post a Comment