Saturday, August 16, 2025

Merise taaraladerupam [మెరిసే తారలదేరూపం] - Sirivennela

Title :Merise taaraladerupam
Movie:Sirivennela
Singers:S.P. Balasubramanyam గారు
Lyricist:Sirivennela Sitaraama sastry గారు
Composer:K.V. Mahadevan గారు
Director:K. Viswanath గారు

మెరిసే తారలదేరూపం, విరిసే పూవులదేరూపం 

అది నాకంటికి శూన్యం..

మనసున కొలువై మమతల నెలవై, వెలసిన దేవిది ఏ రూపం

నా కన్నులు చూడని రూపం, గుడిలో దేవత ప్రతిరూపం నీ రూపం.. అపురూపం 

ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేనో 

ఆ వసంత మాసపు కులగోత్రాలను ఎల కోయిల అడిగేనా 

ఎవరి పిలుపుతో పులకరించి పురివిప్పి తనువు వూగేనో 

ఆ తొలకరి మేఘపు గుణగణాలకై నెమలి వెదుకులాడేనా..

నా కన్నులు చూడని రూపం, గుడిలో దేవత ప్రతిరూపం నీ రూపం.. అపురూపం 

ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా, గానం పుట్టుక గాత్రం చూడాలా 

ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా, గానం పుట్టుక గాత్రం చూడాలా 

వెదురును మురళిగ మలచి, ఈ వెదురును మురళిగ మలచి 

నాలో జీవననాదం పలికిన నీవే నా ప్రాణస్పందనా, నీకే నా హృదయనివేదన 

మనసున కొలువై మమతల నెలవై, వెలసిన దేవిది ఏ రూపం

నా కన్నులు చూడని రూపం, గుడిలో దేవత ప్రతిరూపం నీ రూపం అపురూపం.. 

No comments:

Post a Comment